అభినవ ఇందిర ప్రియాంక
ఇండియాలో వర్ధమాన రాజకీయ నాయకురాలల్లో జనాదరణ కలిగిన లీడర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రియాంక గాంధీ. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ముద్దుల కూతురుగా, అన్న రాహుల్ గాంధీకి ప్రియమైన చెల్లెలుగా ఉన్నారు. కోట్లాది మంది ప్రియాంక గాంధీకి అభిమానులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నకు, తల్లికి చేదోడుగా ఉంటున్నారు. అన్న కంటే ఎక్కువగా ఆమె ప్రచారంలో ముందు వరుసలో ఉంటున్నారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ పై, ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. సమస్యలపై నిలదీస్తున్నారు.
సామాజిక, ఆర్ధిక, రాజకీయ, తదితర రంగాలపై ప్రియాంక గాంధీకి మంచి పట్టుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో నిమగ్నమై పోయారు. అయితే ఇటీవల జరిగిన అధికారిక అత్యున్నత పార్టీ కొర్ కమిటీ మీటింగ్ లో ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే దానిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. తాజాగా ప్రియాంక గాంధీపై ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రియాంక గాంధీని మరో అభినవ ఇందిరా గాంధీగా అభివర్ణించారు.
ప్రియాంక గాంధీ నాయకత్వంలో 2022లో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకురాలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను చూసి ఉత్త్రర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు భయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో రాహుల్ కంటే స్పీడ్ గా ఉపయోగించుకుంటున్నారు ప్రియాంక గాంధీ. ఇండియాలో ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకకే ఉన్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రియాంకలో ఇందిర గాంధీని చూసుకుంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి