ఇక మండలాలకు 108 సర్వీసెస్


రాష్ట్రంలో108 సేవలను మరింతగా విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ఈ సర్వీసెస్ పూర్తిగా సక్సెస్ అయ్యాయి. ఎక్కడ చూసినా 108 అంబులెన్స్ కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టింది మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు. ఆయన పరిపాలన కాలంలోనే ఐటీ దిగ్గజ కంపెనీగా పేరు తెచ్చుకున్న సత్యం కంప్యూటర్స్ సహాయంతో 108 అంబులెన్స్ సర్వీసెస్ ను ప్రభుత్వంతో కలిసి స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం. కాంగ్రెస్ అధికారం లోకి రావడం, సత్యం కంపెనీ అధినేత రామలింగ రాజు జైలుకు వెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇదే సమయంలో కొన్ని నెలల పాటు 108 సేవలు ఆగి పోయాయి. దీంతో రాష్ట్ర మంతటా వత్తిళ్లు పెరగడం, రోడ్డు ప్రమాదాలు చోటు చేసు కోవడంతో అప్పటి దివంగత సీఎం రాజా శేఖర్ రెడ్డి రంగం లోకి దిగారు.

దీనిని నిలబెట్టేందుకు కృషి చేశారు. సత్యం కంపెనీని మహీంద్రా కంపెనీ టేకోవర్ చేసుకుంది. ఇక 108 సేవలు అందించేందుకు మహీంద్రా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో జివికె కంపెనీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇదే కంపెనీ 108 అంబులెన్స్ సేవలు అందిస్తోంది. అయితే సదరు కంపెనీపై కూడా ఆరోపణులున్నాయి. సరైన లెక్కలు చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా బాధితుల నుంచి , ప్రజల నుంచి వత్తిళ్లు వస్తున్నాయి. ఈ సర్వీసెస్ ను గ్రామాల దాకా తీసుకు రావాలని డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రం లోని ప్రతి మండలానికి ఒక ‘108’ అత్యవసర వైద్య సేవల వాహనాన్ని సమకూర్చాలని సర్కారు సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. అందుకు సంబంధించి సమాలోచనలు జరుపుతోంది.

ప్రతి మండ లానికి ‘108’ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తే దాని పరిధిలోని సమీప గ్రామా లకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలు కలుగుతుందని, ప్రాణాపాయం నుంచి అనేక మందిని రక్షించ వచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం 358 వాహనాలు ‘108’ వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 వాహనాలు రోడ్లపై అందు బాటులో ఉండగా మిగిలినవి రిజర్వులో ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లోనూ ఇవే వాహనాలు అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు చేరుస్తున్నాయి. ప్రతి లక్ష జనాభాకు ఒకటి చొప్పున ప్రస్తుతం ‘108’ వాహనం ఉండగా మండలానికి ఒకటి పెంచడం ద్వారా ప్రతి 70 వేల జనాభాకు ఒక వాహనాన్ని అందు బాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 589 మండలాలుండగా ఆ మేరకు వాహనాల సంఖ్యను పెంచనుంది. కాగా ప్రభుతంతో కలిసి నడిచేందుకు అరబిందో కంపెనీ ముందుకు వచ్చింది. మొత్తం మీద ఎమర్జెన్సీ సేవల్లో 108 ముందు ఉంటోంది. ఇదే గనుక అమలవుతే పేదలకు మరింత మేలు జరుగుతుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!