పోస్ట్‌లు

మే, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌ని వైనం - ప్ర‌మాదంలో పార్టీ భ‌విత‌వ్యం

చిత్రం
వందేళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి 17వ సార్వ‌త్రిక ఎన్నిక‌లు శాపంగా మారాయి. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాను ద‌క్కించుకోలేక పూర్తిగా చ‌తికిల ప‌డి పోయింది. దేశాభివృద్ధిలో కీల‌క భూమిక పోషించిన ఆ పార్టీ ఇపుడు త‌న అస్తిత్వాన్ని కోల్పోయే ప‌రిస్థితిని కొని తెచ్చుకుంది. త్యాగాలు, బ‌లిదానాలు చేసుకున్న గాంధీ కుటుంబం ఇవాళ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. మోదీ వ్యూహాల‌ను ఎదుర్కోలేని స్థితిలోకి రావ‌డం బాధాక‌రం. గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి దాకా బ‌ల‌మైన కేడ‌ర్ క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు బేల చూపులు చూస్తోంది. కాంగ్రెస్ తో పాటు మిత్ర‌ప‌క్షాలు సైతం అదే బాట ప‌ట్టాయి. 2014లో మోదీ మామూలుగా ఎంట‌ర్ అయ్యాడు. తాను ఛాయ్‌వాలా నంటూ..ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వ‌మంటూ వేడుకున్నాడు. ఆ త‌ర్వాత ఏకు మేక‌య్యాడు. ఏక‌శ్చ‌త్రాధిప‌త్యం దిశ‌గా దేశాన్ని అన్నీ తానై న‌డిపించాడు. ప్ర‌తిప‌క్షాల నోళ్లు మూయించాడు. ఎన్నో ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య బీజేపీకి తిరిగి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చాడు. ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలను మార్చుకుంటూనే త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. సోష‌ల్ మీడియాను వాడుకున్నాడు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌క...

స్వామే మా సీఎం - స్ప‌ష్టం చేసిన మంత్రివ‌ర్గం

చిత్రం
బీజేపీ అధినేత‌, ఇండియ‌న్ ప్రైమ్ మినిష్ట‌ర్ మిష్ట‌ర్ న‌రేంద్ర మోదీ సృష్టించిన విజ‌యోత్స‌వ సునామీ దెబ్బ‌కు ప్ర‌తిప‌క్షాలు విల‌విల‌లాడి పోతున్నాయి. ఏం చేయాలో తెలియ‌క మిన్న‌కుండి పోయాయి. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన 17వ సార్వ‌త్రిక ఎన్నికల్లో స్ప‌ష్ట‌మైన మెజారిటీని సాధించింది బీజేపీ. ఈ క్రెడిట్ అంతా మోదీ, షాల‌దే. 12 రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ లేకుండా పోయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా మోదీ ప్ర‌భంజ‌నాన్ని ఆప‌లేక పోయారు. క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన కాంగ్రెస్, జేడీఎస్ ల జోడి ల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది ఈ ఎన్నిక‌ల్లో. కేవ‌లం 2 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోయాయి ఈ రెండు పార్టీలు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుత సంకీర్ణ ప్ర‌భుత్వానికి ఓ ర‌కంగా హెచ్చ‌రిక‌ను జారీ చేసిన‌ట్లు భావిస్తున్నారు.  అనూహ్యంగా ప‌వ‌ర్ ను పొంద‌లేని బీజేపీ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కుమారుడు కుమార‌స్వామి ముఖ్య‌మంత్రిగా తాను కొన‌సాగ‌లేన‌ని..ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ తాను త‌ప్పుకుంటాన‌ని మంత్రివ‌ర్గంతో జ‌రిగిన స‌మా...

జ‌నంలోనే జ‌న‌సేన..!

చిత్రం
రాజ‌కీయాలు వేరు..సినిమా రంగం వేరు. రెండు భిన్న‌మైన రంగాలు. పార్టీని న‌డ‌పాలంటే చాలా వ్యూహాలు ప‌న్నాల్సి ఉంటుంది. ఎంద‌రినో భ‌రించ‌ల్సి వ‌స్తుంది. చాలా ఓపిక కావాలి. జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేసి .అర‌చేతిలో వైకుంఠం చూపించే స్థాయికి చేరుకోవాలి. అప్పుడు కాని ప‌వ‌ర్‌లోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌దు. తెలుగుసినిమా రంగంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వెప‌న్. ఏపీ పాలిటిక్స్‌లో ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగాడు. జ‌నసేన పార్టీని స్థాపించి దానికి దిశా నిర్దేశ‌నం చేశారు. అన్నీ తానై ద‌గ్గ‌రుండి న‌డిపించారు. ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాల‌తో క‌లిసి 138 సీట్ల‌లో జ‌న‌సేన అభ్య‌ర్థ‌/ల‌ఉ బ‌రిలో ఉన్నారు. రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓట‌మి పాల‌య్యారు. వైసీపీ అభ్య‌ర్థ‌/ల చేతుల్లో అప‌జ‌యం చ‌వి చూశారు. ఆయ‌నను ఆరాధించే అభిమానులు సైతం ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఓడిపోవ‌డం త‌మ‌ను బాధ క‌లిగించింద‌న్నారు. అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే ఒకే ఒక్క సీటును గెలుచుకోగ‌లిగింది జ‌న‌సేన‌. ఒక్క రాజోలులోనే ఈ విజ‌యం ద‌క్కింది. ఎన్నిక‌ల సంఘం జ‌నసేన పార్టీకి గాజు గ్లాసు కేటాయించింది. ఇపుడు అది పూర్త‌గా ప‌గిలి పోయింది. 25 ...

ఏపీలో కొలువు తీరేదెవ్వ‌రో..?

చిత్రం
ఇలాంటి దారుణ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌ల‌లో కూడా అనుకుని ఉండ‌రు. జీవితంలో మ‌రిచి పోలేని అప‌జ‌యాన్ని అందించారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఈనెల 30న వేద పండితుల సాక్షిగా, జ‌న సమ‌క్షంలో జ‌నామోదం పొందిన జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. అతిర‌థ మ‌హార‌థులు, ఇత‌ర ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి రానున్నారు. ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు వ‌న్ సైడ్‌గా తీర్పు ఇవ్వ‌డం, 150 సీట్ల‌కు చేర్చ‌డంతో జ‌గ‌న్ ఉబ్బి త‌బ్బ‌బ‌వుతున్నారు. ఏదో 120 లేదా 130 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోతామ‌ని న‌మ్మ‌కంతో ఉన్న జ‌గ‌న్‌కు ఊహించ‌ని రీతిలో ఆంధ్రా ప్ర‌జ‌లు గిఫ్ట్ ఇచ్చారు. ఏపీ చ‌రిత్ర‌లో ఇది చారిత్రాత్మ‌క విజ‌యం. ఊహించిన దానికంటే ఎక్కువ‌గా ఎమ్మెల్యేలు గెలిచారు. వీరితో పాటు 23 ఎంపీ సీట్ల‌లో వైసీపీ పాగా వేసింది. బీజేపీతో స‌ఖ్య‌త పాటిస్తున్న జ‌గ‌న్..మోదీ కేబినెట్‌లో చేర‌మ‌ని జ‌గ‌న్‌ను ఆహ్వానిస్తే ..చేరేందుకు సుముఖ‌త చూపించ‌వ‌చ్చు. ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని ప్ర‌ధానంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌...

నిజామాబాద్‌లో నైతిక విజ‌యం రైత‌న్న‌ల‌దే

చిత్రం
మెతుకుల‌ను పండించి ..మ‌ట్టినే న‌మ్ముకుని ..బ‌తుకు బ‌రువై అరిగోస ప‌డుతున్న రైతులు భార‌త‌దేశలో ఒక చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు. నూత‌న అధ్యాయానికి తెర తీశారు. అంత‌కు ముందు పాల‌మూరు జిల్లాలోని పోలేప‌ల్లి గ్రామ‌స్తులు త‌మ భూములు త‌మ‌కు కావాల‌ని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మోసం చేశాడంటూ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించారు. అప్ప‌ట్లో అది ఓ సంచ‌ల‌నం. మొన్న‌టి దాకా తిరుగులేద‌ని భావించిన అధికార పార్టీకి చుక్క‌లు చూపించారు. నిజామాబాద్ అంటేనే పసుపు, చెరుకు పంట‌ల‌కు ప్ర‌సిద్ధి. ఆసియా ఖండంలోనే అధిక సాగు చేసే ప్రాంతం ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ మాత్ర‌మే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే త‌మ బ‌తుకులు బాగు ప‌డ‌తాయ‌ని, త‌మ పిల్ల‌ల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, త‌మ పంట‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర దొరుకుతుంద‌ని ఇక్క‌డి మ‌ట్టి బిడ్డ‌లు భావించారు. అదంతా రివ‌ర్స్ అయ్యింది. సీఎం కూతురు క‌విత ఇక్క‌డ ఎంపీగా పోటీ చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచింది. రైతుల‌కు ప‌సుపు బోర్డు ఏర్పాటు చేస్తామ‌ని, ఆదుకుంటామ‌ని చెప్పి ఆచ‌ర‌ణ‌లో చూపించక పోవ‌డంతో రైతులు పోరు బాట ప‌ట్టారు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యేలా ఆందోళ‌న‌ల...

డైన‌మిక్ స్ట్రాట‌జిస్ట్ ..స‌క్సెస్ స్పెష‌లిస్ట్ - ప్రశాంత్ కిషోరా మ‌జాకా..!

చిత్రం
అత‌డు రంగంలోకి దిగాడంటే ..ఇక అంతే ప్ర‌త్య‌ర్థులు చిత్త‌యి పోవాల్సిందే. అత‌డు పులి కంటే వేగంగా ఆలోచిస్తాడు. రాకెట్ కంటే స్పీడ్‌గా త‌న ప్లాన్‌ను అమ‌లు చేస్తాడు. అంత‌కంటే భిన్నంగా త‌న‌దైన మార్క్ తో ..స్ట్రాట‌జీని అమ‌లు చేస్తాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌టం అంటూ ఉండ‌దు. ప‌ని అంతా పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉంటుంది. ప‌క్కా లోకల్ గా అనిపిస్తుంది ఆయ‌న ఆలోచ‌నా తీరు. అప‌ర మేధావిగా..ఇండియాలో ఎవ‌రికీ రానంత పాపులారిటీ ఆయ‌నకు రానే వ‌చ్చింది.  గెలుపు కావాలంటే..విజ‌యం సాధించాలంటే..ఏం చేయాలో అత‌డికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ను కోవాలి. అంత‌లా పాపుల‌ర్ అయి పోయాడు అత‌డు. ఇంత‌గా ఇంట్ర‌డ్యూస్ చేయాల్సిన వ్య‌క్తి ఎవ‌ర‌త‌డంటే..ఒకే ఒక్క‌డు..డైన‌మిక్ లీడ‌ర్..స‌క్సెస్ స్పెష‌లిస్ట్ - ప్రశాంత్ కిషోర్. యుద్ధంలో గెల‌వాలంటే ఏం చేయాలి. ఎవ‌రిని ఎప్పుడు సంప్ర‌దించాలి. ఏయే శ‌క్తుల‌ను కూడ‌గ‌ట్టు కోవాలి. ఎవ‌రి బ‌లాలు ఏమిటి..బ‌ల‌హీన‌త‌లు ఏమిటి..ఏం చేస్తే స‌క్సెస్ చెంత వాలుతుంది. ఇవ‌న్నీ త‌నొక్క‌డే అమ‌లు చేస్తాడు.  ఎవ‌రూ త‌న ప‌క్క‌న ఉండ‌రు. ఉప్పెన‌లా దూసుకెళ‌తాడు. సునామీలా అల్లుకు పోతాడు. జ‌నాన్ని మాట‌ల‌తో మంత్రం ...

న బూతో న భ‌విష్య‌త్ - అశ్లీలం స‌ర్వ నాశ‌నం

చిత్రం
నాలుగు గ‌దుల్లో దాచు కోవాల్సినవ‌న్నీ ఇపుడు బ‌హిర్గ‌త‌మై పోతున్నాయి. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ మంచి కంటే చెడు ఎక్కువ‌గా ముక్కు ప‌చ్చ‌లార‌ని యువ‌తీ యువ‌కుల‌ను టార్గెట్ చేస్తోంది. భోజ‌నం లేకుండా ఉండ‌గ‌ల‌రమో కానీ మొబైల్స్ లేకుండా ఉండ‌లేని స్థితికి వ‌చ్చేశారు. కాదంటే బాధ‌..వ‌ద్దంటే కోపం..క‌న్న‌వారి మీద క‌సురు కోవ‌డాలు..కుటుంబం అంటే గౌర‌వం లేదు. పాఠాలు చెప్పే వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త లేదు. బ‌ట్టీ ప‌ట్ట‌డాలు..ర్యాంకుల మోత‌లు..ఇలా చెప్పుకుంటూ పోతే దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగు చూశాయి. చెప్పుకోవాలంటే సిగ్గు చేటు. 60 ఏళ్లకే రావాల్సిన అనుభవం ఇపుడు 10 ఏళ్ల పిల్ల‌ల‌కు అర్థ‌మై పోతోంది. ఇదేమిటంటే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయిగా..పేరెంట్స్ త‌మ బాధ్య‌త‌ల‌ను విస్మ‌రిస్తున్నారు. నూటికి 90 శాతం పిల్ల‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేదు. గాలికి వ‌దిలి వేస్తున్నారు. పాఠాలు బోధించాల్సిన వాళ్లు సైతం ప్రేమ పాఠాలు వ‌ల్లె వేస్తున్నారు. బంధాల‌కు అర్థం లేకుండా పోయింది. డాల‌ర్ల మాయ‌లో ప‌డిన వీరంతా దేశాన్ని ఏం ర‌క్షిస్తారో తెలియ‌డం లేదు. సామాజిక మాధ్యమాల్లో ..గూగుల్ వ‌చ్చాక‌..రిల‌య‌న్స్ జియో ఎంట‌ర్ అయ్...

దేశానికే ఆద‌ర్శం..ర‌వీంద‌ర్ సింగ్ నిర్ణ‌యం

చిత్రం
కోట్లు వుంటే ఏం లాభం..కొలువులుంటే ఏం ప్ర‌యోజ‌నం..ప‌దవులుంటే ఏం చేసుకుంటాం. మ‌న‌మైతే కోట్లు ఎలా కొల్ల‌గొట్టాలో ఆలోచిస్తాం. ఎవ‌రి మీద ప‌డితే డ‌బ్బులు వ‌స్తాయో ప్లాన్ల‌లో మునిగి తేలుతాం. కానీ అధికార పార్టీకి చెందిన ర‌వీంద‌ర్ సింగ్ మాత్రం వెరీ వెరీ డిఫ‌రెంట్. ఏ మ‌త‌మైనా..ఏ కుల‌మైనా స‌రే ఆదుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఇంకేం ఏకంగా పార్టీని న‌మ్ముకున్నందుకు న‌గ‌ర పాల‌క సంస్థ‌కు మేయ‌ర్‌గా ఎన్నుకోబడ్డారు సింగ్. అంద‌రూ గెలిచాక ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం మానేస్తే..ర‌వీంద‌ర్ సింగ్ మాత్రం జ‌నం కోసం ఏమేం చేస్తే బాగుంటుందోన‌ని నిత్యం ప్ర‌జా సేవ‌కు అంకిత‌మ‌య్యారు. రోడ్డు మీద రూపాయి ప‌డితే వ‌దిలి వేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే ఆ రూపాయితో ఏం వ‌స్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మ‌నోడు మాత్రం ఆ రూపాయికి మ‌రింత విలువ‌ను పెంచారు. సేవ చేయాల‌న్న త‌లంపు వుంటే ..మాన‌వ‌త్వం వెల్లి విరియ‌దా..న‌గ‌ర వాసుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. కేవ‌లం ఒక్క రూపాయి చెల్లించండి..మ‌ధ్య ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌కండి..మీ వెనుక నేనున్నా..మీకు క్ష‌ణాల్లో న‌ల్లా క‌నెక్ష‌న్ ఇస్తామంటూ ప్ర‌క‌టించారు. దెబ్బ‌కు ఆయ‌న ఇలా ప్ర‌క‌టించా...

గ్రోఫ‌ర్సా ..మ‌జాకా - ఎస్‌బీ బిగ్ ఆఫ‌ర్

చిత్రం
ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ క‌నెక్టివిటీ ఈజీగా మారి పోయింది. ఒక‌ప్పుడు టెలికాం, ర‌వాణా రంగాలు జ‌నానికి దూరంగా ఉండేవి. ఎప్పుడైతే అవి రావ‌డం ప్రారంభ‌మైందో ప్ర‌పంచం చిన్న‌దై పోయింది. ఐటీ అంటేనే ఇండియా.అంత‌గా పాపుల‌ర్ అయ్యిందీ ఈ దేశం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ సెక్టార్‌లో అమెరికా టాప్ వ‌న్ పొజిష‌న్‌లో వుంటే..అందులో 30 శాతానికి పైగా భార‌తీయులే ఉన్న‌త స్థానాల్లో కొలువుతీరారు. అదే స్ఫూర్తితో గూగుల్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, స్నాప్ ఛాట్, ఇలా ప్ర‌తి సామాజిక మాధ్య‌మాల‌ను నిర్వ‌హిస్తున్న వారిలో ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్సే ఉన్నారు. వీరే ప్ర‌తి ఫార్మాట్‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువ‌త కొత్త‌గా ఆలోచిస్తోంది. డిఫ‌రెంట్ గా ఉండేందుకు య‌త్నిస్తోంది. వారు త్వ‌ర‌గా త‌మ కాళ్ల మీద నిల‌బడాల‌ని కోరుకుంటున్నారు. స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే తాము ఒక‌రి కింద ప‌ని చేసేందుకు స‌సేమిరా అంటున్నారు. ఐడియాసుకు ప‌దును పెడుతూ ..స్టార్ట‌ప్ ల‌కు ప్రాణం పోస్తున్నారు. గ‌తంలో పెట్టుబ‌డి కోసం భ‌య‌ప...

టీఓ క్లాక్ - ఛాయ్ అడ్డా హైద‌రాబాద్

చిత్రం
ఓహ్..హైద‌రాబాద్ అంటేనే ప్యార‌డైజ్ బిర్యానీకి పెట్టింది పేరు. అంతేనా ప్ర‌తి గ‌ల్లీలో ఓ టీకొట్టు ఉండాల్సిందే. ఇరానీ ఛాయ్ కి కేరాఫ్ ఈ న‌గ‌ర‌మే. ఎక్క‌డికి వెళ్లినా ..ఏ సందులోకి దూరినా అక్క‌డ ఇరానీ కేఫ్ ఉంటుంది. అంతేనా గ‌రం గ‌రం టీతో పాటు నోరూరించే ఉస్మానియా బిస్క‌ట్లు కూడా నోరూరిస్తాయి. అంత‌లా పాపుల‌ర్ అయ్యిందీ ఈ సిటీ. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వారి దాకా అంతా ఛాయ్ ప్రియులే. పొద్దున లేస్తేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది టీనే. ర‌క‌ర‌కాల ఫ్లేవ‌ర్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. టీ ప్రియుల కోసం ప్ర‌త్యేకంగా రెస్టారెంట్లు వెలిశాయి. త‌క్కువ ఖ‌ర్చు ..ఎక్కువ ఆదాయం ఏద‌న్నా ఉందంటే అది టీ కొట్టు..టీ హోట‌ల్, టీ అడ్డా. మేధావులు, క‌ళాకారులు, సినీ న‌టులు, ద‌ర్శ‌కులు, క్రియేటివిటీ కోసం నానా తిప్ప‌లు ప‌డే వాళ్లంద‌రికీ ఇష్ట‌మైన‌ది ఏదైనా ఉందంటే ఛాయ్ నే. వేడి వేడి టీ గొంతులోకి వెళితే ఆ టేస్ట్ వేరు. ఆ మ‌జా వేరు. ఆంధ్రా వారి దెబ్బ‌కు తెలంగాణ సంస్కృతి దెబ్బ‌తిన్న‌ది. కానీ బ‌తక‌డంలో మాత్రం త‌న సంస్కృతిని కోల్పోలేదు. తెలంగాణ‌లో ఎక్క‌డికి వెళ్లినా మ‌జ్జిగ‌నో లేదా టీనో త‌ప్ప‌కుండా ఇస్తారు. తేనీటి విందు త‌ప్ప‌ని...

దౌడు తీస్తున్న డెయిలీ హంట్ - భారీగా ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్ బ్యాంక్

చిత్రం
దేశ వ్యాప్తంగా న్యూస్ విష‌యంలో ట్రెండింగ్ సృష్టిస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్న డెయిలీ హంట్ కు భారీ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది సాఫ్ట్ బ్యాంక్ . కంటెంట్ విష‌యంలో , న్యూస్ విష‌యంలో డైలీ హంట్ దూసుకెళుతోంది. తాజా వార్త‌ల‌ను, విశేషాల‌ను, ప్ర‌త్యేక క‌థ‌నాల‌ను యాప్‌లో పొందు ప‌రుస్తోంది. దీంతో త‌క్కువ టైంలోనే భారీగా స్పంద‌న వ‌చ్చింది. డిజిట‌ల్ టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు న్యూస్‌ను, వ్యూస్‌ను పొందుప‌రుస్తూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. 150 మిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టింది సాఫ్ట్ బ్యాంక్ . ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇండియ‌న్ న్యూస్ స్టార్ట‌ప్‌ల‌లో ఇదో రికార్డు అని చెప్పాలి. ఇపుడు సాఫ్ట్ బ్యాంకు డెయిలీ హంట్ కంపెనీగా మారి పోయింది. జ‌పాన్ లో సాఫ్ట్ బ్యాంకుకు ఎక్క‌డ‌లేని జ‌నాద‌ర‌ణ ఉంది. బ్యాంకింగ్ రంగంలో అత్యున్న‌త‌మైన స్థానంలో ఉన్న సాఫ్ట్ బ్యాంకు ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్ట‌ప్ కంపెనీల‌లో పెట్టుబ‌డులు పెడుతోంది. అందులో భాగంగానే డైలీ హంట్ ను టేకోవ‌ర్ చేసింది. రీజిన‌ల్ లాంగ్వేజెస్ ప్ర‌ధానంగా ఈ న్యూస్ ప‌నిచేస్తోంది. ఇందులో కంటెంట్ మిగ‌తా వాటికంటే భిన్నంగా అప్ లోడ్ చేయ...

ఇండియ‌న్ పీపుల్స్ మేనేజ‌ర్స్ వీళ్లే - 100 మందితో ఫోర్డ్స్ జాబితా

చిత్రం
ప్ర‌పంచంలో పేరొందిన ఫోర్బ్స్ తాజాగా ఇండియాలో అత్యున్న‌త‌మైన మేనేజ‌ర్లు ఎవ‌ర‌నే దానిపై స‌ర్వే చేసి 100 మంది తో జాబితా వెల్ల‌డించింది. ఇందులో పురుషుల‌తో పాటు మ‌హిళ‌లు కూడా చోటు ద‌క్కించుకున్నారు. ఆయా కంపెనీల‌ను లాభాల బాట ప‌ట్టించ‌డం, ఉద్యోగుల‌కు స్ఫూర్తిగా నిల‌వ‌డం, విలువ‌ల‌కు పెద్ద పీట వేయ‌డం, త‌దిత‌ర అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుని సంస్థ ఎంపిక చేసింది. ఎంపికైన వారిలో జూనియ‌ర్ మేనేజ‌ర్స్ తో పాటు సీనియ‌ర్లు కూడా ఉన్నారు. మొద‌టి స్థానంలో అభిషేక్ కుల్‌క‌ర్ణి నిలిస్తే..రెండో స్థానంలో అయిక్రా త్యాగి నిలిచారు. వీరితో పాటు అలోక్ ప్ర‌తాప్ సింగ్, అమిత్ ర‌మ‌ణి, అనిల్ ఖ‌న్నా, అంకుర్ షా, అంశుల్ జైన్, అనిఫ్ ఖాన్, అరున్ ఎం విజ‌య‌న్, ఆషిష్ జోషి, అషీమా రూణా చోటు ద‌క్కించుకున్నారు. బాన్సి రైజా, బ్రిజేష్ సింగ్, దేబ‌షిస్ పాండా, దీప‌క్ శ్రీ‌వాత్స‌వ‌, ధ‌ర్మేంద్ర జైన్, దిలీప్ కుమార్ కందేల్ వాల్, డాక్ట‌ర్ అంకితా సింగ్, డాక్ట‌ర్ అరుణ్ బాల‌కృష్ణ‌న్, డాక్ట‌ర్ రేష్మా తివారీ, డాక్ట‌ర్ శిఖా తివారీ, ఫ‌యాజ్ ఇంజ‌నీర్, గ‌గ‌న్ జ్యోత్, ఎస్. గ‌ణేష‌న్, గౌర‌వ్ సేఠ్, గురుజోధ్ పాల్ సింగ్, హ‌రి చ‌ర‌ణ్ రావు, హ‌రీష...

బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా

చిత్రం
పోలింగ్ ముగిసింది..ఓట్ల లెక్కింపే మిగిలింది. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ జ‌నం ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నారు. అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా జాతీయ స్థాయిలో పేరున్న నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీలో తిరిగి ప‌వ‌ర్‌లోకి వ‌స్తామని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ గంద‌ర‌గోళం సృష్టించేందుకు య‌త్నిస్తోంద‌ని..స‌ర్వేలు ఎంత‌గా బాకాలు ఊదినా ప్ర‌జ‌లు త‌మ వైపే ఉన్నార‌ని ఆయ‌న అంటున్నారు. మ‌రో వైపు వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్న‌డూ లేనంత‌గా ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. ఆనందాన్ని త‌ట్టుకోలేక పోతున్నారు. తండ్రి చ‌నిపోయిన‌ప్పుడే ఉమ్మ‌డి ఏపీకి సీఎం కావాల‌ని ఎమ్మెల్యేల‌తో సంత‌కాలు కూడా చేయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు. జ‌గ‌న్ మొద‌టి నుంచి తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉన్నారు. ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నారు. బీజేపీతో లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నారు. ఆ త‌ర్వాత త‌న ఆస్తుల‌ను కాపాడుకునేందుకు హైద‌రాబాద్‌లో గులాబీ బాస్ కేసీఆర్‌తో చెలిమి చేశారు. ఎంఐఎం కూడా ఆయ‌న‌కే వ‌త్తాసు ప‌లికింది. ప‌సుపు కుంకుమ‌, రైతుబంధు ప‌థ‌కాల వ‌ల్ల ల‌క్ష‌లాది మందికి ల‌బ్ధి చే...

బిగ్ ఆఫ‌ర్ కొట్టేసిన లివ్ స్పేస్

చిత్రం
ఐటీ అంటేనే బెంగ‌ళూరు. ఇండియాకు స్వ‌ర్గ‌ధామంగా విరాజిల్లుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ పొరుగు సేవ‌లను ఇక్క‌డి ఐటీ కంపెనీల‌తో అనుసంధాన‌మై ప‌నిచేస్తున్నాయి. ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వ‌చ్చి ప‌డిన ఐటీ కంపెనీల పుణ్య‌మా అని ల‌క్ష‌లాది మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పిస్తున్నాయి. అంకురాల‌కు, ఆంట్ర‌ప్రెన్యూర్ల‌కు విప‌రీత‌మైన స్కోప్ ల‌భిస్తోంది. దీంతో ఔత్సాహికులు, యంగ్ ఛాప్స్ అంతా ఐటీ జ‌పం చేస్తున్నారు. జీవితానికి స‌రిప‌డా వేత‌నాలు ఉండ‌నే ఉన్నాయి. క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటున్నారు. ఎప్పుడూ లేనంత‌గా గ‌త 10 సంవ‌త్స‌రాలుగా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీకి సంబంధించి..అనుబంధంగా ఉన్న కోర్సుల‌ను చ‌దివేందుకు ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల నుండి ఇండియాకు వ‌స్తున్నారు చ‌దివేందుకు. అంత‌టి డిమాండ్ ఉంటోంది ఇక్క‌డి కాలేజీలు, సంస్థ‌ల‌కు. ఎంఐటీలు, ఐఐటీలు, ఎంఐటీలు వాటిలోనివే. హెవీ పోటీ ఉంటోంది వీటికి. ల‌క్ష‌లాది మంది ప్ర‌తి ఏటా జేఇఇ మెయిన్స్, అడ్వాన్స్ కు ప్రిపేర్ అవుతారు. వీరిలో కొద్ది మందికి మాత్ర‌మే ఛాన్స్ వ‌రిస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టా...

భాగ్య‌న‌గ‌రం అద్భుతం..ప్రేమ అజ‌రామ‌రం

చిత్రం
నియాన్ లైట్ల వెలుతురులో నా న‌గ‌రం వెలిగి పోతోంది. గుండె గుండెలో ప్రేమ జ‌ల్లుల‌ను చ‌ల్లుకుంటూ. రంజాన్ వేళ‌ల్లో నిండు చంద‌మామ క‌దులుతూ వుంటే..లాడ్ బ‌జార్ లో గాజుల గ‌ల‌గ‌ల‌లు హృద‌యాల‌పై చెర‌గ‌ని రాగాల‌ను అద్దుతాయి. అప్పుడే పూసిన పూలు..విచ్చుకున్న పెద‌వుల మ‌ధ్య న‌వ్వుల కేరింత‌లు..కుల‌మ‌తాల‌కు అతీతంగా జ‌నం ఒక‌రినొక‌రు చూసుకుంటూ స‌ముద్రంలోని ఇసుక రేణువుల్లా త‌చ్చ‌ట్లాడుతూ వుంటే ..మ‌ళ్లీ ప్రేమ‌త‌న‌పు జ్ఞాప‌కాలు మ‌న‌సులో చిగురిస్తాయి. ప్రేమంటే గుండెల క‌ల‌యిక‌. తాను ప్రేమించిన ..త‌న కోసం జీవితాన్ని అర్పించిన భాగ్‌మ‌తి కోస‌మే క‌దా ఈ న‌గ‌రం రూపు దిద్దుకున్న‌ది. అదే భాగ్య‌న‌గ‌ర‌మై భాసిల్లుతోంది. కోట్లాది ప్ర‌జ‌ల ఆత్మ‌ల‌న్నీ ఒక్క‌టై న‌గ‌రాన్ని అల్లుకు పోయేలా చేస్తోంది. ఈ ప్రాంతంలో అడుగు పెడితే చాలు ప్రేమ ఉప్పొంగుతుంది. వెల్లువ‌లా చుట్టేస్తుంది. అటు చూస్తే చార్మినార్ ..న‌గ‌ర‌పు వాసుల ఉమ్మ‌డి ఆస్తి. ప్ర‌పంచానికే పాఠం నేర్పిన చ‌రిత్ర ఈ న‌గ‌రానిదే. త‌రాలు మారినా వ‌న్నె త‌గ్గ‌లేదు. అప్ర‌హ‌తిహ‌తంగా త‌న ఖ్యాతిని దిగంతాల‌కు వ్యాపించేలా భాగ్య‌న‌గ‌రం త‌న‌ను తాను మ‌లుచుకుంది. ప్రేమ కోసం కోట్లాది...