ఇంజనీరింగ్ వేస్ట్..పకోడీ బిజినెస్ బెస్ట్
ప్రతి ఒక్క స్టూడెంట్ కల ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కావడం. ఐపీ ఎక్స్‌పర్ట్స్‌గా కోట్లాది రూపాయలు సంపాదించాలని కలలు కంటారు. ఆ దిశగా రేయింబవళ్లు శ్రమిస్తారు. లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్లు, కాలేజీ క్యాంపస్‌లలో కుస్తీలు పడుతుంటారు. ఐటీ పుణ్యమా అంటూ ఇండియా వ్యాప్తంగా యమ క్రేజ్ పెరిగింది ఈ కోర్సులకు. ఆల్ ఇండియాలో ఆయా ఇంజనీరింగ్ కాలేజీలకు ఎనలేని డిమాండ్. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్ ఐ టీలు, త్రిబుల్ ఐటీలు, ఐఐటీహెచ్‌లకు ప్రయారిటీ ఎక్కువ. ఎందుకంటే వీటిల్లో సీటు దొరకితే చాలు ఇక లైఫ్ లో బోర్ అంటూ ఉండదు..ఫుల్ ఎంజాయ్. నాలుగేళ్లు కష్టపడాల్సిన పనిలేదు. మూడో ఏటనే కంపెనీలు వచ్చి వాలిపోతాయి.జెమ్స్ లాంటి కుర్రాలను ఎంపిక చేసుకుంటాయి. వారికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తాయి. అందుకే వాటిపై అంత మోజు. ఇంజనీరింగ్ సీటు వచ్చిందంటే ఓ యుద్ధం చేసినట్లు లెక్క. ఎక్కడలేనంతటి ఆనందం కూడా. కానీ ఇది మాత్రం డిఫెరెంట్ స్టోరీ.
ఎవరైనా గేట్ లో ర్యాంక్ వస్తే అదే చాలనుకుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ కుర్రాడు సాగర్ మాత్రం ఇంజనీరింగ్ చేసే కంటే రోడ్డుపై పకోడీ వ్యాపారం బెటర్ అంటున్నారు. ఇది నమ్మలేని నిజం. ఆ మధ్యన ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోదీజీ బజ్జీలు, పకోడీ వ్యాపారం పెట్టుకోమని ఉచిత సలహా ఇచ్చారు. నిరుద్యోగం పెరిగి పోతోందని, ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని అన్న ప్రశ్నకు సమాధానంగా. ఇంకేముంది ఈ యువకుడు ..పీఎంను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఏకంగా పకోడీని నమ్ముకున్నాడు. ఇంజనీరింగ్ చదివినా, గేట్‌లో టాప్ ర్యాంక్ సాధించినా పకోడీ తయారు చేస్తూ బతికేస్తున్నాడు. గేటులో వచ్చిన ర్యాంకుకు ఎంటెక్‌లో సీటు వచ్చింది. బద్రీనాథ్ సీజన్ కావడంతో ఎక్కడలేనంత భక్తులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. తన స్వంతూరు పిఫల్ కోడ్‌లో పకోడీ దుకాణాన్ని స్టార్ట్ చేశాడు.
అతడి కొట్టుకు బాగా గిరాకీ పెరిగింది. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతోంది. సీజన్ సమయంలోను, సీజన్ లేక పోయినా సరే సాగర్ చేతితో తయారైన పకోడీ మరింత రుచికరంగా ఉండడంతో ఇక్కడికే వస్తున్నారు జనం. ఆ షాపును వాళ్ల నాన్న పెట్టారు. చేతినిండా డబ్బులు వస్తున్నాయి. రెండేళ్లు చదివి వేస్ట్ చేయడం కంటే పకోడీని నమ్ముకుంటే నాలుగురాళ్లు వెనకేసుకోవచ్చంటున్నారు సాగర్. ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. అమ్మా, నాన్న కష్టపడి చదివించారు. ఎన్ ఐ టీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నా ..వ్యాపారమే బెటర్ గా ఉంటోందంటున్నారు ఈ యువకుడు. ఇంజనీరింగ్ చదవాలంటే ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ కష్టం పకోడీ తయారు చేయడంలో కూడా ఉంటుందంటున్నారు. ఏది ఏమైనా ఇంజనీరింగ్ కంటే పకోడీ బెటర్ కదూ. మనమూ ట్రై చేస్తే పోయేది ఏముంది జిహ్వ చాపల్యం తప్ప.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి