మారణహోమాన్ని ఆపలేమా ..?
మానవత్వం తల్లడిల్లిన సమయం ఇది. సభ్య సమాజం తలొంచు కోవాల్సిన పరిస్థితి. అత్యంత దారుణమైన సంఘటన ఇది. కన్నీళ్లు ఉబికి వస్తున్న వేళ..ఎన్ని శాంతి ప్రవచనాలు పలికినా జరగాల్సిన దారుణం జరిగి పోయింది. ఘోరమే మిగిలింది. ఉగ్రవాదం పెచ్చరిల్లి పోయినా..ఆయా దేశాల మధ్య సరిహద్దులు చెరిగి పోయినా ఇంకా ఉగ్ర మూకలు తమ దాడులు ఆపడం లేదు. ఇది ముమ్మాటికి ఏలిన వారు..ప్రస్తుత పాలకులే బాధ్యత వహించాలి. ఇంటెలిజెన్స్ వైఫల్యం అని అనుకోవడానికి వీలు లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర మూకలు ప్రతి చోటా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిని గుర్తించడం అన్నది కష్టంగా మారింది. కోట్లాది రూపాయలు శాంతి భద్రతల కోసం ఖర్చు చేస్తున్నాయి ఆయా దేశాలు . అయినా ఉగ్రవాదం సమసి పోవడం లేదు. ఎక్కడ చూసినా ఏదో రూపకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు నానా తంటాలు పడుతున్నాయి ఆయా దేశాల పోలీసులు.
ఓ వైపు బాంబుల మోత..ఇంకో వైపు రాకెట్ల దాడులు..ఇంకో వైపు అణుబాంబుల ప్రయోగాలు..ఇలా ఎక్కడికక్కడ ఆధిపత్యం కోసం అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. కోట్లాది ప్రజలు సగానికి పైగా తిండి దొరక్క నానా తంటాలు పడుతుంటే..తాగేందు నీళ్లు లేక అవస్థలు పడుతుంటే..ఆక్టోపస్ లాగా ఉగ్ర వాదులు పేట్రేగి పోతున్నారు. వారికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. శాంతికి ప్రతిరూపంగా భావించే గౌతమ బుద్ధుడు నడయాడిన నేల..శ్రీలంకలో ఇపుడు దారుణ మారణ హోమం చోటు చేసుకున్నది. చర్చీలు, హోటళ్లను టార్గెట్ చేశారు. అదీ ఈస్టర్ ..పవిత్రమైన రోజుగా భావించే సమయంలో అదును చూసి దెబ్బ కొట్టారు. ఎల్‌టీటీఈ సాగించిన మారణ కాండ ప్రపంచాన్ని హడలెత్తించింది. ప్రభాకరన్ తమిళ దేశం కావాలంటూ గెరిల్లా పోరాటం చేశాడు. ఆ సమయంలో శ్రీలంక ఏదో ఒకరోజు దాడులకు గురైంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి