పవర్ పాలిటిక్స్‌లో శ్రవణానందం..!
విద్యా పరంగా ఆయన ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూశారు. ఎంఏ, హెచ్ ఆర్ స్పెషలైజేషన్ తో ఎంబిఏ చేశారు. పిహెచ్‌డి పొందారు. లా కోర్సు పూర్తి చేసి న్యాయవాదిగా కూడా అనుభవం గడించారు. మానవ వనరుల విభాగంలో ఆయనకు మంచి పట్టుంది. దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. మహీంద్రా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా, హెచ్ఆర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దాసోజు శ్రవణ్ కుమార్ ఎండగట్టారు. ప్రజల మధ్య చర్చకు వచ్చేలా చేశారు. ఏ సెమినార్ నిర్వహించినా దాసోజు అక్కడ ఉండాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆయన విస్మరించలేని లీడర్‌గా ..స్పోక్స్ పర్సన్‌గా పేరొందారు. రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాలు సమాజానికి చెరుపు చేసేలా ఉన్నాయని ఆవేదన చెందిన ఆయన హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాహుల్‌తో పాటు సోనియాగాంధీ ప్రసంగాలను దాసోజు దగ్గరుండి అనువాదం చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు తనదైన శైలిలో.
2019లో ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్‌ను రూపొందించడంలో దాసోజే కీకల భూమిక వహించారు. 7 సెప్టెంబర్ 1966లో నల్లగొండ జిల్లాలో జన్మించారు. హైస్కూల్ వరకు తమ ప్రాంతంలోనే చదివారు. 1986లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ యూనియన్ కు సెక్రటరీగా ఉన్నారు. 1987లో ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అకడెమిక్ పరంగా చూస్తే..1990 నుంచి 2000 సంవత్సరం వరకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ లో హెచ్ఆర్ ఎం విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంస్థలో ప్రాజెక్టు ఫ్యాకల్టీగా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర సర్కార్, ప్రపంచ బ్యాంకు, డిఎఫ్ఐడి, డిఓపిటి , తదితర ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను రూపొందించడంలో కీలకంగా పనిచేశారు. అద్భుతమైన రీతిలో ప్రాజెక్టులను స్వంతంగా తయారు చేసి ప్రజెంట్ చేశారు. ఇది ఆయనకున్న తపనను తెలియ చేస్తుంది.
2000 సంవత్సరం నుండి 2007 దాకా అంటే ఏడేళ్ల పాటు కార్పొరేట్ స్థాయి కంపెనీలకు వెన్నుదన్నుగా ఉన్నారు దాసోజు శ్రవణ్ కుమార్. టెక్ మహీంద్ర అంటే సత్యం కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జీఎంగా, హెచ్ఆర్‌గా పనిచేశారు. హిటాచీ కన్సల్టింగ్ లిమిటెడ్ కంపెనీకి హెచ్ఆర్ అండ్ ట్రైనింగ్ తో పాటు డైరెక్టర్‌గా ఉన్నారు. 2008 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అనుకోకుండా ఎంటర్ అయ్యారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ ఎస్ కు స్పోక్స్ పర్సన్‌గా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్నారు. మీడియా మేనేజ్‌మెంట్ కమిటీకి కన్వీనర్‌గా, 2018లో ఎలక్షన్ క్యాంపెయిన్ కన్వీనర్‌గా , ఏఐపీసీ ప్రెసిడెంట్‌గా, టీపీసీసీకి చీఫ్ అఫిసియల్ స్పోక్స్ పర్సన్‌గా , జనరల్ సెక్రటరీగా, ఏఐసీసీకి నేషనల్ స్పోక్స్ పర్సన్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
మానవ వనరుల విభాగంలో 25 ఏళ్ల అనుభవం గడించారు దాసోజు. సియరా అట్లాంటిక్ ఇంక్ కంపెనీకి సేవలందించారు. సీఎస్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపీనిలో ఉన్నత పదవి చేపట్టారు. అకడమిక్ పరంగా, కార్పొరేట్ స్థాయి కంపెనీల పరంగా విశేషమైన పేరు పొందారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6 వేల మంది అసోసియేట్స్ కలిగిన సత్యం కంప్యూటర్స్‌కు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చారు. విశిష్ట సేవలందించినందుకు గాను ఎక్సలెన్స్ అవార్డు పొందారు. సియరా సాఫ్ట్‌వేర్ కంపెనీకి హెచ్ ఆర్ అండ్ ట్రైనింగ్‌లో తనదైన ముద్ర వేశారు. 2006లో ప్రిస్టిజియస్ పురస్కారాన్ని అందుకున్నారు 2006లో. ఏడేళ్ల పాటు మేనేజ్‌మెంట్ , ట్రైనింగ్, హెచ్ ఆర్ విభాగాలలో శిక్షణ ఇచ్చారు. థీసిస్ సమర్పించారు. ఎన్ఎండీసీ, హెచ్ జెడ్ ఎల్, జీ ఎఫ్ సీ ఎల్, ఏపీఎస్ ఆర్ టీసీ తదితర కంపెనీలకు ప్రాజెక్టు రిపోర్టులు అందించారు. దీంతో పాటు ఎన్‌సీజీ, బీఎల్పీ, ఎస్ఎల్పీలకు కూడా ప్రాణం పోశారు.
కన్సల్టెన్సీ తో పాటు రీసెర్చ్ ఎక్స్ పీరియన్స్ అందించారు దాసోజు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ లో భాగంగా జన్మభూమి ప్రోగ్రాంను ఎవాల్యూయేషన్ చేశారు. సెలెక్టర్ ఎన్‌జీఓలు చేపట్టిన కార్యక్రమాలను అస్సెస్‌మెంట్ చేపట్టారు. డిపిఐపీ అమలు చేస్తున్న కార్యక్రమాలను సోషల్ అస్సెస్‌మెంట్ చేపట్టారు. ఏపీలోని యూనివర్శిటీలలో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి , చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి రాసిన థీసిస్ కు గాను దాసోజుకు డాక్టరేట్ దక్కింది. కర్నూలు జిల్లాలో మైనార్టీల కోసం బ్యాంకులు అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి అనాలిసిస్ చేశారు. ఏఎస్‌సిఐలో పనిచేస్తున్న కాలంలో ఎన్నో కీలక ప్రాజెక్టులను అస్సెస్‌మెంట్ చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో భాగంగా ట్రాన్స్‌ఫర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, ఉత్తర్ ప్రదేశ్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ ప్రాజెక్టు , సర్దార్ సరోవర్ నర్మదా ప్రాజెక్టు కు సంబంధించి రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ పై ప్రాజెక్టు రూపొందించి రివ్యూ చేశారు. ఆచార్యుడిగా ఎన్నో పాఠాలు చెప్పారు. ఎందరో ఆయన స్టూడెంట్స్ ఇపుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
పబ్లికేషన్స్ పరంగా చూస్తే.. 2002లో సాఫ్ట్ స్కిల్స్ ఫర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ అనే పేరుతో పబ్లిష్ అయ్యింది. వర్క్ వాల్యూస్ అండ్ పర్సీవ్‌డ్ వాల్యూ అండ్ జాబ్ శాటిస్ ఫాక్షన్ , డాక్టరల్ రీసెర్చ్ ఇన్ ఏపీ యూనివర్శిటీస్ వ్యూస్ ఆప్ సూపర్ వైజర్స్, పబ్లిక్ రిలేషన్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, రీసెటిల్‌మెంట్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ప్రాజెక్టు ఎఫెక్టెడ్ పాపులేషన్ – సమ్ ఇష్యూస్ పేరుతో జర్నల్స్‌లో ప్రచురించారు. ఛేంజ్ మేనేజ్‌మెంట్ పై ఇగ్నోకు రీడింగ్ మెటిరియల్‌ను అందజేశారు శ్రవణ్ కుమార్. రీసెర్చ్ పేపర్స్ వర్కింగ్ విషయానికి వస్తే.. ఆర్గనైజేషనల్ కమిట్‌మెంట్ ఇన్ ఐటీ సెక్టార్ , ఆర్గనైజేషనల్ సిటిజన్ షిప్ బిహేవియర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ కూడా ఉన్నాయి. రీసెర్చ్ స్కాలర్స్ కు దాసోజు గైడ్‌గా ఉన్నారు. ఎంబీఏ, పీజీడిబిఎం స్టూడెంట్స్ కు గైడెన్స్ ఇచ్చారు.
వెల్ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ కు ఎంఫిఎల్ చేసే వారికి సపోర్ట్ చేశారు. అకడమిక్ ఆక్టివిటీస్ పరంగా చూస్తే.. ఐపీఇలో మేనేజింగ్ ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ రిలేషన్ షిప్, మేనేజ్‌మెంట్ ఫెస్టివల్స్ కు కోఆర్డినేటర్‌గా, ఐపీఇకి ప్రత్యేకంగా స్టూడెంట్ మాన్యువల్ ను దాసోజు తయారు చేశారు. హైదరాబద్ చాప్టర్ హెచ్ఆర్‌డి నెట్‌వర్క్‌లో మెంబర్‌గా ఉన్నారు. ఐఎస్‌టీడీ, హైసాకు అసోసియెట్‌గా పనిచేశారు. నాస్కాం, హెచ్ఎంఏ తదితర సంస్థలు నిర్వహించిన పలు సెమినార్లలో ఆయన కీలక వ్యక్తిగా పాల్గొన్నారు. దాసోజు గురించి చెప్పాలంటే..కనీసం ఓ సంవత్సరమైనా పడుతుంది. ప్రస్తుతానికి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన అత్యున్నతమైన పదవులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి