వ్యవసామే బెటర్ అంటున్న ఇంజనీర్
ఎవరైనా ప్రభుత్వ కొలువు వదులుకుంటారా..అలా చేస్తే అతడిని పిచ్చోడని మనం కామెంట్స్ చేస్తాం. కానీ హరీష్ దన్ దేవ్ మాత్రం నెల నెలా వచ్చే జీతాన్ని వదులుకున్నాడు కేవలం వ్యవసాయం మీదున్న ప్రేమతో. జైసల్మేర్ ప్రాంతానికి చెందిన హరీష్ ..మేధావి. ఇంగ్లీష్ భాషపై మంచి పట్టుంది. ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేశాడు. కానీ ఎందుకనో దాని మీద ఆసక్తి తగ్గి పోయింది. 2012లో జైపూర్‌లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఢిల్లీలో ఎంబీఏ కోసం అప్లయి చేశాడు. ఇదే సమయంలో ప్రభుత్వ పరీక్ష రాసి ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటూనే ఎంబీఏ చదివాడు. జూనియర్ ఇంజనీర్‌గా జైసల్మేర్ మున్సిపాలిటీలో పనిచేశాడు. రెండు నెలల పాటు పనిచేశాక సర్కార్ జాబ్ పై ఆసక్తి తగ్గింది. బికనేర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీని సందర్శించాడు హరీష్. కందులు, సిరి ధాన్యాల గురించి తెలుసుకున్నారు. వ్యవసాయ నిపుణులతో చర్చించాక ఓ నిర్ణయానికి వచ్చాడు.
అలోవేరా ఫార్మింగ్ చేస్తే బావుంటుందని సూచించడంతో దానిపై దృష్టి పెట్టారు. మరింత సాగుపై అవగాహన పెంచుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వ్యవసాయ రంగంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో పాల్గొన్నాడు. అలోవేరా సాగులో కొత్త టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకోవాలో..తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలో నేర్చుకున్నారు. అలోవేరా ఫార్మింగ్ పైనే ఎక్కువగా కాన్ సెంట్రేషన్ చేశాడు హరీష్. ఢిల్లీ నుండి బికనేర్ కు 25 వేల అలోవేరా మొక్కలతో బయలు దేరాడు . తనతో పాటు తమ ఊరులో ఉన్న మరికొందరు రైతులకు అలోవేరాను సాగు చేయాలని సూచించాడు. రైతులు సాగు చేసి పండించినా అలోవేరాను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న సంగతిని గ్రహించాడు. ఈ గ్యాప్ ను పూరించేందుకు కొనుగోలుదారులను సంప్రదించాడు. రైతులు పండించే అలోవేరాను కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నాడు.
మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పండించడం ఒక ఎత్తు..దానిని మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ..అలోవేరా ను సాగు చేయాలన్నదే నా అభిమతం. ఫార్మింగ్ ఏజెన్సీలను సంప్రదించా. వారికి అలోవేరా సాగు చేయడం వల్ల కలిగే లాభాలు వివరించా. దీంతో వారిలో కొంత మార్పు వచ్చింది. అలాగే నాలాంటి రైతులకు కూడా. స్వంతంగా అలోవేరా సెంటర్‌ను ఏర్పాటు చేశాడు హరీష్. తానే కొనడం అమ్మడం ప్రారంభించాడు. ఆన్ లైన్లో కొనుగోలు చేసే వారి గురించి వివరాలు సేకరించాడు. ఆఫ్ లైన్‌లో నే కాకుండా ఆన్ లైన్‌లో కూడా అలోవేరాను అమ్మేలా ప్రయత్నాలు చేశాడు.
ఇండియాలోనే అత్యధికంగా అలోవేరాను కొనుగోలు చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది రాందేవ్ బాబా ఆధ్వర్యంలో పతంజలి ఒక్కటే. తానేమిటో..తాను ఎలా ఫార్మింగ్ చేస్తున్నాడో..అలోవేరాను ఎలా పండిస్తున్నాడో ..తదితర వివరాలతో మెయిల్ పంపించాడు. పతంజలి నుంచి రెస్పాన్స్ వచ్చింది. అలోవేరాను పతంజలి కొనుగోలు చేస్తూ వస్తోంది. నేచురెలో ఆగ్రో పేరుతో ఏకంగా హరీష్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అన్నీ అలోవేరా ఉత్పత్తులే. పతంజలి తోడ్పాటుతో ఎంతో మందికి ఉద్యోగం కల్పించారు. సర్కార్ కొలువును కాదనుకుని..వ్యవసాయంపై మక్కువ పెంచుకుని..పతంజలితో ఎంఓయు కుదుర్చుకుని..ఇవాళ నేచరుల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న హరీష్ ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి