మానుకోట మండుతున్నది ..తెలంగాణ తల్లడిల్లుతున్నది – ఈ కరచాలనం ఎవరి కోసం ..?
నిలువెల్లా గాయాలను తట్టుకుని ..ఉద్విగ్నమైన పోరాటాన్ని ఊపిరిగా చేసుకుని ..ప్రపంచం నివ్వెర పోయేలా చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రాంతానికి మాత్రమే వున్నది. ఇది చారిత్రాత్మకమైన ఘట్టం. నూతన ఒరవడికి ప్రాణం పోసింది. కోట్లాది ప్రజలు స్వచ్ఛంధంగా తమ ప్రాంతపు అస్తిత్వం కోసం సాగించిన అరుదైన ఉద్యమం ఇక్కడిదే. ఇలాంటి పోరాటాలు, ఆందోళనలు, స్వచ్చంధ నిరసనలు, సంబండ వర్ణాలు ఒక్కటై ..ఒకే లక్ష్యం కోసం లక్షలాది అడుగులు ఏక కాలంలో సాగింది ఇక్కడే. తెలంగాణ రాష్ట్రం కోసం సాగించిన అలుపెరుగని న్యాయమైన డిమాండ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మద్ధతు లభించింది. ప్రాంతాలకు , కులాలకు, వర్గాలకు అతీతంగా కూలీల నుంచి కార్పొరేట్ ఉద్యోగస్తుల దాకా అంతా తమ ప్రాంతపు విముక్తి కోసం ఉద్యమించారు.
కాలికి బలపం కట్టుకుని మేధావులు, జర్నలిస్టులు, నిరుద్యోగులు, వృద్దులు, పిల్లలు, మహిళలు, దివ్యాంగులు, మైనార్టీలు, బీసీలు, దళిత బహుజనులు..ఇలా ప్రతి ఒక్కరు మమైకమై సాగారు. ఈ పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇంకెందరికో పాఠం నేర్పింది. కరుడుగట్టిన సమైక్యవాదులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, దివంగత వైఎస్ కొడుకు , ఏపీ సీఎం జగన్ మానుకోటకు బయలుదేరేందుకు యత్నించారు. ఆ సమయంలో ఎంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతపు అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు నానా రకాలుగా ప్రాంతేతరులు ప్రయత్నం చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా దక్కించుకున్నారు. ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ కు అడ్డాగా మార్చేశారు. కుట్రలు పన్నారు.
కుతంత్రాలకు తెర లేపారు. అన్నెం పున్నెం ఎరుగని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తదితర యూనివర్శిటీల స్టూడెంట్స్‌ను చిత్రహింసలకు గురి చేశారు. కేసులు నమోదు చేశారు. జైలుపాలు చేశారు. కేంద్రం తలవంచింది. లక్షలాది ప్రజల ఆర్తనాదాలను, నిబద్ధతకు స్పందించింది. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ ఆచారి చేసిన పుణ్యం, కేసీఆర్ దీక్ష, దక్షత, కవులు, కళాకారులు, ప్రజలు, విద్యార్థులు, అన్ని వర్గాల వారు చేసిన ఉద్యమ ఫలితమే నేటి తెలంగాణ. లక్షలాది కొలువులను భర్తీ చేయకుండా మాటలతో కాలయాపన చేస్తున్న సీఎం కేసీఆర్ కు పార్లమెంట్ ఎన్నికలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఈ సమయంలో జగన్‌కు మద్ధతు పలకడం, ఆయనకు సపోర్ట్ చేయడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్టే.
జగన్ అన్నీ మరిచి పోవచ్చు కాక..ఆయన తండ్రి చేసిన మోసం..ఈ కరడుగట్టిన సమైక్యవాదిని మానుకోట మరిచి పోలేదు ఎవరిపైన దాడులకు పాల్పడ్డారో..చిత్రహింసలపాలు చేశారో ఆ ఖాకీలకు పదోన్నతులు కల్పించారు. అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇపుడు సమైక్యవాదుల , ఆంధ్రుల, రాయలసీమ వాసుల ఫ్లెక్సీలతో హైదరాబాద్ నిండి పోయింది. జగన్ వల్ల నష్టమే తప్ప..ఆయనతో పాటు తన అనుచరుల ఆస్తులను కాపాడు కునేందుకే కేసీఆర్ కు వంత పాడుతున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్థానికేతరులకు ఇక్కడ స్థానం లేదని తేల్చి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి