సర్కారు బడిలో హీరోయిన్
ప్రభుత్వ బడులంటే చాలా మందికి చులకన. అన్ని సమస్యలకు ఇంగ్లిష్ భాష ఒక్కటే పరిష్కారమంటూ రెండు తెలుగు రాష్ట్రాల అధిపతులు జపం చేస్తున్నారు. ఇప్పటికే స్టూడెంట్స్ లేరనే నెపంతో బడులను మూసి వేసేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో తెలుగు సినిమా రంగంలో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఉన్నతాధికారులు, పొలిటికల్ లీడర్లు, మంత్రులు, పాఠాలు చెప్పకుండా రాజకీయాలు, వ్యాపారాలు చేస్తున్న టీచర్లు తలదించు కునేలా చేశారు. ఈ టాలీవుడ్ నటి పంతుల్లమగా మారి పోయారు. ఎక్కడో కార్పొరేట్ బడి అనుకుంటే పొరపాటు పడినట్లే.
విద్యార్థులకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పి మెప్పించింది. సర్కారు బడుల్లో విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు చెప్పేందుకు, వారిలో ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పెగా టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం-12లోని ఎన్‌బీటీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించింది. మూడో తరగతి విద్యార్థులకు గంట సమయం పాటు ఇంగ్లిష్ పాఠాలు బోధించారు. వారితో ఇంగ్లిష్‌లో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీలు దిగి వారిని మరింత ఉత్సాహ పరిచారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం మరిచి పోలేనని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాతృ భాషతో పాటు ఇంగ్లిష్ నేర్పించడం ఎంతో అవసరమని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతున్న సంస్థను ఆమె అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు, వారిలో సృజనను పెంచేందుకు తాము ప్రముఖులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్‌ఎస్‌కే ఫౌండర్ చైతన్య కూడా పాల్గొన్నారు. కాగా నిధి లాగా మిగతా టాలీవుడ్ నటీనటులు స్పందించి ప్రభుత్వ బడుల్లో పాఠాలు చెబితే కొంత మేలు జరుగుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి