కళ్లన్నీ హైదరాబాద్ వైపే
అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొలువు తీరాక దాని స్వరూపమే మారి పోయింది. పట్టుపట్టి నగరంలో వన్డే మ్యాచ్ జరిగేలా చేశాడు. నిన్నటి దాకా ఎన్నో ఆరోపణలు ఎదుర్కున్న అసోసియేషన్ ఇప్పుడు కొత్త పాలక వర్గంతో నూతన జవసత్వాలను సంతరించుకుంది. ఇప్పటి దాకా భాగ్యనగరం ఎన్నో ఐపీఎల్ టి20 మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. కానీ అంతర్జాతీయ మెరుపులే లేవు. వన్డే, టెస్టులకు ఆతిథ్య మిచ్చిన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇప్పుడు ఆ లోటునూ తీర్చు కునేందుకు సిద్ధమైంది. ఫామ్‌లో ఉన్న కోహ్లి సేన జోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు నగర క్రికెట్ ప్రియులు పోటెత్తనున్నారు. సమరానికి సాయి అంటోంది వెస్టిండీస్.
భారత కుర్రాళ్లను ఇప్పుడు ఐపీఎల్ వేలమే కాదు, వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరిగే టి20 ప్రపంచకప్ కూడా ఊరిస్తోంది. నిలకడైన ప్రదర్శనతో అటు ఫ్రాంచైజీలు, ఇటు సెలక్టర్ల కంట పడేందుకు యువ ఆటగాళ్లకు విండీస్‌తో సిరీస్ చక్కని అవకాశం కలిపిస్తోంది. ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్‌లో హిట్టయినా... టీమిండియా తరఫున ఫ్లాపవుతున్న ఆటగాళ్లు మనసు పెడితే చోటు ఖాయం చేసుకునే తరుణం కూడా ఇదే. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లి మళ్లీ జట్టును నడిపించేందుకు రానున్నారు. చాన్నాళ్ల తర్వాత పేసర్లు భువనేశ్వర్, షమీ, కుల్దీప్‌లు పొట్టి మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర లకు కోహ్లీ ఛాన్స్ ఇవ్వనున్నారు.
మిడిలార్డర్‌లో అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబేల స్థానాలకు ఢోకా లేదు. మరో వైపు శిఖర్ ధావన్ గాయంతో రాహుల్‌కు వరంగా మారింది. ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కుతుంది. ఇక్కడ మెరుపులు మెరిపిస్తే రోహిత్‌కు రెగ్యులర్ భాగస్వామి కూడా కావొచ్చు. పైగా టి20ల్లో రాహుల్‌కు మంచి రికార్డే ఉంది. పంత్ కు ఈ సిరీస్ అగ్ని పరీక్ష. ఇదిలా ఉండగా బలమైన టీమిండియాను ఢీకొనాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది వెస్టిండీస్. కాగా భారత్‌లో ఆడిన అనుభవం తమకు వుందని, యువసత్తాతోనే కోహ్లిసేను ఓడిస్తామని పొలార్డ్ చెప్పాడు. అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు తెలంగాణ పోలీసులు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి