దిశ హంతకుల కాల్చివేత
సభ్య సమాజం తలొంచుకునేలా దేశమంతటా సంచలనం కలిగించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అలియాస్ దిశ అత్యాచారం చేసి, కాల్చి చంపిన కేసులో నిందితులైన ఆరిఫ్, చిన్న కేశవులు, శివ, నవీన్ లను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కోట్లాది మంది ముక్త కంఠంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే కాల్చి చంపాలని కోరారు. అయితే ఈ ఎన్ కౌంటర్ ను బాధితురాలి తల్లిదండ్రులు దీనిని స్వాగతించారు. మా పాప ఆత్మకు శాంతి జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. ఎక్కడైతే ప్రియాంకా రెడ్డి తన ప్రాణం కోల్పోయారో అక్కడే నిందితులు పారిపోతుండగా ఖాకీలు కాల్చి వేశారు. ఈ సంఘటన ఇండియా అంతటా సంచలనం కలిగించింది.
లోక్ సభ, రాజ్య సభల్లో పార్లమెంట్ సభ్యులు, మేధావులు, కవులు, కళాకారులు, సినీ లోకం, వివిధ రాజకీయ నాయకులు, క్రీడాలోకం..ఇలా ప్రతి ఒక్కరు దిశకు న్యాయం చేయాలని ఒకే స్వరం వినిపించారు. ఇండియాలో ఈ ఎన్ కౌంటర్ జరిగిన కొద్ది నిమిషాల్లోపే వైరల్ అయ్యింది. సత్వర న్యాయం జరగాలన్న వాయిస్ వ్యక్తమైంది. ఇదిలా ఉండగా గత నెల 27 అర్ధరాత్రి దిశను అత్యాచారం చేశారు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోపే నిందితులను పట్టుకున్నారు. సంఘటనపై పోలీసులు నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ మానవ, మహిళా హక్కుల కమిషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దీనిని సీరియస్ తీసుకుంది.
నిందితులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే సమయంలో బాధితురాలి కుటుంబాన్ని ప్రముఖులు సందర్శించారు. సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ కూడా ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఓ వివాహం కోసం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ను మీడియా తప్పు పట్టింది. ఈ ఎన్ కౌంటర్ దెబ్బకు మిగతా నేరస్థులు, నేర స్వభావం కలిగిన వారి వెన్నులో వణుకు పుట్టేలా చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు ఏ రకంగా కోర్టుకు, ప్రభుత్వానికి సమాధానం చెబుతారో సమాజానికి తెలియాల్సి ఉంది. కాగా దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు సవాల్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను షాద్‌నగర్ పోలీసులు పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతంలో క్రైమ్ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పారి పోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ కేసులో ఏ-1 మహ్మద్ ఆరిఫ్, ఏ-2 శివ, ఏ-3 నవీన్, ఏ-4 చెన్నకేశవులను పోలీస్ ఎన్‌కౌంటర్ చేశారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి