దేశమంతటా సజ్జనార్
ఈ దేశాన్ని ప్రియాంకా రెడ్డి అలియాస్ దిశ కేసు ఊపేసింది. తెలంగాణ పోలీసుల పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ సమయంలో దారుణం జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఘటనకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చట్టానికి లోబడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన నిందితులపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. కోట్లాది మంది దిశకు న్యాయం చేయాలని, నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వంపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరం. దీంతో ఈ ఘటనపై అంతటా చర్చనీయాంశం కావడం కూడా పోలీసులపై వత్తిళ్లు పెరిగాయి.
సీఎం కేసీఆర్ కు ప్రజలు విన్నవించారు. దారుణాలు జరగకుండా, మహిళలు, బాలికలు, యువతులు, చిన్నారులకు భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటి వరకు ఎన్నో నేరాలు, అక్రమాలకు పాల్పడిన వారికి ఇంకా శిక్షలు ఖరారు కాలేదు. చట్టాల్లో ఉన్న లొసుగులు ఆసరాగా చేసుకుని నేరగాళ్లు తప్పించు కుంటున్నారు. దీంతో ప్రియాంకా రెడ్డి కేసు కూడా ఇలాగే అవుతుందని అనుకున్నారు. ఇదే సమయంలో కేసు విచారణకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. తీవ్ర నేర స్వభావం కలిగిన వీరిని అన్ని కోణాల్లో విచారణ జరిపారు సీపీ సజ్జనార్.
ఆయనకు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఇప్పటికే పేరుంది. అంతకు ముందు షాద్ నగర్ లో నిందితులను తమకు అప్పగించాలని జనం కోరారు. ప్రతి చోటా, దేశమంతటా నేరస్థులను వెంటనే ఉరి తీయాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అయితే రాజ్యాంగం ప్రకారం పోలీసులకు కొన్ని పరిమితులుంటాయి. ఈ ఒక్క సంఘటన ఎలా జరిగిందన్నది ఇంకా తెలియాల్సి ఉన్నది. చట్టాన్ని చేతుల్లోకి తీసు కోవడం అన్నది ఓ రకంగా భావ్యం కాక పోయినా, జరిగిన దారుణం మాత్రం అత్యంత అమానవీయమైన సంఘటన. ఈ కేసు దేశాన్ని కదిలించింది. ప్రతి ఒక్కరి హృదయాన్ని కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది.
ఇక ముందు నేరం చేయాలన్న, లేదా తప్పు చేయాలంటే భయం కలిగించేలా సజ్జనార్ చేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారం చాలా సున్నితమైన అంశం. మొత్తం ఘటనకు సంబంధించి సీపీ సజ్జనార్ పై స్థాయి అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, హైకోర్టుకు, జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ లకు పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. కాగా ఈ ఎన్ కౌంటర్ దెబ్బకు నేరస్థుల్లో భయం నెలకొనడం మాత్రం ఖాయం. నేరం నీది కాదు నాది కాదు ఈ సమాజానిది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి