శివ..శివ..కైలాసా

సోషల్ మీడియాలో వివాదాస్పద స్వామి నిత్యానంద ఏర్పాటు చేసిన కైలాస ఇప్పుడు వైరల్ అయ్యింది. స్వయం ప్రకటిత దేవుడు.. రేప్‌ కేసు నిందితుడు, ప్రస్తుతం పరారీలో ఉన్న నిత్యానంద తన కోసం, తన అమాయక భక్తుల కోసం కైలాస పేరుతో సొంతంగా ఒక ద్వీప దేశాన్నే సృష్టించుకున్న విషయం తెలిసిందే. దానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం ఆ దేశ న్యాయప్ర తినిధులు ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలుపెట్టారు. ఆ దేశానికి సంబంధించి ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌ కూడా రూపొందించారు. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలోని ఈ ద్వీపం ఉంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్‌ నుంచి కొనేసుకున్న నిత్యానంద. ఆ దీవిలో తన సొంత దేశాన్ని ఏర్పాటు చేసి, సొంత జెండా, పాస్‌పోర్టు, జాతీయ చిహ్నం, రాజ్యాంగం.. ఇలా అన్నింటినీ ఏర్పాటు చేశాడు.

అయితే దీనిపై దేశ వ్యాప్తంగా సెటైర్లు వస్తున్నాయి. సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేయడం ఏంటని ఎవరికి తోచిన విధంగా వాళ్లు నిత్యానందని ఆడేసుకుంటున్నారు. నిత్యానందపై సెటైర్లతో సోషల్‌ మీడియా మోత మోగిపోతోంది.  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీం ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా నిత్యానంతపై తనదైన స్టైల్‌లో సెటైర్ వేశాడు. వీసా రావడానికి ఏం చేయాలి. లేదా అక్కడకు చేరుకున్నాక ఇస్తారా అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు. దానికి కైలాసా అనే హ్యాష్‌ ట్యాగ్‌ని కూడా జత చేశాడు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు తెగ నవ్వు కుంటున్నారు.

నిత్యానంద నీకంటే గొప్ప స్పిన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి అశ్విన్‌కు కేవలం టెస్ట్ జట్టులోనే చోటు దక్కుతోంది. వన్డేలు, టీ-20ల్లో అతనికి అవకాశం ఇవ్వడం లేదు. అయినప్పటికీ టెస్టుల్లో తనకు దొరికిన అవకాశాన్ని అశ్విన్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ అతను మంచి ప్రదర్శన చేశాడు. దీంతో అతన్ని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేశారు. మొత్తం మీద నిత్యానంద కైలాస నుంచి రప్పిస్తారా లేక వదిలేస్తారా లేదో వేచి చూడాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!