మోదీపై చిదంబరం ఆగ్రహం

మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుని, తీహార్ జైలు పాలై ఇటీవలే బెయిల్ పై విడుదలైన మాజీ కేంద్ర మంత్రి చిదంబరం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్థిక విధానాలపై మండిపడ్డారు. పలు కీలక విషయాలను ప్రస్తావించారు. మోదీ ఆర్థిక వ్యవస్థ మందగమనం గురించి మౌనం వహించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన, ముందు చూపు లేకుండా పోయిందన్నారు. యూపీఏ హయాంలో 14 కోట్ల దేశ ప్రజలను పేదరికం నుంచి సాంత్వన కలిగిస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనలో లక్షల మంది పేదరికంలో మగ్గుతున్నారని ధ్వజమెత్తారు.

వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతంగా అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని ఆభిప్రాయ పడ్డారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి నోట్ల రద్దు, జీఎస్‌టీని సరియైన పద్దతిలో అమలు చేయక పోవడం, విపరీతమైన పన్నులు, పీఎంవో ఆఫీసు కేంద్రీకృత నిర్ణయాలు ప్రధాన కారణాలని ఆయన ఆరోపించారు. కాగా, జైలు నుంచి విడుదలైన తర్వాత తనకు మొదట గుర్తొచ్చింది కశ్మీర్‌ ప్రజలేనని చిదంబరం తెలిపారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా  కేసులో 106 రోజులు జైలులో ఉన్నారు. కశ్మీర్‌ ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే తాను కశ్మీర్‌ ప్రజలను కలుస్తానన్నారు.

ఈ మధ్య ఓ పారిశ్రామికవేత్త కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రజలు భయ పడుతున్నారని అన్నారు. ఒక్క చోటే కాదు ప్రతిచోటా భయం ఉంది...మీడియా కూడా భయపడుతోందంటూ చిదంబరం వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంభానికి ఎస్‌పీజీ భద్రత అవసరంలేదని ప్రభుత్వం భావిస్తే సరిపోదని, అనుకోని సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చిదంబరం అన్నారు. గ్రామీణ వినియోగం, వేతనాలు దారుణంగా పడి పోవడం ఆర్థిక వ్యవస్థకు నష్ట దాయకమని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!