ఏపీలో బుగ్గన సెన్సేషన్
ఎవరీ బుగ్గన అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు దమ్మున్న నాయకుడు. ఏపీ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన మంత్రిగా కొనసాగుతున్నారు. జగమెరిగిన రాజకీయ నాయకుడు, అపార చాణ్యుక్యుడిగా పేరొందిన, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు రాజేంద్ర నాథ్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రభుత్వ రైలును నడిపిస్తున్న డ్రైవర్ ఆయన. యువ నాయకుడు, మడమ తిప్పని మనస్తత్వం కలిగిన జగన్ మోహన్ రెడ్డికి ఒక రకంగా అన్నీ బుగ్గననే. విద్యాధికుడిగా, మేధావిగా, తాత్వికుడిగా, అనుభవం కలిగిన పొలిటికల్ లీడర్ గా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నారు.
ఒక రకంగా ఆయనను ఏరికోరి మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. కెప్టెన్ సరిగా ఉంటే జట్టు సభ్యులు కూడా సమర్ధవంతంగా ఉంటారని రాజేంద్రనాథ్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. మొత్తం సందింటి కేబినెట్ లో అత్యంత కీలకమైన వ్యక్తి బుగ్గన. ఏపీలో ఏది కావాలన్నా, లేదా ఏ కొత్త కార్యక్రమమైనా, సంక్షేమ పథకమైనా సరే సక్సెస్ కావాలంటే బుగ్గన, జగన్ పక్కన ఉండాల్సిందే. రాజకీయ పరంగా, పాలనా పరంగా ఎంతో పరిణితి కలిగిన వ్యక్తిగా ఎదిగారు ఆయన. విపక్ష పార్టీల నేతలు, అధినేతలు సంధించే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇస్తున్నారు. అంతే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లకు ధీటుగా ఆన్సర్ చేస్తున్నారు.
దీంతో బాబు అండ్ పవన్ టీమ్ లు ఏమీ చేయలేక పోతున్నాయి. ప్రభుత్వ పరంగా అమలవుతున్న ప్రతి అంశం పట్ల బుగ్గనకు మంచి పట్టుంది. అందుకే జగన్ ఆర్ధిక శాఖతో పాటు ప్రజా ప్రతినిధులను కంట్రోల్ లో పెట్టేందుకు శాసనసభ వ్యవహారాలను కూడా అప్పగించారు. రెండు పదవులు సర్కారు లో అత్యంత కీలకం. ఈ రెండూ పదవులను అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు బుగ్గన. వందకు వంద శాతం సక్సెస్ అయ్యారు కూడా. ఇక రాజేంద్రనాథ్ రెడ్డి వివరాల్లోకి వెళితే..బుగ్గనకు ఘనమైన చరిత్ర ఉంది. రాజేంద్రనాథ్ రెడ్డిది కర్నూల్ జిల్లా.1970 సెప్టెంబరు 27న బేతంచర్లలో జన్మించారు. రాజకీయ వేత్తగా, వ్యాపారవేత్తగా పేరుంది.
2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకు ముందు అంటే 2014 లో జరిగిన ఎన్నికల్లో కూడా అయన వైసీపీ శాసనసభ్యునిగా ఉన్నారు. ఇక 2016-19 వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు బుగ్గన. ఆయన తండ్రి బుగ్గన రామ్‌నాథ్ రెడ్డి. ఐఐటి ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్. అంతే కాదు సర్పంచ్ గా ఉన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి కదిరి వెంకట రెడ్డి ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, ప్రొడక్షన్ మేనేజర్. రాజేంద్రనాథ్ రెడ్డి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు.
1992 లో బళ్లారిలోని మహాబలేశ్వరప్ప ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివాడు. బుగ్గన బహుభాషా కోవిదుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషలలో నిష్ణాతుడు. స్వాతంత్య్రానికి పూర్వం నుండి భారత రాజకీయాలతో ముడిపడి ఉన్న కుటుంబ నేపథ్యం ఉన్నందున, తన కుటుంబ వారసత్వాన్ని అనుసరించడానికి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు. బేతంచర్ల గ్రామ పంచాయతీకి వరుసగా రెండు సార్లు సర్పంచ్‌గా పని చేశాడు. ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మొత్తం మీద బుగ్గన ఇప్పుడు ఏపీలో విస్మరించలేని పొలిటికల్ లీడర్ కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి