జగన్ ఆదా..జనం ఫిదా


సందింటి జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాక పాలనలో తనదైన ముద్ర అగుపించేలా చేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరిచే పనిలో పడ్డారు. ఆయన తీసుకుంటున్న వన్నీ జనానికి ఆమోద యోగ్యాంగా ఉన్నాయి. దీంతో ప్రతి దానికీ ప్రజామోదం లభిస్తోంది. తాజాగా సీఎం తీసుకున్న డిసిషన్ ప్రభుత్వానికి మేలు చేకూరేలా జరిగింది.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు ప్రజలకు సేవలందించేందుకు 4జీ సిమ్‌ కార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేయడంతో 33.77 కోట్ల ప్రజాధనం ఆదా అయింది.

4జీ సిమ్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ ఓపెన్‌ మార్కెట్‌లో నెలకు 199 ఉండగా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కేవలం 92.04కే ఇచ్చేందుకు వీలు కలిగింది. అంటే ఒక్క సిమ్‌ కార్డుపై నెలకు దాదాపు 107 ఆదా అయింది. 4జీ సిమ్‌ కార్డులు 2,64,920 కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఫైనాన్స్‌ బిడ్‌ను ఓపెన్‌ చేసింది. ఈ టెండర్‌లో 4జీ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ మూడేళ్లకు 2,64,920 సిమ్‌లకు 121.54 కోట్లు కోట్‌ చేసిన ఒక సంస్థ ఎల్‌–1గా నిలించింది. దీనిపై ఏపీటీఎస్‌  రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా ఇదే నియమిత కాలానికి మరో సంస్థ  87.77 కోట్లే కోట్‌ చేసింది.

అంటే టెండర్‌ విధానంలో ఎల్‌–1గా నిలిచిన సంస్థ కన్నా రివర్స్‌ టెండరింగ్‌లో మరో సంస్థ  33.77 కోట్లు తక్కువకు కోట్‌ చేసింది. ఈ మొత్తం ప్రజాధనం ఆదా అయినట్లే. ఈ ప్యాకేజీలో జాతీయ, స్థానిక వాయిస్‌ కాల్స్‌కు పరిమితి లేదు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు 1జీబీ డేటా సౌకర్యం ఉంటుంది. కాగా, రివర్స్‌ టెండరింగ్‌ వల్ల 27.8 శాతం.. అదే ఓపెన్‌ మార్కెట్‌ ధరతో పోల్చి చూస్తే ఏకంగా 53.6 శాతం ప్రజాధనం ఆదా అయ్యిందన్నమాట. సో..జగన్ ఏది చేసినా తమ బాగు కోసమే చేస్తున్నారని ప్రజలు ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.

కామెంట్‌లు