బాలయ్య లుక్స్ అదుర్స్
తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రత్యేకతలున్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అతను ఒక్కడే బాలయ్య. తన తండ్రి నుంచి నటవారసత్వం కొనసాగిస్తున్న ఈ నటుడు డైలాగ్ డెలివరీ వెరీ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది. తాజాగా ఆయన వెరీ యంగ్ గా అగుపిస్తున్నారు. లుక్స్ లో వెరీ స్టైలిష్ గా తన అభిమానులు విస్తు పోయేలా చేస్తున్నారు. కాగా బాలకృష్ణ హీరోగా తెర కెక్కుతున్న తాజా చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య స్టైలీష్ లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టు కోగా, దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన చిత్ర పోస్టర్ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా బాలయ్య అభిమానులను మరోసారి సర్‌ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. రూలర్‌లో బాలయ్యకు సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా టీజర్ వెరీ సూన్ అంటూ పేర్కొంది. విడుదల చేసిన పోస్టర్‌లో బాలయ్య స్టెప్పు లేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో పాటు అతడు వేసుకున్న షూస్ ట్రెండీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య తన రూపం, ఆహార్యం పూర్తిగా మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివర దశకు చేరడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ‘రూలర్’ చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ,భూమిక కీలక పాత్రలు పోషించారు.
రూలర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలయ్యాక మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశ పర్చడంతో పాటు ఎన్నికలు రావడంతో బాలయ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. దీంతో లాంగ్ గ్యాప్ తర్వాత రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘రూలర్’పై నందమూరి అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా పూర్తైన తరువాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. సినిమా కథ ఇప్పటికే పూర్తయింది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి