నవ మన్మధుడు ఈ లెజెండ్

హాలీవుడ్‌ సింగర్‌ జాన్‌ లెజెండ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తన పాటలతో జనాలను ఉర్రూత లూగించిన ఈ పాప్‌ సింగర్‌ ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’గా నిలిచాడు. ఈ విషయాన్ని ప్రముఖ పీపుల్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా జాన్‌ లెజెండ్‌ మాట్లాడుతూ ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఇడ్రిస్‌ ఎల్బా తర్వాత నేను ఈ అవార్డును పొందడం చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా ఈ అవార్డుతో నాలో ఒత్తిడి పెరిగింది. ఈ అవార్డు అందుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అదేవిధంగా కొంచెం భయంగా ఉంది.

ఎందుకంటే అంత సెక్సీ మెస్ట్‌ మ్యాన్‌గా ఉన్నానా లేదో అనుమానం కలుగుతోంది. అయితే ఈ విషయంలో గతేడాది విన్నర్‌గా నిలిచిన ఇడ్రిస్‌ ఎల్బాను అనుసరిస్తాను అని జాన్‌ లెజెండ్‌ పేర్కొన్నారు. జాన్‌ లెజెండ్‌ తన ట్విటర్‌ ఖాతాలో.. ఒక చిన్న నాటి ఫోటో, ఎల్బా ఫోటో జత చేసి షేర్‌ చేశారు. ఆ ఫోటోకి 1995 నాటి జాన్‌ లెజెండ్‌  చాలా కలవరపడుతున్నాడు. కానీ 2018కి ఎంపికైన ఎల్బాను అనుసరిస్తున్నాడు. 2019 నన్ను ‘మోస్ట్‌ సెక్సీయెస్ట్‌ మ్యాన్‌’ గా ఎంపిక చేసిన పీపుల్‌ మ్యాగజైన్‌కి ధన్యవాదాలు అంటూ కామెంట్‌ చేసి ఎల్బాకు ట్యాగ్‌ చేశారు.

దీంతో స్పందించిన ఎల్బా ఓ మై గాడ్‌, ధన్యవాదాలు మిత్రమా. నువ్వు ఈ టైటిల్‌ పొందడానికి అర్హుడివి.. ఈ విషయం రాక్‌కు చెప్పకు ఆ టైటిల్‌ను గెలిచింది అతనే అనుకుంటున్నాడని సరదాగా అన్నాడు. నేను ఆ టైటిల్‌ తీసుకున్న వాడిగా.. ఆతనికి చెప్పే హృదయం నాకు లేదు అంటూ ఎల్బా రిట్వీట్ చేశారు. దీంతో ఈ లెజెండ్ కోసం అమ్మాయిలే కాదు అందగత్తెలు ఎదురు చూస్తున్నారు. తమ కలల రాకుమారుడు నిజమైన నవ మన్మధుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!