స్వంత గూటికే రమ్య ప్రిఫర్
కన్నడ నాట సంచలన నటిగా పేరు పొందిన రమ్య కొంత కాలం తర్వాత తిరిగి తన స్వంత గూటికి రానున్నారు. దీంతో ఆమె అభిమానులు ఆనందానికి లోనవుతున్నారు. గతంలో ఆమెకు విపరీతమైన క్రేజీ ఉండేది. అయితే సినిమాల్లో ఫుల్ స్వింగ్ లో నటిగా వెలుగొందుతున్న సమయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా రమ్య తిరిగి మూవీల్లో నటించేందుకు సంసిద్ధమనే సంకేతాలు పంపారు. పునీత్ రాజ్‌కుమార్ సరసన అభి మూవీలో నటించడం ద్వారా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది.
నటి రమ్య తక్కువ సమయంలోనే కన్నడ చిత్రసీమలో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే ముక్కు సూటిగా మాట్లాడే ధోరణితో ఆమె వివాదాస్పద నటిగా కూడా పేరొందారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టిన రమ్య 2017లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో తాను ప్రాణప్రదంగా ప్రేమించే సినిమాలకు దూరమయ్యారు.
ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో ఆమె సోషల్ మీడియా బాధ్యతల నుంచి వైదొలిగారు. తనకు ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయని, వాటిని తాను అంగీకరించ లేదని, అయితే సినిమాల్లో తిరిగి పని చేయడం తనకు ఫన్ గానే ఉంటుందన్నారు. దీనిపై ఇప్పడే ఏమీ చెప్పలేనని రమ్య చెప్పారు. కాగా ఆమె సోచల్ మీడియాలో చాలా చురుకుగా వ్యవహరించారు. ఎంతో పేరు తెచ్చుకున్నారు కూడా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి