మహీంద్రా బంపర్ ఆఫర్

మిలీనియర్‌ ఆయిల్‌ ట్రేడర్ కుమారుడికి తమ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పిస్తామని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన మిలీనియర్‌ రాకేశ్‌ థక్కర్‌ కొడుకు ద్వార్‌కేశ్‌ థక్కర్‌. ఇంజనీరింగ్‌ చదువుతున్న ద్వార్‌ కేశ్‌కు చదువు పట్ల ఆసక్తి లేని కారణంగా తన స్వస్థలం పాంద్రా నుంచి సిమ్లాకు వెళ్లాడు. సొంతంగా ఎదగాలని నిర్ణయించుకొని అక్కడ ఓ హోటళ్లో అంట్లు శుభ్రం చేసే పనిలో చేరాడు. ప్రతి రోజు అంట్లను శుభ్రం చేసి, రోడ్లపైనే నిద్ర పోయే వాడు.

ఈక్రమంలో సిమ్లా పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా, అతను ఓ మిలీనియర్‌ కొడుకు అని తేలింది. ఓ మిలీనియర్‌ కొడుకు అంట్లు తోముతున్న దృశ్యాలు ప్రధాన పత్రికల్లో రావడంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఆనంద్‌, అతనికి తన కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పించారు. ఈ విషయంపై థక్కర్‌ స్పందిస్తు మహీంద్ర కంపెనీ ఆఫర్‌ను కచ్చితంగా స్వీకరిస్తానని తెలిపాడు. కంపెనీ అధికారులను త్వరలోనే కలుస్తానని చెప్పాడు.

మరోవైపు థక్కర్‌ తండ్రి రాకేశ్‌ థక్కర్‌.. మహీంద్ర ఆఫర్‌ చేసిన ఇంటర్న్‌షిప్‌పై స్పందించారు. తన కుమారుడికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉందని, కచ్చితంగా ఏదో ఒక రోజు నెర వేరుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తుల్లో గొప్ప పారిశ్రామికవేత్తగా ద్వార్‌కేశ్‌ థక్కర్‌ ఎదుగుతాడని ఆనంద్‌ మహీంద్ర చెప్పడం విశేషం. మొత్తం మీద సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందిస్తున్న తీరుకు దేశం ఫిదా అవుతోంది.

కామెంట్‌లు