మ్యాక్స్ వెల్ కు విరాట్ బాసట
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందున క్రికెట్‌కు విరామం ప్రకటించిన మ్యాక్స్ వెల్ నిర్ణయం అసాధారనమైదని ప్రశంసించాడు. అలా చెప్పడానికి, విరామం నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలని కోహ్లి పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్ పర్యటనలో తాను కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. ఆ సిరీస్‌లో ఒక్క అర్ద సెంచరీ సాధించ లేదని, దీంతో ఆటగాడిగా చాలా కృంగి పోయినట్లు.. అంతే కాకుండా ఇక ప్రపంచం ముగిసి పోయిందని అనుకునే వాడినని తెలిపాడు.
అలాంటి గడ్డు పరిస్థితి నుంచి బయట పడటానికి చాలా సమయం పట్టినట్లు చెప్పాడు. ఏ ఒక్కరూ కూడా తన వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించడానికి ఇష్ట పడరు. కానీ మ్యాక్స్ వెల్ తను ఎదుర్కొంటున్న సమస్యను బాహ్య ప్రపంచానికి తెలిపాడు. మ్యాక్స్ చేసింది అసాధారణం. నేను కూడా ఇక ప్రపంచం ముగిసి పోయందనుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయాన్ని ఎవరితో పంచు కోవాలో కూడా అర్థం కాలేదు. అందరూ ఎవరి పనిలో వారు నిమజ్ఞమై పోతుంటారు. అయితే ఎదుటి వారి మనసులో ఏముంటదో అర్థం చేసు కోలేరు.
మన మనసు సరిగా లేనప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ విషయంలో మ్యాక్స్ వెల్ ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలిచాడు. అయితే ఇలాంటి ధైర్యం నేను చేయలేను. కెరీర్‌లో ఇబ్బందులు వచ్చినప్పుడు స్పష్టత కోసం విరామం తీసుకోవడం మంచిదే. అయితే ఇలాంటి నిర్ణయాలను గౌరవించాలి కానీ వ్యతిరేకించ వద్దు. మ్యాక్స్‌వెల్ నిర్ణయాన్ని స్వాగతించాలి అని కోహ్లి పేర్కొన్నాడు. మొత్తం మీద కోహ్లీ కి కూడా మనసు ఉంటుందని మరోసారి తెలిపాడు. సాటి ఆటగాట్ల పట్ల ఎక్కువ అభిమానం చూపించే ఆటగాళ్లలో అజహారుద్దీన్ ఒకరైతే మరొకరు కోహ్లీ కావడం గమనార్హం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి