పోస్ట్‌లు

మార్చి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

చ‌క్రం తిప్పేదెవ్వ‌రు..ఢిల్లీ కోట‌పై పాగా వేసేదెవ్వ‌రు..? - పోటీ ర‌స‌వ‌త్త‌రం జ‌నం ఉత్కంఠ భ‌రితం

చిత్రం
క‌మ‌లం విక‌సించేనా..హ‌స్తం హ‌వా న‌డిచేనా..ప్రాంతీయ పార్టీల జెండా ఎగ‌రేనా..! వంద కోట్ల భార‌తావ‌ని ఉత్కంఠ‌తతో ఎదురు చూస్తోంది. కొద్ది రోజుల్లో ఎవ‌రు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంటార‌నేది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మున్న‌త జాతి అంతా ఒకే తాటిపై నిలిచింది. ఈసారి ఎన్నిక‌లు ..స‌మ‌ర్థ‌త‌కు..నీతికి..నిజాయితీకి..అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నాయి. ప్ర‌జ‌లు , యువ‌తీ యువ‌కులు త‌మ భ‌విష్య‌త్ బాగుండాల‌ని స‌ముచిత నిర్ణ‌యం తీసుకునేందుకు సమాయ‌త్తం అవుతున్నారు. తాయిలాలు, స‌బ్సిడీలు..సంక్షేమ ప‌థ‌కాలు ఎర వేసి ఓట్లు రాబ‌ట్టుకునే పార్టీల‌కు చుక్క‌లు చూపిస్తామంటున్నారు. దేశ‌మంతటా మోడీ గాలి వీసినా చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు త‌మ హ‌వాను కొన‌సాగించాయి. ఎన్ని ప్ర‌య‌త్నాలు మోడీ, అమిత్ షా చేసినా ఢిల్లీ కోట‌పై క‌మ‌లం జెండా ఎగుర వేయ‌లేక పోయారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కోసం ప్ర‌పంచమంతా త‌న వైపు తిప్పుకునేలా చేసిన ఘ‌న‌త ఒక్క అర‌వింద్ కేజ్రివాల్‌కే ద‌క్కుతుంది. ప్ర‌పంచంలోనే అత్యంత భారీ ప్ర‌జాస్వామిక దేశంగా వినుతికెక్కిన ఇండియాలో 17వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం...

గూగుల్ మెచ్చిన కుర్రాడు - అబ్దుల్లా అద‌ర‌హో - కోటి 20 ల‌క్షల వార్షిక వేత‌నం

చిత్రం
ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని భార‌తీయ విద్యార్థుల‌కు అపార‌మైన అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. లెక్క‌లేనంత మందికి ఐటీ దిగ్గ‌జ కంపెనీలు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ఇండియాతో పాటు అమెరికాలో అత్య‌ధికంగా ఐటీ ప్రొఫెస‌న‌ల్స్ మ‌న‌వాళ్లే ఉన్నారు. ఐఐటీ, ట్రిబుల్ ఐటీ , ఎన్ఐటీ, ఇత‌ర కాలేజీల‌నే గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బైజూ త‌దిత‌ర కంపెనీల‌న్నీ దృష్టి సారిస్తున్నాయి. ఈ దేశంలో ఐఐటీల‌కు వున్నంత క్రేజ్..పోటీ ఇంకే కళాశాల‌ల‌కు లేదు. కేంద్ర స‌ర్కార్ భారీ ఎత్తున నిధుల‌ను ఖ‌ర్చు చేస్తోంది. స‌గ‌టున ఒక్కో విద్యార్థికి ఐఐటీల‌ల్లో కోర్సులు పూర్త‌య్యేంత దాకా కోటిన్న‌ర రూపాయ‌ల‌కు పైగా కేటాయిస్తోంది. నాణ్య‌వంత‌మైన బోధ‌న‌..అద్భుత‌మైన వాతావ‌ర‌ణం..ఎలాంటి వ‌త్తిళ్లు లేని త‌ర‌గ‌తి గ‌దులు..భిన్న‌మైన బోధ‌న‌..వెర‌సి విద్యార్థుల‌ను భావి భార‌త టెక్కీలుగా తీర్చిదిద్ద‌డంలో ఈ విద్యాల‌యాలు నిమ‌గ్న‌మ‌య్యాయి. అంత‌ర్జాతీయ స్థాయిలో ఏ విశ్వ విద్యాల‌య‌మైనా ఇండియ‌న్ ఐఐటీ స్టూడెంట్స్ అంటేనే మొద‌టి ప్ర‌యారిటి ఇస్తున్నాయి. ఎక్కువ శాతం ఐటీ , ఈ కామ‌ర్స్ కంపెనీల‌న్నీ ఇంజ‌నీరింగ్ లో టాప్‌ల...

ఎన్నిక‌ల సంగ్రామం - హీటెక్కిన ప్ర‌చారం

చిత్రం
దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌లు యుద్ధ రంగాన్ని త‌ల‌పింప చేస్తున్నాయి. కేంద్రంలో ప‌వ‌ర్‌లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ఎడ‌తెగ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన క‌మ‌ల‌నాథుల గుండె గొంతుక అమిత్ షా చాప కింద నీరులా చ‌క్రం తిప్పుతున్నారు. త‌మ‌కు రావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ తీసుకు వ‌చ్చేందుకు ఆప‌రేష‌న్‌ను స్టార్ట్ చేశారు. ఏ పార్టీ వారైనా స‌రే ..ఏ స్థానంలో ఉన్నా స‌రే గెలుపు గుర్రాల‌పైనే దృష్టి పెడుతున్నారు. దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు జాతీయ స్థాయి పార్టీల‌ను ఒకింత క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల‌లో ప్రాంతీయ పార్టీలు కొలువుతీరి వున్నాయి. స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని జాతీయ స్థాయిలోని స‌ర్వేలు తేట‌తెల్లం చేశాయి. దీంతో స్వ‌యంగా దేశ ప్ర‌ధాని .బీజేపీ ర‌థ‌సార‌థి న‌రేంద్ర మోడీ విప‌క్షాల‌ను టార్గెట్ చేశారు. ఓ ఛాయ్ వాలాను అందించిన ఈ దేశం మ‌రోసారి చౌకీదార్‌గా ఉండే త‌న‌కు అవ‌కాశం ఇవ్వండ‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల న‌గారా మోగింది. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌తో పాటు విప‌క్షా...

వెల్లి విరిసిన చైత‌న్యం..అన్న‌దాత‌ల ఆగ్ర‌హం - దేశం చూపు నిజామాబాద్ వైపు

చిత్రం
ఎన్నిక‌ల వేళ దేశ‌మంతా తెలంగాణ‌లోని నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం వైపు చూస్తోంది. ఎన్న‌డూ లేనంత‌గా ఈ ప్రాంతం ఇపుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీని ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఇక్క‌డ ఏకంగా 200 మంది రైతులు ఎంపీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగారు. తాము పండించిన పంట‌కు మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించ‌డం లేదని, ఆరుగాలం పండించే త‌మ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ జిల్లాలో ఎక్కువ శాతం ప‌సుపు, చెరుకు పంట పండిస్తారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా..విన్న‌వించుకున్నా ఉన్న‌తాధికారులు కానీ..పాల‌కులు కానీ త‌మ గోడు విన్న పాపాన పోలేదంటున్నారు బాధితులు. త‌మ స‌మ‌స్యను దేశ వ్యాప్తంగా తెలియ చేయాల‌నే ఉద్ధేశంతోనే తాము ఎన్నిక‌ల‌ను ఆయుధంగా మ‌ల్చుకున్నామ‌ని వారంటున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తన వంతు కృషి చేశాన‌ని ఆమె అంటున్నారు. కానీ అన్న‌దాత‌లు మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాట‌లు త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో త‌మ గురించి ఆలోచించిన దాఖ‌లాలు లేవ‌న్నారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా బ్యాలెట్ బాక్సులు ...

ఈ ఐఏఎస్ జ‌నం మెచ్చిన దేవుడు

చిత్రం
ఇండియాలో అత్యున్న‌త‌మైన అధికారిక స‌ర్వీసుగా పేరొందిన సివిల్ స‌ర్వీసెస్‌లో ఉత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన వాళ్లు ఎంద‌రో. చాలా మంది ఐఏఎస్‌లుగా ప‌నిచేస్తున్నా కొంద‌రు మాత్రం ప్ర‌జా సేవ‌లో మునిగి తేలుతున్నారు. జ‌నం కోస‌మే బ‌తుకుతున్నారు. అలాంటి వారిలో మ‌ణిపూర్‌కు చెందిన ఆర్మ్ స్ట్రాంగ్ పామే ఒక‌రు. నాగాలాండ్ ప్రాంతంలోని జేమే తెగ‌కు చెందిన పామే ప్ర‌పంచం త‌న వైపు చూసేలా ప‌నిచేశాడు. 2015లో దేశంలోనే అత్యుత్త‌మ‌మైన ఐఏఎస్ అధికారి అవార్డును పొందారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన పామే..2005లో డిల్లీ కేంద్రంగా సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యాడు. 2007లో జ‌రిగిన ఎగ్జామ్స్‌లో ఇండియ‌న్ రెవిన్యూ స‌ర్వీసెస్‌కు ఎంపిక‌య్యాడు. క‌స్ట‌మ్స్ అండ్ సెంట్ర‌ల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. 2008లో ఎంపిక చేసిన జాబితాలో ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ కు సెలెక్ట్ అయ్యాడు. మ‌నోడు అంద‌రిలాగా అధికారాన్ని చెలాయించ‌లేదు. త‌న బాధ్య‌త‌లేమిటో గుర్తించాడు. తాను ఎందుకు ఉన్నాడో తెలుసుకుని ..తానే అంద‌రికంటే ముందు ప‌ని చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యాడు. మ‌ణిపూర్ నుండి నాగాలాండ్ ..అసోం వ‌ర‌కు 100...

ఏ దేవి వ‌ర‌ము నీవు..!

చిత్రం
ఎన్నిసార్లు విన్నా ఇంకా ఏదో మిగిలే ఉంటోంద‌న్న భావ‌న నిల‌వనీయ‌డం లేదు. సంగీతానికి ..పాట‌కు ఎన‌లేని శ‌క్తి ఉంది. జ‌నాన్ని స‌మ్మోహితుల‌ను చేసి..జాగృతం చేసి..నిద్ర‌లోకి జారుకునేలా చేసే మ‌హ‌త్తు ఒక్క పాట‌కే ఉందనేది కాద‌న‌లేని స‌త్యం. తెలుగు సినిమా సాహిత్యాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన గేయ ర‌చ‌యిత‌లలో వేటూరి సుంద‌ర రామ్మూర్తి త‌ర్వాతే ఎవ‌రైనా. ఆ క‌లంలోంచి వ‌చ్చిన ప్ర‌తి పాటా ఓ ఆణిముత్యమే. ల‌లిత‌మైన ప‌దాల‌తో ..అద్భుత‌మైన అర్థాన్ని ఇమిడేలా చేయ‌గ‌ల స‌త్తా ఆయ‌న‌కు మాత్ర‌మే ఉన్న‌ది. భౌతికంగా మ‌న‌మ‌ధ్య లేక పోయినా ఆ మ‌హానుభావుడు సృష్టించిన పాట‌లు అన్నీ ఇన్నీ కావు. కాశీనాథుని విశ్వ‌నాథ్ ఓ సీత క‌థ ద్వారా సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. ఆయ‌న క‌లం వెనుతిరిగి చూడ‌లేదు. వేల పాట‌లు రాశారు. తొలినాళ్ల‌ల్లో పాత్రికేయుడిగా ప‌నిచేసిన వేటూరి 8 నందుల‌తో పాటు ఒక జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్నారు. తెలుగు పాట‌కు శ్రీ‌శ్రీ త‌ర్వాత జాతీయ ఖ్యాతిని తీసుకువ‌చ్చిన ఘ‌న‌త వేటూరిదే. సంగీత జ్ఞానాన్ని వంట బ‌ట్టించుకున్న ఆయ‌న సినిమా పాట‌కు వోణీ వేయించారు. అడ‌వి రాముడు, శంక‌రాభ‌ర‌ణం, సిరిసిరిమువ్వ‌, సాగ‌ర సంగ‌మం, స‌...

ప్ర‌పంచాన్ని షేక్ చేస్తున్న హాట్ స్టార్..!

చిత్రం
ఐడియాలు అంద‌రికీ వ‌స్తాయి. కానీ కొంద‌రే వాటిని నిజం చేస్తారు. ఇంకొంద‌రు వాటిని అమ‌లు ప‌రుస్తారు. మెద‌ళ్ల‌కు సాన పెడితే ..కొత్త రకంగా ..కాస్తంత భిన్నంగా జ‌నానికి ద‌గ్గ‌ర‌గా..వారి అభిరుచుల‌కు అనుగుణంగా ప్లాన్ చేస్తే చాలు..కోట్లు పోగేసుకోవ‌చ్చు. డాల‌ర్ల‌ను జ‌మ చేసుకోవ‌చ్చు. ఇదే న‌యా జ‌మానా. ఏ ముహూర్తంలో స్టార్ గ్రూపులో ఎంట‌ర‌య్యాడో కానీ ..ఆ రోజు నుంచి స్టార్ స్టామినా వ‌ర‌ల్డ్‌లో అమాంతం పెరిగింది. వినోదం..డిజిట‌ల్ రంగాల‌లో స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీల‌దే హ‌వా. కోటానుకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది ఈ సంస్థ‌. ఇండియాలో అతి పెద్ద వినోద‌రంగ‌పు వాటాను ద‌క్కించుకుని ఇత‌ర సంస్థ‌ల‌కు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. పెట్టుబ‌డులు ఎవ‌రైనా పెడ‌తారు. కానీ వాటిని లాభాల బాట‌లో పెట్టాలంటే ద‌మ్ముండాలి. ఒక‌టా రెండా ఏకంగా వంద‌ల కోట్లు కొంద‌రి మీద న‌మ్మ‌కంతో కుమ్మ‌రిస్తే ఎలా వుంటుందో చూడాల‌ని వుందా..అయితే స్టార్ గ్రూపు పేరుతో సెర్చ్ చేయండి చాలు. ట‌న్నుల కొద్దీ స‌మాచారం మ‌న‌ముందు వాలిపోతుంది. అంత‌లా పాపుల‌ర్ కావ‌డం వెనుక క‌మిట్‌మెంట్ క‌లిగిన వ్య‌క్తుల స‌మూహం ఉంది. అదే ఉద‌య్ శంక‌ర్..అజిత్ మోహ‌న...

లోకాన్ని ఆవిష్క‌రించే లెన్స్ ..ఫ్లిక‌ర్

చిత్రం
వేయి మాట‌లు ఇవ్వ‌లేని ఆనందాన్ని..ప‌ది కాలాల పాటు గుర్తుంచుకోద‌గిన స్ప‌ర్శ‌ను ..త‌రాల పాటు వెంటాడే చూపుల్ని క‌ట్టిప‌డేసేది ఒక్క‌టే కెమెరా. ఆధునికంగా పెను మార్పులు చోటు చేసుకున్నా ఇమేజెస్ విష‌యంలో త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే ఉన్న‌ది. స్మార్ట్ ఫోన్స్ వ‌చ్చాక‌..ఆండ్రాయిడ్ టెక్నాల‌జీ వాడుతుండ‌డంతో ఫోటోలు దిగ‌డం మామూలై పోయింది. లైఫ్‌ను మ‌రింత అందంగా..నేచ‌ర్‌ను మ‌రింత అర్థ‌వంతంగా ..సొసైటీని లెన్స్‌ల‌లో చూపించ‌గ‌లిగే సాధ‌నం కెమెరానే. సామాజిక మాధ్య‌మాల పుణ్య‌మా అంటూ టాలెంట్ కు ..క్రియేటివిటీకి అద్భుత‌మైన ప్లాట్ ఫార‌మ్స్ ఏర్ప‌డ్డాయి. క‌ష్ట‌ప‌డ‌కుండానే క‌రెన్సీని ఖాతాల్లో జ‌మ చేసుకునే అవ‌కాశాలు కోకొల్ల‌లు. కావాల్సింద‌ల్లా క‌నెక్టివిటీ క‌లిగి ఉండ‌డ‌మే. ప్ర‌తిభ ఏ ఒక్క‌రి సొత్తు కాదు..టాలెంట్ అంద‌రికీ ఒకేలా వుండ‌దు. పోటీ ఉన్న చోటే మ‌నం ఏమిటో ..మ‌న స‌త్తా ఏమిటో తేలుతుంది. అందుకే కాంపిటిష‌న్ కంప‌ల్స‌రీ చేశారు. ఏ సంస్థ అయినా లేక ఏ వ్య‌వ‌స్థ అయినా ముందుగా నిర్ణ‌యించేది మ‌నం క‌రెక్టుగా ఉన్నామా లేదా ..ఒడిదుడుకుల‌ను త‌ట్టుకుంటారా లేక వెనుదిరిగి వెళ్లిపోతారా..సంస్థ‌ను విశ్వ‌సిస్తారా..మ‌ధ్య‌లోనే ట...

శ్రీ‌నివాసం..మ‌హా ప్ర‌సాదం..నిత్య అన్న‌దానం..! ఎన్టీఆర్..ప్ర‌సాద్‌ల పుణ్య ఫ‌లం !

చిత్రం
గోవిందా..గోవిందా..శ్రీ‌నివాసా గోవిందా..ఆపద మొక్కుల వాడా..గోవిందా..అనాధ ర‌క్ష‌కా గోవిందా..ఎక్క‌డ చూసినా..ఏ మెట్లు ఎక్కినా ..ఆ అపురూప‌మైన శ్రీ‌నివాసుడే. తిరుమ‌ల‌..తిరుప‌తి ల‌క్ష‌లాది భ‌క్తుల భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణ‌తో మార్మోమ్రోగుతూనే వున్నాయి. పేద‌లు..ధ‌నికులు..అన్ని రంగాల‌కు చెందిన ల‌బ్ధ ప్ర‌తిష్టులు..సంస్థ‌ల అధిప‌తులు..ప్ర‌పంచం..మెచ్చిన..మ‌హానుభావులు..అనామ‌కులు..అనాధ‌లు..వృద్ధులు..పిల్ల‌లు..దివ్యాంగులు..మ‌హిళ‌లు..అప్పుడే క‌ళ్లు తెరిచిన చిన్నారులు..ఇలా వేలాది మంది నిత్యం ఆ తిరుమ‌ల కొండ‌పై వెల‌సిన శ్రీ‌నివాసుడిని చూసేందుకు తండోప తండాలుగా వ‌స్తూనే వుంటారు. ప్ర‌తి రోజూ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామితో పాటు అలివేలు మంగ‌మ్మ‌ల‌కు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో పూజ‌లు జ‌రుగుతాయి. గాలిమోటార్లు, వాహ‌నాలు, బ‌స్సులు, రైళ్లు భ‌క్తుల‌ను కొండ కింద నుండి కొండ పైకి చేర‌వేస్తాయి. స్వామి, అమ్మ‌వార్ల‌ను వేడుకుంటే..ద‌ర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని..క‌ష్టాల నుండి గ‌ట్టెక్కుతామ‌ని ప్ర‌గాఢ విశ్వాసం. ప్ర‌పంచంలోనే ప్ర‌సిద్ధి చెందిన ఈ ఆల‌యం..ఇపుడు అత్యంత ఆదాయం క‌లిగిన పుణ్య క్షేత్రంగా వినుతికెక్కింద...

సై..సైరా ..సురేంద‌ర్ రెడ్డి..!

చిత్రం
సినిమా అన్న‌ది పేష‌న్. అదో మాయా ప్ర‌పంచం. క‌ల‌ల బేహారుల ఖార్ఖానా. వేలాది మంది దీనిపైనే ఆధార ప‌డ్డారు. జూదం కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన రంగం ఇది. అయినా లెక్క‌లేనంత మంది దీని చుట్టూ తిరుగుతుంటారు. కూటికి లేక పోయినా..న‌డిచేందుకు శ‌క్తి లేక పోయినా స‌రే ఈ రంగమంటే అమిత‌మైన ఆస‌క్తి. లెక్క‌లేనంత టాలెంట్ ఉన్నా ..గుర్తింపున‌కు నోచుకోక పోయినా ..ఏదో ఒక‌రోజు అవ‌కాశం త‌లుపు తడుతుంద‌ని..అదృష్టం వ‌రిస్తుంద‌ని ఈ చ‌ట్రంలోనే తిరుగ‌తూ వున్న వాళ్లు ఎంద‌రో. ఒక్క‌సారి దీనిని ప్రేమిస్తే చాలు ..బ‌తుకంతా దీనితోనే. చావు ప‌ల‌క‌రించే దాకా ఇందులోనే. ఒక్క‌రోజులో రాజు కావాల‌ని అనుకున్న వాళ్ల‌కు ఇది అద్భుత‌మైన దారి చూపిస్తుంది. సినిమా అంటేనే 24 ఫ్రేమ్స్. క‌ల‌లు పండాల..ఊహ‌లకు ప్రాణం పోయాలి. న‌టీ న‌టులు ..టెక్నీషియ‌న్స్..లొకేష‌న్స్..డిస్ట్రిబ్యూట‌ర్స్..ప‌బ్లిసిటీ..ఆడియో లాంఛింగ్..మూవీ రిలీజ్ దాకా..వంద‌లాది మంది ఇందులో లీన‌మ‌వుతారు. త‌మ‌ను తాము ఆవిష్క‌రించుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డ‌తారు. ఒక‌ప్పుడు నిర్మాత‌ల‌కు ఓ వాల్యూ ..ఐడెంటిటి వుండేది. ఇపుడంతా హీరో ఓరియంటెడ్ మూవీస్ అయిపోయాయి. వాళ్ల‌దే రాజ్యం. వాళ్ల‌తోనే వ్యా...