పోస్ట్‌లు

జనవరి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!

చిత్రం
విలువ‌లే ప్రామాణికంగా బ‌తికిన అరుదైన రాజ‌కీయ నాయ‌కుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఇక సెల‌వంటూ వెళ్లిపోయారు. ఇందిర ఎమ‌ర్జెన్సీ కాలంలో ఉప్పెన‌లా ఎదిగివ‌చ్చారు. అపార‌మైన అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఈ దేశంలో జ‌రిగిన ప్ర‌ధాన ఉద్య‌మాల‌తో జార్జ్ కు ప్ర‌త్య‌క్షంగానో..లేక ప‌రోక్షంగానో సంబంధం ఉంది. ప్ర‌భాక‌ర‌న్ స్థాపించిన ఎల్ టీటీఇకి ఆయ‌న బేష‌ర‌త్తుగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించి అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపారు. రాజ‌కీయవేత్త‌గా..మేధావిగా..ర‌చ‌యిత‌గా..జ‌ర్న‌లిస్టుగా..సంపాద‌కుడిగా..కార్మికప‌క్ష నేత‌గా ఎదిగారు. రాజ‌కీయాల‌లో సుదీర్ఘ‌మైన ప్ర‌యాణం చేసిన ఆయ‌న ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఉన్న‌త స్థాయి ప‌ద‌వుల‌ను చేప‌ట్టినా ఏరోజు ప్ర‌జ‌ల‌ను మ‌రిచి పోలేదాయ‌న‌. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో అరుదైన రైల్వే స‌మ్మెకు నాయ‌క‌త్వం వ‌హించి రికార్డు సృష్టించారు. మాన‌వుల పక్షాన నిలిచారు. ప్ర‌జ‌ల గొంతుక‌కు ప్రాణం పోశారు. ముంబైలో హాక‌ర్స్ యూనియ‌న్ లీడ‌ర్‌గా జీవితాన్ని ఆరంభించిన ఫెర్నాండేజ్ అంచెలంచెలుగా ఎదిగారు. దేశ రాజ‌కీయాల‌లో విస్మ‌రించ‌లేని నాయ‌కుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. తెల...

సినీ వెన్నెల .. సిరి వెన్నెల..!

చిత్రం
తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం ఆయ‌న‌. గేయ ర‌చ‌యిత‌గా అత్యున్న‌త‌మైన స్థానాన్ని అందుకున్న యోగి. క‌వి.ర‌చ‌యిత‌. న‌టుడు. భావుకుడు. ఏ స‌మ‌యంలోనైనా రాయ‌గ‌ల నేర్పు క‌లిగిన అరుదైన వ్య‌క్తి ..సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఆయ‌న క‌లంలోంచి జాలువారిన ప్ర‌తి అక్ష‌రం తెలుగు వాకిట గ‌వాక్ష‌మై నిలిచి పోయింది. ఏది మాట్లాడినా..ఇంకేది రాసినా దానికో ప‌ద్ధ‌తి..ప‌ర‌మార్థం ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఆకాశమంత కీర్తి శిఖ‌రాల‌ను అందుకున్న ఈ అక్ష‌ర పితామ‌హుడి సినీ ప్ర‌స్థానంలో లెక్క‌లేన‌న్ని పుర‌స్కారాలు..అవార్డులు..ప్ర‌శంస‌లు. త‌న‌తో పాటు ఎంద‌రినో గేయ ర‌చ‌యితలుగా తీర్చిదిద్దిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే. అతిర‌థ మ‌హార‌థుల‌ను త‌ట్టుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర్చుకున్న తీరు ప్ర‌శంస‌నీయం. తీక్ష‌ణంగా చూసే క‌ళ్లు. స‌మాజాన్ని చైత‌న్య‌వంతం చేసే దిశ‌గా ఉండేలా ఎన్నో పాట‌లు రాశారు. ఆయ‌న స్పృశించ‌ని అంశమంటూ ఏదీ లేదు. బ‌ల‌పం ప‌ట్టి బామ్మ బ‌ళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా అని రాసిన సిరివెన్నెల‌..నిగ్గ‌దీసి అడుగు సిగ్గులేని జ‌నాన్ని అంటూ ప్ర‌శ్నించ‌డం నేర్పాడు. ఎప్పుడూ ఒప్పుకోవ‌...

భాగ్య‌న‌గ‌రానికే బ్రాండ్ జిందా తిలిస్మాత్ .. ఏటా 12 కోట్ల ట‌ర్నోవ‌ర్ ..! -పేద‌ల‌కు వ‌రం దివ్య ఔష‌ధం

చిత్రం
ఏ ఊరుకు వెళ్లినా..ఏ ఇంటి త‌లుపు త‌ట్టినా..ఏ సంత‌లో త‌చ్చ‌ట్లాడినా..ఏ జాత‌ర‌ను సంద‌ర్శించినా ..అందుబాటులో ఉండే దివ్య‌మైన ఔష‌ధం జిందా తిలిస్మాత్. తెలంగాణ ప్రాంతానికి అరుదైన గౌర‌వంగా నిలుస్తోంది. త‌ర‌త‌రాలుగా చిన్నా పెద్ద తేడా లేకుండా ప్ర‌తి అంగ‌ట్లో ..మందుల దుకాణంలో..కిరాణా కొట్టులో..పాన్ షాప్‌ల వ‌ద్ద ..ప్ర‌తి చోటా తిలిస్మాత్ ల‌భిస్తుంది. ఇంత‌గా ప్రాచుర్యం పొందిన ఈ మందు ధ‌ర చాలా త‌క్కువ‌. జ‌లుబు..ద‌గ్గుకు ఇది అద్భుతంగా ప‌ని చేస్తుంది. అందుకే దీనికంత‌టి డిమాండ్. కార్పొరేట్ మందుల కంపెనీలు సాధించ‌లేని స‌క్సెస్ ను ఈ మందు స్వంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా దేశంలోని ప్ర‌తి న‌గ‌రంలో జిందా తిలిస్మాత్ విరివిగా ల‌భిస్తుంది. ఏ బిజినెస్ మేగ్న‌ట్ సాధించ‌లేని ఫీట్‌ను ఫారూఖీ కుటుంబం సాధించింది. దీనిపై బ‌డా కంపెనీలు క‌న్నేసినా ఆ ద‌రిదాపుల్లోకి వెళ్ల‌లేక పోయాయి. దీని ఫార్మూలా వారికి మాత్ర‌మే తెలుసు. అంత‌గా కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. ఐటీ అనే స‌రిక‌ల్లా హైద‌రాబాద్ ను చూపిస్తున్నారు. కానీ భార‌త‌దేశ చ‌రిత్ర‌లో..యునాని ప‌రంగా జిందా తిలిస్మాత్ త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. అంత‌టి...

భ‌క్తుల బాంధ‌వుడు - ల‌క్ష్మీ న‌ర‌సింహుడు - యాదాద్రి మ‌రో భ‌ద్రాద్రి

చిత్రం
ఉగ్ర‌రూపుడైన ల‌క్ష్మీన‌ర‌సింహ్మ స్వామి కొలువై ఉన్న యాద‌గిరిగుట్ట ఇపుడు యాదాద్రిగా పిలువ‌బ‌డుతోంది. వేలాది మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకుంటున్నారు. తెలంగాణ తిరుప‌తిగా వినుతికెక్కిన ఈ ఆల‌యానికి అద్భుత‌మైన చ‌రిత్ర ఉన్న‌ది..అత్యంత విశిష్ట‌మైన‌ది ఈ స్థ‌లం. ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించేలా..హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ప్ర‌ధాన ర‌హ‌దారికి ప‌క్క‌నే ఉన్న ఈ ఆల‌యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు ..జీవితాంతం గుర్తుండి పోయేలా ఆ ల‌క్ష్మీన‌ర‌సింహ్మ స్వామి మ‌నల్ని దీవిస్తూనే ఉంటాడు. ఇదో పేద‌ల తిరుమ‌ల‌గా విరాజిల్లుతోంది. ర‌వాణా సౌక‌ర్యం ఉండ‌డం..కేపిట‌ల్ సిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఈ గుడి ప్ర‌తి నిత్యం పూజ‌ల‌తో..భ‌క్తుల తాకిడితో నిండిపోతోంది. న‌ల్ల‌గొండ జిల్లాలో ఉన్న ఈ ఆల‌యంలో న‌ర‌సింహ‌స్వామితో పాటు ల‌క్ష్మీదేవి కొలువై ఉన్నారు. ఎత్తైన గుట్ట‌లు..కొండ‌లు..చుట్టూ చెరువులు..ర‌హ‌దారులు..నియాన్ లైట్ల వెలుతురుతో యాదాద్రి భ‌క్తుల మ‌న‌సు దోచుకుంటోంది. స్థ‌ల పురాణ చ‌రిత్ర ప‌రంగా చూస్తే యాద మ‌హ‌ర్షి ఈ గుట్ట‌పై త‌పస్సు చేశాడు. అప‌ర భ‌క్తుడైన ఈ మ‌హ‌ర్షి భ‌క్తికి మెచ్చిన న‌ర‌సింహ‌స్వా...

చిన‌జీయ‌ర్ స్వామి ఆశీర్వాదం - గులాబీ బాస్‌కు బ‌లం - ఆలోచ‌నా ప‌రుడు - అప‌ర భ‌క్తుడు

చిత్రం
రెండోసారి ముచ్చ‌ట‌గా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత శ్రీ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ‌. మేధావిగా..ర‌చ‌యిత‌గా..క‌విగా.. గాయ‌కుడిగా..ప‌రిపాల‌నాద‌క్షుడి గా..నాయ‌కుడిగా..ఉద్య‌మ‌కారుడి గా..ముంద‌స్తు విజ‌న్ క‌లిగిన రాజ‌కీయ నేత‌గా ఆయ‌న‌కు పేరుంది. మాట‌ల మాంత్రికుడిగా ..బ‌హు భాషా కోవిదుడిగా..సాహిత్యకారుడిగా ఎన్నో పార్శ్వాలు ఆయ‌న‌లో ఉన్నాయి. అన్నింటికంటే కేసీఆర్ అప‌ర భ‌క్తుడు. ముందు నుంచి పెద్ద‌ల‌న్నా గౌర‌వ భావం ఎక్కువ‌. త‌న‌కు పాఠాలు నేర్పిన గురువుల‌ను స్మ‌రించు కోవ‌డం..త‌న చిన్న‌నాటి స్నేహితుల కుటుంబాల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌కు ఆయ‌న పెట్టింది పేరు. తెలంగాణ‌కు ఏం కావాలో..ఏం కోల్పోయిందో..ఏయే అవ‌కాశాలు..వ‌న‌రులు ..ప్రాజెక్టులు..నీటి పారుద‌ల‌..చెరువులు..ఇలా చెప్పుకుంటూ పోతే ..ఇన్మ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ లో కూడా పొల్లు పోకుండా చెప్ప‌డం కేసీఆర్ స్పెషాలిటీ. అద్భుత‌మైన క‌వితలు చెప్ప‌గ‌ల‌రు..ప‌ద్యాలంటే ఆయ‌న‌కు పంచ ప్రాణం. కొడుకు, బిడ్డ‌..అల్లుడు..అంత‌కంటే మ‌నుమ‌డు ..మ‌నుమ...

ఓవ‌ర్సీస్‌లో ప్రిన్స్ అరుదైన రికార్డు - వ‌సూళ్ల‌లో టాప్

చిత్రం
తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడు మ‌హేష్ బాబుకు ఓ ప్ర‌త్యేక‌త వుంది. చాలా సింపుల్ గా త‌న కుటుంబం..వృత్తి మిగ‌తావేవీ ప‌ట్టించుకోరాయ‌న‌. ఏ సినిమా చేసినా క‌థ‌లో కొంచెం కొత్త‌ద‌నం ఉండేలా జాగ్ర‌త్తలు తీసుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. పిల్ల‌లు, పెద్ద‌లు, యువ‌తీ యువ‌కులు ..అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారంతా ఆయ‌న‌కు అభిమానులు. మోస్ట్ వాంటెడ్..మోర్ పాపుల‌ర్ హీరోగా ఇప్ప‌టికీ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నారు. మొన్న శ్రీ‌మంతుడు..నిన్న భ‌ర‌త్ అనే నేను సినిమాల‌తో ఓ రేంజ్‌లో ఇటు టాలీవుడ్‌లోను..అటు ఓవ‌ర్సీస్‌లోను వ‌సూళ్ల‌లో రికార్డులు తిర‌గ‌రాస్తున్నారు. మ‌హేష్ బాబు అంటేనే ఓ స్పెషాలిటీ..ఆయ‌న‌కు అన్ని ప్రాంతాలలో న‌టించే న‌టీమ‌ణులే కాదు యూత్ కూడా ఫిదా. 20 కోట్ల రూపాయ‌ల రేంజ్ నుండి ఏకంగా 110 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసే స్థాయికి చేరుకున్నాయి తెలుగు సినిమాలు. ఎన్న‌డూ లేనంత‌గా సినిమా ప్రేక్ష‌కులు మాత్రం కంటెంట్ ..ఎంట‌ర్ టైన్‌మెంట్ కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. సినిమాల నిర్మాణం నుంచి విడుద‌ల‌య్యే దాకా ప్ర‌తిదీ ఓ యుద్ధాన్ని త‌ల‌పింప చేస్తోంది. సినిమా న‌డుస్తుందా లేదో అనే విష‌యాన్ని ట్రైల‌ర్ లోనే ...

!..నువ్వు నీలాగే ఉండు..!

చిత్రం
నీ ద‌గ్గ‌ర ఏముంది. నిన్ను పొగిడే వాళ్లున్నారా. నీ చుట్టూ మందీ మార్బ‌లం ఉందా. నిన్ను ఆకాశానికి ఎత్తేసి. లాబీయింగ్ చేసే వాళ్లున్నారా. ఎదుటి వాళ్ల‌ను మెస్మ‌రైజ్ చేసే లౌక్యం ఉందా..పోనీ సాయంత్రం అయితే బార్ లేదా ప‌బ్ కు తీసుకు వెళ్ల‌గ‌లిగే స్టామినా నీకుందా..గ్యాంగ్ ను మెయింటెనెన్స్ నీ వ‌ద్దుందా..పోనీ బెదిరించి ప‌నులు చేసుకునే ప‌వ‌ర్ వుందా..ప‌ర్స్ నిండా క‌రెన్సీ వుందా..ఆస్తులు, అంత‌స్తులు..అమెరికాను త‌ల‌ద‌న్నే కార్లున్నాయా..క‌ళ్లు చెదిరే స్మార్టు ఫోన్లున్నాయా. నీకెంత‌మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారా..అయితే ఇప్పుడున్న దునియాలో నువ్వు తోపు. నిన్ను డామినేట్ చేసే వాళ్లుండ‌రు..అంతా అన్నా అని అనేటోళ్లే. ఇంకెందుకు ఆల‌స్యం. అమెరికా జ‌పం చేయండి చాలు. అబ్బో ఫ్ల‌యిట్లు..దిమ్మ తిరిగే బ్యాంకు బ్యాలెన్సులు నిండితే చాలు క‌దా. నీకో స‌ర్కార్ కొలువుంటే చాలు..అదే ప‌ది వేలు. అదే ధ్యాస‌..అదే శ్వాస‌. ప‌క్కోడు ఏమై పోతేనేం. నువ్వు బాగుంటే చాలు. ఇది కాదు జింద‌గీ అంటే. నీ వ‌ద్ద చిల్లి గ‌వ్వ లేక పోయినా..నీ ద‌గ్గ‌ర ద‌మ్ముంటే చాలు. దీనిని ఏలటానికి . ఇక నీకు నీవే బ్రాండ్. నీ జీవితం నీది. ఇంకొకడి డామినేష‌న్ అక్క‌ర్లేదు. నిన్ను...

ధ్యానం జీవ‌న యోగం..!

చిత్రం
ఎవ‌రికి వారై ..ఎవ‌రి లోకంలో వాళ్లు ఊరేగుతూ అదే అద్భుత‌మనుకుంటూ బ‌తుకు జీవుల‌కు అన్నీ వున్నా ఏదో వెలితి కెలుకుతోంది. వ‌స్తువుల వ్యామోహం మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఈ త‌రుణంలో ప్ర‌శాంతత కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ముప్పై ఏళ్ల‌కే ముస‌లిత‌నం వ‌చ్చేస్తోంది. చేతుల్లో సెల్లు గొల్లుమ‌నేలా క‌ట్ట‌డి చేస్తోంది. అటు శ‌రీరం..ఇటు మ‌న‌సు రెండింటి మ‌ధ్య ఈ లోకంలో మ‌న‌కంటూ ఓ ఐడెంటిటీ కావాలిగా. దీని కోసం అంద‌మైన అబ‌ద్దాలు. లేనిపోని ఆడంబ‌రాలు. ఎంత నేర్చుకున్నా..త‌రాల‌కు స‌రిప‌డా సంపాదించినా సంతృప్తి శూన్యం. ఐదారుగంట‌లు కుదురుగా కూర్చోలేరు. ఒద్దిక‌గా వుండ‌లేరు. ప్ర‌పంచాన్ని ఉద్ద‌రించలేరు. పోనీ ఓ క్వింటాలు బ‌రువును ఎత్తలేరు. ఎందుకూ కొర‌గాని డిజిగ్నేష‌న్లు. ఎవ‌రిని క‌దిలించినా ఇంజ‌నీరింగ్ జ‌పం. ఇండియాను ఎప్పుడో మ‌ర్చిపోయారు. 24 గంట‌లు మొబైల్‌లోనే..అక్క‌డే ప్ర‌త్య‌క్షం..ప‌ల‌క‌రించేందుకు కూడా టైం దొర‌క‌ని దౌర్భాగ్య ప‌రిస్థితి. డాల‌ర్ల మాయాజాలం మ‌నుషుల్ని ఒక ప‌ట్టాన నిల‌వ‌నీయ‌కుండా చేస్తోంది. క‌ళ్లు చెదిరే నిర్మాణాలు..కాంక్రీట్ గ‌దుల్లో ఇరుక్కు పోయిన బ‌తుకులు. అంత‌టా బ‌ట‌న్ సిస్టం. బ‌తుకంతా అభ‌ద్ర‌త ర...

లివింగ్ లెజెండ్..కేసీఆర్..!

చిత్రం
కేసీఆర్ ఈ పేరు ప్రపంచ చరిత్రలో ఓ పాఠం ..ఓ అధ్యాయం. పట్టుదలకు మారు పేరు ..అనుకున్నది సాధించే మొండి ఘటం. జనం మెచ్చిన నాయకుడు . ప్రజలు మెచ్చిన పరిపాలనాదక్షుడు. అపర భగీరథుడు . బహు భాషా కోవిదుడు . తాత్వికుడు ..పోరాట యోధుడు . వ్యూహకర్త ..కవి ..రచయిత ..గంటల తరబడి లక్షలాది సమూహాన్ని నియంత్రించే ఉపన్యాసకుడు. పలు అంశాల్లో పట్టు కలిగిన ధీరోదాత్తదుడు. లోకం నివ్వెర పోయేలా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాన్ని నడిపిన జగమెరిగిన నేత. ఆయనే కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. అంతా ముద్దుగా పిలుచుకునే పేరు కేసీఆర్. కొందరు అనామకులుగానే ఉంటారు .ఇంకొందరు భావి తరాలను ప్రభావితం చేసే చరిత్రను సృష్టిస్తారు . అలాంటి చరిత్రను తీరుగా రాసిన జన హృదయ నేత కేసీఆర్. బహుశా ఈ దేశంలో ఏ నాయకుడు ఎదుర్కోని అవమానాలను ఆయన ఎదుర్కొన్నారు . అయినా తెలంగాణ విముక్తి కోసం ఆయన చేయని పోరాటం లేదు ..ఆయన చేయని ప్రయత్నం లేదు . ఈ ప్రపంచంలో సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత దాకా ఆయన పేరు సదా నిలిచే ఉంటుంది. అప్పటి సీఎం చంద్రబాబు తీరుతో విసిగి వేసారి ..తెలంగాణ ప్రాంతపు దుఃఖాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి ఆయన.దుఃఖం వచ్చినా ఆపు కోలేని మానవత్వం ఉన్న మనీషి కేసీఆ...

కవితమ్మ..బతుకమ్మ..!

చిత్రం
తెలంగాణ మాగాణంలో విస్మరించలేని పదం కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఆమె పేరు వినని వారంటూ వుండరు. అంతగా ప్రాచుర్యం పొందారు. ఇటు రాష్ట్ర స్థాయిలోను అటు దేశ విదేశాలలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలిగా నలుదిశలా వినుతికెక్కారు. ఉద్యమ నేపథ్యం ..అపారమైన విజ్ఞానం. నాయకత్వ నైపుణ్యం ఆమె సొంతం.ఏది మాట్లాడినా సరే ఒక విజన్ ఉండేలా ఎదుటి వారిని మెప్పిస్తారు. ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరులో ఆమె చేపట్టిన బతుకమ్మ పండుగ ఒక బ్రాండ్ గా మారి పోయింది . బతుకమ్మ అంటేనే కవితమ్మ అనే పేరు చీర స్థాయిగా నిలిచి పోయేలా చేసింది . ఇదంతా ఆమె సాధించిన అపూర్వ విజయం ఇది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. నిరంతర నిర్బంధంలో సైతం ఆడబిడ్డల్ని ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన ఘనత ఆమెదే. ఎన్నో అవమానాలు .. మరెన్నో ఆరోపణలు ..వాటినన్నిటిని ధైర్యంతో ఎదుర్కొన్నది. తానే నేటి యువతకు ఓ ఐకాన్ లాగా మారి పోయింది. అదీ ఆమెకున్న ఘనత ..ప్రత్యేకత. తెలంగాణ యాస ..భాష..కట్టు బొట్టు .అన్నిటిని ఆమె జనంలోకి తీసుకు వెళ్లారు . దేశం దాటి ఖండాతరాళాల్లో తెలంగాణ సంస్కృతి .. సాంప్రదాయాలను పాటించేలా చేశారు . ఇప్పుడు ఎక్క...

రోగుల పాలిట దైవం కె.జె.రెడ్డి వైద్యం

చిత్రం
ఆర్థోపెడిక్ విభాగంలో దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న వైద్యుల జాబితాలో డాక్ట‌ర్ కె.జె.రెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ‌లో ఆయ‌న పేరు ఎవ‌రిని అడిగినా త‌డుముకోకుండా చెప్పేస్తారు. అపార‌మైన అనుభ‌వంతో పాటు  రోగుల ప‌ట్ల ఆయ‌న చూపించే అనురాగం రెడ్డిని ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా నిలిచేలా చేసింది. ఆర్థోపెడిక్ ప‌రంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ విష‌యాన్ని ఆయ‌న ముందే గుర్తించారు. అందుకే తాను పుట్టిన ఊరికి, పాల‌మూరు జిల్లాకు పేరు తీసుకు వ‌చ్చారు. ఆయ‌న త‌న మూలాల‌ను మ‌రిచి పోలేదు. ఒక‌ప్పుడు వైద్యం కోసం  అష్ట‌క‌ష్టాలు ప‌డిన త‌మ ప‌ల్లె ప్ర‌జ‌లను చూసి రెడ్డి చ‌లించి పోయారు. ఏకంగా జిల్లా చ‌రిత్ర‌లో స‌క‌ల స‌దుపాయాలు, సౌక‌ర్యాల‌తో అత్యాధునిక‌మైన ఆస్ప‌త్రిని, మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్‌, రాయిచూర్ ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే జిల్లా కేంద్రానికి ద‌గ్గ‌ర‌లో పేద‌ల‌కు మెరుగైన చికిత్స‌లు అంద‌జేస్తోంది.  కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు.క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబద్ధ‌త‌, సింప్లిసిటీకి పెట్టింది పేరు కె.జె.రెడ్డి. క‌లాం క‌ల‌లు క‌న్నారు..ద...

సేవే మార్గం జీవితం ధ‌న్యం - మ‌హిళా స్ఫూర్తి - శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు

చిత్రం
జీవితం దేవుడిచ్చిన వ‌రం. ప‌ది మందికి సేవ చేయ‌డంలో ఉన్నంత సంతృప్తి ఎందులోనూ ఉండ‌దంటున్నారు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం జూప‌ల్లి గ్రామానికి చెందిన శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు. త‌రాల‌కు  స‌రిప‌డా ఆస్తులు, అంత‌స్తులున్నా అవేవీ మ‌న‌కు ఆనందాన్ని ఇవ్వ‌వ‌ని చెబుతారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన దాంట్లోంచి ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలంటారు. ఒక మ‌హిళ త‌లుచుకుంటే ఏమైనా సాధించ‌గ‌ల‌మ‌ని ఆమె నిరూపిస్తున్నారు. సాటి మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. త‌ల్లిదండ్రులు ర‌ఘుప‌తిరావు, సౌంద‌ర్య‌దేవి. ఐదుగురు అక్కా చెల్లెళ్లు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు. డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నారు. 1975లో క‌రీంన‌గర్ జిల్లాకు చెందిన శ్రీ‌మాన్ భాస్క‌ర్‌రావు గారితో వివాహం. వీరికి ఒక పాప‌. ఒక బాబు. ఇద్ద‌రూ చ‌దువులో రాణించారు. వైద్యులుగా అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. కోడ‌లు , అల్లుడు కూడా డాక్ట‌ర్సే. 1980లో జి.వి.భాస్క‌ర్‌రావు పేరుతో సీడ్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. 1986లో దీనిని కావేరీ సీడ్స్ కంపెనీగా మార్చారు. ఇదే స‌మ‌యంలో శ్రీశ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అప్ప‌టి నుండి శ్రీ‌మ‌తి వ‌న‌జా ...