పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్ర‌పంచ చైత‌న్య‌పు గొంతుక‌..ప్ర‌జా యుద్ధ నౌక - బాబ్ మార్లే ..!

చిత్రం
యుద్ధాన్ని నిర‌సించినవాడు..ప్ర‌జ‌ల‌ను ప్రేమించిన వాడు. గుండెల్లో చైత‌న్య దీప్తుల‌ను వెలిగించిన మ‌హోన్న‌త మాన‌వుడు. బ‌తికింది కొన్నేళ్ల‌యినా కొన్ని త‌రాల పాటు వెంటాడేలా త‌న గాత్రాన్ని జ‌నం కోసం అంకితం చేసిన ధీరోదాత్తుడు బాబ్ మార్లే. మోస్ట్ ఫేవ‌ర‌బుల్ సింగ‌ర్‌గా ..సెర్చ్ ఇంజ‌న్ దిగ్గ‌జం గూగుల్‌లో కోట్లాది ప్ర‌జ‌లు వెతుకుతున్న సాంస్కృతిక యోధుడిగా ఆయ‌న గుర్తుండి పోతాడు. అత‌డి క‌ళ్ల‌ల్లో వేగం..అత‌డి చూపుల్లో ఆర్ద్ర‌త‌..అత‌డి గొంతులో మార్మిక‌త ..అత‌డి న‌డ‌త‌లోని మాన‌వ‌త క‌లిస్తే అత‌డే బాబ్ . ప్ర‌పంచాన్ని త‌న పాట‌ల‌తో ఊపేసిన మొన‌గాడు. శాంతి కోసం పాట‌లు క‌ట్టాడు. ప్ర‌జ‌ల వైపు నిల‌బ‌డ్డాడు. హింస‌కు వ్య‌తిరేకంగా ఎన్నో గీతాలు రాసి ఆలాపించాడు. ఏకంగా తానే ఓ పాట‌ల సైన్యాన్ని త‌యారు చేశాడు. పుట్టుక‌తో జ‌మైక‌న్ అయిన బాబ్..ఇపుడు పాట‌ల పాల‌పుంత‌. చ‌నిపోయి ..భౌతికంగా మ‌న మ‌ధ్య లేక పోవ‌చ్చు గాక‌..కానీ ఆయ‌న సృజియించిన గాత్ర‌పు మాధుర్యం ఇంకా..ఇంకా మోగుతూనే ఉన్న‌ది. రాజ్య హింస‌కు పాల్ప‌డే పాల‌కుల నుండి మార్కెట్ , కార్పొరేట్ శ‌క్తుల కుయుక్తులు, మోసాల‌కు పాల్ప‌డే వారి వెన్నులో తూటాలై పేలుతూనే ఉన్నాయి. చ‌ర...

!..రాచాల నుంచి రాజ‌ధాని దాకా ..!..శీన‌న్న ప్ర‌స్థానం ..!

చిత్రం
పాల‌మూరు జిల్లాలోని రాచాల ప‌ల్లె ఇవాళ గ‌ర్వ ప‌డుతున్న‌ది. ఇదే ప‌ల్లెకు చెందిన వి.శ్రీ‌నివాస్ గౌడ్ ..గ్రూప్ -1 అధికారిగా..ఉద్య‌మ సంఘాల అధినేత‌గా, గౌర‌వ అధ్య‌క్షుడిగా..తెలంగాణ ఉద్య‌మ నేత‌గా ..ఎమ్మెల్యేగా ప్రారంభ‌మైన ప్ర‌స్థానం అమాత్యునిగా ఎదిగేలా చేసింది. ఇదంతా ఒక్క‌రోజులో సాధ్య‌మైనది కాదు. ఎన్నో ఏళ్లుగా క‌ష్ట‌ప‌డి ఒక్కో మెట్టు ఎక్కుతూ..ఉన్న‌త స్థానాన్ని అధిరోహించారు. విద్యావంతుడిగా, మేధావిగా, ఉన్న‌తాధికారిగా , రాజ‌కీయ నేత‌గా ప‌రిణ‌తి సాధించిన గౌడ్ అంచెలంచెలుగా త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌త్యేక రాష్ట్రం కోసం జ‌రిగిన అలుపెరుగ‌ని పోరాటంలో, ఉద్య‌మంలో ఆయ‌న చురుకుగా పాల్గొన్నారు. ఉద్యోగుల‌ను కూడ‌గ‌ట్ట‌డంలో ఆయ‌న కీల‌క భూమిక పోషించారు. 14 ఏళ్లుగా జ‌రిగిన అలుపెరుగ‌ని పోరాటంలో గులాబీ బాస్ కేసీఆర్ వెన్నంటే వున్నారు. మొద‌టిసారి ఏర్ప‌డిన కొత్త రాష్ట్రంలో గౌడ్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. రెండోసారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో అత్య‌ధిక మెజారిటీ సాధించి ర...

మ‌ట్టిబిడ్డ‌ల‌ బ‌తుక‌మ్మ‌..!

చిత్రం
చ‌రిత్ర మ‌రిచి పోతున్నం చెమ్మ‌గిల్లిన క‌న్నీళ్ల సాక్షిగా ఈ మ‌ట్టికి ఎన‌లేని క‌థ వున్న‌ది అది కొన్నేళ్ల పోరాటం..ఎడ‌తెగ‌ని ఆరాటాల్ని  పొదివి ప‌ట్టుకుని ఎగ‌సి ప‌డిన దృశ్యం స‌జీవ రూప‌మై నిటారుగా నిల‌బ‌డ్డ‌ది అది స‌గ‌ర్వంగా ప్ర‌పంచానికి తానేమిటో చాటి చెప్పింది ఉద్య‌మ‌మై ఎగ‌సి ప‌డ్డ‌ది ..ఊపిరై బిడ్డ‌ల్ని పొదివి ప‌ట్టుకుంది అది కోట్లాది గొంతుక‌ల్లో మాటై మోగింది పాటై జ‌త క‌ట్టింది..జాత‌రై..పెను ఉప్పెనై చుట్టేసింది అదే నా బ‌తుక‌మ్మ‌..ఆత్మ‌గౌర‌వం కోసం సాగిన ప్ర‌స్థానానికి ప్ర‌తిరూపంగా నేడు దిగంతాల‌ను దేదీప్య‌మానంగా వెలుగొందేలా విస్మ‌రించ లేనంత‌గా ఎదిగిపోయింది.. ఎన్ని కుట్ర‌లు..ఎన్ని కుతంత్రాలు..ఎన్ని ఛీత్కారాలు అన్నీ కోల్పోయిన చోట..నిలువ నీడ లేకుండా పోయిన చోట మ‌ళ్లీ ఫీనిక్స్ ప‌క్షి లాగా ..జ‌నం జెండాగా మారి ..కాల‌ర్ ఎగ‌రేసిన తీరు ఎంద‌రికో స్ఫూర్తినిచ్చింది..ప్ర‌జా స్వ‌రానికి ప్రాణం పోసింది.. వెకిలి వేషాలు..ద్వంద‌ర్థాల మాయల ప‌డిపోతున్న త‌రుణంలో బ‌తుక‌మ్మ సంద్ర‌మై చుట్టుముట్టింది..లోకాన్ని త‌నలో ఇముడ్చుకుంది కోటి గొంతుక‌ల రాగ‌మై ..గుండెల్ని పిండేసింది.. అందుకే ఈ జాగ‌ల ద‌మ్ముంది.. ఈ మ‌ట్ట...

నా ప్రాణ‌మా గాన‌గాంధ‌ర్వ‌మా ( ఎడ్ షేరేన్ - షేప్ ఆఫ్ యు సాంగ్ )

చిత్రం
ఏ దివి నుంచి దిగివ‌చ్చిన గొంతుక‌వో ఏ లోక‌పు సృజియించిన పాట‌ల జ‌ల‌తీవెవో  ఏ దిగంతాల‌ను దాటుకుని గుండెల్ని చీల్చిన మిస్సైల్ వో నీ గాత్రం అజ‌రామ‌రం.. నీ స్వ‌రం అప్ర‌హ‌తిహ‌తం భూమిని చీల్చుకుని నిటారుగా నిల‌బ‌డిన వ‌రి కంకుల్లా నింగిని తాకే వేగుచుక్క‌ల్లా .. చీక‌టిని చీల్చుకుని వ‌చ్చే తార‌క‌ల్లా మ‌న‌స్సును మెస్మ‌రైజ్ చేసే నీ స్వ‌ర‌జ‌తుల‌ను విన్నాక పాట‌కున్న ప‌వ‌ర్ ఏమిటో తెలిసింది.. పాటంటే ప‌చ్చ‌ని చేలు గాలికి క‌ద‌లాడిన‌ట్టు పాటంటే అమ్మ చ‌నుబాలు తాగిన‌ట్టు పాటంటే అడవి బిడ్డ‌ల‌కు ఆయుధం తోడైన‌ట్టు పాటంటే యుద్ధంలో ఫిరంగులు మోగిన‌ట్టు పాటంటే కోట్లాది ప్ర‌జ‌ల ఆర్త‌నాదం క‌దా.. పాటంటే శ‌త‌వ‌సంతాల స‌మ్మేళ‌నం క‌దా పాటంటే క‌డుపు కోత‌కు గురైన గ‌ర్భ‌శోకం క‌దా పాటంటే శ్మ‌శానంలో క‌న్నీటి రాగం క‌దా పాటంటే జ‌న విన్యాసం క‌దా పాటంటే చావు బ‌తుకుల పోరాటం క‌దా పాటంటే రేప‌టి భ‌విష్య‌త్తును వెలిగించే సితార క‌దా అందుకే పాట‌కు ఫిదా అయ్యేది కోట్లను కాద‌నుకుని డాల‌ర్ల‌ను దాటుకుని మ‌నుషుల‌ను ఏకం చేస్తోంది నీ గాత్రం ఎక్క‌డ విన్నా నీ స్వ‌ర‌మే.. ప‌డుకుంటే నీ చూపుల చుర‌క‌త్తులై చీల్చుతున్న‌వి.. నిల్చుంటే నీ గొం...

ప్ర‌పంచం మెచ్చిన మ‌హిళా నాయ‌కురాలు - క‌రుణా గోపాల్ ..!

చిత్రం
ఫ్యూచ‌రిక్ సిటీస్ ..స్మార్ట్ సిటీస్ ..ఈ పేర్లు వింటే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది ఒకే ఒక్క‌రు ..ఆమె క‌రుణా గోపాల్. వ్య‌క్తి నుండి సంస్థ‌గా ఎదిగిన ఆమె ప్ర‌యాణం స్ఫూర్తి దాయ‌కంగా వుంటుంది. ఒక మ‌హిళ‌గా ..త‌ల్లిగా..ఆంట్ర‌ప్రెన్యూర్‌గా..మెంటార్‌గా..ఫౌండ‌ర్‌గా..మేధావిగా..ప్ర‌తిభ‌..తేజ‌స్సు క‌లిగిన వ్య‌క్తిగా ఎదిగారు. ఎందరికో ఆద‌ర్శ ప్రాయంగా నిలిచారు. ప్ర‌స్తుతం బీజేపీలో కేంద్ర స్థాయిలో కీల‌క‌మైన భూమిక‌ను పోషిస్తున్నారు. మ‌రో వైపు ఫ్యూచ‌రిక్ సిటీస్‌ను స్థాపించి న‌గ‌రాల‌ను ఎలా కాపాడు కోవాలో తెలియ చేస్తున్నారు. ఐవిఎల్‌పీ ఫెలోగా ఉన్నారు. అమెరికాలో పేరొందిన హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలోని జాన్ ఎఫ్‌. కెన్న‌డీ స్కూల్ ఆఫ్ గ‌వ‌ర్న‌మెంట్‌లో బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. మేధావిగా..ఆలోచ‌న‌ల్లో అత్యంత సునిశిత‌మైన ప‌రిజ్ఞానం క‌లిగిన వ్య‌క్తిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఎక్క‌డికి వెళ్లినా థాట్ ..డైన‌మిక్ లీడ‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. స్మార్ట్ సిటీస్ గురించి ఆమె ఎన్నో ప‌రిశోధ‌న‌లు చేశారు. ప్ర‌పంచాన్ని చుట్టి వ‌చ్చారు. అపార‌మైన అనుభ‌వాన్ని గ‌డించారు. ఫౌండేష‌న్ ఫ‌ర్ ఫ్యూచ‌రిక్ సిటీస్ సంస్థ‌కు ప్ర‌స్తుతం అధ్య‌...

మీడియాలో రారాజు..బిజినెస్‌లో మారాజు..ఉద‌య‌శంక‌ర్ ట్రెండ్ సెట్ట‌ర్ ..!

చిత్రం
మాస్ మీడియాలో స్టార్ టీవీ గ్రూప్ త‌న హ‌వాను అప్ర‌హ‌తిహంగా కొన‌సాగిస్తోంది. ఇండియ‌న్ ఎంట‌ర్‌టైన్మెంట్ రంగంలో రికార్డుల‌ను తిర‌గ రాసి మిగ‌తా మీడియా సంస్థ‌ల‌ను, దిగ్గ‌జాల‌ను కోలుకోలేకుండా చేసింది. వ్యాపార ప‌రంగా చూస్తే న్యూ ట్రెండ్స్ ను సృష్టిస్తోంది. ఇండియా అంటేనే క్రికెట్ ..ఇపుడు ప్ర‌సార హ‌క్కుల‌ను ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బిడ్‌లో పాల్గొని ప్ర‌సార హ‌క్కుల‌ను స్వంతం చేసుకుని త‌న రికార్డుల‌ను తానే అధిగ‌మించింది. ఇదంతా ఒక్క‌రోజులో జ‌రిగిన ప్ర‌యాణం అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. స్టార్ దూకుడుకు ఇత‌ర సంస్థ‌ల‌న్నీ నిమ్మ‌కుండి పోయాయి. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా అద్భుత‌మైన బ్రాండ్ ను తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ఒక్క‌డిదే ..అత‌నే ఉద‌య శంక‌ర్ . కీలక స‌మ‌యాల్లో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం..ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించ‌డం. వ్యాపార ప‌రంగా దెబ్బ తీయ‌డం..అన్ని రంగాల‌ను ప‌టిష్ట‌వంతం చేయ‌డం..అపార‌మైన అనుభ‌వం క‌లిగిన ..విశిష్ట‌మైన వ్య‌క్తుల‌ను ..విజేత‌ల‌ను త‌న టీంలో చేర్చుకోవ‌డం..అటు క్రియేటివిటీకి..ఇటు ఐడెంటిటీకి..స‌క్సెస్‌కు ఎదురే లేకుండా చేయ‌డంలో ఆయ‌న అంద‌రికంటే ముందు వ‌రుసలో నిలిచ...

నేస్తం నువ్వే సమస్తం - వ‌ల్ల‌బ‌దాస్ స్మ‌తిలో..!

చిత్రం
పాల‌మూరు జిల్లా వీరుల‌ను క‌న్న‌ది. అత్యంత ప్ర‌తిభావంతుల‌ను చేసింది. ఉద్య‌మ‌కారుల‌ను..పోరాట స్ఫూర్తిని..త్యాగ‌ధ‌నుల‌ను..విజేత‌లను..మేధావుల‌ను ..తాత్వికుల‌ను..గాయ‌నీ గాయ‌కుల‌ను..క‌ష్ట‌జీవుల‌ను అందించింది. ఈ మ‌ట్టిలో పుట్టి..దీనిలోనే త‌క్కువ కాలంలోనే ఇక సెల‌వంటూ వెళ్లి పోయాడు..మా వ‌ల్ల‌బ‌దాస్ మ‌హేంద‌ర్ గౌడ్. మ‌రిక‌ల్ మండ‌లం జిన్నారం ఊరులో పుట్టిన మ‌హేంద‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న మ‌మ్మ‌ల్ని వీడి ఇవాళ్టితో ఏడాది గ‌డిచింది. గ్రూప్ -1 ఆఫీస‌ర్ గా అద్భుత‌మైన నైపుణ్యం, సునిశిత‌మైన తార్కిక విశ్లేష‌ణ‌, రాయ‌డంలో, చ‌ద‌వ‌డంలో, విశ్లేషించ‌డంలో మా కంటే ఆయ‌న ముందున్నారు. గుండె నిండా ప్రేమ‌ను..మాన‌వ‌త్వాన్ని క‌లిగిన స్నేహితుడు దూరం కావ‌డం బాధాక‌రం. కాలం ఎంత విచిత్ర‌క‌ర‌మైన ప‌రిస్థితిని క‌లుగ చేసిందో త‌లుచుకుంటేనే క‌న్నీళ్లు కారి పోతున్న‌వి. మా ఇద్ద‌రి మ‌ధ్య రెండేళ్ల స్నేహం మాత్ర‌మే. కానీ మ‌రిచి పోలేని జ్ఞాప‌కాల‌ను మిగిల్చింది. ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ‌, సాహిత్య‌, సాంస్కృతిక‌, సైన్స్, ఐటీ, సోష‌ల్ మీడియా, న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌తి రంగంలో ఆయ‌న‌కు అప‌రిత‌మైన అనుభ‌వం ఉన్న‌ది. ప్ర‌తి అంశం ...

ఆ రూపం అపురూపం .. ఆమె జ్ఞాప‌కం అజ‌రామ‌రం - మ‌దిలో మ‌ధుబాల..!

చిత్రం
భార‌తీయ సినీ జ‌గ‌త్తులో చెరిగిపోని జ్ఞాప‌కం ఆమె.. అందం..అభిన‌యం..విన‌యం..క‌ల‌గ‌లిస్తే మ‌ధుబాల‌. ఇవాళ ప్రేమికుల రోజు..అలాగే వెండితెర వెన్నెల‌..మ‌ధుబాల పుట్టిన రోజు. ఎన్నేళ్ల‌యింది చూసి..మొఘెల్ ఏ ఆజం సినిమా ఎప్ప‌టికీ క్లాసిక్కే. ఆ చూపు..ఆ క‌ళ్లు..ఆ రూపం..ఇంకెవ్వ‌రికీ రాదు..దేవుడు సృష్టించిన అద్భుతాల్లో మ‌ధుబాల ఒక‌రు. ఆమె అస‌లు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహల్వి. 14 ఫిబ్ర‌వ‌రి 1933లో ఢిల్లీలో జ‌న్మించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. త‌న అందంతో మెస్మ‌రైజ్ చేశారు. న‌టిగా దిగంతాల‌ను వెలిగించారు. ఈ ప్ర‌యాణంలో మ‌లుపులు ఎన్నో..జ్ఞాప‌కాలు మ‌రెన్నో. త‌లుచుకుంటే చాలు ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. ఎన‌లేని కీర్తిని మూట‌గ‌ట్టుకున్నారు. కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. 1950 నుండి 1960 మ‌ధ్య కాలంలో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించారు. త‌న స‌మ‌కాలికులైన న‌టీమ‌ణులు న‌ర్గీస్, మీనాకుమారిల‌తో ..స‌మానంగా గౌరవం పొందారు. సాంప్ర‌దాయ ముస్లిం దంప‌తుల 11 మంది సంతానంలో మ‌ధుబాల ఐద‌వ వ్య‌క్తి. తండ్రి అతావుల్లా ఖాన్ పెషావ‌ర్‌లోని ఇంపీరియ‌ల్ టొబాకో కంపెనీలో త‌న ఉద్యోగాన్ని కోల్పోవ‌డంతో ..త‌న కుటుంబాన్ని ముంబ‌య...

అగ్ని శిఖ‌రం అంచున ..అక్ష‌ర యోధుడు ..!

చిత్రం
సుసంప‌న్న‌మైన ..త‌ర‌త‌రాల‌కు స‌రిప‌డా వ‌న్నె త‌గ్గ‌ని చ‌రిత్ర క‌లిగిన ప్రాంతం తెలంగాణ‌. ఈ మ‌ట్టికి ఎన‌లేని మాన‌వ‌త్వం వున్న‌ది. మ‌నుషుల్ని ..జీవాల‌ను ఒకే రీతిన చూడ‌గ‌లిగే సంస్కృతి ఈ ఒక్క ప్రాంతానికి మాత్ర‌మే వున్న‌ది. పోరాటాల‌కు..త్యాగాల‌కు..బ‌లిదానాల‌కు..ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక ఈ స్థ‌లం. ఆయుధాలు లేక పోయినా స‌రే ఆత్మ‌విశ్వాసానికి కొదువ లేదు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో సుదీర్ఘ‌మైన పోరాటం చేసి..ప్ర‌త్యేక రాష్టం కోసం తెలంగాణ జెండాను ఎగుర వేసిన ఘ‌న‌మైన చ‌రిత్ర‌ను సృష్టించింది ఈ స్థల‌మే. అపార‌మైన వ‌న‌రులు..అద్భుత‌మైన అవ‌కాశాలు క‌లిగిన ఒకే ఒక్క ప్రాంత‌మిదే. ఎక్క‌డికి వెళ్లినా ఈ మ‌ట్టిలో వున్నంత ప్రేమ ఇంకెక్క‌డా దొర‌క‌దు . అందుకే ఆ అక్ష‌ర యోధుడు దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు ..నా తెలంగాణ కోటి ర‌త‌ణాల వీణ అని స‌గౌర‌వ్వంగా లోకానికి చాటి చెప్పారు. క‌విగా, ర‌చ‌యిత‌గా, గేయ ర‌చ‌యిత‌గా తెలంగాణ ప్రాంతం నుండి త‌న‌దైన ముద్ర‌ను వేసుకుని అక్ష‌రాల‌తో మంట‌లు పుట్టించిన మ‌హాక‌వి దాశ‌ర‌థి. వ‌రంగ‌ల్ జిల్లా చిన్న‌గూడురులో 1925 జూలై 22న జ‌న్మించారు. నిజాం న‌వాబుల దాష్టిక పాల‌న‌పై ఎక్కుపెట్టిన ఆయుధం ఆయ‌న‌. తెలం...