నా ప్రాణ‌మా గాన‌గాంధ‌ర్వ‌మా ( ఎడ్ షేరేన్ - షేప్ ఆఫ్ యు సాంగ్ )

ఏ దివి నుంచి
దిగివ‌చ్చిన గొంతుక‌వో
ఏ లోక‌పు సృజియించిన
పాట‌ల జ‌ల‌తీవెవో 
ఏ దిగంతాల‌ను దాటుకుని
గుండెల్ని చీల్చిన మిస్సైల్ వో
నీ గాత్రం అజ‌రామ‌రం..
నీ స్వ‌రం అప్ర‌హ‌తిహ‌తం
భూమిని చీల్చుకుని
నిటారుగా నిల‌బ‌డిన వ‌రి కంకుల్లా
నింగిని తాకే వేగుచుక్క‌ల్లా ..
చీక‌టిని చీల్చుకుని వ‌చ్చే తార‌క‌ల్లా
మ‌న‌స్సును మెస్మ‌రైజ్ చేసే
నీ స్వ‌ర‌జ‌తుల‌ను విన్నాక
పాట‌కున్న ప‌వ‌ర్ ఏమిటో తెలిసింది..
పాటంటే ప‌చ్చ‌ని చేలు
గాలికి క‌ద‌లాడిన‌ట్టు
పాటంటే అమ్మ చ‌నుబాలు తాగిన‌ట్టు
పాటంటే అడవి బిడ్డ‌ల‌కు
ఆయుధం తోడైన‌ట్టు
పాటంటే యుద్ధంలో
ఫిరంగులు మోగిన‌ట్టు
పాటంటే కోట్లాది ప్ర‌జ‌ల ఆర్త‌నాదం క‌దా..
పాటంటే శ‌త‌వ‌సంతాల
స‌మ్మేళ‌నం క‌దా
పాటంటే క‌డుపు కోత‌కు గురైన
గ‌ర్భ‌శోకం క‌దా
పాటంటే శ్మ‌శానంలో
క‌న్నీటి రాగం క‌దా
పాటంటే జ‌న విన్యాసం క‌దా
పాటంటే చావు బ‌తుకుల
పోరాటం క‌దా
పాటంటే రేప‌టి భ‌విష్య‌త్తును
వెలిగించే సితార క‌దా
అందుకే పాట‌కు ఫిదా అయ్యేది
కోట్లను కాద‌నుకుని
డాల‌ర్ల‌ను దాటుకుని
మ‌నుషుల‌ను ఏకం చేస్తోంది నీ గాత్రం
ఎక్క‌డ విన్నా నీ స్వ‌ర‌మే..
ప‌డుకుంటే నీ చూపుల చుర‌క‌త్తులై
చీల్చుతున్న‌వి..
నిల్చుంటే నీ గొంతు
ర‌క్త‌మై మీటుతున్న‌ది
ఎక్క‌డిదీ జ‌ల‌ధార‌..స్వ‌ర‌ధార
ఎంతటి మాధుర్యం..
చూస్తే చాలు ఫిదా అయిపోయేలా
నీ పాట చుట్టుముడుతోంది..
షేరెన్ నీ పాట‌కు అల్విదా !

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!