పర్యాటకుల కోసం దుబాయి సన్నద్ధం
ప్రపంచంలో దుబాయికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసింది అక్కడి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం. అంతే కాకుండా పర్యాటకుల కోసం వసతి, సౌకర్యాలను కల్పిస్తోంది. అంతే కాకుండా తాజాగా దుబాయి ఫెస్టివల్ ను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ట్రావెలర్స్ కు దుబాయి స్వర్గ ధామంగా ఉంటోంది. ఇటీవల పర్యాటకులు ఎక్కువగా ఈ అందమైన సిటీని ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో అరబ్ కంట్రీకి గణనీయమైన రీతిలో ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు అక్కడి సర్కార్ బంపర్ ఆఫర్స్ కూడా ఇస్తోంది. దీంతో ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున దుబాయి ఫెస్టివల్ కోసం బుకింగ్ చేసుకుంటున్నారు.
మరో వైపు పర్యాటకులు పెరగడంతో అక్కడి విమానయాన రంగానికి కూడా ఆదాయం సమకూరుతోంది. ఈసారి 24వ దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. 29న దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనుంది. గ్లోబల్ విలేజ్ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పర్యాటకులను ఆకర్షించడానికి 3,500 షాపింగ్ ఔట్ లెట్స్‌ను ఏర్పాటు చేశారు. కేవలం ట్రావెలర్స్ కోసం ప్రతి ఏటా దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. పర్యాటకులు ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తుంటారు.
అనేక రకాల సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తారు. షాపింగ్ ఔట్‌లెట్స్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వివిధ రకాల ఆహార పదార్థాలను వండి పెట్టడానికి రెస్టారెంట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఊష్ణోగ్రతలు తగ్గిన తరువాత అంటే.. శీతాకాలం ఆరంభమయ్యే సమయంలో దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. వివిధ దేశాల సంస్కృతి, కళలకు అద్దం పట్టేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. దాదాపు 80 దేశాల పర్యాటకులు ఈ దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌లో పాల్గొంటారని అంచనా. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంతో మంది యూఏఈలో ఉపాధి పొందుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి