పండుగ వేళ జియో బంపర్ అఫర్

దీపావళి పండుగ వేళ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరో సారి కస్టమర్లును ఆకర్షించే పనిలో పడ్డది. నిన్నటి దాకా ఇతర టెలికాం కంపెనీలకు చుక్కలు చూపించింది. రీఛార్జ్ చేసుకునే  వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కల్పించే పనిలో పడ్డది. ఇందులో భాగంగా రీఛార్జ్ తో పాటు ఆల్‌ వన్‌ ప్లాన్‌ పేరుతో ఇప్పటికే అమలు చేసింది. ఆ తర్వాత దానిని నిలిపి వేశారు. తిరిగి ఇదే ప్లాన్ ను జియో రిలయన్స్ కంపెనీ పునరుద్ధరించింది. కస్టమర్లను ఆకట్టు కునేందుకు విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇదే వ్యూహాన్ని జియో స్మార్ట్ ఫోన్‌ విషయంలో కూడా అమలు చేస్తోంది.

తాజాగా ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌ జియో ఫోన్‌ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆల్‌ ఇన్‌ వన్ మంత్లీ ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. 75  రూపాయలు,125,185 విలువైన రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లలో వరుసగా నెలకు త్రీ జీబీ  రోజుకు 0.1 జీబీ, 14జీబీ, రోజుకు 0.5 జీబీ, 28 జీబీ రోజుకు 1 జీబీ, 56 జీబీ రోజుకు 2జీబీ డేటాలను అందిస్తుంది. అంతే కాదు ఉచిత 500 నిమిషాల నాన్ జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్‌ చేస్తోంది.

అలాగే అపరిమిత జియో-టు-జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్‌లు కూడా ఇందులో ఉన్నాయి. జియో ఫోన్ వినియోగదారుల కోసం తన కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ల ద్వారా ప్రత్యర్థుల కంటే 25 రెట్లు ఎక్కువ విలువను అందిస్తున్నామని జియో పేర్కొంది. ఇటీవల ఇంటర్‌ కనెక్ట్ యూజ్ చార్జీలను జియో ప్రకటించింది. దీనిపై  వినియోగదారుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల‍ కోసం ఆల్‌ ఇన్‌ వన్‌ మంత్లీ ప్లాన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం మీద టెలికాం కంపెనీల నెలకొన్న పోటీ వినియోగదారులకు వరంగా మారింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!