సాల్వ్ చేయడంలో దాదా దిట్ట
బిసిసిఐ ప్రెసిడెంట్ గా బెంగాలీ దాదా సౌరబ్ గంగూలీ ఛార్జ్ తీసుకున్నాక మార్పులు మొదలయ్యాయి. బిసిసిఐకి పాలక వర్గం కూడా కొలువు తీరింది. బంగ్లాదేశ్ తో జరిగే తీ 20 , టెస్టు మ్యాచులకు సంబంధించి టీమిండియా జట్లను క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ తో కలిసి ప్రకటించాడు దాదా. ఇందులో ప్రసాద్ తో పాటు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. మరో వైపు మాజీ క్రికెటర్స్ గంగూలీని పొగిడితే, తాజగా వారి జాబితాలోకి చేరి పోయాడు సీఓఏ మాజీ చీఫ్ వినోద్ రాయ్. రెండేళ్ల కిందట..అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే, కోహ్లీ మధ్య విభేదాలు భారత క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపాయి. అయితే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం జంబో తన పదవికి రాజీనామా చేయడంతో వివాదం సమసింది.
కుంబ్లే, కోహ్లీ విభేదాలను నాటి క్రికెట్ పాలక కమిటీ సైతం పరిష్కరించ లేక పోయింది. అయితే సౌరవ్ గంగూలీ కనుక అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి వుంటే ఆ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించే వాడని రద్దయిన సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ అభిప్రాయపడ్డారు. కుంబ్లే, కోహ్లీ మధ్య వివాదాన్ని సరిగ్గా పరిష్కరించ లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆ వివాదం కనుక నేడు చోటు చేసుకొని ఉంటే అధ్యక్షుడిగా గంగూలీ బలవంతంగా నైనా కుంబ్లేని కొనసాగిస్తాడు అని ఆయన అన్నారు. కుంబ్లేతో సర్దుకు పోయేలా కోహ్లీని క్రికెట్ సలహా కమిటీ సభ్యులైన సచిన్, గంగూలీ ఒప్పించలేక పోయారని వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా బర్మింగ్ హామ్‌లో సచిన్‌ను కలిశా. తర్వాత గంగూలీ తోనూ మాట్లాడా.
అప్పటికే విరాట్‌తో సుదీర్ఘంగా మాట్లాడిన విషయాన్ని వారిద్దరికీ తెలిపా. వారే కోహ్లీని ఒప్పించ లేక పోయినప్పుడు నా వల్ల అవుతుందా. కెప్టెన్, కోచ్ మధ్య విభేదాలు తలెత్తితే తొలగించాల్సింది కోచ్‌నే కదా. అక్కడే దొరికి పోయాం అని రాయ్ వివరించారు. కోహ్లీ, శాస్ర్తిలకు స్వేచ్ఛ ఇవ్వడంపై మాట్లాడుతూ..సారథికి, కోచ్‌కు గాక ఎవరికి స్వేచ్ఛ ఇస్తాం అని వినోద్ రాయ్ ఎదురు ప్రశ్నించారు. మొత్తం మీద పవర్లోకి వచ్చిన గంగూలీ ఇప్పుడు ఎలా పరుగులు పెట్టిస్తాడో వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి