పోస్ట్‌లు

అనంతం..అద్భుతం..ఆదాయం

చిత్రం
సామాజిక మాధ్యమం అందుబాటులోకి వచ్చాక ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళు, సామాన్యులు సైతం అందుబాటు లోకి, వెలుగు లోకి వస్తున్నారు. ఇదంతా వాళ్లలో ఉన్న ప్రతిభ, అంతులేని నైపుణ్యం కూడా. అన్నీ ఉన్నా అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదే సమయంలో సాంకేతిక నైపుణ్యంలో చోటు చేసుకున్న మార్పులు కోట్లాది మందిని కనెక్ట్ అయ్యేలాగా చేస్తోంది. దీంతో అపరిమితమైన అవకాశాలు తలుపు తడుతున్నాయి. టాలెంట్ ఉండి పలు భాషల్లో కొంచెం పట్టు సాధించ గలిగితే చాలు లక్షలు వెనకేసు కోవచ్చు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. మరికొందరు ఋషులు, యోగులు, స్వాములుగా, మార్గ నిర్దేశకులుగా, జాతికి జీవం పోసేలా తమను తాము మల్చుకుంటున్నారు.  ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు న్యూమరాలజిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్కులు కేవలం సమాజ సేవకే తమ విలువైన కాలాన్ని, జీవితాన్ని వినియోగిస్తున్నారు. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న వారికీ మేలు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాధన ద్వారా తాము నేర్చుకున్న మంచి అంశాలు, విషయాలను పామరులకు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. అలాంటి వార...

యువరాజుతో కరచాలనం చిన్నారి ఆనందం

చిత్రం
సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొందరు అనామకులు ఒక్క రోజులోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోపే ప్రపంచమంతటా పాపులర్ అయి పోతున్నారు. తాజాగా అబుదాబిలో జరిగిన సంఘటన ఓ చిన్నారిని హైలెట్ గా మార్చేసింది. అదేమిటంటే అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ కొద్ది రోజుల కిందట ఓ విందులో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అతనితో కరచాలనం  చేసేందు కోసం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి పరుగు పరుగున వచ్చి ఆ లైన్‌లో నిలబడింది. ఆ యువరాజ వారి కోసం చేతులు ముందుకు చాచి ఆతృతగా ఎదురు చూడ సాగింది. అందరికీ చిరునవ్వుతో కరచాలనం చేస్తూ వచ్చిన యువరాజు చివరకు ఆ చిన్నారికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వ కుండానే వెళ్లి పోయాడు. దీంతో ఆ చిన్నారి హృదయం తీవ్రంగా గాయపడింది. తన వంతు రాగానే యువరాజు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వ లేదని ఎంతగానో బాధ పడింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రపంచమంతటా చర్చనీయాంశం కావటంతో వెంటనే ఆ యువరాజు చిన్నారి ఐశా మహమ్మద్‌ మషీత్‌ అల్‌ మజ్‌రౌవీ ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులను సందర్శించి సంభ్రమాశ్చ...

ఎంత తిడితే అంత ఆనందం

చిత్రం
ఇదేమిటి అనుకుంటున్నారా..అవును మీరు చూస్తున్నది కరెక్టే. తెలుగు, తమిళ్ సినిమా రంగాల్లో తన సంగీతంతో మెస్మరైజ్ చేస్తూ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్. తనకు పొగడ్తల కంటే తిట్టే వారినే ఎక్కువగా ఇష్టపడతానని అంటున్నాడు. ప్రసంశలు ఉన్న చోటే విమర్శలు కూడా ఉంటాయి. విమర్శలను విశ్లేషించు కుంటూ ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ కెరీర్లో ముందుకు సాగి పోవాలనుకుంటున్నాను అంటున్నారు తమన్‌. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథా నాయికలుగా నటించారు. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ పలు విశేషాలు పంచుకున్నారు. వెంకీమామ ఒక ఎమోషనల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా రఫ్‌ వెర్షన్‌ చూసి నేను కంట తడి పెట్టుకున్నాను. ఇందులోని ఎమోషన్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుందని అనుకుంటున్నాను. మామా, అల్లుడా అన్నట్లు వెంకటేష్, నాగచైతన్య ఇద్దరూ పోటీ పడి నటించారు. ఫస్ట్‌ హాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా, సెకండాఫ్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. వ...

అజ్జూ ఋణం తీర్చుకున్న దాదా

చిత్రం
రియల్లీ యూ ఆర్ గ్రేట్ దాదా. దమ్మున్నోడు. డైనమిక్ లీడర్. అంతే కాదు ఎవ్వరికీ జవాబుదారీ ఇవ్వాల్సిన పరిస్థితులు తీసుకు రాకుండానే తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు బెంగాల్ టైగర్ సౌరభ్ గంగూలీ. తనను నమ్ముకున్న వారికి, తనకు అవకాశం ఇచ్చిన వారికి సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నాడు ఈ తాజా ప్రెసిడెంట్. మహమ్మద్ అజహరుద్దీన్ అద్భుతమైన ఆటగాడు. అంతే కాదు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పినట్టు ఈ మాజీ ఆటగాడు ఈ దేశానికి దేవుడు ఇచ్చిన వరం. ఒకవేళ అనుకోని రీతిలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ఇరుక్కోక పోయి ఉనింటే ఇవ్వాళ బిసిసిఐకి దిశా నిర్దేశనం చేసే స్థాయిలో ఉండేవాడు. ఈ హైదరాబాదీ పేరుతో ఎన్నో రికార్డులు నమోదు అయి ఉన్నాయి. ఒకానొక దశలో ఇండియన్ క్రికెట్ జట్టులోకి అనూహ్యంగా వచ్చాడు. తక్కువ సమయంలోనే ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. బొంబాయి క్రికెటర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. ప్రపంచం దోషిగా నిలబెట్టిన సమయంలో క్రికెట్ దిగ్గజాలు సిద్దు, కపిల్ దేవ్ , గంగూలీ తోడుగా ఉన్నారు. ఆయన వెనుకే నిలబడ్డారు. ఇప్పటికీ అజహరుద్దీన్ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలో లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తు...

ఆల్ఫాబెట్ సిఇఓగా పిచాయ్

చిత్రం
ప్రపంచం లోనే దిగ్గజ సంస్థకు కార్య నిర్వహణ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయ సాంకేతిక మేధావి సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కీలకమైన ప్రకటన వెలువడింది కూడా. ఇప్పటికే గూగుల్ కంపెనీకి సిఇఓ గా ఉన్న అరుదైన, అద్భుతమైన ఈ వ్యక్తి ఏది చేసినా, ఏది మాట్లాడినా ఓ సంచలనమే. కొద్ది సేపట్లోనే అది వైరల్ గా మారుతుంది కూడా. ఇప్పటికే భారీ వేతనాన్ని అందుకుంటున్న సిఇఓలలో సుందర్ పిచాయ్ మొదటి ప్లేస్ లో ఉన్నారు. ఐటీ పరంగా గూగుల్ ను టాప్ రేంజ్ లో నిలబెట్టేందుకు, కొత్త టెక్నాలజీని అప్ డేట్ చేయడం. ఈ ప్రపంచం నివ్వెర పోయేలా ఆవిష్కరణలకు సాంకేతిక జోడించడంలో సుందర్ అందరి కంటే ముందంజలో ఉన్నారు. నిత్యం ప్రపంచ అభివృద్ధి కోసం పరితపించే ఈ ఇండియన్ టెక్కీ దిగ్గజం తన చరిత్రను తానే అధిగమిస్తున్నాడు. ఇది కూడా ఓ రికార్డు గానే భావించాలి. గూగుల్ లో సిఇఓ గా చేరక ముందు సుందర్ పిచాయ్ ఆల్ఫా బెట్ ఐటీ కంపెనీలో విధులు చేపట్టాడు. తాజాగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక రంగంలో ఐటీ పరంగా గూగుల్ సంస్థకు దరిదాపుల్లో కంపెనీలు లేక పోయినా భవిష్యత్తులో ఏ కంపెనీ తమను దాటి వేళ్ళ కూడదనే రీతిలో వర్క...

ఖాకీల వేట..చిక్కని నిత్యానంద

చిత్రం
వివాదాస్పద మత బోధకుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం, కిడ్నాప్‌ ఆరోపణల నేపథ్యంలో స్వామి ఆశ్రమంలో పోలీసులు మరోసారి దాడులు నిర్వించారు. పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని  నిత్యానంద ఆశ్రమాన్ని జిల్లా అధికారులు  ఖాళీ చేయించారు. తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల  నేపథ్యంలో  ఈ చర్య తీసుకున్నారు. బాలికల అపహరణ, కిడ్నప్ లాంటి ఇతర క్రిమినల్ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్‌ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు. అంతే కాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశయించారు. పిల్లల్న...

పెద్ద ఎత్తున ఉద్యోగుల ఇంటిబాట

చిత్రం
కొన్నేళ్లుగా దేశానికి విశిష్టమైన రీతిలో సేవలు అందించిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు దివాళా అంచున నిలబడింది. దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువ చేసే స్వంత స్థలాలు ఈ టెలికాం సంస్థకు ఉన్నాయి. అందుకేనేమో మోడీ కంపెనీ ఉద్దీపన పేరుతో అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆసరా కోసం అర్రులు చాస్తున్నాయి. ఇక బ్యాంకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పేదలు, సామాన్యులు కస్టపడి దాచుకున్న డబ్బులన్నీ వ్యాపారులు, బడాబాబులు, కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు, బిజినెస్ టైకూన్స్ జేబుల్లోకి వెళ్లి పోయాయి. దీంతో అన్ని ప్రభుత్వ బ్యాంకులు నేల చూపులు చూస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలలో ఎక్కువగా నష్ట పోయింది మాత్రం కోట్లాది సామాన్య ప్రజలు మాత్రమే. జాతీయ స్థాయి ఆర్ధిక వృద్ధి రేటు కూడా మందగమనంలో సాగుతోంది. దీంతో భారతీయ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ప్రధాని, విత్త, హోమ్ శాఖా మంత్రులతో కలిసి అత్యవసర సమావేశం చేపట్టారు. అయినా మార్పు మాత్రం రాలేదు. ఇంకో వైపు బ్లాక్ మనీని అరికడతామని, విదేశాల్లో దాచుకున్న దొంగల భరతం పడతానని బీ...