పోస్ట్‌లు

మనోడు అపర కుబేరుడు..!

చిత్రం
ధీరుభాయి అంబానీ పుత్ర రత్నం ముఖేష్ అంబానీ ఇండియాలో అపర కుబేరుడిగా మరోసారి వినుతికెక్కారు. రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ కు చైర్మన్ గా వున్న ముఖేష్ మరోసారి వైరల్ గా మారారు. నిన్నటి దాకా జియో తో సెన్సేషనల్ సృష్టించిన ఈ వ్యాపార దిగ్గజం దెబ్బకు ఇతర కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఒకే ఒక్క ప్రకటనతో భారతీయ టెలికాం రంగాన్ని షేక్ చేశారు ధీరుభాయి సుపుత్రులు. తండ్రి స్థాపించిన రిలయన్స్ ను ఇవ్వాళ  ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా తీర్చిదిద్దారు. వేలాది మంది దీనిని నమ్ముకుని ఉన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఒకే ఒక్క ప్రకటనతో ఇండియాలో షేర్స్ అమాంతం పైకి ఎగ బాకాయి. ప్రత్యర్థి కంపెనీల షేర్స్ డీలా పడ్డాయి. జియో లో నమోదైన కస్టమర్లు ఏకంగా 34 కోట్లకు చేరుకున్నారు. ఇది కూడా ఓ రికార్డ్. తాజాగా అపర కుబేరులు ఎవరో జాబితా విడుదలైంది. మొత్తం కుబేరుల్లో 3,80,700 కోట్ల తో అపర కుబేరుడుగా ముఖేష్ అంబానీ మొదటి ప్లేస్ లో నిలిచి చరిత్ర సృష్టించారు. రెండవ స్థానంలో హిందూజా, మూడో ప్లేస్ లో అజీమ్ ప్రేమ్ జి ఉన్నారు. మొత్తం 25 మంది కుబేరుల లిస్టును ప్రక...

మోస్ట్ పవర్ ఫుల్ మెన్ - ఇమ్రాన్ నోట మోడీ మాట

చిత్రం
నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్టుండి మాట మార్చాడు. ఇండియాతో ప్రతి క్షణం యుద్దానికి కాలు దువ్వుతోంది పాక్. ఎప్పుడైతే జమ్మూ, కాశ్మీర్లో 370 ఆర్టికల్ ను కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం రద్దు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ మరింత రెచ్చి పోయాడు. భారత్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూనే బురద జల్లడం ప్రారంభించారు. మరో వైపు ఉగ్రవాదులకు తమ ప్రాంతం అడ్డాగా ఉందని ఒప్పుకుంటూనే ఇండియాను ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అంతర్జాతీయ వేదికపై జరిగిన సమావేశంలో ఇండియాపై పాకిస్థాన్ ప్రతినిధి నిప్పులు చెరిగారు. జమ్మూ, కాశ్మీర్ తమదేనంటూ చెప్పుకొచ్చారు. అక్కడ పాల్గొన్న దేశాలలో ఒక్క చైనా దేశం తప్పా పాకిస్థాన్ కు ఏ ఒక్క దేశమూ మద్దతు పలకలేదు. సరి కదా పాకిస్తాన్ ను ఉగ్రస్తాన్ అంటూ పేర్కొన్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ఇమ్రాన్ ఖాన్ పర్యటించారు. ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో మీట్ అయ్యాడు. పాకిస్తాన్, ఇండియా దేశాలు చర్చలు జరిపి ఆసియాలో ఉద్రిక్త వాతావరణం లేకుండా చేయాలని, ఇందు కోసం తాను మధ్యవర్తిత్వం వహించేందుకు రెడీగా ఉన్నానంటూ ట్రంప్ స్పష్టం చేశారు. దీనిని భ...

న్వవ్వుల రేడు ఇక రాడు..!

చిత్రం
తెలుగు సినిమా రంగం గొప్ప నటుడిని కోల్పోయింది. హాస్య నటుడిగా పేరున్న తెలంగాణకు చెందిన వేణు మాధవ్ ఇక సెలవంటూ వెళ్లి పోయాడు. మొన్నటికి మొన్న ఎమ్మెస్ ను కోల్పోయింది. జనానికి వినోదం పంచుతున్న వాళ్లంతా ఒక్కరొక్కరుగా ఉండలేమంటూ వెళ్లి పోతున్నారు. మొదట మిమిక్రి ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన జీవితం ఉన్నట్టుండి నటుడిగా సక్సెస్ అయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో 1969 సెప్టెంబరు 28 లో పుట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 400లకు పైగా సినిమాల్లో నటించాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకునే వారు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించేవాడు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించే వాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సు లేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు. వేణు మాధవ్ కు వెంట్రిలాక్విజ...

బ్లూ స్మార్ట్ లో దీపికా పదుకొనే పెట్టుబడి

చిత్రం
ఇండియాను స్టార్ట్ అప్స్ ఏలుతున్నాయి. భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. డిఫరెంట్ ఐడియాస్ తో అంకురాలను ఏర్పాటు చేసే వారికి కంపెనీలు, బ్యాంకులే కాదు క్రీడా, సినిమా రంగాలకు చెందిన వారు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ ట్యాక్సీ స్టార్ట్ అప్ బ్లూ స్మార్ట్ లో ప్రముఖ నటి దీపికా పదుకొనే మూడు మిలియన్స్ ను పెట్టుబడిగా పెట్టింది. ఈ కంపెనీ ఢిల్లీ , ముంబై, హైదరాబాద్ లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటిగా దీపికకు పేరుంది. కాగా ఇప్పటి దాకా డ్రమ్స్ ఫుడ్ , బెల్లట్రిక్స్ ఎయిరోస్పెస్, మైంత్ర స్టార్ట్ అప్ లలో ఆమె పెట్టుబడులు పెట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న సామెతను ఈ ముద్దుగుమ్మ ఆచరిస్తోంది. సినిమా రంగం అన్నది జూదం లాంటిది. ఎప్పుడు స్టార్ డం ఉంటుందో తెలియదు. అందుకే సంపాదించిన డబ్బులను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే మరింత లాభాలు పొందవచ్చని దీపికా పదుకొనే ఆశ. ఆమె ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టార్ట్ అప్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. కాగా ఇప్పటికే బ్లూ స్మార్ట్ వ్యాపారం కూడా గాడిలో పడింది. తమ వ్యాపారాన్ని మరింత గా విస్తరించేందుకు...

అత్యంత గౌరవ ప్రదమైన కంపెనీలు మనవే

చిత్రం
అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత గౌరవ ప్రదమైన కంపెనీల జాబితాను వెల్లడించింది. ఇందులో మన భారత్ కు చెందిన కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గతంలో లిస్టులో వెనుకబడిన ఇండియన్ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ముచ్చటగా మూడో స్థానంలో నిలిచింది. తన సత్తాను చాటింది. అంతే కాకుండా ఈసారి ప్రకటించిన జాబితాలో 16 భారతీయ కంపెనీలకు చోటు దక్కడం విశేషం. గత ఏడాది 2018 లో ఇన్ఫోసిస్ ప్లేస్ 31 ఉండగా.. ఈసారి 3 లో నిలిచి విస్తు పోయేలా చేసింది. ఫోర్బ్స్ మొత్తం 250 కంపెనీలతో జాబితా రూపొందించింది. టీసీఎస్ , టాటా మోటార్స్, హెచ్ డి ఎఫ్ సి సహా ఇతర కంపెనీలు గతంలో కంటే మరింత మెరుగైన రాంక్ లు పొందాయి. ఉన్న వాటిలో టాటా గ్రూప్ కంపెనీస్ కు చెందినవి మూడు కంపెనీలకు చోటు దక్కింది. వరల్డ్ వైడ్ గా చూస్తే సాంకేతికంగా సేవలు అందిస్తున్న వీసా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే కంపెనీ మూడో ప్లేస్ లో ఉండగా ఈసారి ఏకంగా ప్రథమ స్థానానికి ఎగబాకింది. మరో వైపు కిందటి ఏడాదిలో మొదట ఉన్న అమెరికాకు చెందిన వాల్ డిస్ని కంపెనీ ఏకంగా ఏడో ప్లేస్ కు పడి పోయింది. ఇక ఇండియాకు సంబంధించి ఇన్ఫోసిస్ కంపెనీతో పాటు టాటా మోటార్స్ ...

అమితాబ్ కు అరుదైన గౌరవం..అత్యున్నత పురస్కారం..!

చిత్రం
భారత దేశంలో గొప్ప నటుడిగా పేరున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించింది. సినీ ప్రస్థానంలో దీనిని గొప్పగా భావిస్తారు. అమితాబ్ బచ్చన్ ను ఏకగ్రీవంగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. నటుడిగా, ప్రయోక్తగా, గాయకుడిగా, నిర్మాతగా అమితాబ్ బచ్చన్ ఎక్కని మెట్లు లేవు. ఒకప్పుడు నటనకు పనికి రావంటూ హేళనకు, అవమానాలకు గురైన ఈ అరుదైన వ్యక్తి ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎల్లప్పటికిని గుర్తుంచుకునేలా తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు.  ఎక్కడైతే తనను వద్దన్నారో వాళ్ళే తనతో సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు. ఏ గొంతు పూర్తిగా పనికే రాదని హేళన చేసిన వాళ్ళు సిగ్గు పడేలా అదే గొంతుతో అలవోకగా, అత్యంత గాంభీర్యంతో కవితలు చదువుతూ ఉంటే కోట్లాది మంది ఫిదా అయి పోయారు. ఆయన నటించిన సినిమాలన్నీ అద్భుతమైన విజయాలు నమోదు చేసుకున్నాయి. బిగ్ బి గా పేరున్న అమితాబ్ చేయని పాత్ర అంటూ లేదు. ఏది ఇచ్చినా దానికి న్యాయం చేశారు. తాజాగా తెలుగులో చిరంజీవితో కలిసి సైరా సినిమాలో కూడా నటించారు. అమ...

ఐటీ హబ్ లో స్టార్ట్ అప్స్ హవా..!

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో ఇన్నోవేటివ్ హబ్ గా ఇప్పటికే పేరొందిన సైబరాబాద్ పలు స్టార్ట్ అప్ లకు వేదికవుతోంది. సరికొత్త ఐడియాస్ , డిఫ్ఫరెంట్ వే లో ఇప్పటికే వందలాదిగా ప్రారంభమయ్యాయి. ఇందులో ఎక్కువగా సక్సెస్ అయితే, మరికొన్ని మధ్యలో ఉన్నాయి. టెక్నాలజీ, హెల్త్, ఇన్నోవేషన్, ఈ కామర్స్, టెలికాం, డిజిటల్ టెక్నాలజీ, ట్రావెల్ టూరిజం తదితర వాటిపై అంకుర సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటు అయ్యాయి. చిన్న గదుల్లో స్టార్ట్ అయిన ఈ స్టార్ట్ అప్స్ ఇప్పుడు కొన్ని వందలాది మందికి ఉపాధి కల్పించే కంపెనీలుగా మారాయి. ఇక్కడ ఏర్పాటైన ప్రభుత్వం మరింత తోడ్పాటు అందిస్తోంది. కొత్త ఐడియాస్ ను ప్రోత్సహించేందుకు గాను ఏకంగా ఐటీ హబ్ ను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా దిగ్గజ కంపెనీల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, ట్రైనింగ్ ఇస్తోంది. మెంటార్స్, ట్రైనర్స్, వెంచర్ కేపిటల్ , ఇన్వెస్ట్ మెంట్స్ , కంపెనీస్ సపోర్ట్ అందజేసేలా నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా స్టార్ట్ అప్ ఫండ్ ను ఐటి హబ్ లో ఇటీవలే ఏర్పాటు చేసింది. కొన్ని బడా కంపెనీలు ఎదుగుతున్న అంకుర సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా...