పోస్ట్‌లు

వ్య‌వ‌సాయానికి కేంద్రం సాయం

చిత్రం
రెండు నెల‌లు గ‌డిచినా వ‌రుణ దేవుడు క‌రుణించ‌డం లేదు. ఒక్క ముంబ‌యిని మాత్ర‌మే క‌రుణించ‌గా మిగ‌తా ప్రాంతాల్లో ఒక్క నీటి చుక్క ప‌డ‌లేదు. భూముల‌ను న‌మ్ముకుని వాన‌ల కోసం ఎదురు చూస్తున్న కోట్లాది రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. క‌నీసం తాగేందుకు సైతం నీరు దొర‌క‌ని ప‌రిస్థితి దాపురించింది. ఓ వైపు ఎక్కువ శాతం నీళ్లు స‌ముద్రం పాల‌వుతున్నా వాటిని ఒడిసి ప‌ట్టుకునే సాంకేతిక నైపుణ్యాన్ని ఇన్నేళ్ల‌యినా ఏ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన పాపాన పోలేదు. చెరువులు, కుంట‌లు బోసిపోయిన‌వి. వాన‌మ్మ జాడ లేదు. గ‌త ఏడాది కొంత మేర‌కు రుతు ప‌వ‌నాలు ముందుగానే వీచినా కాస్తో కూస్తో తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఈసారి పూర్తిగా ప‌రిస్థితి అందుకు భిన్నంగా వుంది. క‌నీసం ఒక్క టీఎంసీ నీళ్లు కూడా ఆయా ప్రాజెక్టుల్లోకి రాలేదు. ఇక సాగు మాట దేవుడెరుగు..తాగేందుకు ఎట్లా అన్న‌ది జ‌నాన్ని తొలుస్తున్న‌ది. రోజు రోజుకు జ‌నాభా పెరుగుతూ పోతుండ‌గా దానిని కంట్రోల్ చేయ‌లేక ప్రభుత్వం నానా తంటాలు ప‌డుతున్న‌ది. అక్క‌డ‌క్క‌డ చెదురు మ‌దురుగా కురిసిన తొల‌క‌రి వ‌ర్షాల‌కు రైతులు గ‌త్యంత‌రం లేక పొలాల‌ను దుక్కి దున్ని చ‌దును చేసి ప...

కాంగ్రెస్‌కు కాయ‌క‌ల్ప చికిత్స - ప్ర‌త్యక్ష పోరుకు రాహుల్ సిద్ధం

చిత్రం
ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా రాహుల్ గాంధీ త‌న‌ను తాను మ‌లుచుకున్నారు. హుందాగా పార్టీలో ఏం జ‌రుగుతుందో పూస‌గుచ్చిన‌ట్టు చెప్పారు. వ‌య‌సు మ‌ళ్లిన వారు ప‌ద‌వుల‌ను, అధికారాన్ని అంటిపెట్టుకుని వుంటే పార్టీ మ‌నుగడ ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని రాహుల్‌జీ ప్ర‌శ్నించారు. దేశాన్ని సంస్క‌రించ‌డం కంటే పార్టీని ప్ర‌క్షాళ‌న చేయ‌డ‌మే ముఖ్య‌మని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీనే పార్టీకి అధ్య‌క్షుడిగా వుండాల‌ని ఒత్తిళ్లు పెరిగినా ఆయ‌న స‌సేమిరా ఒప్పుకోలేదు. కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఘ‌న‌మైన పార్టీ కేడ‌ర్ క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ఎందుకు ప‌వ‌ర్‌లోకి రాలేక పోయామ‌ని , ప్ర‌తి ఒక్క‌రు పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు. పార్టీ అంటే స‌మూహం, ఏ ఒక్క‌రితోనో అది న‌డ‌వ‌దు. వంద‌లాది చేతులు క‌లిస్తేనే అనుకున్న‌ది సాధించ‌గ‌లం. పార్టీని న‌డిపించ‌డం కంటే ముందు మ‌నం ఎక్క‌డ దారి త‌ప్పామో స‌మీక్షించు కోవాలి. అందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా అనేది ఆలోచించు కోవాలి. పొద్ద‌స్త‌మానం ప్ర‌తిప‌క్షాల‌నో లేక వ్య‌క్తుల‌నో టార్గెట్ చేస్తూ కాలం గ‌డ‌ప‌డం మ‌న‌కు అలవాటుగా మారి పోయింది. అధికారంలో ఉన్న పార్టీ...

ఇండియ‌న్ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా - టీవీల అమ్మ‌కాల్లో కోట్ల ఆదాయం

చిత్రం
భార‌తీయ మార్కెట్ ను చైనా ఉత్ప‌త్తులు శాసిస్తున్నాయి. ఇంట్లో వాడే ప్ర‌తి వ‌స్తువుల‌న్నీ ఇపుడు చైనాలో త‌యారైన‌వే కావ‌డం విశేషం. అవ‌న్నీ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుండ‌డంతో భార‌తీయులు ఎగ‌బ‌డి కొనుగోలు చేస్తున్నారు. అటు ఆన్ లైన్‌లో ఇటు ఆఫ్ లైన్‌లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా కొంటున్నారు. ఈ ఏడాదిలో 7 వేల 224 కోట్ల విలువ చేసే టెలివిజ‌న్ల‌ను ఇండియ‌న్స్ కొనుగోలు చేశారు. ఇందులో స‌గానికి పైగా చైనా నుంచి త‌యారై, దిగుమ‌తి చేసుకున్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు స్మార్ట్ ఫోన్లు ఇంకో వైపు టీవీలు లేకుండా ఉండ‌లేని ప‌రిస్థితికి వ‌చ్చారు ఇండియ‌న్స్. ఆధునిక ప్ర‌ప‌చంలో టీవీ లేని ఇల్లు ఉండ‌దంటే న‌మ్మ‌లేం. కేబుల్ ఆప‌రేట‌ర్లు వ‌చ్చాక టీవీలు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యాయి. ఈ మేర‌కు 2018-2019 ఆర్థిక సంవ‌త్స‌రంలో 7 వేల 224 కోట్ల విలువైన టెలివిజ‌న్ల‌ను భార‌త్ దిగుమ‌తి చేసుకుంద‌ని ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాల్లో వెల్ల‌డైంది. ఇంకా లెక్క‌కు రాని టీవీ సెట్లు ఎన్నో. ముఖ్యంగా దిగుమ‌తి చేసుకున్న వాటిలో చైనాలో త‌యారై మ‌న దేశానికి వ‌చ్చిన ఉత్ప‌త్తుల్లో టీవీలు టాప్. దిగుమ‌తుల్లో స‌గానికి పైగా చైనా నుంచి తీసుకున్న‌వే . 3 వేల 807 కోట్...

రాయుడు రిటైర్మెంట్ ..అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై

చిత్రం
క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు క్రికెట్ జ‌ట్టుకు అడ్డు గోడ‌లా నిలిచి ..ఒడ్డుకు చేర్చే అరుదైన ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న తెలుగు వాడైన అంబ‌టి రాయుడు అనూహ్యంగా , ప్ర‌పంచ క‌ప్ టోర్నీ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇక నేనాడ‌లేనంటూ రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో త‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌క పోవ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో అన్ని ఫార్మాట్‌ల నుండి వైదొలుగుతున్న‌ట్లు తెలిపారు. మ్యాచ్ లు జ‌రిగేట‌ప్పుటు ఏ జ‌ట్టుకైనా కీల‌కం నాలుగో స్థానానిదే. ఆ ప్లేస్‌లో వ‌చ్చే ఆట‌గాళ్లు కీల‌క‌మైన క్రికెట‌ర్స్‌గా పేర్కొంటారు. జ‌ట్టును ఆదుకోవాల‌న్నా, నిల‌దొక్కుకునేలా చేయాల‌న్నా, స్కోరును నెమ్మ‌దిగా ప‌రుగులు పెట్టించాల‌న్నా ఈ ప్లేస్‌లో వ‌చ్చే ఆట‌గాళ్లే కీల‌కంగా ఉంటారు. అదే స్థానంలో గ‌త కొన్నేళ్లుగా అంబ‌టి ఆడుతూ వ‌స్తున్నారు. గ‌త ప‌దేళ్ల‌లో యువ‌రాజ్ సింగ్, సురేష్ రైనాలు ఇదే ప్లేస్‌లో ఆడుతూ టీమిండియాకు గెలుపుల్లో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చారు. వీరిద్ద‌రూ దూర‌మ‌య్యాక వారి స్థానంలో ఎంత మంది ఆట‌గాళ్లు వ‌చ్చినా నిల‌దొక్కుకోలేక పోయా...

దివికేగిన కార్పొరేట్ దిగ్గ‌జం - బికె బిర్లా క‌న్నుమూత

చిత్రం
భార‌తీయ పారిశ్రామిక రంగంలో త‌న‌కంటూ ఓ బ్రాండ్‌ను, ఇమేజ్‌ను స్వంతం చేసుకున్న బిర్లా సంస్థ‌ల అధినేత‌, ఛైర్మ‌న్ బి.కె. బిర్లా ఇక సెల‌వంటూ వెళ్లి పోయారు. పారిశ్రామిక ప‌రంగా, వ్యాపార వేత్త‌గా, విద్య ప‌ట్ల అచంచ‌ల‌మైన ప్రేమ క‌లిగిన విద్యా వేత్త‌గా , దాత‌గా బిర్లా క‌ల‌కాలం గుర్తుండి పోతారు. ఆయ‌న మ‌ర‌ణం దేశానికి, ప్ర‌పంచ పారిశ్రామిక రంగానికి తీర‌ని లోటుగా భావించాలి. దేశ వ్యాప్తంగా బిర్లా పేరుతో ఎన్నో ఆల‌యాల‌ను నిర్మించారు. మ‌రికొన్నింటిని పున‌రుద్ధ‌రించారు. ప్ర‌పంచంలోనే అత్యం గొప్ప‌నైన క‌ళాశాల‌ల‌ను, నాణ్య‌మైన విద్య‌ను, దేశానికి కావాల్సిన అద్భుత‌మైన వ్య‌క్తుల‌ను త‌యారు చేసిన వ్య‌క్తిగా బిర్లా చిరస్మ‌ర‌ణీయుడు. ఇండియాలో పేరెన్నిక‌గ‌న్న విద్యా సంస్థ‌ల్లో ఒక‌టిగా ఆయ‌న స్థాపించిన బిట్స్ పిలానీ ఒక‌టి. ఇండియా అంటేనే మొద‌ట జ్ఞాప‌కానికి వ‌చ్చేది టాటాలు, బిర్లాలే. బిర్లా పూర్తి పేరు బ‌సంత్ కుమార్ బిర్లా. 98 ఏళ్ల వ‌య‌సులో ముంబ‌యిలో క‌న్ను మూశారు. దేశ వ్యాప్తంగా 25 విద్యా సంస్థ‌లు, ఎన్నో కంపెనీల‌ను , దాతృత్వ సంస్థ‌ల‌ను బిర్లా ఏర్పాటు చేశారు. కుటుంబీకుల‌ను శోక సంద్రంలో ముంచెత్తారు. కోల్‌క‌తాలోని...

ఇక సెల‌వు..ప‌ద‌వికి బైబై..రాహుల్ రాం రాం..!

చిత్రం
ఇండియాలో రాజ‌కీయం అంటే ర‌ణరంగాన్ని త‌ల‌పింప చేస్తోంది. ఎత్తుల‌కు పై ఎత్తులు వేయాలి. ప్ర‌త్య‌ర్థుల క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టికప్పుడు ప‌సిగ‌డుతూ వుండాలి. వీలైతే వారిని డీమోర‌లైజ్ చేసేందుకు కుట్ర‌లు ప‌న్నాలి. వీలైతే తిమ్మిని బొమ్మి చేయాలి. డ‌బ్బులు వెద‌జ‌ల్లాలి. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ప్ర‌చారం చేస్తూనే ఉండాలి. అంతే కాకుండా మీడియా మేనేజ్‌మెంట్ లో ఆరితేరి ఉండాలి. సెల‌బ్రెటీలు, మోస్ట్ పాపుల‌ర్ పర్సనాలిటీస్ తో పాటు బిజినెస్ టైకూన్స్, కార్పొరేట్ కంపెనీల స‌పోర్ట్ తీసుకోవాలి. వీలైతే అవ‌తలి పార్టీల నేత‌ల‌కు గాలం వేయాలి, కోట్లు కుమ్మ‌రించాలి. ఎవ‌రికీ తెలియ‌కుండా గ‌ల్లీ స్థాయి నుండి ఢిల్లీ దాకా ఎవ‌రికీ తెలియ‌కుండా డ‌బ్బులు చేర‌వేయ‌గ‌ల‌గాలి. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై నిత్యం విషం క‌క్కుతూనే వుండాలి. చివ‌ర‌కు జ‌నాన్ని ప్ర‌భావితం చేసేందుకు మ‌ద్యాన్ని విచ్చ‌ల‌విడిగా స‌ర‌ఫ‌రా చేయాలి. ఇన్ని చేస్తే గెలుపు ద‌క్కుతుందా అంటే అదీ లేదు. అనుమానం క‌లిగితే పోలింగ్ స‌ర‌ళిని మార్చేసే సాంకేతిక నైపుణ్యాన్ని మేనేజ్ చేయ‌గ‌లగాలి. ఇవ‌న్నీ చేయ‌గ‌లిగే పార్టీలే ఇపుడు భార‌త‌దేశంలో ప‌వ‌ర్‌లో కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల అధిక...

బాలీవుడ్‌లో టాప్ 5 సినిమాలు ఇవే..!

చిత్రం
సినిమా ఇండ‌స్ట్రీ అనే స‌రిక‌ల్లా ఇండియాలో ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది బాలీవుడ్ త‌ర్వాతే ఏదైనా . ఇప్ప‌టి దాకా వేలాది సినిమాలు విడుద‌ల‌వుతూనే ఉన్నాయి. కొన్ని సాధార‌ణ స‌క్సెస్ అవుతే, మ‌రికొన్ని బాక్సాఫీస్‌లు బ‌ద్ద‌లు కొట్టాయి. కొన్ని మూవీస్ రికార్డులు బ్రేక్‌లు చేస్తే..మ‌రికొన్ని కోట్లాది రూపాయ‌లు కొల్ల‌గొట్టాయి. ఇంకొన్ని అయితే డాల‌ర్లు కొల్ల‌గొడుతున్నాయి. ఎన్ని సినిమాలు వ‌చ్చినా..వ‌స్తూనే వున్నా ..కొన్ని మాత్రం ఎల్ల‌కాలం పాటు అలాగే వుంటాయి. మ‌న గుండెల్ని త‌డుముతూనే ఉంటాయి. అలాంటి వాటిలో జ‌నాన్ని స‌మ్మోహితుల‌ను చేసి..థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించిన సినిమాలు వంద‌లోపు వుండొచ్చ‌ని సినీ వ‌ర్గాల అంచ‌నా. ఇండియా సినిమా ఇండ‌స్ట్రీ పై ఆధార‌ప‌డిన వాళ్లు ల‌క్ష‌లాది మంది ఉన్నారు. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా దీనినే న‌మ్ముకుని బ‌తుకులు పారేసుకున్న వాళ్లు కూడా ఎంద‌రో. వీరు లెక్క‌ల్లోకి రారు. వారి చిరునామాలు మ‌న‌కు దొర‌క‌వు. సినిమా అన్న‌ది ఓ ఆల్కెమీ అంటాడు మిత్రుడు, ర‌చ‌యిత సిద్దారెడ్డి. నిజ‌మేగా త‌ను చెప్పింది. సినిమా తీయాలంటే ఒక‌ప్పుడు సుల‌భంగా వుండేది. టెక్నాల‌జీ పెరిగింది. మార్కెట్ శ...