పోస్ట్‌లు

జ‌య‌హో జ‌స్‌ప్రీత్..జాక్ పాట్ కొట్టేసిన దృవ‌..!

చిత్రం
ఎంత పెద్ద కంపెనీ అయినా, అది ఏ రంగానికి చెందిన‌దైనా స‌రే టెక్నాల‌జీ మీద ఆధార ప‌డాల్సిందే. లేక‌పోతే ఇత‌ర దిగ్గ‌జ కంపెనీల‌కు పోటీ ఇవ్వ‌కుండానే వెన‌క్కి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే దిగ్గ‌జ కంపెనీల‌న్నీ డేటా, సెక్యూరిటీ , ఆటోమెషీన్, మిష‌న్ లెర్నింగ్, త‌దిత‌ర ఫ్లాట్‌ఫాంల‌పై ఆధార‌ప‌డుతున్నాయి. ఇందు కోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చిస్తున్నాయి. ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రుస్తూ, ఆదాయంలో దూసుకెళుతున్న ఐటీ కంపెనీల‌కు ఇండియాకు చెందిన జ‌స్‌ప్రీత్ సింగ్ రూపొందించిన దృవ ఐటీ సొల్యూష‌న్స్ టాప్ వ‌న్‌లో నిలుస్తోంది. అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీకి దృవ సాంకేతిక స‌హ‌కారం అందిస్తోంది. ఆల్ ఇన్ వ‌న్ బ్యాక‌ప్, డిసాస్ట‌ర్ రిక‌వ‌రీ, ఆర్కైవ‌ల్ అండ్ అన‌లిటిక్స్ సొల్యూష‌న్స్ అన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో సేవ‌లు పొందేలా రూపొందించాడు సింగ్. ఊహించ‌ని రీతిలో దృవ సొల్యూష‌న్స్ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్ల‌డంతో అన్ని కంపెనీస్ బిగ్ ఆఫ‌ర్స్ ప్ర‌క‌టిస్తున్నాయి. వికింగ్ కంపెనీ ఏకంగా దృవ‌లో 130 మిలియ‌న్లు పెట్టుబ‌డి పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేర‌కు ఎంఓయు కూడా చేసుకుంది. టోట‌ల్ కేపిట‌ల్ ప‌రంగా చూస్తే దృవ 328 మిలియ‌న్ల‌కు చేరుకుంది. సాస్...

నెల‌స‌రిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న క‌మ‌ల్ నాయ‌క్..!

చిత్రం
ప్ర‌తి నెల నెలా వ‌చ్చే నెల‌స‌రి గురించి మాట్లాడాలంటే ఒక‌ప్పుడు జంకేవారు. ఊర్ల‌ల్లో పెద్ద‌వారి ఇండ్ల‌ల్లో యువ‌తుల‌ను, మ‌హిళ‌ల‌ను ఇళ్ల‌ల్లోకి రానిచ్చే వారు కాదు. ఆ నాలుగు రోజులు బ‌య‌టే ఉండాల్సిందే. క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌లు. కాలం మారడం, ప్ర‌పంచం కొత్త దారుల‌ను వెతుక్కోవ‌డంతో మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ ల‌భించింది. ఎక్కువ‌గా యుక్త వ‌య‌సులోకి వ‌చ్చే బాలిక‌ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంటోంది. ముఖ్యంగా పేద దేశాల్లో. స‌రైన స‌మ‌యంలో ఆహారం అంద‌క పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణం కూడా. ఎవ‌రైనా ఎప్పుడైనా అనారోగ్యంతో చికిత్స కోసం వెళితే..మొద‌ట‌గా అడిగేది మీకు మెన్సెస్ స‌రిగా వ‌స్తున్నాయా లేదా అని వాక‌బు చేస్తారు.  ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో, జీవ‌న విధానంలో పున‌రుత్ప‌త్తికి ప్ర‌ధాన కేంద్రం ఇదే. బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌లు యుక్త వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నెల‌స‌రి ఆగి పోయే దాకా నానా ర‌కాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇండ్ల‌ల్లో ప‌నులు, వంట చేయ‌డం ద‌గ్గ‌రి నుంచి ..ఉద‌యం నుంచి రాత్రి ప‌డుకునేంత దాకా నానా ర‌కాలుగా గొడ్డు చాకిరి చేస్తూనే ఉంటారు. మ‌ళ్లీ ఉద్యోగాల‌కు వెళ్ల‌డం కూడా. దీంతో వారు శారీర‌కంగా , మ...

డాల‌ర్లు కురిపిస్తున్న దోశె - కంద‌స్వామినా మ‌జాకా

చిత్రం
ప్ర‌పంచం మారిపోతోంది బాస్. కాస్తంత డిఫ‌రెంట్ గా ఆలోచించి..దాన్ని వ‌ర్క‌వుట్ చేసేలా క‌ష్ట‌ప‌డితే చాలు కోట్లు వెన‌కేసు కోవ‌చ్చు. కావాల్సింద‌ల్లా ప‌ట్టుద‌ల‌. మొహ‌మాటానికి చెక్ పెట్టేయాలి. త‌మ మీద త‌మ‌కు న‌మ్మ‌కం ఉండాలి. అంతేనా ఏ ప‌నైనా కానీ, కానీ అది మ‌రింత రుచిక‌రంగా, అద్భుతంగా మ‌ళ్లీ మ‌ళ్లీ తిరిగి వ‌చ్చేలా ఫుడ్ ఐట‌మ్స్ ను త‌యారు చేయ‌గ‌లిగితే ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లో మార్కెట్ దుమ్ము రేప‌వ‌చ్చు. ఇపుడు ఫుడ్ ఇండ‌స్ట్రీ డాల‌ర్ల‌ను డామినేట్ చేస్తోందంటే న‌మ్మ‌గ‌ల‌మా. ఇది ముమ్మాటికి నిజం. ఇండియ‌న్స్ క‌రెన్సీ కంటే ఆక‌లిని తీర్చుకునేందుకు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తారు. జ‌నం అవ‌స‌రాలే హోట‌ల్ , రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు జీవం పోశాయి. ఇపుడు దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ఇవి ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇక సంత‌లు, జాత‌ర్ల‌లో , ఇత‌ర ఫంక్ష‌న్ల‌లో కేట‌రింగ్‌లు, హోట‌ళ్లు, చిన్న కొట్ల గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఇక ఇండియ‌న్స్, ప్ర‌వాస భార‌తీయుల వంట‌కాల్లో మొద‌టి ప్రాధాన్య‌త‌, ఛాయిస్ ఏమిటంటే దోశె. అందుకే చెన్నైకి చెందిన ప్రేమ్ గ‌ణ‌ప‌తి త‌క్కువ పెట్టుబ‌డితో కోట్లాది రూపాయ‌లు సంపాదించాడు. చ‌రిత్...

ఏపీలో కొలువుల పండ‌గ‌..దూకుడు పెంచిన జ‌గ‌న్

చిత్రం
రాజ్యం త‌ల్చుకుంటే, ప‌రిపాల‌నాధిప‌తి అనుకుంటే ఏదైనా చేయొచ్చ‌ని పాల‌నా ప‌రంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు , ప‌థ‌కాలు అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని నిరూపిస్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రెండ‌వ ముఖ్య‌మంత్రిగా తాజాగా ప్ర‌మాణ స్వీకారం చేసిన యువ నాయ‌కుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. తాను ఎన్నిక‌ల ప్ర‌చారంలో , పాద‌యాత్ర నిర్వ‌హించిన స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు కొలువుల పండుగ‌కు తెర తీశారు. స‌మాజ సేవ‌లో ఉద్యోగులు కీల‌క భూమిక పోషిస్తార‌ని వారు బాగుంటే మ‌రింత బాధ్య‌తాయుతంగా ప‌నిచేస్తార‌ని సీఎం న‌మ్మారు. అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారికి ఆమోద‌యోగ్యంగా వుండేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇది ఓ ర‌కంగా మిగ‌తా రాష్ట్రాల‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే. నీళ్లు, నిధులు, నియామ‌కాలు పేరుతో సుదీర్ఘ‌మైన పోరాటాన్ని నిర్వ‌హించి చ‌రిత్ర సృష్టించి..తిరిగి రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ ఎస్ ఇపుడు నీళ్ల జ‌పం చేస్తోంది. సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తోంది. కానీ ఉద్య‌మ కాలంలో అన్నింటిని వ‌దిలేసి త‌మ బ‌తుకులు బాగు ప‌డ‌త‌య‌ని, త‌మ కుటుంబాలు చ‌ల్లంగ ఉంటాయ‌ని ఆశించిన ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యా...

టీటీడీ ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డి

చిత్రం
ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయంతో పాటు కోట్లాది మంది భ‌క్తులు క‌లిగిన ఏకైక దైవం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఛైర్మ‌న్‌గా మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని గ‌రుడాళ్వారు స‌న్నిధిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ ..వై.వితో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, శాస‌న‌మండ‌లి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, ఎమ్మెల్యేలు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, శ్రీ‌కాంత్ రెడ్డి, ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజు, పాల‌క‌మండ‌లి మాజీ స‌భ్యుడు రౌతు సూర్య ప్ర‌కాశ్ రావు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్ర‌జ‌లకు ఇబ్బందులు లేకుండా చేయ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని, ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా చేస్తాన‌ని చెప్పారు. కాగా టీటీడీ ఛైర్మ‌న్‌గా ఆయ‌న‌కు ముందు నుంచే ప‌ద‌వి ల‌భిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తార‌ని అనుకున్నారు. త‌ర్వాత ఫైర్ బ్రాండ్ నేత రోజా పేరు కూడా విని...

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన బిర్యానీ బై కిలో - 15 వేల కోట్ల బిర్యానీ వ్యాపారం

చిత్రం
ఫుడ్ ప‌రంగా బిర్యానికి ఉన్నంత క్రేజ్ ఇంకే ఫుడ్ ఐటంకు లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇండియాలో స్టార్ట‌ప్‌ల హ‌వా కొన‌సాగుతోంది. ఓ వైపు కేంద్రం ఇంకో వైపు రాష్ట్రాలు, బ్యాంకులు, వివిధ కంపెనీలు అంకుర సంస్థ‌ల‌కు చేయూత‌నిస్తూ ప్రోత్స‌హిస్తున్నాయి. స్టార్టింగ్‌లో ఉన్నా స‌రే వారి ఐడియాలు వ‌ర్క‌వుట్ అయ్యేలా అన్ని వ‌స‌తుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. హైద‌రాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వ‌చ్చే ట్రావెల‌ర్స్ ఫ‌స్ట్ ప్ర‌యారిటీ బిర్యానీనే ఉంటోంది. హైద‌రాబాద్ అంటేనే బిర్యానీ ..బిర్యానీ అంటేనే ఈ సిటీనే. బిర్యాని తినాలంటే మ‌రింత రుచి క‌రంగా ఉండాలంటే బిర్యానీ రైస్ డిఫ‌రెంట్ మోడ్‌లో త‌యారు చేస్తున్నారు. ఈ రైస్‌కు హ‌య్య‌స్ట్ రేట్స్ పెట్టి కొంటున్నారు. ఇదే ఫార్మాట్‌లో ఫుడ్ రంగంలో బిర్యానీ బై కిలో స్టార్ట‌ప్ రుయ్ మంటూ దూసుకెళుతోంది. ఐవీ క్యాప్ వెంఛ‌ర్స్ సంస్థ ఏకంగా ఈ స్టార్ట‌ప్‌లో 30 కోట్ల ఫండింగ్ స‌మ‌కూర్చింది. సంప్ర‌దాయ ద‌మ్ బిర్యానీ మ‌రింత రుచిక‌రంగా ఉంటోంది. ఫ్రెష్ బిర్యానీని త‌యారు చేసింది మాత్రం కౌషిక్ రాయ్‌, విషాల్ జిందాల్, రితేష్ సిన్హా లు క‌లిసి 201...

ఆన్‌లైన్ పేమెంట్స్‌ల‌లో గూగుల్ పే నెంబ‌ర్ వ‌న్

చిత్రం
టెక్నాల‌జీ మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూనే వున్న‌ది. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థకు మ‌రింత బ‌లాన్ని ఇస్తోంది. ప‌నితీరు మెరుగు ప‌డేందుకు, ఎక్కువ సిబ్బంది, ఉద్యోగులు లేకుండా చేసేందుకు సాంకేతిక‌త ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీతో అనుసంధానం అవుతున్నారు. కంపెనీలు, వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు, వ్యాపారులు, టెలికాం కంపెనీల‌న్నీ ఐటీ మీదే ఆధార‌ప‌డ్డాయి. తాజాగా డిజిట‌ల్ టెక్నాల‌జీ భారీగా విస్త‌రించింది. టెలికాం రంగంలో ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంది. ఇండియాలో , ఏసియా ఖండంలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియో 5 కోట్ల‌కు పైగా స‌బ్ స్క్రైబ‌ర్స్‌తో రికార్డు బ్రేక్ చేసింది. ఎక్క‌డికి వెళ్లినా త‌మ నెట్ వ‌ర్క్ ఉండేలా ఫైబ‌ర్ సిస్టంను ఏర్పాటు చేసింది ఈ కంపెనీ. మిగ‌తా టెలికాం కంపెనీల‌కు చుక్క‌లు చూపిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు క‌ల‌గ‌డంతో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కంపెనీలు యాప్స్‌ను త‌యారు చేశాయి. వీటిలో పే టిఎం ఇండియాలో ప్ర‌తి ఒక్క‌రికి ఎరుకే. ఆ త‌ర్వాత ఫోన్ పే వ‌చ్చింది. గూగుల్ పే యాప్ కు ఎ...