పోస్ట్‌లు

ఐటీ కంపెనీల్లో నీటికి క‌ష్ట‌కాలం - సిబ్బందికి త‌క్కువ తాగండ‌ని ఆదేశం

చిత్రం
దేశ వ్యాప్తంగా వాన‌ల కాలం ఇంకా ప్రారంభం కాక పోవ‌డంతో తాగేందుకు నీళ్లంద‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా చెన్నైని ఈ నీటి కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. ల‌క్ష‌లాది మంది ఈ న‌గ‌రంలో జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. ఐటీ రంగానికి వ‌స్తే వంద‌లాది ఐటీ కంపెనీలు చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్, ముంబై, ఢిల్లీ న‌గ‌రాల‌లో కొలువు తీరాయి. తాజాగా చెన్నై విష‌యానికి వ‌స్తే, వేలాది మంది ఆయా ఐటీ కంపెనీల్లో ప‌ని చేస్తున్నారు. వీరంద‌రికి ఉచితంగా కంపెనీలు సేవ‌లందిస్తున్నాయి. నీళ్ల‌తో పాటు ఫుడ్, టిఫిన్స్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అందిస్తున్నాయి. తాజాగా వ‌ర్షాలు కురియ‌క పోవ‌డంతో భూగ‌ర్భ జ‌లాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. దీంతో నీటి కొర‌త‌ను అధిగమించేందుకు ఏలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో తెలియ‌క యాజ‌మాన్యాలు ఆలోచన‌లో ప‌డ్డాయి. మిగ‌తా న‌గ‌రాల్లో కొంత నీరు లభిస్తున్న‌ప్ప‌టికీ చెన్నైలో మాత్రం రోజు రోజుకు నీటి కొర‌త మ‌రింత తీవ్ర‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా న‌గ‌రంలోని చాలా హోట‌ళ్ల‌లో నీళ్లు లేవంటూ బోర్డులు త‌గిలించారు. ఎంతైనా తినండి కానీ నీళ్లు మాత్రం అడ‌గొద్దంటూ వేడుకుంటున్నారు. ఇంత‌టి నీటి తీవ్ర క...

రిల‌య‌న్స్ సాయం - జియో మ‌రింత బ‌లం..!

చిత్రం
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా టెలికాం రంగాన్ని త‌న‌దైన ప‌నితీరుతో షేక్ చేస్తున్న జియో కంపెనీని మ‌రింత విస్త‌రించేందుకు, ఇత‌ర ఏ టెలికాం రంగ కంపెనీ సైతం ద‌రి దాపుల్లో రాకుండా వుండేందుకు రిల‌య‌న్స్ న‌డుం బిగించింది. ఈ మేర‌కు భారీగా పెట్టుబ‌డి పెట్టేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ల‌క్ష‌ల‌ను దాటి కోట్లకు చేరుకుంది ..జియో క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌. ఇపుడు ఈ కంపెనీ క‌న్ను ప్ర‌త్యేకంగా ఈ కామ‌ర్స్, బ్రాడ్ బాండ్, 5జీ స‌ర్వీసులపై ప‌డింది. వీటిలో కూడా సంచ‌నాల‌కు తెర లేపుతూ ..ఇండియ‌న్, వ‌ర‌ల్డ్ మార్కెట్‌ల‌లోకి ప్ర‌వేశించేందుకు పావులు క‌దుపుతోంది. ఇంత పెద్ద ఎత్తున విస్త‌రించాలంటే భారీగా పెట్టుబ‌డి కావాల్సి వ‌స్తుంది. రిల‌య‌న్స్ జియో కంపెనీకి దాని పేరెంట్ కంపెనీగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ కొన్నేళ్లుగా కొన‌సాగుతోంది. భారీగా విస్త‌రించేందుకు హెవీ ఇన్వెస్ట్‌మెంట్ అవ‌స‌రం ప‌డుతుంది. రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ లోకి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీ 20 వేల కోట్ల‌కు పైగా క్యాపిట‌ల్‌ను పెట్టుబ‌డి రూపంలో పెట్ట‌బోతోంద‌ని సం...

వారంలో ఒక రోజు - పోలీసుల్లో ఆనందం ..కుటుంబాల్లో సంతోషం

చిత్రం
వాళ్లు మ‌న‌లాంటి మ‌నుషులే. మ‌న‌మంతా ఇలా ఆనందంగా ఉన్నామంటే వారందిస్తున్న సేవ‌లే. ర‌క్ష‌ణ విభాగంలో కీల‌క భూమిక పోషిస్తూ రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్య‌త‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న అటెండ‌ర్ నుంచి ఐఏఎస్ ఆఫీస‌ర్ల దాకా ప్ర‌తి ఒక్క‌రికి 8 గంట‌ల ప‌ని, వారంలో ఒక రోజు వారాంత‌పు సెల‌వు తీసుకుంటున్నారు. ద‌ర్జాగా కుటుంబాల‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎప్ప‌టి నుంచో ఆయా ఎన్నిక‌ల సంద‌ర్భంగా అన్ని పార్టీల నేత‌లు పోలీసుల‌కు వీక్లీ ఆఫ్ అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ నేటి దాకా అమ‌లు కాలేదు. రాజు త‌లుచుకుంటే ఏదైనా చేయ‌వ‌చ్చ‌ని ఏపీ సీఎంగా ఎన్నికైన వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిరూపించారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో భాగంగా ప్ర‌క‌టించిన విధంగానే త‌క్ష‌ణ‌మే పోలీసు శాఖ‌లో ప్ర‌తి ఒక్క‌రికి వీక్లీ ఆఫ్ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. పోలీసులు సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపార...

కెప్టెన్సీకి రాహుల్ రాం రాం - కొలిక్కి రాని కొత్త సార‌థి

చిత్రం
సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ ఎన్న‌డూ లేనంత‌టి సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించిన పార్టీకి పేరున్నా ప్ర‌స్తుతం జ‌వ‌స‌త్వాలు కోల్పోయి చ‌తికిల‌ప‌డింది. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా బ‌ల‌మైన క్యాడ‌ర్ క‌లిగిన పార్టీ ఇపుడు ర‌థ‌సార‌థి కోసం వెతుకుతోంది. నిన్న‌టి దాకా పార్టీ బాధ్య‌త‌లు తీసుకున్న రాహుల్ గాంధీ దేశ్ కీ నేత అంటూ క్యాడ‌ర్ ప్ర‌చారం చేసింది. రెండు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాలేక పోయారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాను కూడా అందించ‌లేక పోయారు. దీంతో పార్టీ ఓట‌మికి ..భారీ ప‌రాజ‌యానికి పూర్తి బాధ్య‌త వ‌హిస్తూ తాను కాంగ్రెస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఇప్ప‌టికే దేశ ప్ర‌జ‌ల సాక్షిగా ప్ర‌క‌టించారు. రాహుల్ నిర్ణ‌యాన్ని పార్టీకి చెందిన సీనియ‌ర్ లీడ‌ర్ల‌తో పాటు తల్లి సోనియాగాంధీ, చెల్లెలు ప్రియాంక గాంధీలు ఎంత‌గా న‌చ్చ చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని మార్చు కోలేదు. త‌మ కుటుంబం నుంచి కాకుండా వేరే ఎవ్వ‌రికైనా పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించండంటూ లేఖ...

క‌విత్వంతో ఐపీఎస్ క‌ర‌చాల‌నం

చిత్రం
ఓ వైపు ఐపీఎస్‌గా స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే మ‌రో వైపు సామాజిక బాధ్య‌త‌గా క‌విత్వంతో క‌ర‌చాల‌నం చేస్తోంది చంద‌నా దీప్తి. జీవితాన్ని ఆవిష్క‌రించే సాధ‌నాల్లో పోయెట్రి ఒక‌టి. సానుకూల దృక్ఫ‌థంతో ఆలోచిస్తే స‌మ‌స్య‌లు చిన్న‌విగా క‌నిపిస్తాయ‌ని , చూసే దృష్టిని బ‌ట్టి లైఫ్ వుంటుంద‌ని ఆమె న‌మ్ముతారు. ఆ దిశ‌గా ఆమె అడుగులు వేస్తున్నారు. క‌విత్వం రాయ‌డంతో పాటు వివిధ అంశాల‌పై ర‌చ‌న‌లు కూడా చేస్తున్నారు. పోలీసు శాఖ అంటేనే చాలా మంది ఇబ్బందిక‌రంగా భావిస్తారు. ప్ర‌స్తుతం చంద‌నా దీప్తి ఎస్పీగా మెద‌క్ జిల్లా బాధ్య‌త‌లు చూస్తున్నారు. జిల్లా వాసులకు బాస‌ట‌గా నిలుస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స్ఫూర్తి దాయ‌కంగా ఉండేలా ర‌చ‌న‌లు చేస్తూ చైత‌న్య‌వంతం చేస్తున్నారు. చంద‌నా దీప్తి ముందు నుంచి మెరిట్ స్టూడెంట్. ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఢిల్లీలో సిఎస్ఇ కోర్సు చేశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీస‌ర్‌గా ఎంపిక‌య్యారు. దీప్తి స్వంత ఊరు తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వ్య‌క్తి. హైద‌రాబాద్‌లో ఉంటూ క‌ష్ట‌ప‌డి చ‌దివారు. బెస్ట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. వివిధ సామా...

కేసీఆర్ భగీర‌థ ప్ర‌య‌త్నం - కాళేశ్వ‌రం క‌ళ్ల‌ముందు సాకారం

చిత్రం
అప‌ర మేధావిగా, దార్శ‌నికుడిగా, ముందు చూపు క‌లిగిన నాయ‌కుడిగా పేరుగాంచిన తెలంగాణ ష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రో చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు. అసాధ్యమ‌నుకున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టును సుసాధ్యం చేసి త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించుకున్నారు. కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో అతి త‌క్కువ టైంలో ప్ర‌పంచంలోనే అతి పెద్ద వంతెన నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. ఇది తెలంగాణ సాధించిన ఘ‌న‌త‌. కోట్లాది ప్ర‌జ‌ల ఆశ‌లు సాకారం అయ్యేలా చేసిన వైనం భావి త‌రాల‌కు పాఠంగా నిలువ బోతున్న‌ది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనిని మంత్రి ఈటెల ప‌ర్య‌వేక్షించారు. రేయింబ‌వ‌ళ్లు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు క‌ష్ట‌ప‌డ్డారు. ఈ ప్రాజెక్టుకు కొండ గుర్తుగా సీఎం విగ్ర‌హాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేశారు. ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌కమైన కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 3 ప్ర‌ధాన రిజ‌ర్వాయ‌ర్లు, 16 రిజ‌ర్వాయ‌ర్లు, 20 లిఫ్టులు అంటే ఎత్తిపోత‌లు, 203 కిలోమీట‌ర్ల మేర సొరంగ మార్గం, 1521 కిలోమీట‌ర్ల పొడ‌వునా కాల్వ‌లు నిర్మించారు. 37 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరు అందించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. మ...

చంద్ర‌బాబుకు క‌టీఫ్..క‌మ‌లంతో దోస్తానా

చిత్రం
సుదీర్ఘ‌మైన చ‌రిత్ర క‌లిగిన ప్రాంతీయ పార్టీగా పేరు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ సంక‌ట స్థితిని ఎదుర్కొంటున్న‌ది.ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అటు అసెంబ్లీలోను ఇటు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అతి త‌క్కువ సీట్ల‌ను చేజిక్కించుకుంది. ఊహించ‌ని రీతిలో ఓట‌మిని చ‌వి చూశారు తెలుగు త‌మ్ముళ్లు. అధినాయ‌క‌త్వం దీనికి పూర్తిగా బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థ‌ల స‌మ‌రానికి వైసీపీ సై అంటుంటే టీడీపీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. త‌న కుటుంబంతో క‌లిసి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరిన చంద్ర‌బాబుకు అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు టీజీ వెంక‌టేశ్, సుజ‌నా చౌద‌రి, సిఎం ర‌మేష్, గ‌రిక‌పాటిలు బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. త‌మ రాజ్య‌స‌భ ప‌క్షాన్ని క‌మ‌లంలో విలీనం చేయాల‌ని కోరుతూ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు లేఖ అంద‌జేశారు. త్వ‌ర‌లో మ‌రో ముగ్గురు లోక్‌స‌భ స‌భ్యుల‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా త‌మ పార్టీలోకి వ‌స్తార‌ని , అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత చేర్చుకోవాలో లేదా అన్న‌ది అపుడు పార్టీ హైక‌మాండ్ ఓ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఏపీ టీడీపీలో వీరి జంపింగ్ క‌ల‌క‌లం రేపింద...