పోస్ట్‌లు

జ‌నం జ‌నసంద్రం..ప‌వ‌న్ ప్ర‌భంజ‌నం

చిత్రం
జ‌న‌మే జ‌నం ఎటు చూసినా జ‌న‌మే. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం. ఊహించ‌ని రీతిలో అభిమానులు ప్రేమ‌గా పిలుచుకునే ప‌వ‌ర్ స్టార్ కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. భావ సారూప్య‌త క‌లిగిన మేధావులు, వ్య‌క్తులు, సంస్థ‌ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందు నుంచి క‌లిసి న‌డుస్తున్నారు. ప‌వ‌న్ వెన్నంటి అపార రాజ‌కీయ‌ప‌ర‌మైన అనుభ‌వం క‌లిగిన నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉండ‌నే ఉన్నారు. ప‌వ‌న్ చిటికె వేసినా..లేదా మాట్లాడినా తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజ‌నాన్ని సృష్టిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ కొద్ది శాతం తేడాతో అధికారంలోకి వ‌చ్చింది. బీజేపీతో చెలిమి కూడా లాభించింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీన్ మారింది. తెలుగుదేశం పార్టీ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌దైన శైలితో పాద‌యాత్ర చేప‌ట్టారు. తానే ప‌వ‌ర్లోకి వ‌స్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ నుండి టికెట్లు ద‌క్క‌ని వారంతా జ‌గ‌న్ పంచ‌న చేరారు. అన్ని పార్ట...

జ‌నం చేతుల్లో ఆయుధం..ప్ర‌జాస్వామినికే త‌ల‌మానికం రాజ్యాంగానికి ర‌క్ష ..జాతికి సుర‌క్ష‌..ఓటు ..!

చిత్రం
అయిదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌ల‌ను చూసి ఆవేశ ప‌డిపోతే ఎలా..నిరుత్సాహానికి గురైతే ఏం ప్ర‌యోజ‌నం. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా భార‌త‌దేశానికి పేరుంది. ఇక్క‌డున్నంత స్వేచ్ఛ ఇంకే దేశంలోను లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఎన్నో కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, జాతులు కోట్లాది మంది స‌ఖ్య‌త‌తో జీవిస్తున్నారు. అభిప్రాయాలలో భేదాలు ఉన్న‌ప్ప‌టికీ..ఆలోచ‌న‌ల్లో తేడాలు ఉన్న‌ప్ప‌టికీ ఎన్నిక‌లు వ‌చ్చే స‌రిక‌ల్లా ఎవ‌రికి వారు త‌మ ఆత్మ ప్ర‌బోధం మేర‌కు ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వ‌చ్చిన మ‌హాత్ముడు క‌ల‌లు క‌న్న గ్రామాలు పురోభివృద్ధి సాధించాలంటే ఓటును వాడుకోవాల్సిందే. ప్ర‌తి అయిదేళ్ల‌కు ఒక‌సారి పార్ల‌మెంట్‌కు..ఆయా రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఇది స‌ర్వ‌సాధార‌ణం. కొన్ని సంద‌ర్భాల‌లో ఓటు వేయ‌కుండా త‌మ‌కెందుకులే అనే ధోర‌ణితో చాలా మంది దూరంగా ఉంటున్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ధ‌తి కాదు. రాజ్యాంగం ప్ర‌తి ఒక్క‌రికి ఓటు హ‌క్కు వినియోగించుకునే అరుదైన అవ‌కాశాన్ని ఇచ్చింది. దీని ద్వారానే మ‌నం ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను..మ‌న కోసం ప‌...

జ‌నం మెచ్చిన లీడ‌ర్లు..మాట‌లతో మంట‌లు ..!

చిత్రం
ఓ వైపు ఎండ‌లు మండిపోతుంటే..మ‌రో వైపు జ‌నం మెచ్చిన పొలిటిక‌ల్ లీడ‌ర్లు మాత్రం త‌మ పంచ్‌లు..ప్ర‌సాల‌తో మ‌రింత అగ్గి రాజేస్తున్నారు. ఎన్నిక‌ల పుణ్య‌మా అంటూ ఊపిరి పీల్చుకున్న జ‌నానికి త‌మ మాట‌ల తూటాల‌తో కంటి మీద కునుకే లేకుండా చేస్తున్నారు. పోలింగ్ కొద్ది రోజులే ఉండ‌డంతో లీడ‌ర్ల పంచ్‌ల‌ను భ‌లే ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలోనే త‌న మాట‌ల‌తో మెప్పించే ద‌మ్మున్న లీడ‌ర్‌గా తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌..ప్ర‌స్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పేరుంది. ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, ఉర్దూ త‌దిత‌ర భాష‌ల‌లో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. అన్నింటికంటే తెలంగాణ యాస‌, మాండ‌లికాన్ని ఆయ‌న వంట ప‌ట్టించుకున్నంత‌గా ఇంకే నాయ‌కుడు ప్రాక్టీస్ చేయ‌లేదు. ఏ విష‌యం గురించైనా అన‌ర్ఘ‌లంగా ప్ర‌సంగించ‌గ‌ల ద‌మ్ము ..ధైర్యం ఒక్క కేసీఆర్‌కే ఉన్న‌ది. జనాన్ని మాట‌ల‌తో మెస్మ‌రైజ్ చేయ‌డం..కొత్త విష‌యాల గురించి తెలియ చేయ‌డం..ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌ను ఒకే చోట నుండి క‌ద‌ల‌నీయ‌కుండా చేయ‌డంలో ఆయ‌నకు ఆయ‌నే సాటి. కేసీఆర్ వ‌చ్చుడో..స‌చ్చుడో అంటూ ఆయ‌న ఇచ్చిన నినాదం జ‌నాన్ని ఉద్య‌మం వైపు మ‌ళ్లేలా చేసింది. ఏకంగా ప్ర‌త్యేక రాష్ట్రం సిద్ధించేందు...

చ‌క్రం తిప్పేదెవ్వ‌రు..ఢిల్లీ కోట‌పై పాగా వేసేదెవ్వ‌రు..? - పోటీ ర‌స‌వ‌త్త‌రం జ‌నం ఉత్కంఠ భ‌రితం

చిత్రం
క‌మ‌లం విక‌సించేనా..హ‌స్తం హ‌వా న‌డిచేనా..ప్రాంతీయ పార్టీల జెండా ఎగ‌రేనా..! వంద కోట్ల భార‌తావ‌ని ఉత్కంఠ‌తతో ఎదురు చూస్తోంది. కొద్ది రోజుల్లో ఎవ‌రు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంటార‌నేది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మున్న‌త జాతి అంతా ఒకే తాటిపై నిలిచింది. ఈసారి ఎన్నిక‌లు ..స‌మ‌ర్థ‌త‌కు..నీతికి..నిజాయితీకి..అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నాయి. ప్ర‌జ‌లు , యువ‌తీ యువ‌కులు త‌మ భ‌విష్య‌త్ బాగుండాల‌ని స‌ముచిత నిర్ణ‌యం తీసుకునేందుకు సమాయ‌త్తం అవుతున్నారు. తాయిలాలు, స‌బ్సిడీలు..సంక్షేమ ప‌థ‌కాలు ఎర వేసి ఓట్లు రాబ‌ట్టుకునే పార్టీల‌కు చుక్క‌లు చూపిస్తామంటున్నారు. దేశ‌మంతటా మోడీ గాలి వీసినా చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు త‌మ హ‌వాను కొన‌సాగించాయి. ఎన్ని ప్ర‌య‌త్నాలు మోడీ, అమిత్ షా చేసినా ఢిల్లీ కోట‌పై క‌మ‌లం జెండా ఎగుర వేయ‌లేక పోయారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కోసం ప్ర‌పంచమంతా త‌న వైపు తిప్పుకునేలా చేసిన ఘ‌న‌త ఒక్క అర‌వింద్ కేజ్రివాల్‌కే ద‌క్కుతుంది. ప్ర‌పంచంలోనే అత్యంత భారీ ప్ర‌జాస్వామిక దేశంగా వినుతికెక్కిన ఇండియాలో 17వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం...

గూగుల్ మెచ్చిన కుర్రాడు - అబ్దుల్లా అద‌ర‌హో - కోటి 20 ల‌క్షల వార్షిక వేత‌నం

చిత్రం
ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని భార‌తీయ విద్యార్థుల‌కు అపార‌మైన అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. లెక్క‌లేనంత మందికి ఐటీ దిగ్గ‌జ కంపెనీలు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. ఇండియాతో పాటు అమెరికాలో అత్య‌ధికంగా ఐటీ ప్రొఫెస‌న‌ల్స్ మ‌న‌వాళ్లే ఉన్నారు. ఐఐటీ, ట్రిబుల్ ఐటీ , ఎన్ఐటీ, ఇత‌ర కాలేజీల‌నే గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బైజూ త‌దిత‌ర కంపెనీల‌న్నీ దృష్టి సారిస్తున్నాయి. ఈ దేశంలో ఐఐటీల‌కు వున్నంత క్రేజ్..పోటీ ఇంకే కళాశాల‌ల‌కు లేదు. కేంద్ర స‌ర్కార్ భారీ ఎత్తున నిధుల‌ను ఖ‌ర్చు చేస్తోంది. స‌గ‌టున ఒక్కో విద్యార్థికి ఐఐటీల‌ల్లో కోర్సులు పూర్త‌య్యేంత దాకా కోటిన్న‌ర రూపాయ‌ల‌కు పైగా కేటాయిస్తోంది. నాణ్య‌వంత‌మైన బోధ‌న‌..అద్భుత‌మైన వాతావ‌ర‌ణం..ఎలాంటి వ‌త్తిళ్లు లేని త‌ర‌గ‌తి గ‌దులు..భిన్న‌మైన బోధ‌న‌..వెర‌సి విద్యార్థుల‌ను భావి భార‌త టెక్కీలుగా తీర్చిదిద్ద‌డంలో ఈ విద్యాల‌యాలు నిమ‌గ్న‌మ‌య్యాయి. అంత‌ర్జాతీయ స్థాయిలో ఏ విశ్వ విద్యాల‌య‌మైనా ఇండియ‌న్ ఐఐటీ స్టూడెంట్స్ అంటేనే మొద‌టి ప్ర‌యారిటి ఇస్తున్నాయి. ఎక్కువ శాతం ఐటీ , ఈ కామ‌ర్స్ కంపెనీల‌న్నీ ఇంజ‌నీరింగ్ లో టాప్‌ల...

ఎన్నిక‌ల సంగ్రామం - హీటెక్కిన ప్ర‌చారం

చిత్రం
దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌లు యుద్ధ రంగాన్ని త‌ల‌పింప చేస్తున్నాయి. కేంద్రంలో ప‌వ‌ర్‌లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ఎడ‌తెగ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన క‌మ‌ల‌నాథుల గుండె గొంతుక అమిత్ షా చాప కింద నీరులా చ‌క్రం తిప్పుతున్నారు. త‌మ‌కు రావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ తీసుకు వ‌చ్చేందుకు ఆప‌రేష‌న్‌ను స్టార్ట్ చేశారు. ఏ పార్టీ వారైనా స‌రే ..ఏ స్థానంలో ఉన్నా స‌రే గెలుపు గుర్రాల‌పైనే దృష్టి పెడుతున్నారు. దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు జాతీయ స్థాయి పార్టీల‌ను ఒకింత క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల‌లో ప్రాంతీయ పార్టీలు కొలువుతీరి వున్నాయి. స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని జాతీయ స్థాయిలోని స‌ర్వేలు తేట‌తెల్లం చేశాయి. దీంతో స్వ‌యంగా దేశ ప్ర‌ధాని .బీజేపీ ర‌థ‌సార‌థి న‌రేంద్ర మోడీ విప‌క్షాల‌ను టార్గెట్ చేశారు. ఓ ఛాయ్ వాలాను అందించిన ఈ దేశం మ‌రోసారి చౌకీదార్‌గా ఉండే త‌న‌కు అవ‌కాశం ఇవ్వండ‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల న‌గారా మోగింది. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు అన్ని పార్టీల‌తో పాటు విప‌క్షా...

వెల్లి విరిసిన చైత‌న్యం..అన్న‌దాత‌ల ఆగ్ర‌హం - దేశం చూపు నిజామాబాద్ వైపు

చిత్రం
ఎన్నిక‌ల వేళ దేశ‌మంతా తెలంగాణ‌లోని నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం వైపు చూస్తోంది. ఎన్న‌డూ లేనంత‌గా ఈ ప్రాంతం ఇపుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీని ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఇక్క‌డ ఏకంగా 200 మంది రైతులు ఎంపీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగారు. తాము పండించిన పంట‌కు మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించ‌డం లేదని, ఆరుగాలం పండించే త‌మ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ జిల్లాలో ఎక్కువ శాతం ప‌సుపు, చెరుకు పంట పండిస్తారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా..విన్న‌వించుకున్నా ఉన్న‌తాధికారులు కానీ..పాల‌కులు కానీ త‌మ గోడు విన్న పాపాన పోలేదంటున్నారు బాధితులు. త‌మ స‌మ‌స్యను దేశ వ్యాప్తంగా తెలియ చేయాల‌నే ఉద్ధేశంతోనే తాము ఎన్నిక‌ల‌ను ఆయుధంగా మ‌ల్చుకున్నామ‌ని వారంటున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తన వంతు కృషి చేశాన‌ని ఆమె అంటున్నారు. కానీ అన్న‌దాత‌లు మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాట‌లు త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో త‌మ గురించి ఆలోచించిన దాఖ‌లాలు లేవ‌న్నారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా బ్యాలెట్ బాక్సులు ...