పోస్ట్‌లు

శ్రీ‌నివాసం..మ‌హా ప్ర‌సాదం..నిత్య అన్న‌దానం..! ఎన్టీఆర్..ప్ర‌సాద్‌ల పుణ్య ఫ‌లం !

చిత్రం
గోవిందా..గోవిందా..శ్రీ‌నివాసా గోవిందా..ఆపద మొక్కుల వాడా..గోవిందా..అనాధ ర‌క్ష‌కా గోవిందా..ఎక్క‌డ చూసినా..ఏ మెట్లు ఎక్కినా ..ఆ అపురూప‌మైన శ్రీ‌నివాసుడే. తిరుమ‌ల‌..తిరుప‌తి ల‌క్ష‌లాది భ‌క్తుల భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణ‌తో మార్మోమ్రోగుతూనే వున్నాయి. పేద‌లు..ధ‌నికులు..అన్ని రంగాల‌కు చెందిన ల‌బ్ధ ప్ర‌తిష్టులు..సంస్థ‌ల అధిప‌తులు..ప్ర‌పంచం..మెచ్చిన..మ‌హానుభావులు..అనామ‌కులు..అనాధ‌లు..వృద్ధులు..పిల్ల‌లు..దివ్యాంగులు..మ‌హిళ‌లు..అప్పుడే క‌ళ్లు తెరిచిన చిన్నారులు..ఇలా వేలాది మంది నిత్యం ఆ తిరుమ‌ల కొండ‌పై వెల‌సిన శ్రీ‌నివాసుడిని చూసేందుకు తండోప తండాలుగా వ‌స్తూనే వుంటారు. ప్ర‌తి రోజూ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామితో పాటు అలివేలు మంగ‌మ్మ‌ల‌కు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో పూజ‌లు జ‌రుగుతాయి. గాలిమోటార్లు, వాహ‌నాలు, బ‌స్సులు, రైళ్లు భ‌క్తుల‌ను కొండ కింద నుండి కొండ పైకి చేర‌వేస్తాయి. స్వామి, అమ్మ‌వార్ల‌ను వేడుకుంటే..ద‌ర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని..క‌ష్టాల నుండి గ‌ట్టెక్కుతామ‌ని ప్ర‌గాఢ విశ్వాసం. ప్ర‌పంచంలోనే ప్ర‌సిద్ధి చెందిన ఈ ఆల‌యం..ఇపుడు అత్యంత ఆదాయం క‌లిగిన పుణ్య క్షేత్రంగా వినుతికెక్కింద...

సై..సైరా ..సురేంద‌ర్ రెడ్డి..!

చిత్రం
సినిమా అన్న‌ది పేష‌న్. అదో మాయా ప్ర‌పంచం. క‌ల‌ల బేహారుల ఖార్ఖానా. వేలాది మంది దీనిపైనే ఆధార ప‌డ్డారు. జూదం కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన రంగం ఇది. అయినా లెక్క‌లేనంత మంది దీని చుట్టూ తిరుగుతుంటారు. కూటికి లేక పోయినా..న‌డిచేందుకు శ‌క్తి లేక పోయినా స‌రే ఈ రంగమంటే అమిత‌మైన ఆస‌క్తి. లెక్క‌లేనంత టాలెంట్ ఉన్నా ..గుర్తింపున‌కు నోచుకోక పోయినా ..ఏదో ఒక‌రోజు అవ‌కాశం త‌లుపు తడుతుంద‌ని..అదృష్టం వ‌రిస్తుంద‌ని ఈ చ‌ట్రంలోనే తిరుగ‌తూ వున్న వాళ్లు ఎంద‌రో. ఒక్క‌సారి దీనిని ప్రేమిస్తే చాలు ..బ‌తుకంతా దీనితోనే. చావు ప‌ల‌క‌రించే దాకా ఇందులోనే. ఒక్క‌రోజులో రాజు కావాల‌ని అనుకున్న వాళ్ల‌కు ఇది అద్భుత‌మైన దారి చూపిస్తుంది. సినిమా అంటేనే 24 ఫ్రేమ్స్. క‌ల‌లు పండాల..ఊహ‌లకు ప్రాణం పోయాలి. న‌టీ న‌టులు ..టెక్నీషియ‌న్స్..లొకేష‌న్స్..డిస్ట్రిబ్యూట‌ర్స్..ప‌బ్లిసిటీ..ఆడియో లాంఛింగ్..మూవీ రిలీజ్ దాకా..వంద‌లాది మంది ఇందులో లీన‌మ‌వుతారు. త‌మ‌ను తాము ఆవిష్క‌రించుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డ‌తారు. ఒక‌ప్పుడు నిర్మాత‌ల‌కు ఓ వాల్యూ ..ఐడెంటిటి వుండేది. ఇపుడంతా హీరో ఓరియంటెడ్ మూవీస్ అయిపోయాయి. వాళ్ల‌దే రాజ్యం. వాళ్ల‌తోనే వ్యా...

క్రియేటివిటికి ప‌ట్టం ..క‌ళాకారుల‌కు స్వ‌ర్గ‌ధామం ..ఆర్ట్‌బ్లోర్..!

చిత్రం
తిన్నామా..ప‌డుకున్నామా..తెల్లారిందా ఇదేనా లైఫ్ అంటే..కాదు..జీవితం అద్భుతం. ఒకే ఒక్క‌సారి వ‌చ్చే ఈ అరుదైన అవ‌కాశం ఇంకే జీవికి లేదు. సంగీతం..సాహిత్యం..ప్ర‌కృతి ..ఆకాశం..ఇవ్వ‌న్నీ ..జ‌ర్నీ ఇవన్నీ క‌లిస్తే..కొత్త ప్ర‌పంచం ఆవిష్కృత‌మ‌వుతుంది. లోకంలో లెక్క‌లేనంత టాలెంట్ వుంది. అద్భుతాలు సృష్టించే సృజ‌న‌శీలురు కోట్ల‌లో ఉన్నారు. బొమ్మ‌లు గీసే వాళ్లు..త‌యారు చేసే వాళ్లు లెక్క‌లేనంత మంది. మ‌న దేశంలో క‌ళాకారుల‌కు గుర్తింపు త‌క్కువ‌. కానీ ఇత‌ర దేశాల్లో అయితే క‌ళ్ల‌కు అద్దుకుంటారు. అక్క‌డంతా క‌ళాత్మ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తారు. పాలిటిక్స్‌ను అంత‌గా ప‌ట్టించుకోరు. ఎన్నిక‌ల‌ప్పుడే ఆ త‌ర్వాత వ‌దిలేస్తారు. సంగీతానికి, పెయింటింగ్స్‌కు ..క‌విత్వానికి..స‌మావేశాల‌కు ఇచ్చినంత ప్ర‌యారిటీ ఇంకే దానికి ఇవ్వ‌రు. పాల‌కుల‌కంటే క‌ళాకారుల‌కే గౌర‌వం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంద‌రో టాలెంట్ క‌లిగిన వారికి ఒక వేదిక తీసుకు వ‌చ్చేందుకు ఆర్ట్‌బ్లోర్ కృషి చేస్తోంది. ఎక్క‌డున్నా ..ఏ మూల‌నున్నా స‌రే..కొంచెం క్రియేటివిటీకి ప్రాణం పోసి తమ‌ను తాము నిరూపించు కోగ‌లిగితే చాలు. ఆర్టిస్టులంద‌రికి ఒక ఫ్లాట్ ఫారంగా ఇది ప‌నిచేస్తు...

జ‌న హృదయ‌పు నేత - మాన‌వ‌త్వపు ప‌తాక ..!

చిత్రం
క‌డ‌దాకా న‌మ్మిన విలువ‌ల కోసం క‌ట్టుబ‌డిన మ‌హోన్న‌త మాన‌వుడు పారిక‌ర్. భ్ర‌ష్టుప‌ట్టిన రాజ‌కీయాల‌లో క‌డ‌దాకా నిబ‌ద్ధ‌త‌తో బ‌తికిన అతికొద్ది ఎన్న‌ద‌గిన నాయ‌కుల‌లో ఆయ‌న ఒక‌రు. అత్యంత సామాన్య‌మైన కుటుంబంలో పుట్టి..క‌ష్ట‌ప‌డి ఐఐటీ చ‌దివి ..అత్యున్న‌త‌మైన ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అధిష్టించి..అనంత‌రం దేశ స్థాయిలో ప్రాముఖ్య‌త క‌లిగిన ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి..అనుకోకుండా రాజీనామా చేసిన అరుదైన నాయ‌కుడు. భూత‌ద్దం పెట్టి వెతికినా నిజాయితీ క‌లిగిన పొలిటిక‌ల్ లీడ‌ర్లు క‌నిపించ‌డం లేదు. మాఫియా క‌నుస‌న్న‌ల‌లో మార్కెట్ న‌డుస్తున్న స‌మ‌యంలో ప్ర‌జాస్వామ్యం బ‌తికే ఉంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. 13 డిసెంబ‌ర్ 1955లో మనోహర్ గోపాలకృష్ణ పారిక‌ర్ గోవాలోని మపూసాలీలో జన్మించాడు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐఐటీని పూర్తి చేసి సీఎం ప‌ద‌విని నిర్వ‌హించిన వారిలో దేశంలోనే ఆయ‌న ప్ర‌థ‌ముడు. ప్ర‌జ‌ల‌ను ప్రేమించిన ఈ మ‌నిషి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎలాంటి భేష‌జాల‌కు తావీయ‌కుండా న‌మ్మిన వాటికి క‌ట్టుబ‌డ్డారు. చావు ప‌ల‌క‌రించే వ‌ర‌కు త‌న‌కు తోచిన రీతిలో ప‌ని చేసుకుంటూనే ఉండి పోయారు. భార‌తీయ జ‌న‌త...

కంపెనీ క‌హానీ..క‌లెక్ష‌న్ల‌లో సునామీ..! వారెవ్వా..వ‌ర్మ‌..!!

చిత్రం
డైన‌మిజం ఎలా వుంటుందో..ఇండియాలో ఆక్టోప‌స్‌లా విస్త‌రించిన మాఫియాను..ముంబ‌యి లైఫ్ స్ట‌యిల్‌ను సెల్యూలాయిడ్ మీద ఆవిష్క‌రించిన ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ‌. ఆద్యంత‌మూ కొత్త‌ద‌నాన్ని ..డేర్‌నెస్‌ను అమితంగా ఇష్ట‌ప‌డే ఈ డైరెక్ట‌ర్ రూటే స‌ప‌రేట్. పేరుకే మూడ‌క్ష‌రాలు అయినా ఆర్జీవీ అంటే వ్య‌క్తి వంద‌లాది మంది స‌మూహం. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌ట‌మే కాదు..అనుకున్నాడంటే త‌క్ష‌ణ‌మే ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు రావ‌డం ఆయ‌న స్పెషాలిటీ. శివ‌తో తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన ఈ అగ్ర ద‌ర్శ‌కుడు ..ఏకంగా ముంబయిని సంబ్ర‌మాశ్చ‌ర్యానికి గురి చేశాడు. వాట్ ఏ టాలెంట్..వాట్ ఏ క‌రేజ్. ఓ వైపు బాల్ థాక‌రే..మ‌రో వైపు దావూద్..చోటా రాజ‌న్‌..గ్యాంగులు..మాఫియా క‌ల్చ‌ర్..ఆ కాన్సెప్ట్ ను త‌లుచుకుంటేనే మ‌న‌కైతే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది. కానీ వ‌ర్మ ద‌మ్మున్నోడు..గ‌ట్స్ ఉన్నోడు..ఏకంగా గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను..గ్రూపుల‌ను..రౌడీల లైఫ్ స్ట‌యిల్‌ను..మాఫియా చేస్తున్న ఆగ‌డాల‌ను తెర‌పైకి తీసుకు వ‌చ్చాడు. పాత ముఖాల‌తో బోర్ కొట్టించిన హిందీ సినిమాను త‌న వైపు చూసేలా చేశాడు వ‌ర్మ‌. ఎందుకూ ప‌నికిరాని వారిని..అడిష‌న...

హృద‌య సమీరం - పాట‌ల త‌రంగం.. !

చిత్రం
సినీ జ‌గ‌త్తులో అత‌డో పాట‌ల కెర‌టం. ఉత్తుంగ త‌రంగ‌మై అల్లుకు పోయాడు. గుండె నుంచి గుండెల్లోకి ప్ర‌వ‌హిస్తూనే వున్నాడు..అత‌డే త‌న పాట‌ల‌తో జ‌గ‌త్తును వెలిగించిన చెలికాడు..పాట‌ల విద్వ‌త్తు స‌మీర్. చెప్పుకుంటూ పోతే ఈ కాలం స‌రిపోదు. జీవితాన్ని వెలిగించేది క‌విత్వ‌మే. రోజూ చ‌ద‌వ‌కుండా ..రాయ‌కుండా వుండ‌లేక పోవ‌డంలోనే వుంది అస‌లైన మ‌జా. సాహిత్యంలో క‌వికే ప్ర‌యారిటీ ఎక్కువ‌. ఎలాగైనా ఆవిష్క‌రించే అవ‌కాశం ఇందులోనే త‌ప్పా మ‌రెక్క‌డా ల‌భించ‌దు. ప్ర‌తి వాళ్లు క‌వులు కావాల‌ని..పేరు తెచ్చు కోవాల‌ని..త‌మ‌కు గుర్తింపు రావాల‌ని ఆరాట ప‌డ‌తారు. కానీ అది దేవుడు మ‌నిషికి ఇచ్చిన అద్భుత వ‌రం. కొంద‌రికి ఆ ప్ర‌తిభ పుట్టుక‌తో వ‌స్తే..మ‌రికొంద‌రికి క‌ష్ట‌ప‌డితే రాయ‌గ‌లిగే స్థితికి చేరుకుంటారు. సాహిత్యం..క‌విత్వం..పాట‌ల సంచారం ఈ మూడు ఒక‌దానికొక‌టి పెనవేసుకుని వుంటాయి. కొంచెం ప్ర‌య‌త్నం చేస్తే క‌వులై పోతారేమో కానీ..గేయ ర‌చ‌యిత‌లు కావాలాంటే చాలా సాధ‌న చేయాలి. అహోరాత్రులు శ్ర‌మించాలి. నిద్ర‌హారాలు మానుకోవాలి. ఒక్కోసారి పిచ్చెక్కిన‌ట్టు అనిపిస్తుంటుంది. సినిమా రంగం అంటేనే అదో అంతుచిక్క‌ని ర‌హ‌స్యం. ఒకే రోజ...

ముద్దుల మురిపెం..స‌ర‌స స‌ల్లాపం ..!

చిత్రం
జీవితం అన్నాక కాస్తంత రిలీఫ్ లేక‌పోతే..వుండీ అర్థం ఏముంటుంద‌ని..? ఓ ముద్దు ముచ్చ‌ట లేక‌పోతే శరీరం అల‌స‌ట‌కు లోన‌వుతుంది. ఏదో కోల్పోయినంత బాధ క‌లుగుతుంది. లోకంలో స్త్రీ పురుషుల మ‌ధ్య ఉన్నంత క‌నెక్టివిటీ ఇంకే జీవ‌రాశుల్లో లేదు. అందుకే ఇంతటి ఆక‌ర్ష‌ణ‌. ఒక‌రిపై మ‌రొక‌రి మ‌మ‌కారం. అన్నింటికంటే ఎక్కువ‌గా అర్థం చేసుకోవ‌డం. అత‌డు సినిమాలో మ‌హేష్ బాబు..త్రిష‌ల మ‌ధ్య పండిన కెమిస్ట్రీ ఎంద‌రినో ఆక‌ట్టుకునేలా..మ‌ళ్లీ మ‌ళ్లీ జ్ఞాప‌కం తెచ్చుకునేలా చేసింది. ఊహ‌ల్లో విహ‌రించ‌డం మ‌న‌కు ఎక్కువ‌గా అల‌వాటు. ఆ ఊహే ..ఆ ఆలోచ‌నే లేక పోతే లైఫ్ బోర్ కొడుతుంది. ఈ ప్ర‌యాణం వేస్ట్ అనిపిస్తుంది. అప్ప‌టికి ఇప్ప‌టికీ ఎంత తేడా..త‌లుచుకుంటేనే ఆశ్చ‌ర్యం వేస్తుంది. త‌న కోసం వేచి చూడ‌టం. సినిమా టాకీసుల వ‌ద్ద‌..బ‌స్టాండ్..రైల్వే స్టేష‌న్ వ‌ద్ద నిలిచి వుండ‌టం.. సాయంత్ర‌మైతే బ‌య‌ట‌కు వ‌స్తుందేమోన‌న్న ఆరాటం. ఇదంతా ర‌క్త మాంసాలు క‌లిగిన స్పందించే హృద‌యం కోసం మ‌రో మ‌న‌సు ప‌డే త‌ప‌న‌..నిరీక్ష‌ణ‌. ఎవ‌రికి వారు ..ఎవ‌రి లోకంలో వాళ్లు న‌టిస్తున్నారంతే..చూస్తే అంతా ఒక్క‌రే..త‌రిచి చూస్తే ఒక‌రిలో ఎన్నో ముఖాలు..మ‌రెన్నో ఈర్ష్...