పోస్ట్‌లు

క్రియేటివిటికి ప‌ట్టం ..క‌ళాకారుల‌కు స్వ‌ర్గ‌ధామం ..ఆర్ట్‌బ్లోర్..!

చిత్రం
తిన్నామా..ప‌డుకున్నామా..తెల్లారిందా ఇదేనా లైఫ్ అంటే..కాదు..జీవితం అద్భుతం. ఒకే ఒక్క‌సారి వ‌చ్చే ఈ అరుదైన అవ‌కాశం ఇంకే జీవికి లేదు. సంగీతం..సాహిత్యం..ప్ర‌కృతి ..ఆకాశం..ఇవ్వ‌న్నీ ..జ‌ర్నీ ఇవన్నీ క‌లిస్తే..కొత్త ప్ర‌పంచం ఆవిష్కృత‌మ‌వుతుంది. లోకంలో లెక్క‌లేనంత టాలెంట్ వుంది. అద్భుతాలు సృష్టించే సృజ‌న‌శీలురు కోట్ల‌లో ఉన్నారు. బొమ్మ‌లు గీసే వాళ్లు..త‌యారు చేసే వాళ్లు లెక్క‌లేనంత మంది. మ‌న దేశంలో క‌ళాకారుల‌కు గుర్తింపు త‌క్కువ‌. కానీ ఇత‌ర దేశాల్లో అయితే క‌ళ్ల‌కు అద్దుకుంటారు. అక్క‌డంతా క‌ళాత్మ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తారు. పాలిటిక్స్‌ను అంత‌గా ప‌ట్టించుకోరు. ఎన్నిక‌ల‌ప్పుడే ఆ త‌ర్వాత వ‌దిలేస్తారు. సంగీతానికి, పెయింటింగ్స్‌కు ..క‌విత్వానికి..స‌మావేశాల‌కు ఇచ్చినంత ప్ర‌యారిటీ ఇంకే దానికి ఇవ్వ‌రు. పాల‌కుల‌కంటే క‌ళాకారుల‌కే గౌర‌వం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంద‌రో టాలెంట్ క‌లిగిన వారికి ఒక వేదిక తీసుకు వ‌చ్చేందుకు ఆర్ట్‌బ్లోర్ కృషి చేస్తోంది. ఎక్క‌డున్నా ..ఏ మూల‌నున్నా స‌రే..కొంచెం క్రియేటివిటీకి ప్రాణం పోసి తమ‌ను తాము నిరూపించు కోగ‌లిగితే చాలు. ఆర్టిస్టులంద‌రికి ఒక ఫ్లాట్ ఫారంగా ఇది ప‌నిచేస్తు...

జ‌న హృదయ‌పు నేత - మాన‌వ‌త్వపు ప‌తాక ..!

చిత్రం
క‌డ‌దాకా న‌మ్మిన విలువ‌ల కోసం క‌ట్టుబ‌డిన మ‌హోన్న‌త మాన‌వుడు పారిక‌ర్. భ్ర‌ష్టుప‌ట్టిన రాజ‌కీయాల‌లో క‌డ‌దాకా నిబ‌ద్ధ‌త‌తో బ‌తికిన అతికొద్ది ఎన్న‌ద‌గిన నాయ‌కుల‌లో ఆయ‌న ఒక‌రు. అత్యంత సామాన్య‌మైన కుటుంబంలో పుట్టి..క‌ష్ట‌ప‌డి ఐఐటీ చ‌దివి ..అత్యున్న‌త‌మైన ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అధిష్టించి..అనంత‌రం దేశ స్థాయిలో ప్రాముఖ్య‌త క‌లిగిన ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి..అనుకోకుండా రాజీనామా చేసిన అరుదైన నాయ‌కుడు. భూత‌ద్దం పెట్టి వెతికినా నిజాయితీ క‌లిగిన పొలిటిక‌ల్ లీడ‌ర్లు క‌నిపించ‌డం లేదు. మాఫియా క‌నుస‌న్న‌ల‌లో మార్కెట్ న‌డుస్తున్న స‌మ‌యంలో ప్ర‌జాస్వామ్యం బ‌తికే ఉంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. 13 డిసెంబ‌ర్ 1955లో మనోహర్ గోపాలకృష్ణ పారిక‌ర్ గోవాలోని మపూసాలీలో జన్మించాడు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐఐటీని పూర్తి చేసి సీఎం ప‌ద‌విని నిర్వ‌హించిన వారిలో దేశంలోనే ఆయ‌న ప్ర‌థ‌ముడు. ప్ర‌జ‌ల‌ను ప్రేమించిన ఈ మ‌నిషి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎలాంటి భేష‌జాల‌కు తావీయ‌కుండా న‌మ్మిన వాటికి క‌ట్టుబ‌డ్డారు. చావు ప‌ల‌క‌రించే వ‌ర‌కు త‌న‌కు తోచిన రీతిలో ప‌ని చేసుకుంటూనే ఉండి పోయారు. భార‌తీయ జ‌న‌త...

కంపెనీ క‌హానీ..క‌లెక్ష‌న్ల‌లో సునామీ..! వారెవ్వా..వ‌ర్మ‌..!!

చిత్రం
డైన‌మిజం ఎలా వుంటుందో..ఇండియాలో ఆక్టోప‌స్‌లా విస్త‌రించిన మాఫియాను..ముంబ‌యి లైఫ్ స్ట‌యిల్‌ను సెల్యూలాయిడ్ మీద ఆవిష్క‌రించిన ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ‌. ఆద్యంత‌మూ కొత్త‌ద‌నాన్ని ..డేర్‌నెస్‌ను అమితంగా ఇష్ట‌ప‌డే ఈ డైరెక్ట‌ర్ రూటే స‌ప‌రేట్. పేరుకే మూడ‌క్ష‌రాలు అయినా ఆర్జీవీ అంటే వ్య‌క్తి వంద‌లాది మంది స‌మూహం. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌ట‌మే కాదు..అనుకున్నాడంటే త‌క్ష‌ణ‌మే ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు రావ‌డం ఆయ‌న స్పెషాలిటీ. శివ‌తో తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన ఈ అగ్ర ద‌ర్శ‌కుడు ..ఏకంగా ముంబయిని సంబ్ర‌మాశ్చ‌ర్యానికి గురి చేశాడు. వాట్ ఏ టాలెంట్..వాట్ ఏ క‌రేజ్. ఓ వైపు బాల్ థాక‌రే..మ‌రో వైపు దావూద్..చోటా రాజ‌న్‌..గ్యాంగులు..మాఫియా క‌ల్చ‌ర్..ఆ కాన్సెప్ట్ ను త‌లుచుకుంటేనే మ‌న‌కైతే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది. కానీ వ‌ర్మ ద‌మ్మున్నోడు..గ‌ట్స్ ఉన్నోడు..ఏకంగా గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను..గ్రూపుల‌ను..రౌడీల లైఫ్ స్ట‌యిల్‌ను..మాఫియా చేస్తున్న ఆగ‌డాల‌ను తెర‌పైకి తీసుకు వ‌చ్చాడు. పాత ముఖాల‌తో బోర్ కొట్టించిన హిందీ సినిమాను త‌న వైపు చూసేలా చేశాడు వ‌ర్మ‌. ఎందుకూ ప‌నికిరాని వారిని..అడిష‌న...

హృద‌య సమీరం - పాట‌ల త‌రంగం.. !

చిత్రం
సినీ జ‌గ‌త్తులో అత‌డో పాట‌ల కెర‌టం. ఉత్తుంగ త‌రంగ‌మై అల్లుకు పోయాడు. గుండె నుంచి గుండెల్లోకి ప్ర‌వ‌హిస్తూనే వున్నాడు..అత‌డే త‌న పాట‌ల‌తో జ‌గ‌త్తును వెలిగించిన చెలికాడు..పాట‌ల విద్వ‌త్తు స‌మీర్. చెప్పుకుంటూ పోతే ఈ కాలం స‌రిపోదు. జీవితాన్ని వెలిగించేది క‌విత్వ‌మే. రోజూ చ‌ద‌వ‌కుండా ..రాయ‌కుండా వుండ‌లేక పోవ‌డంలోనే వుంది అస‌లైన మ‌జా. సాహిత్యంలో క‌వికే ప్ర‌యారిటీ ఎక్కువ‌. ఎలాగైనా ఆవిష్క‌రించే అవ‌కాశం ఇందులోనే త‌ప్పా మ‌రెక్క‌డా ల‌భించ‌దు. ప్ర‌తి వాళ్లు క‌వులు కావాల‌ని..పేరు తెచ్చు కోవాల‌ని..త‌మ‌కు గుర్తింపు రావాల‌ని ఆరాట ప‌డ‌తారు. కానీ అది దేవుడు మ‌నిషికి ఇచ్చిన అద్భుత వ‌రం. కొంద‌రికి ఆ ప్ర‌తిభ పుట్టుక‌తో వ‌స్తే..మ‌రికొంద‌రికి క‌ష్ట‌ప‌డితే రాయ‌గ‌లిగే స్థితికి చేరుకుంటారు. సాహిత్యం..క‌విత్వం..పాట‌ల సంచారం ఈ మూడు ఒక‌దానికొక‌టి పెనవేసుకుని వుంటాయి. కొంచెం ప్ర‌య‌త్నం చేస్తే క‌వులై పోతారేమో కానీ..గేయ ర‌చ‌యిత‌లు కావాలాంటే చాలా సాధ‌న చేయాలి. అహోరాత్రులు శ్ర‌మించాలి. నిద్ర‌హారాలు మానుకోవాలి. ఒక్కోసారి పిచ్చెక్కిన‌ట్టు అనిపిస్తుంటుంది. సినిమా రంగం అంటేనే అదో అంతుచిక్క‌ని ర‌హ‌స్యం. ఒకే రోజ...

ముద్దుల మురిపెం..స‌ర‌స స‌ల్లాపం ..!

చిత్రం
జీవితం అన్నాక కాస్తంత రిలీఫ్ లేక‌పోతే..వుండీ అర్థం ఏముంటుంద‌ని..? ఓ ముద్దు ముచ్చ‌ట లేక‌పోతే శరీరం అల‌స‌ట‌కు లోన‌వుతుంది. ఏదో కోల్పోయినంత బాధ క‌లుగుతుంది. లోకంలో స్త్రీ పురుషుల మ‌ధ్య ఉన్నంత క‌నెక్టివిటీ ఇంకే జీవ‌రాశుల్లో లేదు. అందుకే ఇంతటి ఆక‌ర్ష‌ణ‌. ఒక‌రిపై మ‌రొక‌రి మ‌మ‌కారం. అన్నింటికంటే ఎక్కువ‌గా అర్థం చేసుకోవ‌డం. అత‌డు సినిమాలో మ‌హేష్ బాబు..త్రిష‌ల మ‌ధ్య పండిన కెమిస్ట్రీ ఎంద‌రినో ఆక‌ట్టుకునేలా..మ‌ళ్లీ మ‌ళ్లీ జ్ఞాప‌కం తెచ్చుకునేలా చేసింది. ఊహ‌ల్లో విహ‌రించ‌డం మ‌న‌కు ఎక్కువ‌గా అల‌వాటు. ఆ ఊహే ..ఆ ఆలోచ‌నే లేక పోతే లైఫ్ బోర్ కొడుతుంది. ఈ ప్ర‌యాణం వేస్ట్ అనిపిస్తుంది. అప్ప‌టికి ఇప్ప‌టికీ ఎంత తేడా..త‌లుచుకుంటేనే ఆశ్చ‌ర్యం వేస్తుంది. త‌న కోసం వేచి చూడ‌టం. సినిమా టాకీసుల వ‌ద్ద‌..బ‌స్టాండ్..రైల్వే స్టేష‌న్ వ‌ద్ద నిలిచి వుండ‌టం.. సాయంత్ర‌మైతే బ‌య‌ట‌కు వ‌స్తుందేమోన‌న్న ఆరాటం. ఇదంతా ర‌క్త మాంసాలు క‌లిగిన స్పందించే హృద‌యం కోసం మ‌రో మ‌న‌సు ప‌డే త‌ప‌న‌..నిరీక్ష‌ణ‌. ఎవ‌రికి వారు ..ఎవ‌రి లోకంలో వాళ్లు న‌టిస్తున్నారంతే..చూస్తే అంతా ఒక్క‌రే..త‌రిచి చూస్తే ఒక‌రిలో ఎన్నో ముఖాలు..మ‌రెన్నో ఈర్ష్...

కార్పొరేట్ ప్ర‌పంచం..బ‌తుకు పాఠం - మథురా మ‌జాకా ..!

చిత్రం
అంతు చిక్క‌ని ఆలోచ‌న‌లు..క‌ళ్లు చెదిరే భ‌వంతులు..వాటి వెన‌కాల ఎన్నో మెద‌ళ్లు పోట్లాడుతుంటాయి. నిద్ర‌హారాలు మాని నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ద‌క్కించు కోవాలో.ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు చిక్క‌కుండా మార్కెట్‌లో ఎలా రాణించాలో..నాయ‌క‌త్వానికి..విజయానికి మ‌ధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి..ఎలాంటి ప్లాన్స్ అమ‌లు చేస్తారు..ఇవ్వ‌న్నీ తెలుసు కోవాలంటే కార్పొరేట్ సినిమా చూడాల్సిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ రాం గోపాల్ వ‌ర్మ ఏ ముహూర్తంలో ముంబ‌యిలో హిందీ సినీ ఫీల్డ్ లోకి ఎంట‌ర‌య్యాడో ఆ రోజు నుండి క్రియేటివిటీకి కొద‌వ లేకుండా పోయింది. ఆయ‌న టీంలోని స‌భ్యుడే మథుర్ భండార్క‌ర్. ఎక్క‌డెక్క‌డో ఉంటూ..అవ‌కాశాలు రాక ..వేధింపులు భ‌రించ‌లేక ..అప‌రిమిత‌మైన టాలెంట్ వుండీ ..వాడుకోలేక‌..త‌ల్ల‌డిల్లుతున్న స‌మ‌యంలో వ‌ర్మ దిక్సూచిలా మారాడు. ఎంద‌రికో నీడ నిచ్చాడు. క్రియేటివిటీ..క‌మిట్‌మెంట్..క‌రేజ్ ..క‌లిగిన వాళ్ల‌కు చోటిచ్చాడు. వాళ్ల వెనుక ఉన్నాడు. ధైర్యాన్ని ఇవ్వ‌డ‌మే కాదు ..తెగువ‌ను ఎలా ప్ర‌ద‌ర్శించాలో నేర్పించాడు. ఇండియ‌న్ సెల్యూలాయిడ్ మీద చెర‌గ‌ని ముద్ర వేసేలా ప్ర‌తి టెక్నిషియ‌న్‌ను తీర్చిదిద్దాడు ఆర్‌జీవి. చూడ‌టా...

యాయిరే ..యాయిరే..రంగీలా..రే..!

చిత్రం
తెలుగువాడి ద‌మ్ము ఏమిటో..టాలెంట్ ఏమిటో..క్రియేటివిటీ అంటే ఎలా వుంటుందో ప్ర‌పంచానికి తెలియ చెప్పిన ఒకే ఒక్క‌డు రాం గోపాల్ వ‌ర్మ‌. శివ సినిమాతో తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన ఈ ద‌ర్శ‌కుడి దెబ్బ‌కు ఒక్క‌సారిగా హిందీ సినిమా కుదుపుల‌కు లోనైంది. జాతి యావ‌త్తు మొద‌టిసారిగా ..మెయిన్ స్ట్రీమ్‌లో తీసిన ఈ మూవీ కొత్త రికార్డుల‌ను తిర‌గ రాసింది. ఒకే మూస ధోర‌ణికి అల‌వాటు ప‌డిన సినీ ప్రేక్ష‌కుల‌ను ముఖ్యంగా ముంబ‌యిని ర‌ఫ్ఫాడించింది. వ‌సూళ్ల‌లో బాక్సాఫిస్ బ‌ద్ద‌లు కొట్టింది. కోట్లు కుమ్మ‌రించేలా చేసింది. కంటెంట్ ప‌రంగా ..స్క్రీన్ ప్లే ప‌రంగా..మ్యూజిక్ ప‌రంగా ఎంతో ఉన్న‌త స్థాయికి తీసుకు వెళ్లిన ఘ‌న‌త ఒన్ అండ్ ఓన్లీ డైన‌మిక్ డైరెక్ట‌ర్ వ‌ర్మ‌కే ద‌క్కుతుంది. త‌న సంగీతంతో మెస్మ‌రైజ్ చేసిన ఘ‌న‌త అల్లా రఖా రెహ‌మాన్ మొద‌టిసారిగా హిందీ సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. త‌న ప‌వ‌ర్ ఏమిటో ఇండియ‌న్స్‌కు తెలియ చెప్పారు. హీరోయిజం ..మేన‌రిజం చ‌ట్రంలో ఇరుక్కు పోయిన హీరో, హీరోయిన్లను మాస్ వ‌ర‌కు తీసుకు పోయాడు. ముంబ‌యిని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంతో ఏలుతున్న సినీ దిగ్గ‌జాల‌ను కోలుకోలేకుండా చేశాడు వ‌ర్మ...