పోస్ట్‌లు

యాయిరే ..యాయిరే..రంగీలా..రే..!

చిత్రం
తెలుగువాడి ద‌మ్ము ఏమిటో..టాలెంట్ ఏమిటో..క్రియేటివిటీ అంటే ఎలా వుంటుందో ప్ర‌పంచానికి తెలియ చెప్పిన ఒకే ఒక్క‌డు రాం గోపాల్ వ‌ర్మ‌. శివ సినిమాతో తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన ఈ ద‌ర్శ‌కుడి దెబ్బ‌కు ఒక్క‌సారిగా హిందీ సినిమా కుదుపుల‌కు లోనైంది. జాతి యావ‌త్తు మొద‌టిసారిగా ..మెయిన్ స్ట్రీమ్‌లో తీసిన ఈ మూవీ కొత్త రికార్డుల‌ను తిర‌గ రాసింది. ఒకే మూస ధోర‌ణికి అల‌వాటు ప‌డిన సినీ ప్రేక్ష‌కుల‌ను ముఖ్యంగా ముంబ‌యిని ర‌ఫ్ఫాడించింది. వ‌సూళ్ల‌లో బాక్సాఫిస్ బ‌ద్ద‌లు కొట్టింది. కోట్లు కుమ్మ‌రించేలా చేసింది. కంటెంట్ ప‌రంగా ..స్క్రీన్ ప్లే ప‌రంగా..మ్యూజిక్ ప‌రంగా ఎంతో ఉన్న‌త స్థాయికి తీసుకు వెళ్లిన ఘ‌న‌త ఒన్ అండ్ ఓన్లీ డైన‌మిక్ డైరెక్ట‌ర్ వ‌ర్మ‌కే ద‌క్కుతుంది. త‌న సంగీతంతో మెస్మ‌రైజ్ చేసిన ఘ‌న‌త అల్లా రఖా రెహ‌మాన్ మొద‌టిసారిగా హిందీ సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. త‌న ప‌వ‌ర్ ఏమిటో ఇండియ‌న్స్‌కు తెలియ చెప్పారు. హీరోయిజం ..మేన‌రిజం చ‌ట్రంలో ఇరుక్కు పోయిన హీరో, హీరోయిన్లను మాస్ వ‌ర‌కు తీసుకు పోయాడు. ముంబ‌యిని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంతో ఏలుతున్న సినీ దిగ్గ‌జాల‌ను కోలుకోలేకుండా చేశాడు వ‌ర్మ...

ప‌ర్‌దేశి ..ప‌ర్‌దేశి జానా న‌హీ..ముజే ఛోడ్ కే..!

చిత్రం
!...నువ్వు వెళ్లిపోతే నేనుండ లేను. స‌మ‌స్తం నువ్వైన‌ప్పుడు నేను నేనుగా ఎలా వుండ‌గ‌ల‌ను..? గుండె నిండా నువ్వే నిండి పోయిన‌ప్పుడు ..నా అడుగుల్లో నీ స‌వ్వడి వింటున్న‌ప్పుడు ..నా ఆలోచ‌న‌ల్లో నువ్వు త‌చ్చ‌ట్లాడుతున్న‌పుడు ..నీ త‌ల‌పుల్లో నా త‌నువు మ‌మేక‌మైన‌ప్పుడు..స‌మ‌స్త‌మంతా నీ జ్ఞాప‌కాలు తోడేస్తుంటే..నేను మ‌నిషిగా ఎలా వుండ‌గ‌ల‌ను..? ఇలా హృద‌యాల‌ను క‌ట్టి ప‌డేసి..క‌న్నీళ్లు చెమ‌ర్చేలా చేసిన అద్భుత‌మైన సినిమా రాజా హిందూస్తానీ...! భార‌తీయ సినిమా చ‌రిత్ర‌ను ఈ మూవీ తిర‌గ రాసింది. బాక్సాఫీసు వ‌ద్ద వ‌సూళ్ల‌లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ మూవీ అటు అమీర్ ఖాన్‌ను ఇటు క‌రిష్మా క‌పూర్‌ల‌కు జీవితాంతం మ‌రిచి పోలేని విజ‌యాన్ని అందించింది. ఇదంతా ఆ సినిమాకు ప్రాణం పెట్టి..అహోరాత్రులు క‌ష్ట‌ప‌డి వెండితెర మీద ఆవిష్క‌రించిన ఘ‌న‌త ఒక్క‌డికే ద‌క్కుతుంది..అత‌డే ద‌ర్శ‌కుడు ద‌ర్మేష్ ద‌ర్శ‌న్. 1996 న‌వంబ‌ర్ 15 దేశ వ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేశారు. పేద కుటుంబానికి చెందిన కారు డ్రైవ‌ర్..సంప‌న్న కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రేమ‌లో ప‌డితే ఏం జ‌రుగుతుంద‌నే దానిపై స్టోరీ లైన్‌ను తీసుకుని దీనిని తీశ...

దివ్యాంగుల‌ పాలిట దైవం..మీరా షెనాయ్..!

చిత్రం
అత్యున్న‌త‌మైన సామాజిక‌వేత్త‌ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు మీరా షెనాయ్. సామాజిక‌, ఆర్థిక‌, ఉపాధి త‌దిత‌ర రంగాల‌లో అరుదైన వ్య‌క్తిగా ..బెస్ట్ సోష‌ల్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నారు. చెన్నైయిలో పుట్టినా హైద‌రాబాద్‌ను కేంద్రంగా చేసుకున్నారు. యూత్ ఫ‌ర్ జాబ్స్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఇపుడు నిరుద్యోగుల ఆశ‌ల‌కు రెక్క‌లు తొడుగుతోంది. డాక్యుమెంటేష‌న్ స్పెష‌లిస్టుగా, క‌మ్యూనికేష‌న్ ఎక్స్‌ప‌ర్ట్‌గా, మెంటార్‌గా, డైరెక్ట‌ర్‌గా, సోష‌ల్ ఇంజ‌నీర్‌గా ..ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ దిశ‌గా ఎన‌లేని కృషి చేశారు. అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నా సింపుల్‌గా ఉండ‌టం ఆమె ప్ర‌త్యేక‌త‌. ప్ర‌పంచ బ్యాంకు అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థకాల రూప‌క‌ల్ప‌న‌లో ..ప్ర‌ధాన‌మైన డాక్యుమెంట్స్ రూపొందించ‌డంలో మీరా షెనాయ్ కీల‌క పాత్ర పోషించారు. ఎవ‌రికైనా ప్ర‌తిభ వుంటుంది..దానికి సాన పెడితే త‌ప్ప‌కుండా త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డ‌తార‌న్న‌ది ఆమె గ‌ట్టిగా న‌మ్మారు. అందుకే యూత్ 4 జాబ్స్ కు శ్రీ‌కారం చుట్టారు. అసంఘ‌టిత రంగంలో ఉన్న పేద కుటుంబాల పిల్ల‌ల‌ను ఒకే తాటిపైకి తీసుకు రావ‌డం, వారు త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేలా చేయ‌డం దీని ఉద...

ఎనీ టైం లోన్ ..ఎప్పుడైనా ఎక్క‌డైనా - అప్పు ఇంత ఈజీనా..!

చిత్రం
సంపాదించ‌డం ఏమో కానీ ఈ లోకంలో రుణం పొందాలన్నా..అప్పు చేయాల‌న్నా స‌వాల‌క్ష నిబంధ‌న‌లు..లెక్క‌లేన‌న్ని కార‌ణాలు. ఒక్కోసారి అనుకోకుండా డ‌బ్బులున్నా స‌మ‌యానికి బ్యాంకుల‌లో..ఏటీఎంల‌లో డ‌బ్బులుండ‌వు. ఖాతాల్లో లెక్క‌లేనంత క్యాష్ వున్నా ..ఆప‌ద‌లో ఆదుకోని ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. బంగారాన్ని, ప్లాట్ల‌ను, ఫ్లాట్ల‌ను, న‌గ‌ల‌ను, ఇండ్ల కాగితాల‌ను తాక‌ట్టు పెట్టినా డ‌బ్బులు చేతికి అంద‌వు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను స్వ‌త‌హాగా అనుభ‌వించిన ఓ జంట ఏర్పాటు చేసిన సంస్థ ఏకంగా కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డిస్తోంది. ప‌క్కా ప్లానింగ్..రిజ‌ల్ట్ వ‌చ్చే దాకా క‌ష్ట‌ప‌డితే అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చ‌ని హైద‌రాబాద్ కేంద్రంగా ప్రారంభ‌మైన ఎనీ టైం లోన్ స్టార్ట‌ప్ నిరూపిస్తోంది. వీరిద్ద‌రి క‌థ ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తోంది. టైంను వేస్ట్ చేస్తూ..గ‌డిపే కంటే ఇలా డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తే కొంత‌లో కొంతైనా త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డే అవకాశం ఉంది. ఇండియాలో ఆంట్ర‌ప్రెన్యూర్స్, స్టార్ట‌ప్‌ల సంద‌డి పెరిగింది. ప్రైవేట్ సంస్థ‌లే కాకుండా ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేకంగా వీరి కోసం ఐటీ విభాగంలో భాగం చేశాయి. ఈ భార్యాభ‌ర్త‌ల‌కు ఒకానొక ...

స్ఫూర్తి శిఖ‌రాలు ..గెలుపు గాథ‌లు - సోష‌ల్ స‌మోసా సంచ‌ల‌నం..!

చిత్రం
ఒక్కొక్క‌రిది ఒక్కో పంథా. ప్ర‌పంచంలో ఎక్క‌డో ఒక చోట కొత్త ఆవిష్క‌ర‌ణ ప్రాణం పోసుకుంటోంది. చిన్న‌త‌నంలోనే అపార‌మైన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు. త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉండాల‌ని త‌ప‌న‌తో ర‌గిలి పోతున్నారు..ఇండియ‌న్ యూత్. ఒక‌రు చెబితే పాఠాలు ఎందుకు వినాలి..మ‌న‌మే క‌ష్ట‌ప‌డ‌దాం..ప‌ది మందికి బ‌తుకునిద్దాం. త్వ‌ర‌గా ఎద‌గాల‌ని అనుకోవ‌డం లేదు మేం. మా త‌ర‌మంతా స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌డం కాకుండా ఎలా అభివృద్ధికి పునాది కావాల‌నే దానిపైనే మా క్రియేటివిటికి ప‌దును పెడ‌తామంటున్నారు. ఆంట్ర‌ప్రెన్యూర్స్‌గా, స్టార్ట‌ప్‌ల‌ను స్టార్ట్ చేసి వినూత్నంగా ఆలోచించ‌డ‌మే కాకుండా ఆచ‌ర‌ణ‌లో విజేత‌లుగా నిల‌బ‌డుతున్నారు. వేలాది మందికి స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తున్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి ..స్వంత ఖ‌ర్చుల‌తో..ఎన్నో ఇబ్బందులకు గుర‌వుతూ..ప‌డుతూ లేస్తూ ..కాలంతో పాటే ప‌రుగులు తీస్తున్నారు. ప్రింట్ , మీడియా , ఎంట‌ర్ టైన్ మెంట్ రంగాలు దుమ్ము రేపుతున్నా అవి అస‌లైన విజేత‌ల గురించి ప‌రిచ‌యం చేయ‌డం లేదు. కార్పొరేట్ రంగాలు భాగ‌స్వామ్యం వ‌హించ‌డ‌మో లేదా యాజాన్య‌పు రంగంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే చేస్తుండ‌డంతో వార...

ఏపీలో రాజు ఎవ్వ‌రో..పీఠం ద‌క్కేదెవ‌రికో -బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా..ప‌వ‌న్ కు ద‌క్కేనా - వెల్ల‌డించ‌నున్న మిష‌న్ చాణ‌క్య

చిత్రం
దేశ మంత‌టా ఓ వైపు యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటే..స‌రిహ‌ద్దులో కాల్పుల మోత మోగుతుంటే..మ‌రో వైపు ఎండ వేడిమి కంటే ఎక్కువ‌గా ఎన్నిక‌ల వాతావర‌ణం అగ్గి కంటే ఎక్కువ మండుతోంది. బీజేపీ స‌ర్కార్ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎక్క‌డ కూడా త‌న‌కు ఎదురే లేకుండా చేయాల‌ని అనుకుంటోంది. ఇందు కోసం అమిత్ షా చాప కింద నీరులా త‌న ప్లాన్‌ను వ‌ర్క‌వుట్ చేసేందుకు ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు. నిన్న‌టి దాకా చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగిన టీడీపీ..బీజేపీలు ఇపుడు ఒక‌రినొక‌రు తిట్టుకోవ‌డంతోనే స‌రిపెడుతున్నారు. దేశ రాజ‌కీయాలు మ‌రింత రంజుగా మారాయి. ఎవ‌రు ఎటు వైపు వెళుతున్నారో తెలియ‌డం లేదు. బిజేపియేత‌ర పార్టీల‌న‌న్నింటిని ఒకే తాటిపైకి తీసుకురావాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎడ‌తెగ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌ల బాజా మోగ‌నుంది. ఇప్ప‌టి నుంచే చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. లెక్క‌కు మించి స‌ర్వేలు చేయించారు. మ‌రో వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడిన‌ని నిరూపించుకున్నారు. జ‌నం కోసం పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. ప్ర‌తిప‌క్ష న...

స‌ద్గురుతో సంభాష‌ణం..జీవితం ఆనంద‌మ‌యం..!

చిత్రం
ఇపుడంతా యోగుల కాలం. ఆధ్యాత్మిక‌వేత్త‌ల అడుగు జాడ‌లతో భార‌త‌దేశం పునీత‌మ‌వుతోంది. ఓ వైపు యుద్ధపు మేఘాలు క‌మ్ముకుంటున్నా..మ‌రో వైపు భ‌క్తి ప్ర‌ప‌త్తులు య‌ధాలాపంగా కొన‌సాగుతూనే వున్నాయి. పుణ్య‌క్షేత్రాలు వేద మంత్రాలతో పునీత‌మ‌వుతున్నాయి. యోగా..ధ్యానం ..జీవితం..ఆనంద‌మ‌యం కావ‌డానికి ఎన్నో ప్ర‌యోగాలు..మ‌రెన్నో అడుగులు నిరాటంకంగా కొన‌సాగుతూనే వున్నాయి. ఈ స్థ‌లం ఎంద‌రికో నీడ‌నిచ్చింది. మ‌రికొంద‌రికి బ‌తుకునిచ్చింది. ప్రపంచానికి మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూనే..నిరంత‌రం ఇబ్బందులకు గురి చేసే కాలాన్ని ఎలా ఒడిసి ప‌ట్టుకోవాలో..జీవితాన్ని ఎలా సంతోష‌మ‌యంగా మార్చుకోవాలో ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువుగా వినుతికెక్కిన జ‌గ్గీ వాసుదేవ‌న్ ఆచ‌రణాత్మ‌కంగా చూపిస్తున్నారు. వ‌య‌సు పెరిగే కొద్దీ రోగాల బారిన ప‌డ‌తాం. లేవాల‌న్నా..న‌డ‌వాల‌న్నా ఎన్నో ఇబ్బందులు..మాన‌సికంగా..శారీర‌కంగా క‌ష్టాలు..వీట‌న్నింటిని కాద‌ని ఆయ‌న పిల్లాడిలా గెంతుతారు..ఆడ‌తారు..పాడ‌తారు..క్లిష్ట‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించాలో చెబుతారు. జ‌గ్గీతో మాట్లాడుతూ వుంటే ప్ర‌పంచాన్ని మ‌రిచి పోతాం. మ‌నం మ‌న నుండి దూర‌మై పోతాం..క‌ల్మ‌షం లేని లోక‌పు దారుల్...