పోస్ట్‌లు

దివ్యాంగుల‌ పాలిట దైవం..మీరా షెనాయ్..!

చిత్రం
అత్యున్న‌త‌మైన సామాజిక‌వేత్త‌ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు మీరా షెనాయ్. సామాజిక‌, ఆర్థిక‌, ఉపాధి త‌దిత‌ర రంగాల‌లో అరుదైన వ్య‌క్తిగా ..బెస్ట్ సోష‌ల్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నారు. చెన్నైయిలో పుట్టినా హైద‌రాబాద్‌ను కేంద్రంగా చేసుకున్నారు. యూత్ ఫ‌ర్ జాబ్స్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఇపుడు నిరుద్యోగుల ఆశ‌ల‌కు రెక్క‌లు తొడుగుతోంది. డాక్యుమెంటేష‌న్ స్పెష‌లిస్టుగా, క‌మ్యూనికేష‌న్ ఎక్స్‌ప‌ర్ట్‌గా, మెంటార్‌గా, డైరెక్ట‌ర్‌గా, సోష‌ల్ ఇంజ‌నీర్‌గా ..ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ దిశ‌గా ఎన‌లేని కృషి చేశారు. అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్నా సింపుల్‌గా ఉండ‌టం ఆమె ప్ర‌త్యేక‌త‌. ప్ర‌పంచ బ్యాంకు అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థకాల రూప‌క‌ల్ప‌న‌లో ..ప్ర‌ధాన‌మైన డాక్యుమెంట్స్ రూపొందించ‌డంలో మీరా షెనాయ్ కీల‌క పాత్ర పోషించారు. ఎవ‌రికైనా ప్ర‌తిభ వుంటుంది..దానికి సాన పెడితే త‌ప్ప‌కుండా త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డ‌తార‌న్న‌ది ఆమె గ‌ట్టిగా న‌మ్మారు. అందుకే యూత్ 4 జాబ్స్ కు శ్రీ‌కారం చుట్టారు. అసంఘ‌టిత రంగంలో ఉన్న పేద కుటుంబాల పిల్ల‌ల‌ను ఒకే తాటిపైకి తీసుకు రావ‌డం, వారు త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేలా చేయ‌డం దీని ఉద...

ఎనీ టైం లోన్ ..ఎప్పుడైనా ఎక్క‌డైనా - అప్పు ఇంత ఈజీనా..!

చిత్రం
సంపాదించ‌డం ఏమో కానీ ఈ లోకంలో రుణం పొందాలన్నా..అప్పు చేయాల‌న్నా స‌వాల‌క్ష నిబంధ‌న‌లు..లెక్క‌లేన‌న్ని కార‌ణాలు. ఒక్కోసారి అనుకోకుండా డ‌బ్బులున్నా స‌మ‌యానికి బ్యాంకుల‌లో..ఏటీఎంల‌లో డ‌బ్బులుండ‌వు. ఖాతాల్లో లెక్క‌లేనంత క్యాష్ వున్నా ..ఆప‌ద‌లో ఆదుకోని ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. బంగారాన్ని, ప్లాట్ల‌ను, ఫ్లాట్ల‌ను, న‌గ‌ల‌ను, ఇండ్ల కాగితాల‌ను తాక‌ట్టు పెట్టినా డ‌బ్బులు చేతికి అంద‌వు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను స్వ‌త‌హాగా అనుభ‌వించిన ఓ జంట ఏర్పాటు చేసిన సంస్థ ఏకంగా కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డిస్తోంది. ప‌క్కా ప్లానింగ్..రిజ‌ల్ట్ వ‌చ్చే దాకా క‌ష్ట‌ప‌డితే అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చ‌ని హైద‌రాబాద్ కేంద్రంగా ప్రారంభ‌మైన ఎనీ టైం లోన్ స్టార్ట‌ప్ నిరూపిస్తోంది. వీరిద్ద‌రి క‌థ ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తోంది. టైంను వేస్ట్ చేస్తూ..గ‌డిపే కంటే ఇలా డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తే కొంత‌లో కొంతైనా త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డే అవకాశం ఉంది. ఇండియాలో ఆంట్ర‌ప్రెన్యూర్స్, స్టార్ట‌ప్‌ల సంద‌డి పెరిగింది. ప్రైవేట్ సంస్థ‌లే కాకుండా ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేకంగా వీరి కోసం ఐటీ విభాగంలో భాగం చేశాయి. ఈ భార్యాభ‌ర్త‌ల‌కు ఒకానొక ...

స్ఫూర్తి శిఖ‌రాలు ..గెలుపు గాథ‌లు - సోష‌ల్ స‌మోసా సంచ‌ల‌నం..!

చిత్రం
ఒక్కొక్క‌రిది ఒక్కో పంథా. ప్ర‌పంచంలో ఎక్క‌డో ఒక చోట కొత్త ఆవిష్క‌ర‌ణ ప్రాణం పోసుకుంటోంది. చిన్న‌త‌నంలోనే అపార‌మైన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు. త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉండాల‌ని త‌ప‌న‌తో ర‌గిలి పోతున్నారు..ఇండియ‌న్ యూత్. ఒక‌రు చెబితే పాఠాలు ఎందుకు వినాలి..మ‌న‌మే క‌ష్ట‌ప‌డ‌దాం..ప‌ది మందికి బ‌తుకునిద్దాం. త్వ‌ర‌గా ఎద‌గాల‌ని అనుకోవ‌డం లేదు మేం. మా త‌ర‌మంతా స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌డం కాకుండా ఎలా అభివృద్ధికి పునాది కావాల‌నే దానిపైనే మా క్రియేటివిటికి ప‌దును పెడ‌తామంటున్నారు. ఆంట్ర‌ప్రెన్యూర్స్‌గా, స్టార్ట‌ప్‌ల‌ను స్టార్ట్ చేసి వినూత్నంగా ఆలోచించ‌డ‌మే కాకుండా ఆచ‌ర‌ణ‌లో విజేత‌లుగా నిల‌బ‌డుతున్నారు. వేలాది మందికి స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తున్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి ..స్వంత ఖ‌ర్చుల‌తో..ఎన్నో ఇబ్బందులకు గుర‌వుతూ..ప‌డుతూ లేస్తూ ..కాలంతో పాటే ప‌రుగులు తీస్తున్నారు. ప్రింట్ , మీడియా , ఎంట‌ర్ టైన్ మెంట్ రంగాలు దుమ్ము రేపుతున్నా అవి అస‌లైన విజేత‌ల గురించి ప‌రిచ‌యం చేయ‌డం లేదు. కార్పొరేట్ రంగాలు భాగ‌స్వామ్యం వ‌హించ‌డ‌మో లేదా యాజాన్య‌పు రంగంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే చేస్తుండ‌డంతో వార...

ఏపీలో రాజు ఎవ్వ‌రో..పీఠం ద‌క్కేదెవ‌రికో -బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా..ప‌వ‌న్ కు ద‌క్కేనా - వెల్ల‌డించ‌నున్న మిష‌న్ చాణ‌క్య

చిత్రం
దేశ మంత‌టా ఓ వైపు యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటే..స‌రిహ‌ద్దులో కాల్పుల మోత మోగుతుంటే..మ‌రో వైపు ఎండ వేడిమి కంటే ఎక్కువ‌గా ఎన్నిక‌ల వాతావర‌ణం అగ్గి కంటే ఎక్కువ మండుతోంది. బీజేపీ స‌ర్కార్ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎక్క‌డ కూడా త‌న‌కు ఎదురే లేకుండా చేయాల‌ని అనుకుంటోంది. ఇందు కోసం అమిత్ షా చాప కింద నీరులా త‌న ప్లాన్‌ను వ‌ర్క‌వుట్ చేసేందుకు ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు. నిన్న‌టి దాకా చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగిన టీడీపీ..బీజేపీలు ఇపుడు ఒక‌రినొక‌రు తిట్టుకోవ‌డంతోనే స‌రిపెడుతున్నారు. దేశ రాజ‌కీయాలు మ‌రింత రంజుగా మారాయి. ఎవ‌రు ఎటు వైపు వెళుతున్నారో తెలియ‌డం లేదు. బిజేపియేత‌ర పార్టీల‌న‌న్నింటిని ఒకే తాటిపైకి తీసుకురావాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎడ‌తెగ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌ల బాజా మోగ‌నుంది. ఇప్ప‌టి నుంచే చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. లెక్క‌కు మించి స‌ర్వేలు చేయించారు. మ‌రో వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడిన‌ని నిరూపించుకున్నారు. జ‌నం కోసం పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. ప్ర‌తిప‌క్ష న...

స‌ద్గురుతో సంభాష‌ణం..జీవితం ఆనంద‌మ‌యం..!

చిత్రం
ఇపుడంతా యోగుల కాలం. ఆధ్యాత్మిక‌వేత్త‌ల అడుగు జాడ‌లతో భార‌త‌దేశం పునీత‌మ‌వుతోంది. ఓ వైపు యుద్ధపు మేఘాలు క‌మ్ముకుంటున్నా..మ‌రో వైపు భ‌క్తి ప్ర‌ప‌త్తులు య‌ధాలాపంగా కొన‌సాగుతూనే వున్నాయి. పుణ్య‌క్షేత్రాలు వేద మంత్రాలతో పునీత‌మ‌వుతున్నాయి. యోగా..ధ్యానం ..జీవితం..ఆనంద‌మ‌యం కావ‌డానికి ఎన్నో ప్ర‌యోగాలు..మ‌రెన్నో అడుగులు నిరాటంకంగా కొన‌సాగుతూనే వున్నాయి. ఈ స్థ‌లం ఎంద‌రికో నీడ‌నిచ్చింది. మ‌రికొంద‌రికి బ‌తుకునిచ్చింది. ప్రపంచానికి మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూనే..నిరంత‌రం ఇబ్బందులకు గురి చేసే కాలాన్ని ఎలా ఒడిసి ప‌ట్టుకోవాలో..జీవితాన్ని ఎలా సంతోష‌మ‌యంగా మార్చుకోవాలో ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువుగా వినుతికెక్కిన జ‌గ్గీ వాసుదేవ‌న్ ఆచ‌రణాత్మ‌కంగా చూపిస్తున్నారు. వ‌య‌సు పెరిగే కొద్దీ రోగాల బారిన ప‌డ‌తాం. లేవాల‌న్నా..న‌డ‌వాల‌న్నా ఎన్నో ఇబ్బందులు..మాన‌సికంగా..శారీర‌కంగా క‌ష్టాలు..వీట‌న్నింటిని కాద‌ని ఆయ‌న పిల్లాడిలా గెంతుతారు..ఆడ‌తారు..పాడ‌తారు..క్లిష్ట‌మైన స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించాలో చెబుతారు. జ‌గ్గీతో మాట్లాడుతూ వుంటే ప్ర‌పంచాన్ని మ‌రిచి పోతాం. మ‌నం మ‌న నుండి దూర‌మై పోతాం..క‌ల్మ‌షం లేని లోక‌పు దారుల్...

ఐఎంఎఫ్ చీఫ్ ఎక‌న‌మిస్ట్‌గా గీతా గోపినాథ్ ..!

చిత్రం
అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యున్న‌త‌మైన సంస్థ‌గా పేరొందిన అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త‌గా ఇండియాకు చెందిన గీతా గోపినాథ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఐఎంఎఫ్‌కు భార‌త్ త‌ర‌పున ఓ మ‌హిళ ఆర్థిక‌వేత్త ప్ర‌ధాన ప‌ద‌విని చేప‌ట్ట‌డం ఇదే మొద‌టిసారి. ఆర్థిక రంగంలో ఆమెకు అపార‌మైన అనుభ‌వం ఉన్న‌ది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక‌ప‌ర‌మైన వ్య‌వ‌హారాల‌లో ఎంతో ప్ర‌భావితం చూపే ఐఎంఎఫ్ సంస్థ‌కు ఓ మ‌హిళ ప‌గ్గాలు చేప‌ట్ట‌డం మ‌హిళా సాధికార‌త‌కు నిద‌ర్శ‌నం. ఈ దేశ‌పు మ‌హిళ‌లంద‌రికి ల‌భించిన అరుదైన గౌర‌వంగా భావించాల్సి ఉంటుంది. గీతా గోపినాథ్‌ది ప‌శ్చిమ బెంగాల్. 8 డిసెంబ‌ర్ 1971లో కోల్‌క‌త్తాలో జ‌న్మించారు. ఇండియ‌న్ అమెరిక‌న్ ఆర్థిక‌వేత్త‌గా ఉన్నారు. ప్ర‌పంచంలో ఉన్న‌త‌మైన యూనివ‌ర్శిటీగా పేరొందిన హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీలో ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ అండ్ ఎకన‌మిక్స్ విభాగానికి ప్రొఫెస‌ర్‌గా ..హెడ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్స్ అండ్ మాక్రో ఎక‌న‌మిక్స్ ప్రోగ్రాం, నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ఎక‌న‌మిక్ రిసెర్చ్ కు కో డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేర‌ళ రాష్ట ప్ర‌భుత్వ ముఖ్య‌...

పాట‌ల పాల‌పుంత ..గుండెల్లో గిలిగింత‌..!

చిత్రం
భార‌తీయ సినీ రంగంలో మేరున‌గ‌ధీరురాలిగా పేరు తెచ్చుకున్నారు ఆషా భోంస్లే. ఓ వైపు అక్క ల‌తా మంగేష్క‌ర్ త‌నకంటూ ఎదురే లేకుండా ..ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలుతున్న రోజుల్లో అప్పుడే విక‌సించిన అమ్మాయి గొంతులా ..పిల్ల తెమ్మ‌ర‌లా..కోకిల స్వ‌రంతో ముందుకు వ‌చ్చింది ఆషా. ల‌త ప్ర‌శాంతంగా పాడుతూ వెళుతుంటే..ఆషా మాత్రం పుల్ జోష్ మీదున్న సాంగ్స్ ఎంచుకుంది. 8 సెప్టెంబ‌ర్ 1933లో జ‌న్మించిన ఆషా..1943లో బాలీవుడ్ లోకి ఎంట‌ర్ అయ్యారు. ఇక అప్ప‌టి నుండి ఇప్ప‌టి దాకా కొన్నేళ్ల పాటు త‌న గాత్ర మాధుర్యంతో వంద‌లాది పాట‌లు పాడారు. త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను నిల‌బెట్టుకున్నారు. ఓ సాథిరే తేరెబి న‌భీ క్యా జీనా అంటూ పాడుతుంటే జ‌నం మైమ‌రిచి పోయారు. ఆ గొంతులో పిల్ల‌న గ్రో వి ఇమిడి పోయిందా అన్న స్థాయిలో ఆషా పాడ‌కుంటూ వెళ్లారు. దాదాపు 1000 సినిమాల్లో పాడి రికార్డు సృష్టించారు. ప్ర‌తి సారి అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారి పోయినవి ఎన్నో. అయినా ఆమె వెన‌క్కి త‌గ్గ‌లేదు. ల‌త అప్ప‌టికే ఇండియ‌న్ సినిమా రంగాన్ని ఏలుతున్నారు. ఆమె త‌న స్వంత చెల్లెలు కోసం ఏనాడూ సిఫార‌సు చేయ‌లేదు. నేను నిన్ను సిఫార‌సు చేస్తే ఏం లాభం..నీకంటూ నీవే క‌ష్ట‌...