ఉదయ శంకరా..మజాకా

ఎందుకో ఈవేళ మళ్లీ ఉదయ్ శంకర్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే ఏం చెప్పాలి. విజయం అంటే ఏమిటో..గెలుపులోని మజా ఏమిటో..అట్టడుగున ఉన్న సంస్థను అత్యున్నతమైన స్థాయికి తీసుకు వెళ్లగలిగే దమ్మున్న ఒకే ఒక్కడు. ఎంత చెప్పినా తక్కువే..ఇంకా ఇంకా ఎంతో చెప్పాలన్న కసి ఎక్కువవుతోంది. ఎవరీ ఉదయ్ అనుకుంటున్నారా..ఇంకెవరు..ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సక్సెస్ ఫుల్ సిఇఓ. ఇపుడు స్టార్ టీవీ గ్రూపును పరుగులు పెట్టిస్తున్నాడు. అంతే కాదు స్టార్ టీవీకి కొత్త రూపును ..ఊపును తీసుకు వచ్చాడు. వరల్డ్ వైడ్ గా స్టార్ మీడియాకు ఎనలేని డిమాండ్ ఉంటోంది. దీనికి ఓ ఇండియన్ పూర్తిగా బాధ్యతలు స్వీకరించడం. దానిని ఎవరూ ఊహించని స్థాయికి తీసుకు వెళ్లేలా చేయడం ఓ చరిత్ర. భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా..సాంప్రదాయాలు వెళ్లి విరిసేలా దేశమంతటా స్టార్ ను టాప్ పొజిషన్‌లో ఉండేలా ప్రయత్నం చేశాడు. అందులో ఉదయ్ శంకర్ సక్సెస్ అయ్యాడు. ఎక్కడా రాజీ పడని ఈ సిఇఓ ఏది చేసినా అది ఓ సెన్సేషన్. భారతీయ బుల్లితెర మీద స్టార్ రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. మిగతా టీవీ యాజమాన్యాలు అందుకోలేనంత ఎత్తుకు తీసు...