ఉద‌య శంక‌రా..మ‌జాకా

ఎందుకో ఈవేళ మ‌ళ్లీ ఉద‌య్ శంక‌ర్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే ఏం చెప్పాలి. విజ‌యం అంటే ఏమిటో..గెలుపులోని మ‌జా ఏమిటో..అట్ట‌డుగున ఉన్న సంస్థ‌ను అత్యున్న‌త‌మైన స్థాయికి తీసుకు వెళ్ల‌గ‌లిగే ద‌మ్మున్న ఒకే ఒక్క‌డు. ఎంత చెప్పినా త‌క్కువే..ఇంకా ఇంకా ఎంతో చెప్పాల‌న్న క‌సి ఎక్కువ‌వుతోంది. ఎవ‌రీ ఉద‌య్  అనుకుంటున్నారా..ఇంకెవ‌రు..ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ స‌క్సెస్ ఫుల్ సిఇఓ. ఇపుడు స్టార్ టీవీ గ్రూపును ప‌రుగులు పెట్టిస్తున్నాడు. అంతే కాదు స్టార్ టీవీకి కొత్త రూపును ..ఊపును తీసుకు వ‌చ్చాడు. వ‌ర‌ల్డ్ వైడ్ గా స్టార్ మీడియాకు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. దీనికి ఓ ఇండియ‌న్ పూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం. దానిని ఎవ‌రూ ఊహించ‌ని స్థాయికి తీసుకు  వెళ్లేలా చేయ‌డం ఓ చ‌రిత్ర‌. భార‌తీయ సంస్కృతికి అద్దం ప‌ట్టేలా..సాంప్ర‌దాయాలు వెళ్లి విరిసేలా దేశ‌మంత‌టా స్టార్ ను టాప్ పొజిష‌న్‌లో ఉండేలా ప్ర‌య‌త్నం చేశాడు.
అందులో ఉద‌య్ శంక‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌ని ఈ సిఇఓ ఏది చేసినా అది ఓ సెన్సేష‌న్. భార‌తీయ బుల్లితెర మీద స్టార్ రాకెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. మిగ‌తా టీవీ యాజ‌మాన్యాలు అందుకోలేనంత ఎత్తుకు తీసుకు వెళ్లాడు ఈ స్టార్ సిఇఓ. ఒక్క‌రే కాదు వంద‌లాది చేతులు క‌లిస్తేనే సంస్థ మ‌నుగ‌డ సాధిస్తుంది. ఈ విజ‌యంలో క‌నిపించ‌ని వ్య‌క్తులు త‌మ శ్ర‌మ‌ను ధార‌పోస్తున్నారు. అక్క‌డ ఆకాశంలో న‌క్ష‌త్రాల్లాగా మీడియా రంగంలో కూడా స్టార్ త‌న స్థానాన్ని ప‌దిలంగా ఉంచుకుంటోంది. ఇందు కోసం వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వినియోగించుకుంటూ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంది. దీనిని ఊహించ‌ని స్థాయికి తీసుకు వెళ్లేలా ఉద‌య్ శంక‌ర్ నిత్యం క‌ష్ట‌ప‌డుతున్నారు. తాను ముందుండి న‌డిపిస్తున్నారు.
స‌క్సెస్ అంటే ఏమిటో తెలుసు కోవాలంటే..త‌న‌ను చూసి నేర్చు కోవాల్సిందే. స్టార్ టివి టీంలో ఉద‌య్ శంక‌ర్ కెప్టెన్ అయితే..మ‌రికొంద‌రు ఇందులో కీల‌క భూమిక పోషిస్తున్నారు. వారిలో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ పీపుల్ ఉన్నారు.స్టార్ డిస్నీ సంస్థ‌కు ఉద‌య్ ప్రెసిడెంట్ అండ్ ఛైర్మ‌న్, సిఇఓ గా ఉన్నారు. కె.మాధ‌వ‌న్ , స్టార్ డిస్నీకి మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సంజ‌య్ జైన్ చీఫ్, ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్‌గా ఉండ‌గా సౌత్ బిజినెస్ సిఇఓగా కెవిన్ వాజ్ ఉన్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఇండియా సిఇఓగా విజ‌య్ సింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక భార‌తీయుల హృద‌యాల‌ను కొల్ల‌గొడుతున్న స్టార్ టీవి స్పోర్ట్స్ సిఇఓ గా గౌతమ్ ఠాకూర్ ఉండ‌గా ఇక హ్యూమ‌న్ అండ్ రిసోర్సెస్ ప్రెసిడెంట్ గా అమితా మ‌హేశ్వ‌రి బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.
స్టార్ టీవీ జ‌న‌ర‌ల్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా దీప‌క్ జాక‌బ్ ఉండ‌గా హిందీ జిఇసీ అధ్య‌క్షుడిగా గౌర‌వ్ బెన‌ర్జీ ఉంటే డిస్ట్రిబ్యూష‌న్ అధ్య‌క్షుడిగా గుర్జీవ్ సింగ్ క‌పూర్, స్ట్రాట‌జీ అండ్ ఇంక్యూబేష‌న్ హెడ్ గా ఇస్పితా దాస్ గుప్తా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ మొత్తం విన్నింగ్ జ‌ర్నీలో వీరే కీల‌కం. ఉద‌య్ సింగ్ ఎక్క‌డా త‌గ్గ‌డు. ఎవ‌రి మాటా విన‌డు. అంద‌రి మాటా వింటాడు. ఒక్క‌సారి క‌మిట్ అయితే చాలు ఇక వెన‌క్కి చూడ‌డు. ఎంతో ముందు చూపుతో స్టార్ టీవీని టాప్ రేంజ్ లోకి తీసుకు వెళ్ల‌డ‌మే కాదు లాభాల బాట‌లోకి తీసుకు వెళ్లాడు. చ‌దువుకుంటున్న యువ‌తీ యువ‌కులు, జీవితంలో పైకి రావాల‌నుకునే వాళ్లు, ఆయా సంస్థ‌ల్లో ఉన్న‌త స్థాయిలో ఉన్న వాళ్లు..అన్ని రంగాల‌కు చెందిన వారు గెలుపొందాలంటే ఎక్క‌డికో వెళ్లాల్సిన ప‌ని లేదు..ఉద‌య్ శంక‌ర్ ను చూస్తే చాలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!