పోస్ట్‌లు

తలైవాతో తీరిన కల

చిత్రం
తమిళ సినీ అభిమానులు ప్రేమగా పిలుచుకునే తలైవా రజనీకాంత్ నటించిన దర్బార్ సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీని పాన్ డైరెక్టర్ మురుగదాస్ తెలుగు, తమిళ్, హిందీలలో తీశాడు. తాను అందరి లాగే రజనీకాంత్ ను చూసి పెరిగా. ఆయనతో సినిమా తీయాలన్న కోరిక అలాగే ఉండి పోయింది. ఇప్పుడు దర్బార్ తో తీరింది. దీని కోసం దాదాపు 15 ఏళ్ళు వేచి చూసా అని చెప్పారు డైరెక్టర్ మురుగదాస్. ఒకే కథతో వెళితే ఏం బావుంటుంది. అందుకే పలు కథలతో రజనీకాంత్ సర్ ఇంటికి వెళ్ళా. ఆయన ఒకే చెప్పారు. నాలో ఆనందం రెట్టింప్పయింది. అంతకు ముందు తలైవాతో సినిమాకు కాల్ రావడం నా జీవితంలో మరిచి పోలేను. ఇదే విషయం సినీ ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్‌లోనూ సినిమా కుదరక పోవచ్చు. అలా జరగ కూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు అషన్స్ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీ సార్‌ దగ్గరకు వెళ్లాను అని మురుగదాస్‌ వెల్లడించారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్బార్‌ పేరుతో సినిమా తీశాడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో రిలీజ్‌...

విశాల్ కు ప్రియా గ్రీన్ సిగ్నల్

చిత్రం
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రియుడు, యువ తమిళ నటుడు విష్ణు విశాల్ మరోసారి వైరల్ గా మారాడు. ఎప్పుడూ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా లో చురుకుగా ఉండటం ఈ నటుడికి అలవాటు. ఇంతకు ముందు వరకూ తన చిత్రాలకు సంబంధించిన వార్తలో ఉండేవారు. ఇప్పుడు ప్రియురాలు, ప్రేమ అంటూ వార్తలో నానుతున్నారు. గుత్తా జ్వాల ప్రేమలో మునిగి తేలుగున్నట్లు సోషల్ మీడియాలో అవుతోంది. నటుడిగా మాత్రం బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం జగజ్జాల కిల్లాడి, ఎఫైఆర్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా విష్ణు విశాల్‌ ఇంతకు ముందు సిలుక్కువార్‌ పట్టి సింగం చిత్రంలో నటించడంతో పాటు దాని నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. దీనికి సెల్లా ఆయ్యావు  దర్శకుడు. ఈ చిత్రం 2018 డిసెంబర్‌లో విడుదలయ్యింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందు కోలేదు. అయినా విష్ణువిశాల్‌ ఈ దర్శకుడికి తాజాగా మరో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబినేషన్‌లో కొత్త చిత్రానికి సంబంధించిన ఫ్రీ పొడక్షన్‌ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కాగా ఇందులో విష్ణు విశాల్‌కు జంటగా నటి ప్రియా భవానీ శంకర్‌ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథ వినిపించినట్లు...

అనిల్ కు పుత్రోత్సాహం

చిత్రం
ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడికి కొత్త ఏడాది కలిసి వచ్చినట్టుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా తీసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ ప్రిన్స్ తో తీసిన సినిమా సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కు రెడీ అయ్యింది. సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్స్ కు భారీ ఆదరణ లభించింది. కాగా డైరెక్టర్ అనిల్ కు కుమారుడు పుట్టాడు. ఇది వరకు రావిపూడి.. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 లాంటి హిట్‌ సినిమాలను అందించాడు. అతని సినిమా వస్తుందంటే చాలు ఒక్కసారైనా చూడాల్సిందే అనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఓటమి చవి చూడని దర్శకుడిగా అనిల్‌ రావిపూడికి టాలీవుడ్‌లో ముద్ర పడి పోయింది. వినూత్న కామెడీతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించే శక్తి అనిల్‌ రావిపూడి సొంతం. గతేడాది ఎఫ్‌2తో బాక్సాఫీస్‌ దగ్గర నవ్వులు కురిపించన అనిల్‌ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాకు పని చేస్తున్నారు. అనిల్‌ రావిపూడికి కొడుకు పుట్టడంతో కుటుంబంలో సంతోషం నెలకొంది. దీంతో అనిల్‌ ఇంట్లో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్టయింది. కాగా అనిల్‌, భావనల జంటకు శ్రేయాస్వి అనే కూతురు ఉంది. కూతురుతో ఆడుకోడానికి మరో బుడతడు వచ్చేయడంతో ఆ ఇంట్...

ఇరాన్ పై పెద్దన్న కన్నెర్ర

చిత్రం
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశ పౌరులపై గానీ, ఆస్తులపై గానీ దాడులు జరిగితే చూస్తు ఊరు కోబోమని స్పష్టం చేశారు. చాలా వేగంగా..తీవ్రంగా స్పందిస్తామని తెలిపారు. ఇరాన్‌లోని 52 ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని వెల్లడించారు. ఆ లక్ష్యాల్లో ఇరాన్‌లోని ముఖ్య ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇరాన్‌ సహా తమను బెదిరించే వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునేంతటి శక్తి అమెరికాకు ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఒక ఉగ్రవాద నాయకుడిని చంపితే..ఇరాన్‌ అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడుతోంది. ఇప్పటికే ఖాసీం సులేమాని మా రాయబార కార్యాలయంపై దాడి చేశాడు. అలాగే తమకు చెందిన ప్రాంతాలపై, ఆస్తులపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. విదేశాల్లోని అమెరికా ప్రజలకు గానీ, ఆస్తులను తాకాలని ఇరాన్‌ భావిస్తే ఇది వారికి ఒక హెచ్చరిక అవుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైనిక జనరల్‌ ఖాసీం సులేమాని, ఇరాకీ పా...

ఎన్సీపీకి ముఖ్య పదవులు

చిత్రం
మరాఠాలో కొత్తగా కొలువుతీరిన సంకీర్ణ సర్కారులో కీలక మంత్రి పదవులన్నీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థులకే లభించాయి. ఒఊహించని రీతిలో బీజేపీకి గుడ్ బై చెప్పిన శివసేన తో బద్ద శత్రువులైన కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పావులు కదిపారు పవార్. అంతే కాదు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు కలిసేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది దేశ రాజకీయాల్లో ఓ చరిత్రకు నంది పలికిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఓ వైపు దేశంలో అత్యంత బలీయమైన శక్తులుగా అవతరించారు ప్రధాని నరేంద్ర మోదీజీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా. వీరిద్దరిని ఎదుర్కొని నిలబడటం, రాజకీయంగా పోరాడటం కష్టం. కానీ అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశారు శరద్ పవార్. మహారాష్ట్రలో మొదటి సారిగా ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా చేసిన ఘనత మాత్రం ఈ రాజకీయ చాణిక్యుడిదే. అప్పుడో ఇప్పుడో అంటూ నెట్టుకుంటూ వస్తున్న ఈ సంకీర్ణ సర్కార్ ఐదేళ్లు పాలన సాగిస్తుందా అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. అయినా ఎప్పుడూ కూల్ గా పాజిటివ్ దృక్పథంతో ఉండే ఉద్దవ్ సీఎం గా ఉంటారని శివసేన నాయకులూ, కార్యకర్తలు నమ్మకాన్ని వ్యక్తం చ...

సర్వ దర్శనం కోసం తిరుమల సిద్ధం

చిత్రం
కోట్లాది భక్తుల కొంగు బంగారంగా భావించే తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలకు లక్షలాదిగా విచ్చేసే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. వేంకటేశ్వరుడికి  ఏకాంతంగా పూజాది  కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 2 గంటలకే దర్శనాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహావిష్ణువుకు ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనవి. ధనుర్మాస నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాల్లో తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామి వారు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా వెలుపలికి వచ్చి భక్తులకు దర్శమిస్తారు. ఇదే సమయంలో  భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ద్వార ప్రవేశంతో పాటు స్వామి వారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ఇదే పర్వదిన సమయంలో శ్రీవారు ప్రత్...

రియల్ బూమ్ రయ్ రయ్

చిత్రం
ఓ వైపు ఆర్థిక మందగమనం భారత దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మరో వైపు అమెరికా ఇరాన్ ను టార్గెట్ చేసింది. అంతే కాదు చైనాపై గురువు మంటోంది. ఇండియాకు కూడా ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. చివరకు ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ మోదీ చేసిన మంత్రాంగంతో యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దిగి వచ్చారు. అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ రక్తి కట్టిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం కారణంగా ఆర్ధిక రంగాన్ని తీవ్ర ప్రభావితం చేస్తోంది. అయినా దీనిని కాదని రియల్, కంస్ట్రక్షన్ రంగాలు ఐటీ హబ్ హైదరాబాద్ లో జోరుమీదున్నాయి. దీంతో నగరాన్ని వికేంద్రీకరణ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లోనే  కనిపించింది. దీనికి ఎక్కడ లేనంత డిమాండ్ వచ్చింది. ఐటీ కేంద్రంగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట వరకు ఎకరం భూమి ధర కోట్లాది రూపాయలను దాటేసింది. మెరుగైన రవాణా, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో..కంపెనీలన్నీ అటు వైపు మొగ్గు చూపాయి. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ కు దగ్గరగా, ఓఆర్ఆర్ ఆనుకుని ఉండటంతో, సౌత్ సిటీలోనూ రియల్ ఎస్టేట్ విస్తరిస్...