పోస్ట్‌లు

అజ్జూకు అరుదైన గౌరవం

చిత్రం
భారత మాజీ క్రికెట్ సారధి, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు మహమ్మద్ అజహరుద్దీన్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఇప్పటికే ఈ అతగాడికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి. ఇండియా జట్టుకు ఎనలేని విజయాలు నమోదు చేసిన ఆటగాడిగా పేరుంది. ప్రస్తుతం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో  అజహరుద్దీన్‌ పేరిట ఒక స్టాండ్‌ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్తర్న్‌ పెవిలియన్‌లోని స్టాండ్స్‌లలో ఒక దానిని అజహర్‌ స్టాండ్‌గా వ్యవహరిస్తారు. డిసెంబర్‌ 6న భారత్, వెస్టిండీస్‌ మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్‌ సమయంలో అధికారికంగా స్టాండ్‌కు పేరు పెడతామని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వెల్లడించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ క్రికెటర్లు అర్షద్‌ అయూబ్, వెంకటపతి రాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా ఆయన చెప్పారు. మరో వైపు సౌత్‌ పెవిలియన్‌ బ్లాక్‌లోని ఒక లాంజ్‌కు హెచ్‌సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్‌.దయానంద్‌ పేరు కూడా పెట్టనున్నారు. టి20 మ్యాచ్‌ కోసం నేటి నుంచి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ...

ఫ్రాంచైజీలపై రాహుల్ ఫైర్

చిత్రం
మాజీ భారత జట్టు సారధి, ప్రస్తుత క్రికెట్ అకాడెమీ బాధ్యుడు రాహుల్ ద్రవిడ్ ఫ్రాంచైజీలపై నిప్పులు చెరిగారు. సామాన్యంగా తనపని తాను చేసుకుని పోయే స్వభావం ఉన్న వ్యక్తి. ఉన్నట్టుండి తన మనసులోని అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇండియాలో ప్రస్తుతం ఐపీఎల్ హవా కొనసాగుతోంది. కోట్లాది రూపాయల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కంపనీలు దీనిపై కన్నేశాయి. అంతే కాకుండా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. అయితే ఫ్రాంచైజీలు మాత్రం భారత సీనియర్ ఆటగాళ్లను అస్సలు పరిగణలోకి తీసు కోవడం లేదు. దీనిపై ది వాల్ తీవ్రంగా స్పందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భారత క్రికెట్ కోచ్ లను తీసుకోకుండా ఫ్రాంచైజీలు తప్పు చేస్తున్నాయని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయ పడ్డాడు. లీగ్‌లో ఎక్కువ మంది మన ఆటగాళ్లే ఉంటారని, వారిని అర్థం చేసు కోవడంలో ఇండియన్ కోచ్ లే ముందుంటారని స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రతిభా వంతులైన కోచ్‌లు మనకు అందుబాటులో ఉన్నారని, హెడ్‌ కోచ్‌గా పెట్టుకునే అవకాశం∙లేకపోతే కనీసం, అసిస్టెంట్‌ కోచ్‌గానైనా ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఈ దిగ్గజ ద్రవిడ్‌ సూచించాడు. ...

బంధాలే కీలకం..కథకు ప్రాణం

చిత్రం
దేనికైనా కుటుంబమే ముఖ్యం. కథైనా లేదా పాటలైనా, మాటలైనా అన్నీ ఇందులోంచి వచ్చినవే. అందుకే బంధాల అనుబంధాలను, వాటిలోని భావోద్వేగాలను తెరమీద చూపించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నారు వర్ధమాన దర్శకుడు సుందర్ సూర్య. ఆప్యాయతలు.. అనుబంధాలంటే ఆయనకు చాలా ఇష్టం. పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మ ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో రాణిస్తున్నా అంటున్నారు. 12 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఆనంద క్షణాల్ని గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్న లైన్‌ ఆధారంగానే అమ్మమ్మగారి ఇల్లు సినిమా తీశా అంటున్నారు సూర్య. కథా చర్చల కోసం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. అందుకే దీనినే ఎంచుకున్నారు. కుటుంబంలో పెద్దన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి, చిన్నన్నయ్య వ్యాపారి. నచ్చిన రంగంలో రాణించాలని అమ్మ మణి ప్రోత్సహించింది. ఆమెకు చాలా రుణపడి ఉన్నా. మనసుకు నచ్చిన పని చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదు. దీనిని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే చిత్ర పరిశ్రమలో నిలదొక్కు కోవాలనే బలమైన కాంక్షతో ముందుకు సాగుతున్నా అని చెప్పారు ఈ యంగ్ డైరెక్టర్. అమ్మమ్మ గారి ఇల్లు చిత్రీకరణ నా బలమైన ఆకాంక్షను ...

హబ్బీకీ ప్రియాంక లవ్లీ గిఫ్ట్

చిత్రం
‘వైట్‌ టైగర్‌’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నారు బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. మరికొన్ని రోజుల్లో ఈ గ్లోబల్‌ స్టార్‌ మొదటి పెళ్లి రోజును జరుపు కోబోతున్నారు.  2018 డిసెంబర్‌ 1న వీరి వివాహం అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రియాంక అమెరికాకు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ వెళ్లిన ప్రియాంక భర్త హలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. జెర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన ఓ కుక్క పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి ‘గినో’ గా అప్పుడే పేరు కూడా పెట్టేశారు. ఇందుకు నిక్‌ నిద్రలేవక ముందే కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చి ప్రియాంక సర్‌ప్రైజ్‌ చేశారు. ఇదంతా వీడియో తీసిన ప్రియాంక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  దీనికి ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు. హ్యపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇ​క దీనిపై స్పందించిన నిక్‌..ఉదయాన్నే నాకు మంచి బహుమతి అందింది. మా గిల్‌కు హాయ్‌ చెప్పండి. నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను. థాంక్యూ ప్రియాంక అంటూ తెలిపారు. కాగా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఇంటిలో డయానా అనే కుక్క ...

సర్కార్ తీస్తానంటున్న వర్మ

చిత్రం
సంచలనాలకు కేరాఫ్ గా మారిన దమ్మున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఏది మాట్లాడినా లేదా ఏది తీసినా అది వివాదాస్పదం అవుతోంది. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో వర్మ మూవీ తీశాడు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే పలు ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఇంకా ఈ సినిమాకు సెన్సార్ సెర్టిఫికెట్ రాలేదు. అయినా తాను మాత్రం ఆగనంటున్నాడు ఈ డైనమిక్ దర్శకుడు. మరాఠాలో బాల థాక్రే ఏర్పాటు చేసిన శివ సేన మొదటి సారిగా అధికారంలోకి వచ్చింది. గతంలో రామ్ గోపాల్ వర్మ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సర్కార్ సినిమా తీశారు. ఇది బాల్ థాక్రే కు చెందిన మూవీ. అది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే తన మనసులోని మాట బయట పెట్టారు వర్మ. సర్కార్ సినిమాను మరోసారి తీయాలని ఉందన్నారు. బయట, సోషల్‌ మీడియాలో నాపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి నాకు బాగా తిట్టించు కోకపోతే నిద్రపట్టదు. నాలో అలాంటి బుద్ధి ఒకటి డెవలప్‌ అయ్యింది. ఎవరైనా పొగిడితే నాకు నిద్ర వస్తుంది అంటున్నారు ఈ డైరెక్టర్. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల చే...

ఓటమిని ఒప్పుకోను..గెలిచేదాకా నిద్రపోను

చిత్రం
ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా, విమర్శలు గుప్పించినా నేను పట్టించుకోను. నేను చేసిన సినిమాలు సక్సెస్ కావొచ్చు. కాక పోవచ్చు. వాటిపై నిజాయితీగా కామెంట్స్ చేస్తే ఒప్పుకుంటా. కానీ నా మూవీస్ చూడకుండా అర్థం లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఒప్పుకోను. ఓటమిని తేలిగ్గా తీసుకోను. అయితే గెలిచేదాకా నిద్ర పోను అని స్పష్టం చేశారు ప్రముఖ యంగ్, డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ. ఇదిలా ఉండగా నా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆడినా.. ఆడక పోయినా నేను పట్టించుకోను కానీ ఆ తర్వాత ఓ నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటున్నాడు అర్జున్‌ రెడ్డి. ఇటీవల విజయ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేక పోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా, ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవారని వెల్లడించారు. విజయ్‌ గోవాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమంలో పాల్గొన్నాడు. డియర్‌ కామ్రేడ్‌ సినిమాపై ఓ చిన్న అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా విడుదలైన సమయ...

రౌడీపై పార్వతి ఫైర్

చిత్రం
అర్జున్‌ రెడ్డి సినిమా విడుదలై రెండేళ్లు అయినా ఇంకా ఆ సినిమాపై వివాదాలు మాత్రం రాజు కుంటూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కబీర్‌ సింగ్‌ పేరుతో హిందీ లోనూ తెర కెక్కించడంతో విమర్శకులు మండి పడిన విషయం తెలిసిందే.  ఈ చిత్రాలపై మలయాళ నటి పార్వతీ మీనన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించే దాన్నే కాదంటూ కుండ బద్ధలు కొట్టారు. తాజాగా గోవా ఫిల్మ్‌ ఫెస్ట్‌వల్‌ వేదికలో విజయ్‌ దేవరకొండ ఎదురు పడగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వది లేస్తాం. అయితే అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంప దెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండి, యువతను ప్రేరేపించేదిగా ఉంది. అయితే ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను, కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను అని పార్వతి పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్‌ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం. నటి పార్వతీ మీనన్‌ వ్యాఖ్యలపై హీరో విజయ్‌ రెస్పాండ్ అయ్యారు. ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడు...