పోస్ట్‌లు

అందరి చూపు ఈడెన్ వైపు

చిత్రం
ప్రపంచంలోనే అత్యున్నతమైన క్రికెట్ ఆటకు వేదికైన ఈడెన్ గార్డెన్స్ మరో చరిత్రకు నాంది పలకబోతోంది. గులాబీ గుబాళింపులన్నీ సిటీ ఆఫ్‌ జాయ్‌ లోనే కనిపిస్తున్నాయి. కోల్‌కతాలో ఎక్కడ చూసినా ఇప్పుడు పింక్‌ టెస్టు పలుకులే. క్రికెట్‌ను ప్రేమించే చారిత్రక నగరానికి ఇప్పుడు కొత్త శోభ చేకూరింది. తొలిసారి జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టును విజయవంతం చేసేందుకు కోల్‌కతా వాసులంతా ప్రయత్నం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పింక్‌ టెస్టును సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు, చిరస్మరణీయంగా మార్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లూ చేశాడు. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరిగే డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌కు పలు ఆకర్షణలు తోడవుతున్నాయి. గతంలో భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం ఈ సారి కూడా ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉండటం కూడా వారికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆతిథ్యం అద్భుతంగా ఉండేందుకు ‘క్యాబ్‌’ అన్ని ఏర్పాట్లు చేసింది. స్వయంగా గంగూలీనే అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. టెస్టు మ్యాచ్‌ సందర్భంగా చేయబోయే ప్రత్యేక కార్యక్రమాల గురించి వెల్లడించారు. బంగ్లాదేశ్‌...

మేఘా సక్సెస్..ఫోర్బ్స్ లో పబ్లిష్

చిత్రం
ఇండియాలో బిగ్గెస్ట్ నిర్మాణ కంపెనీగా ఇప్పటికే పేరొందిన ఎంఈఐఎల్‌ మరో చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజిన్ కలెక్టర్స్‌ ఎడిషన్‌ 2019లో మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్‌లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్‌ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్‌ జాబితా విడుదల చేసింది. 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేఘా బిల్డర్‌ పేరుతో ఫోర్బ్స్‌ స్టోరీ ప్రచురించింది. పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన మేఘా ఇంజనీరింగ్, అటు తర్వాత సాగించిన అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది.14 బిలియన్‌ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే జోర్డాన్...

ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ క్లోజ్

చిత్రం
భారతీయ ఆర్ధిక రంగం ఎన్నడూ లేని రీతిలో కుదుపునకు లోనవుతోంది. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన పేమెంట్స్ బ్యాంకులన్నీ ఇప్పుడు మోడీ తీసుకున్న నోట్ల రద్దు దెబ్బకు దివాళా అంచున నిలబడ్డాయి. ఇప్పటికే కొన్ని పేమెంట్స్ బ్యాంకులు తీవ్ర నష్టాలతో ఒడిడుకులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా మరో పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేతకు సిద్ధమైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌కు తాజాగా ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్‌ ఈ ఏడాది సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేసిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్‌ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్‌ నియమించిందని వివరించింది. అయ్యర్‌ డెలాయిట్‌ టచ్‌ తొమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీలో సీనియర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించ లేమని, స్వచ్ఛంద మూసివేతను జూలై లోనే ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 2015 ఆగస్టులో ఆర్‌బీఐ మొత్త...

దిగ్గజ కంపెనీలకు రియల్ మి షాక్

చిత్రం
స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో చైనాకు చెందిన కంపెనీలే తమ హవాను కొనసాగిస్తున్నాయి. వరల్డ్ మార్కెట్ లో ఇప్పటికే షావో మి ఏకంగా ఐదో ప్లేస్ కు చేరుకుంది. దిగ్గజ యాపిల్, శాంసంగ్ కంపెనీలను దాటుకుని ఇండియన్ మార్కెట్ ను రెడ్ మి శాసిస్తోంది. ఇప్పటికే 10 లక్షల మొబైల్స్ అమ్మి రికార్డు బ్రేక్ చేసింది. లెనోవా, మోటరోలా, వివో , షావోమి , రియల్ మి మొబైల్స్ కంపెనీలన్నీ ఇప్పుడు చైనాకు చెందినవే. తాజాగా శాంసంగ్ మడత ఫోన్ ను లంచ్ చేసింది చైనాలో. దీని ధర లక్షా 75 వీలుగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోటరోలా కంపెనీ సైతం 5 జీ స్మార్ట్ ఫోన్ ను ప్రదర్శనలో ఉంచింది. మరో వైపు మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు రియల్ మి అద్భుతమైన ఫీచర్స్ తో కొత్తగా పలు మోడల్స్ తో రిలీజ్ చేసింది. తాజాగా రియల్‌ మి..ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్లస్‌ చిప్‌ అమర్చిన ఈ మోడల్‌ రెండు వేరియంట్లలో లభిస్తుండగా 8జీబీ,128జీబీ ధర 29,999 వద్ద నిర్ణయించింది.12జీబీ, 256జీబీ వేరియంట్‌ ధర 33,999. వీటిలో 64 మెగా పిక్సెల్‌ క్వాడ్‌ కెమెరాను అమర్చింది. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ స్మా...

బస్సులు నడిచేనా..కష్టాలు తీరేనా

చిత్రం
షరతులు విధించ కుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయో లేదోనన్న ఆందోళన ప్రయాణీకుల్లో నెలకొంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 46 రోజుల పాటు సమ్మె కొనసాగింది. ఈ సమ్మెను ప్రభుత్వం మొదటి నుంచి చట్ట విరుద్ధంగానే భావిస్తోంది. కార్మికులపై అనేక ఆంక్షలు విధించింది. విధుల్లో చేరేందుకు రెండు సార్లు గడువు విధించింది. కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మెను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు లభించ కుండానే తమంతట తాముగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని అన్ని డిపోల్లో డ్రైవర్లు,కండక్టర్లతో సహా సిబ్బంది విధుల్లో చేరే అవకాశాలు వున్నాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకుంటుందా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం రెండు సార్లు విధించిన గడువుల్లో కొందరు విధుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గడువు తరువాత వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు నిర...

సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్

చిత్రం
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్ లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ వంటి ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా షేర్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌  లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 71.86కు చేరినప్పటికీ, మన మార్కెట్‌ ముందుకే దూసుకు పోయింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,816 పాయింట్లను తాకిన సెన్సెక్స్‌ చివరకు 182 పాయింట్ల లాభంతో 40,652 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపునకు 2 పాయింట్లు తక్కువ. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌కు ఒక పాయింట్‌ తక్కువగా 11,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 99 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, చివరకు 59 పాయింట్ల లాభంతో సరి పెట్టుకుంది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో 346 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్‌ హై, 40,816 పాయింట్లను తాకింది. సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైకు చేరడం, నిఫ్టీ ఇంట్...

సర్కారుదే ఆలశ్యం..సమ్మె విరమణకు సిద్ధం

చిత్రం
అలుపెరుగకుండా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ముగింపు దశకు చేరుకుంది. ఎలాంటి షరతులు విధించ కుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. సమ్మె వ్యవహారాన్ని కార్మిక న్యాయ స్థానమే తేల్చాలని, దీనికి రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ హైకోర్టు కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించింది. ఈ వ్యవహారం ఇప్పుడు కార్మిక శాఖకు చేరింది. దీంతో కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జేఏసీ వెల్లడించింది. ప్రజలు, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. సమ్మెలో ఉన్న కార్మికుల ఆత్మ గౌరవం కాపాడాలని, సమ్మెకు పూర్వం ఉన్న పరిస్థితి కల్పించి వారిని విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత వ్యక్తమైతేనే సమ్మె విరమిస్తామని పేర్కొంది. లేని పక్షంలో యథాతథంగా సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. సమ్మె విషయంలో హైకోర్టులో ఊరట లభిస్తుందని ముందు నుంచి ఊహించిన కార్మికులకు షాక్ ఇచ్చింది. అనుకూల నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇ...