పోస్ట్‌లు

పార్టీ భవితవ్యం మీదే..తేడా వస్తే వేటే

చిత్రం
ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా అపూర్వమైన విజయాన్ని అందించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిచాల్సిన బాధ్యత మనందరి పై ఉంది. అంతే కాదు పార్టీ ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదే. అలా అని పట్టించుకోక పోతే మాత్రం చర్యలు తప్పవు. ఎమ్మెల్యేలతో పేచీలు, ఇగోలు పక్కన పెట్టాల్సిందే. గ్రామ స్థాయి నుండి నగర స్థాయి దాకా బల పడేలా చేయాల్సింది మీరే అని ఏపీ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మిమ్మల్ని పూర్తిగా నమ్మాను. బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేర్చక పోతే ఎలాగని నిలదీశారు. పార్టీని బలోపేతం చేయడానికి సాధించిన విజయాలనూ పరిగణనలోకి తీసుకుంటా. ఆరు నెలల పని తీరు ఆధారంగా చేసుకుని చూస్తా. బాగా లేకపోతే పునరాలోచించాల్సి వస్తుంది. పార్టీకి ఎమ్మెల్యేలే బలమని తేల్చి చెప్పారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గొడవల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది. ఎమ్మెల్యేలు బలంగా ఉంటేనే.. పార్టీ బలంగా ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం పెంచే బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదే. ప్రతి నెలలో రెండు నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాల్లో బస చేయాల్సింద...

జీఓ సంచలనం..టీటీడీలో కలకలం

చిత్రం
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు తన అనుయాయులకు ప్రధానమైన పదవులు అప్పగిస్తున్నారు. దీనిపై విపక్షాలు మండి పడుతున్నా డోంట్ కేర్ అంటున్నారు. ఆచరణలో జగన్ తన తాత రాజా రెడ్డిని గుర్తుకు తెస్తున్నారు. ఒక్క రోజులోనే పలు జీఓలు జారీ చేసి జనాన్ని మెస్మరైజ్ చేస్తుండగా, ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో గుబులు రేగుతోంది. తాజాగా వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జిఓ ప్రకంపనలు సృష్టిస్తోంది. జీవో నంబర్ 2323 తిరుమల తిరుపతి దేవస్థానంలో షేక్ చేస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు రిటైర్ అయి ఇంకా విధుల్లో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని తాజా జీవోలో ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అప్రమత్తమయ్యారు. అలాంటి ఉద్యోగులందరినీ గుర్తించి నివేదిక సమర్పించాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. వివరాలు అందిన వెంటనే ఆ అరవై మందిని తొలగించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రిటైర్ అయిన వారిలో టీటీడీ రిటైర్డ్ సూపరిడెంట్ డాలర్ శేషాద్రిపై కూడా పూర్తి స్థాయిలో వేటు పడనున్న...

ప్రయాణీకులకు పసందైన భోజనం

చిత్రం
నిత్యం ప్రయాణం చేయాలనుకునే ట్రావెలర్స్ కు తీపి కబురు అందించింది రైల్వే శాఖ. రుచికరమైన భోజనం అందించాలని ప్లాన్ చేస్తోంది. కూర్చునే సీట్ల వద్దకే లంచ్, టిఫిన్స్, టీ, కాఫీ, ఇతర పానీయాలు, తినుబండారాలు అందజేయనుంది ఐఆర్‌సీటీసీ. ట్రైన్ జర్నీలో అమ్మకానికి వచ్చే రుచులు ఆస్వాదించాలని ఉన్నా వాటి నాణ్యత బాగుండదని తినేందుకు, ఆర్డర్ ఇవ్వడానికి జంకుతారు. బయట మార్కెట్, హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కంటే ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో రైల్వే శాఖ అనుసరిస్తున్న తీరు పట్ల కొంత ఏవగింపు కూడా ఉంది. దీనిపై దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఐఆర్‌సీటీసీ రంగంలోకి దిగింది. ఆరోగ్య వంతమైన, రుచికరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన వంటకాలు అందించాలని రైల్వే శాఖ చర్యలను చేపట్టింది. ఆ క్రమంలోనే పలు ఈ-క్యాటరింగ్‌ కంపెనీలు ఐఆర్‌సీటీసీతో ఒప్పందం చేసుకుని మరీ జైన్‌ ఫుడ్‌ సహా పలు రకాల క్యుసిన్‌లను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. పీఎన్‌ఆర్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే చాలు సీటు దగ్గరకే ఫుడ్‌ డెలివరీ చేస్తోంది. ప్రతి చోటా డిస్కౌంట్‌ రాజ్య మేలుతున్న వేళ, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ...

తలైవా తళుక్కు మనేనా..ఐడియా వర్కవుటయ్యేనా

చిత్రం
పాన్ ఇండియాలో దిగ్గజ దర్శకులు ఎక్కువగా సినిమాలు తీయాలనుకునే ఒకే ఒక్క హీరో రజనీకాంత్. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ అరుదైన, అద్భుతమైన నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అతడి స్థాయి దేశ సరిహద్దులు దాటి..ఇంటర్నేషనల్ ను తాకింది. తమిళ నాడులో ఆయన పేరు చెబితే చాలు జనం పూనకం తో ఊగి పోతారు. ఏ ముహూర్తాన దర్శకుడు బాలచందర్ గైక్వాడ్ పేరును రజనీకాంత్ అని పేరు మార్చాడో, ఇక అప్పటి నుంచి కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ వస్తున్నాడు. అతడు మాట్లాడితే, నటిస్తే చాలు కోట్లు వసూలవుతాయి. ఆయనకు ఉన్నంత క్రేజ్ ఏ నటుడికీ లేదు. డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్స్ తో తీసే డైరెక్టర్స్ అంటే తలైవాకు ఇష్టం. అందుకే తనకన్నా వయసులో చిన్న వాళ్ళైనా సరే సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ అగ్ర నటుడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ వత్తిడి చేస్తున్నారు. వయసు రీత్యా చూసుకున్నా అయన ఇంకా నవ యవ్వనుడిగా అగుపిస్తున్నారు. తన కూతురు వయసున్న వాళ్ల తో ధీటుగా పోటీపడి డ్యాన్సులు చేస్తున్నారు. బీజేపీ ఆయనతో ఇప్పటికే టచ్ లో ఉంది. కానీ తలైవా ఇప్పటి దాకా నోరు మెదప లేదు. తాజాగా పాన్ డైరెక్టర్ మురుగదాస్ తో దర్బార్ ...

సారూ..తగ్గితే తప్పేంటి..?

చిత్రం
తెలంగాణాలో రెండవ సారి కొలువు తీరిన సీఎం కేసీఆర్ తన మాట తప్పా ఎవ్వరి మాటా వినడం లేదు. వినిపించు కోవడం లేదు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కు ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా, ఉద్యమ నాయకుడిగా, పాలకుడిగా, పరిపాలనా దక్షుడిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. మేధావిగా, అపర చాణ్యుక్యుడిగా వినుతి కెక్కారు. బహు భాషా కోవిదుడిగా పేరొందారు. తాను ఏది చెబితే అదే చట్టమని, అదే శాసనమని నమ్ముతున్నారు. ఆ దిశగా పాలన సాగిస్తున్నారు. తాను తప్పా ఇంకెవ్వరూ మాట్లాడ కూడదని షరతు విధించారు. దీంతో తెలంగాణాలో ఇప్పుడు మాట్లాడటం అన్నది నేరంగా మారింది. ప్రజలపై నిర్బంధం కొనసాగుతున్నది. నిఘా మరింతగా పెరిగింది. గత 60 ఏళ్ళ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా పాలన సాగుతోంది. ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళు పైకి మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నది. ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను కేసీఆర్ కదిలించారు. అందరినీ ఒకే తాటి పైకి తీసుకు వచ్చారు. అదే క్రమంలో ఆర్టీసీకి చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగమయ్యారు. కీలక పాత్ర పోషించారు. సారుకు అండగా నిలబడ్డారు. ప్రజా...

ఫస్ట్ ప్రయారిటీ టాలెంట్ కే

చిత్రం
తెలుగు సినిమా రంగంలో టాప్ రేంజ్ డైరెక్టర్స్ లలో ఒకడిగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. ఆలోచనలకు రెక్కలు వస్తాయి. సృజనాత్మకత వెళ్లి విరుస్తుంది. పూరి జగన్నాథ్ అంటేనే అంతులేని ఎనర్జీ కి కేరాఫ్. న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోతాడు. ఎలాంటి భేషజాలకు తావివ్వకుండా క్రియేటివిటీకి పెద్ద పీట వేయడం పూరికి అలవాటు. పుస్తకాలు బాగా చదువుతాడు. తన ఇల్లే తన లోగిలి. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన తత్వవేత్తలను ఇప్పటికే చదివాడు. అందరి కంటే జగన్నాథ్ కు ఫిలాసఫర్ నీషే అంటే అభిమానం. ఆయనతో పాటు ఓషో కూడా. ఉన్నది ఒక్కటే జిందగీ అని నమ్మే పూరి ఏది మాట్లాడినా సంచలనమే. ఎందుకంటే పైసా జేబులో లేక పోయినా సరే ఎలా బతకాలో నేర్చు కోవాలంటే..జగన్నాథ్ తో ఐదు నిమిషాలు సంభాషిస్తే చాలు మనలో కోల్పోయిన ఎనర్జీ తిరిగి వస్తుంది. అంతులేని కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఆయనలో తాను గొప్ప డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉండదు. జస్ట్ ఓ సాధారణమైన వ్యక్తిగా మనకు అగు పిస్తాడు. ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాడు. ఇగో ను పక్కన పెడితే చాలు ఇక సమస్యలు అంటూ ఉండవంటాడు...

పోరాటం ఆగదు..విజయం తప్పదు

చిత్రం
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 27 రోజులకు చేరుకుంది. ఇప్పటి దాకా 16 మంది కార్మికులు మృతి చెందారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. హైకోర్టు సమ్మె పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ఒక మెట్టు దిగితే తప్పేమిటని ప్రశ్నించింది. ఓ వైపు కార్మికులు చని పోతున్నారు, మరో వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయినా ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదు. ఇంతకూ రాష్ట్రంలో ప్రభుతం అనేది ఉందా అని అడ్వొకేట్ జనరల్ ను నిలదీసింది. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. మీరేమో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు. మరి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మీ సీఎం 100 కోట్ల వరాలు ప్రకటించారు. మరి వాటికి డబ్బులు ఎలా వస్తాయో చెప్పండని కోరింది. దీనికి ఏజీ వద్ద నుంచి సమాధానం రాలేదు. అదనపు ఏజీ అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీ ఏం చేస్తున్నారు. ప్రభుత్వం నిద్ర పోయిందా..ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్ ను ఎందుకు నియమించి లేదు. కార్మికులు తమ ఇబ్బందుల గురించి ఎవ్వరితో చెప్పు కోవాలో మీరే చెప్పండి. ఓ వైపు ప్రజల్ల...