పోస్ట్‌లు

దమ్మున్న మగాడు ఉదయ్ శంకర్

చిత్రం
వాడు మగాడ్రా బుజ్జి అన్న తెలుగు సినిమా డైలాగ్ కు ఖచ్చితంగా సరి పోతాడు ఉదయ్ శంకర్. ఎవరితను అనుకుంటున్నారా..భారతీయ మీడియాను ఏలుతున్న ఒకే ఒక్క మగాడు..స్టార్ టీవీ సీయివో. ఇప్పుడు ఇతడే మోస్ట్ పాపులర్ హీరో. ఇతడికున్నంత ఫాలోయింగ్ ఇంకెవ్వరికీ లేదంటే నమ్మలేం. స్టార్ గ్రూప్ కు భారతీయతను జోడించి కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. అందరు నడిచిన బాటలో నడిస్తే కిక్ ఏముంటుంది అని ప్రశ్నిస్తాడు అమాయకంగా. ఏకంగా కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన స్టార్ టీవీ సంస్థను ఏకంగా ట్రిలియన్ డాలర్ల రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు. ఎవరికీ అందడు. అతడు అనుకున్నాడంటే ఇక ప్రత్యర్థులు చిత్తై పోవాల్సిందే. అది అతడికున్న టాలెంట్. ఎక్కడ ఎప్పుడు దెబ్బ కొడతాడా తెలియదు. ఆలోచనల్లో లయన్ ను తలపిస్తే ఆచరణలో చిరుతను గుర్తుకు తెస్తారు ఉదయ్ శంకర్. తాజాగా ఇండియాను ప్రభావితం చేసిన వ్యక్తులు 100 మందిని ఎంపిక చేస్తే స్టార్ అధిపతి ఉదయ్ శంకర్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని దాటేసి చరిత్ర సృష్టించారు.  ఆసియా ఖండంలో స్టార్ టీవీ టాప్ రేంజ్ లోకి దూసుకు వెళ్ళింది. ఇండియన్ మీడియా మార్కెట్ ను శాసిస్తున్న స్టార్ ..ప్రపంచ మా...

ఆకలి కేకల్లో వెనిజులా.. ఆదుకునేది ఎలా..?

చిత్రం
ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ నిల్వలు కలిగిన దేశంగా పేరొందిన వెనిజులా ఇప్పుడు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. లక్షలాది  మంది అన్నమో రామ చంద్ర అంటూ మొత్తుకుంటున్నారు. వందలాది మందికి కూడుతో పాటు గూడు కూడా కరువైంది. చేసేందుకు పనులు లేవు, ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అన్నింటిని ఉచితంగా ఇస్తూ పోయింది.  దీంతో జనం ఎక్కువ శాతం పని చేయకుండా సోమరులుగా తయారయ్యారు. దక్షిణ అమెరికాలో వుండే ఈ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే . ఆ దేశం ఇలా పేద దేశంగా తయారు కావడానికి అగ్ర రాజ్యం అమెరికా కూడా ఒక కారణం. ప్రపంచంలో యుఎస్ కు తాను బతికినన్నాళ్లు ఆ దేశ ప్రెసిడెంట్ కు నిదుర లేకుండా చేసిన ఘనత క్యూబా మాజీ ప్రెసిడెంట్ ఫెడరల్ కాస్ట్రో. ఆయన బతికి ఉన్నన్నాళ్ళు వెనిజులా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్ కు వెన్ను దన్నుగా నిలిచారు. అయినా ఫలితం లేక పోయింది. వెనుజులాను గొప్ప కంట్రీగా తీర్చి దిద్దిన హ్యూగో చావెజ్ మరణించడం తో,  అటు అమెరికాకు అడ్డు లేకుండా పోయింది. ఆ దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలపై కన్నేసింది. అంతర్జాతీయ పరంగా ఆయిల్ ధరలు తగ్గడంతో పన్నుల రూపేణా వచ్చే డబ్బులన్నీ తగ్గి పోయాయి. తిండి నుంచి బట్టల దాక...

సినీవాలిలో వెన్నెల వసంతం..!

చిత్రం
తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. దాని రేంజ్ హాలీవుడ్ ను అందుకునే ప్రయత్నంలో ఉంది అంటే నమ్మగలమా. టాలీవుడ్ లో తీసే సినిమాల్లో కామెడీ అన్నది కంపల్సరీ. ప్రతి సినిమాలో హాస్యం అన్నది తప్పకుండా ఉండాలి. లేకపోతే తెలుగు వారు తట్టుకోలేరు. ప్రతి దర్శకుడు కొన్ని నిమిషాలైనా కామెడీ సీన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే బ్రహ్మ్మనందం, ఆలీ , పృత్వి , తదితరులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వెన్నెల కిషోర్ తన హవాను కొనసాగిస్తున్నారు. మౌనంగా ఉంటూనే తన ప్రతిభా పాటవాలతో దుమ్ము రేపుతున్నారు. రోజు రోజుకు తాను లేకుండా సినిమాలు తీయలేని స్థితికి తీసుకు వచ్చారు ఈ నటుడు.  కిషోర్ ఉంటే చాలు సినిమా తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో పుట్టిన ఇతగాడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొంత కాలం పాటు పనిచేసారు. ఆ తర్వాత సినిమా మీదున్న ప్రేమ అతడిని దర్శకుడిగా మార్చేసింది. ఇంటర్ చదవడానికి హైదరాబాదుకు వచ్చాడు. సినిమాలు చూడటం అలవాటైంది. డిగ్రీ పూర్తయిన తరువాత ఏడాదిన్నర పాటు ఓ కోర్సులో చేరాడు. జీఆర్ఈ, టోఫెల్ లో  మంచి స్కోరు సంపాదించాడు. అమెరికాలో మాస్టర్స్ చదవడ...

క్యూ కట్టిన జనం..వికసిస్తున్న కమలం

చిత్రం
తెలంగాణాలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు దేశంలో ఒకే పార్టీ, ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేశం అన్న నినాదాన్ని నిజం చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇప్పటికే తెలంగాణాలో ఉద్యమ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేకుండా పోయింది. గతలోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగ పాటు కలిగింది. ముఖ్యమంత్రి స్వంత కూతురు, ఎంపీగా ఉన్న కవితను చిత్తుగా ఓడించారు. దీంతో కమలం తమ పార్టీ పట్ల ప్రజలకు ప్రేమ, అభిమానం ఉందని తేటతెల్లడం కావడంతో బీజీపీ రంగం లోకి దిగింది . చాప కింద నీరులా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. టీడీపీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్, తదితర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , తదితరులు భారీ ఎత్తున జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీకి పూర్వ వైభవం రానుందని సీనియర్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేలాది మంది కార్యకర్తలు కలిగిన తెలుగుదేశం పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయక...

అక్బరుద్దీన్ దౌత్యం..పాక్ కు పరాభవం..నిను చూసి గర్విస్తోంది దేశం..!

చిత్రం
నిన్నటి దాకా చిలుక పలుకులు పలుకుతూ, భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది పాకిస్థాన్ కు అంతర్జాతీయ వేదికపైన పరాభవం తప్ప లేదు. తాను నమ్ముకున్న అమెరికా మౌనం వహిస్తే, ఒక్క చైనా తప్ప ఏ ఒక్క కంట్రీ పాక్ కు మద్దతు పలకలేదు. ఇస్స్యూ సీరియస్ కావడంతో ..అంతర్జాతీయ భద్రత సంస్థలో చర్చకు వచ్చింది. పాకిస్థాన్ ను ఒంటరి ప్రపంచలో ఒంటరి చేయడంలోనూ, దౌత్య పరంగా సక్సెస్ చేయడంలో ఒకే ఒక్కడు కీలక పాత్ర పోషించారు. అతడెవరో కాదు సయ్యద్ అక్బరుద్దీన్ . ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత ప్రతినిధి గా , భారత రాయబారిగా ఉన్నారు. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తో పాటు దానికి వంత పాడిన చైనాకు పరాభవం జరిగేలా చేసాడు. ఇది తమ స్వంత వ్యవహారమని, వేరెవ్వరు ఇందులో జోక్యం చేసుకోలేరని స్పష్టం చేశారు సయ్యద్. దీనిపై ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు మాను కోవాలని పాక్ ను హెచ్చరించింది. అంతర్జాతీయ వేదికపై తన గొంతును గట్టిగా, మరింత బలంగా వినిపించారు. ఆయన ప్రదర్శించిన దౌత్యం , దూకుడు భారతీయుల మనసు గెలుచుకుంది. టెర్రరిజాన్ని రూపు మాపేందుకు ప్రతి దేశం, దానిని పాలిస్తున్న పాలకులు కృషి చేయాలనీ పిలుపునిచ్చ...

డ్రోన్ కలకలం ..బాబు ఆగ్రహం

చిత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా అధికార, విపక్షాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి విపక్ష నేతలు, నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగి పోయాయి . దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే దాకా వెళ్ళింది. అయినా ఫలితం లేక పోగా,  కరకట్ట దగ్గర బాబు నివాసాన్ని కూల్చేందుకు జగన్ డిసైడ్ అయ్యారు. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు నివాసం దగ్గరి వరకు నీళ్లు వచ్చాయి. ఆయన కుటుంబం అప్పటికే హైదరాబాద్ కు మార్చేసింది. ఈ విషయం వైరల్ గా మారింది. మరో వైపు ప్రభుత్వం ఉన్నఫలంగా బాబుకు ఉన్న జెడ్ కేటగిరి భద్రతను కుదించింది. ఈ విషయంపై తెలుగు తమ్ములు కొందరు కోర్టుకు ఎక్కారు. దీనిపై విచారించిన ధర్మాసనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరి కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తొంబై మందితో కూడిన భద్రతను పునరుద్దరించాలని ఆదేశించింది. ఇప్పటికే ఆశా వర్కర్స్ రోడ్డెక్కరు. కాంట్రాక్ట్ సిబ్బంది తమను తొలగించ వద్దంటూ ఆందోళన బాట పట్టారు. పాలనపై కంటే ప్రతిపక్షాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాని టైం వెస్ట్ చేస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ...

అధిపతి ఆగ్రహం..యాదాద్రి మరో తిరుపతి కావాల్సిందే..!

చిత్రం
ఈ దేశంలో ఆధ్యాత్మిక భావన కలిగిన ముఖ్యమంత్రులల్లో తెలంగాణా సీఎం కల్వకుంట్ల  చంద్ర శేఖర్ రావు ప్రథమ స్థానంలో నిలుస్తారు. అదీ ఆయన ప్రత్యేకత. ఎక్కడ గుడి కనిపిస్తే చాలు అక్కడికి తానే స్వయంగా వెళతారు. మొక్కులు తీర్చుకుంటారు. దర్శనం చేసుకుంటారు. మొదటి నుంచీ కేసీఆర్ దంపతులకు దైవం పట్ల నమ్మకం ఎక్కువ. వాసనలు రాక పోయినా, పాలన ప్రజలకు అందుబాటులో ఉండేలా, బంగారు తెలంగాణ దిశగా మార్చేలా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా ఆయన యజ్ఞ , యాగాలు చేస్తారు. పండితులను, పామరులను గౌరవిస్తారు. సన్మానిస్తారు. వారికి యెనలేని ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంపై విపక్షాలు విమర్శలు చేసినా పట్టించు కోలేదు. తాను ఖర్చు చేసే ప్రతి పైసా తాను సంపాదించిన దానిలోంచే ఖర్చు చేస్తున్నానని, మీకెందుకు ఆ బాధ అంటూ సెటైర్స్ విసిరారు. కేసీఆర్ కు ముందు నుంచి యాదగిరిగుట్ట లో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి అంటే యెనలేని అభిమానం. నమ్మకం కూడా. ఆలయానికి యాదాద్రి పేరు పెట్టారు. పూర్తిగా శాస్త్రోక్తంగా, ప్రపంచంలోనే ఏ ఆలయం లేని రీతిలో పునర్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. జగత్ గురువు శ్రీ శ్రీ శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామీజీకి కేసీఆర్ అపార...