పోస్ట్‌లు

ఏపీలో కొలువు తీరేదెవ్వ‌రో..?

చిత్రం
ఇలాంటి దారుణ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌ల‌లో కూడా అనుకుని ఉండ‌రు. జీవితంలో మ‌రిచి పోలేని అప‌జ‌యాన్ని అందించారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఈనెల 30న వేద పండితుల సాక్షిగా, జ‌న సమ‌క్షంలో జ‌నామోదం పొందిన జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. అతిర‌థ మ‌హార‌థులు, ఇత‌ర ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి రానున్నారు. ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు వ‌న్ సైడ్‌గా తీర్పు ఇవ్వ‌డం, 150 సీట్ల‌కు చేర్చ‌డంతో జ‌గ‌న్ ఉబ్బి త‌బ్బ‌బ‌వుతున్నారు. ఏదో 120 లేదా 130 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోతామ‌ని న‌మ్మ‌కంతో ఉన్న జ‌గ‌న్‌కు ఊహించ‌ని రీతిలో ఆంధ్రా ప్ర‌జ‌లు గిఫ్ట్ ఇచ్చారు. ఏపీ చ‌రిత్ర‌లో ఇది చారిత్రాత్మ‌క విజ‌యం. ఊహించిన దానికంటే ఎక్కువ‌గా ఎమ్మెల్యేలు గెలిచారు. వీరితో పాటు 23 ఎంపీ సీట్ల‌లో వైసీపీ పాగా వేసింది. బీజేపీతో స‌ఖ్య‌త పాటిస్తున్న జ‌గ‌న్..మోదీ కేబినెట్‌లో చేర‌మ‌ని జ‌గ‌న్‌ను ఆహ్వానిస్తే ..చేరేందుకు సుముఖ‌త చూపించ‌వ‌చ్చు. ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని ప్ర‌ధానంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌...

నిజామాబాద్‌లో నైతిక విజ‌యం రైత‌న్న‌ల‌దే

చిత్రం
మెతుకుల‌ను పండించి ..మ‌ట్టినే న‌మ్ముకుని ..బ‌తుకు బ‌రువై అరిగోస ప‌డుతున్న రైతులు భార‌త‌దేశలో ఒక చ‌రిత్ర‌కు నాంది ప‌లికారు. నూత‌న అధ్యాయానికి తెర తీశారు. అంత‌కు ముందు పాల‌మూరు జిల్లాలోని పోలేప‌ల్లి గ్రామ‌స్తులు త‌మ భూములు త‌మ‌కు కావాల‌ని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మోసం చేశాడంటూ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించారు. అప్ప‌ట్లో అది ఓ సంచ‌ల‌నం. మొన్న‌టి దాకా తిరుగులేద‌ని భావించిన అధికార పార్టీకి చుక్క‌లు చూపించారు. నిజామాబాద్ అంటేనే పసుపు, చెరుకు పంట‌ల‌కు ప్ర‌సిద్ధి. ఆసియా ఖండంలోనే అధిక సాగు చేసే ప్రాంతం ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ మాత్ర‌మే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే త‌మ బ‌తుకులు బాగు ప‌డ‌తాయ‌ని, త‌మ పిల్ల‌ల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, త‌మ పంట‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర దొరుకుతుంద‌ని ఇక్క‌డి మ‌ట్టి బిడ్డ‌లు భావించారు. అదంతా రివ‌ర్స్ అయ్యింది. సీఎం కూతురు క‌విత ఇక్క‌డ ఎంపీగా పోటీ చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచింది. రైతుల‌కు ప‌సుపు బోర్డు ఏర్పాటు చేస్తామ‌ని, ఆదుకుంటామ‌ని చెప్పి ఆచ‌ర‌ణ‌లో చూపించక పోవ‌డంతో రైతులు పోరు బాట ప‌ట్టారు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యేలా ఆందోళ‌న‌ల...

డైన‌మిక్ స్ట్రాట‌జిస్ట్ ..స‌క్సెస్ స్పెష‌లిస్ట్ - ప్రశాంత్ కిషోరా మ‌జాకా..!

చిత్రం
అత‌డు రంగంలోకి దిగాడంటే ..ఇక అంతే ప్ర‌త్య‌ర్థులు చిత్త‌యి పోవాల్సిందే. అత‌డు పులి కంటే వేగంగా ఆలోచిస్తాడు. రాకెట్ కంటే స్పీడ్‌గా త‌న ప్లాన్‌ను అమ‌లు చేస్తాడు. అంత‌కంటే భిన్నంగా త‌న‌దైన మార్క్ తో ..స్ట్రాట‌జీని అమ‌లు చేస్తాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌టం అంటూ ఉండ‌దు. ప‌ని అంతా పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉంటుంది. ప‌క్కా లోకల్ గా అనిపిస్తుంది ఆయ‌న ఆలోచ‌నా తీరు. అప‌ర మేధావిగా..ఇండియాలో ఎవ‌రికీ రానంత పాపులారిటీ ఆయ‌నకు రానే వ‌చ్చింది.  గెలుపు కావాలంటే..విజ‌యం సాధించాలంటే..ఏం చేయాలో అత‌డికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ను కోవాలి. అంత‌లా పాపుల‌ర్ అయి పోయాడు అత‌డు. ఇంత‌గా ఇంట్ర‌డ్యూస్ చేయాల్సిన వ్య‌క్తి ఎవ‌ర‌త‌డంటే..ఒకే ఒక్క‌డు..డైన‌మిక్ లీడ‌ర్..స‌క్సెస్ స్పెష‌లిస్ట్ - ప్రశాంత్ కిషోర్. యుద్ధంలో గెల‌వాలంటే ఏం చేయాలి. ఎవ‌రిని ఎప్పుడు సంప్ర‌దించాలి. ఏయే శ‌క్తుల‌ను కూడ‌గ‌ట్టు కోవాలి. ఎవ‌రి బ‌లాలు ఏమిటి..బ‌ల‌హీన‌త‌లు ఏమిటి..ఏం చేస్తే స‌క్సెస్ చెంత వాలుతుంది. ఇవ‌న్నీ త‌నొక్క‌డే అమ‌లు చేస్తాడు.  ఎవ‌రూ త‌న ప‌క్క‌న ఉండ‌రు. ఉప్పెన‌లా దూసుకెళ‌తాడు. సునామీలా అల్లుకు పోతాడు. జ‌నాన్ని మాట‌ల‌తో మంత్రం ...

న బూతో న భ‌విష్య‌త్ - అశ్లీలం స‌ర్వ నాశ‌నం

చిత్రం
నాలుగు గ‌దుల్లో దాచు కోవాల్సినవ‌న్నీ ఇపుడు బ‌హిర్గ‌త‌మై పోతున్నాయి. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ మంచి కంటే చెడు ఎక్కువ‌గా ముక్కు ప‌చ్చ‌లార‌ని యువ‌తీ యువ‌కుల‌ను టార్గెట్ చేస్తోంది. భోజ‌నం లేకుండా ఉండ‌గ‌ల‌రమో కానీ మొబైల్స్ లేకుండా ఉండ‌లేని స్థితికి వ‌చ్చేశారు. కాదంటే బాధ‌..వ‌ద్దంటే కోపం..క‌న్న‌వారి మీద క‌సురు కోవ‌డాలు..కుటుంబం అంటే గౌర‌వం లేదు. పాఠాలు చెప్పే వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త లేదు. బ‌ట్టీ ప‌ట్ట‌డాలు..ర్యాంకుల మోత‌లు..ఇలా చెప్పుకుంటూ పోతే దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగు చూశాయి. చెప్పుకోవాలంటే సిగ్గు చేటు. 60 ఏళ్లకే రావాల్సిన అనుభవం ఇపుడు 10 ఏళ్ల పిల్ల‌ల‌కు అర్థ‌మై పోతోంది. ఇదేమిటంటే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయిగా..పేరెంట్స్ త‌మ బాధ్య‌త‌ల‌ను విస్మ‌రిస్తున్నారు. నూటికి 90 శాతం పిల్ల‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేదు. గాలికి వ‌దిలి వేస్తున్నారు. పాఠాలు బోధించాల్సిన వాళ్లు సైతం ప్రేమ పాఠాలు వ‌ల్లె వేస్తున్నారు. బంధాల‌కు అర్థం లేకుండా పోయింది. డాల‌ర్ల మాయ‌లో ప‌డిన వీరంతా దేశాన్ని ఏం ర‌క్షిస్తారో తెలియ‌డం లేదు. సామాజిక మాధ్యమాల్లో ..గూగుల్ వ‌చ్చాక‌..రిల‌య‌న్స్ జియో ఎంట‌ర్ అయ్...

దేశానికే ఆద‌ర్శం..ర‌వీంద‌ర్ సింగ్ నిర్ణ‌యం

చిత్రం
కోట్లు వుంటే ఏం లాభం..కొలువులుంటే ఏం ప్ర‌యోజ‌నం..ప‌దవులుంటే ఏం చేసుకుంటాం. మ‌న‌మైతే కోట్లు ఎలా కొల్ల‌గొట్టాలో ఆలోచిస్తాం. ఎవ‌రి మీద ప‌డితే డ‌బ్బులు వ‌స్తాయో ప్లాన్ల‌లో మునిగి తేలుతాం. కానీ అధికార పార్టీకి చెందిన ర‌వీంద‌ర్ సింగ్ మాత్రం వెరీ వెరీ డిఫ‌రెంట్. ఏ మ‌త‌మైనా..ఏ కుల‌మైనా స‌రే ఆదుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఇంకేం ఏకంగా పార్టీని న‌మ్ముకున్నందుకు న‌గ‌ర పాల‌క సంస్థ‌కు మేయ‌ర్‌గా ఎన్నుకోబడ్డారు సింగ్. అంద‌రూ గెలిచాక ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం మానేస్తే..ర‌వీంద‌ర్ సింగ్ మాత్రం జ‌నం కోసం ఏమేం చేస్తే బాగుంటుందోన‌ని నిత్యం ప్ర‌జా సేవ‌కు అంకిత‌మ‌య్యారు. రోడ్డు మీద రూపాయి ప‌డితే వ‌దిలి వేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే ఆ రూపాయితో ఏం వ‌స్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మ‌నోడు మాత్రం ఆ రూపాయికి మ‌రింత విలువ‌ను పెంచారు. సేవ చేయాల‌న్న త‌లంపు వుంటే ..మాన‌వ‌త్వం వెల్లి విరియ‌దా..న‌గ‌ర వాసుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. కేవ‌లం ఒక్క రూపాయి చెల్లించండి..మ‌ధ్య ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌కండి..మీ వెనుక నేనున్నా..మీకు క్ష‌ణాల్లో న‌ల్లా క‌నెక్ష‌న్ ఇస్తామంటూ ప్ర‌క‌టించారు. దెబ్బ‌కు ఆయ‌న ఇలా ప్ర‌క‌టించా...

గ్రోఫ‌ర్సా ..మ‌జాకా - ఎస్‌బీ బిగ్ ఆఫ‌ర్

చిత్రం
ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ క‌నెక్టివిటీ ఈజీగా మారి పోయింది. ఒక‌ప్పుడు టెలికాం, ర‌వాణా రంగాలు జ‌నానికి దూరంగా ఉండేవి. ఎప్పుడైతే అవి రావ‌డం ప్రారంభ‌మైందో ప్ర‌పంచం చిన్న‌దై పోయింది. ఐటీ అంటేనే ఇండియా.అంత‌గా పాపుల‌ర్ అయ్యిందీ ఈ దేశం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ సెక్టార్‌లో అమెరికా టాప్ వ‌న్ పొజిష‌న్‌లో వుంటే..అందులో 30 శాతానికి పైగా భార‌తీయులే ఉన్న‌త స్థానాల్లో కొలువుతీరారు. అదే స్ఫూర్తితో గూగుల్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, స్నాప్ ఛాట్, ఇలా ప్ర‌తి సామాజిక మాధ్య‌మాల‌ను నిర్వ‌హిస్తున్న వారిలో ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్సే ఉన్నారు. వీరే ప్ర‌తి ఫార్మాట్‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువ‌త కొత్త‌గా ఆలోచిస్తోంది. డిఫ‌రెంట్ గా ఉండేందుకు య‌త్నిస్తోంది. వారు త్వ‌ర‌గా త‌మ కాళ్ల మీద నిల‌బడాల‌ని కోరుకుంటున్నారు. స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే తాము ఒక‌రి కింద ప‌ని చేసేందుకు స‌సేమిరా అంటున్నారు. ఐడియాసుకు ప‌దును పెడుతూ ..స్టార్ట‌ప్ ల‌కు ప్రాణం పోస్తున్నారు. గ‌తంలో పెట్టుబ‌డి కోసం భ‌య‌ప...

టీఓ క్లాక్ - ఛాయ్ అడ్డా హైద‌రాబాద్

చిత్రం
ఓహ్..హైద‌రాబాద్ అంటేనే ప్యార‌డైజ్ బిర్యానీకి పెట్టింది పేరు. అంతేనా ప్ర‌తి గ‌ల్లీలో ఓ టీకొట్టు ఉండాల్సిందే. ఇరానీ ఛాయ్ కి కేరాఫ్ ఈ న‌గ‌ర‌మే. ఎక్క‌డికి వెళ్లినా ..ఏ సందులోకి దూరినా అక్క‌డ ఇరానీ కేఫ్ ఉంటుంది. అంతేనా గ‌రం గ‌రం టీతో పాటు నోరూరించే ఉస్మానియా బిస్క‌ట్లు కూడా నోరూరిస్తాయి. అంత‌లా పాపుల‌ర్ అయ్యిందీ ఈ సిటీ. పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వారి దాకా అంతా ఛాయ్ ప్రియులే. పొద్దున లేస్తేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది టీనే. ర‌క‌ర‌కాల ఫ్లేవ‌ర్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. టీ ప్రియుల కోసం ప్ర‌త్యేకంగా రెస్టారెంట్లు వెలిశాయి. త‌క్కువ ఖ‌ర్చు ..ఎక్కువ ఆదాయం ఏద‌న్నా ఉందంటే అది టీ కొట్టు..టీ హోట‌ల్, టీ అడ్డా. మేధావులు, క‌ళాకారులు, సినీ న‌టులు, ద‌ర్శ‌కులు, క్రియేటివిటీ కోసం నానా తిప్ప‌లు ప‌డే వాళ్లంద‌రికీ ఇష్ట‌మైన‌ది ఏదైనా ఉందంటే ఛాయ్ నే. వేడి వేడి టీ గొంతులోకి వెళితే ఆ టేస్ట్ వేరు. ఆ మ‌జా వేరు. ఆంధ్రా వారి దెబ్బ‌కు తెలంగాణ సంస్కృతి దెబ్బ‌తిన్న‌ది. కానీ బ‌తక‌డంలో మాత్రం త‌న సంస్కృతిని కోల్పోలేదు. తెలంగాణ‌లో ఎక్క‌డికి వెళ్లినా మ‌జ్జిగ‌నో లేదా టీనో త‌ప్ప‌కుండా ఇస్తారు. తేనీటి విందు త‌ప్ప‌ని...