పోస్ట్‌లు

విరాళాల్లో బీఎస్పీనే టాప్ - మాయావ‌తా మ‌జాకా

చిత్రం
దేశంలో కార్పొరేట్ కంపెనీల‌న్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయ‌డం మామూలే. ఏ పార్టీనైనా కేంద్రంలో కానీ లేదా ఆయా రాష్ట్రాల‌లో కొలువుతీరితే..ఆయా సంస్థ‌లు, యాజ‌మాన్యాలు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయా పార్టీల‌కు మామూళ్లు లేదా విరాళాల రూపేణా ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. దీంతో ఆర్థిక నేరాలు ఎక్క‌డ‌లేని విధంగా దేశ వ్యాప్తంగా పెరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే నేర‌స్థులు..రాజ‌కీయ నాయ‌కులు..వ్యాపారులు ముగ్గురూ దేశాన్ని నియంత్రించాల‌ని చూస్తున్నారు. ఒక‌ర‌కంగా ప‌వ‌ర్లో ఎవ‌రున్న‌ప్ప‌టికిని వీరు చెప్పిందే శాస‌నంగా మారుతోంది. దీంతో బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తికి విఘాతం క‌లుగుతోంది. ఒక పార్టీ గుర్తుతో పోటీ చేయ‌డం. గెలుపొందాక మ‌రో పార్టీలోకి జంప్ కావ‌డం మామూలై పోయింది. ఆయా పార్టీల‌కు చెందిన అధినేత‌లు, చోటా మోటా నాయ‌కులు వ్యాపార‌స్తుల‌ను , కంపెనీల‌ను టార్గెట్ చేయ‌డం ఇటీవ‌లి కాలంలో ఫ్యాష‌న్ గా మారింది. ఎందుకొచ్చిన తంటా అంటూ వ్యాపార‌స్తులు త‌మ‌కు తోచిన రీతిలో మామూళ్లు నెల‌నెల‌కు ..ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏక మొత్తంలో చెల్లిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. వ్య‌...

రుచిలో టాప్..ఆదాయంలో నెంబ‌ర్ వ‌న్ - కామ‌త్ హోట‌ల్స్ క‌హానీ

చిత్రం
భార‌తీయ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలోంచి వ‌చ్చిన కామ‌త్ ఇపుడు ప్ర‌పంచంలోనే గ‌ర్వించ‌ద‌గిన హోట‌ల్స్ య‌జ‌మానిగా చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని స్వంతం చేసుకున్నారు. ఇదో ప్ర‌పంచ రికార్డు. ఒకప్పుడు డ‌బ్బుల కోసం నానా ఇబ్బందులు ప‌డిన కామ‌త్ కుటుంబం ఇపుడు వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా ఉపాధి చూపిస్తోంది. కోట్లాది రూపాయ‌లు రోజూ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతున్నాయి. కొన్నేళ్లు గ‌డిచినా ఎలాంటి మార్పులు లేవు. క‌ష్ట‌మ‌ర్ల అభిరుచుల‌కు అనుగుణంగా హోట‌ల్స్‌ను ఏర్పాటు చేసుకుంటూ పోయారే త‌ప్పా ..నాణ్య‌త విష‌యంలో..సేవ‌లు అందించ‌డంలో కించిత్ తేడా క‌నిపించకుండా కాపాడుకుంటూ వ‌స్తోంది కామ‌త్ హోట‌ల్స్ యాజ‌మాన్యం. ఒక‌ప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామ‌త్ హోట‌ల్ ఇపుడు ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించింది. త‌న బ్రాండ్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది. డ‌బ్బున్న వాళ్లు గొప్ప వాళ్లు అనుకునే స్థాయికి దిగ‌జారిన మ‌న‌కు విఠ‌ల్ కామ‌త్ క‌ళ్లు తెరిపించారు. భార‌తీయుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా..సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షిస్తూ కామ‌త్ హోట‌ల్స్ న‌డుస్తున్నాయి. ఇది ఒక ర‌కంగా పాఠంగా నేర్చుకోవాల్సిన అవ‌స‌రం వున్న‌ది. ...

దుమ్ము రేపిన ఢిల్లీ..డీలా ప‌డిన హైద‌రాబాద్ ..!

చిత్రం
భారత మాజీ క్రికెట్ దిగ్గ‌జం గంగూలి మెంటార్‌గా ఉన్న ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ పేల‌వ‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించి అప‌జ‌యాన్ని కొనితెచ్చుకుంది. స‌న్ రైజ‌ర్స్ ముచ్చ‌ట‌గా మూడోసారి ఓట‌మిని మూట‌గ‌ట్టు కోవ‌డం విశేషం. ర‌బాడ‌, పాల్ , మోరిస్ విజృంబించ‌డంతో స‌న్ రైజ‌ర్స్ ఏ కోశాన ధీటుగా బ‌దులు ఇవ్వ‌లేక పోయింది. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆ జ‌ట్టు ఏకంగా మ‌రో మూడు మ్యాచ్‌ల‌ను కోల్పోయింది. ఓపెన‌ర్లు బెయిర్ స్టో, వార్న‌ర్‌లను న‌మ్ముకున్న ఆ జ‌ట్టు ప్ర‌తిసారి జ‌రిగే మ్యాచ్‌లో చ‌తికిల ప‌డుతోంది. 39 ప‌రుగుల తేడాతో ఢిల్లీ ఘ‌న‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసుకుని ..గెలుపుల్లో హ్యాట్రిక్ కొట్టింది. మ‌రోసారి బ్యాటింగ్ వైఫ‌ల్యం స‌న్ రైజ‌ర్స్ ను వెంటాడింది. ఎప్ప‌టిలాగే ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్ కేవ‌లం 47 బంతులు ఆడి 51 ప‌రుగులు చేయ‌గా..ఇందులో మూడు ఫోర్లు, ఒక భారీ సిక్స‌ర్ ఉంది. మ‌రో కీల‌క ఆట‌గాడు జానీ బెయిర్ స్టో 31 బంతులు ఆడి 41 ప‌రుగులు చేసి జ‌ట్టు స్కోర్ పెంచాడు. అయిదు ఫోర్లు ..మ‌రో సిక్స‌ర్ సాయంతో ఈ ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌ట బ్యాటింగ్‌కు దిగ‌న ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వి...

చెన్నై చంద్రమా ..గెలుపే మంత్రమా

చిత్రం
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా మరో విజయాన్ని నమోదు చేసింది . కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిని ఐపీఎల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. మొదట కోల్ కత్తా జట్టు బ్యాట్టింగ్ చేయగా చెన్నై నిర్దేశించిన టార్గెట్ ను ఈజిగా ఛేదించింది . ఇరు జట్లు బలమైనవి కావడం తో మ్యాచ్ మరింత హీట్ పెంచుతుందని అనుకున్న ఫాన్స్ కు ఆట ఏకపక్షంగా సాగింది . దీంతో గెలుపు సునాయాసంగా చెన్నైకి లభించింది. మొత్తం మీద కోల్ కత్తా జట్టుపై రైనా ఆఫ్ సెంచరీ చేయడం ..రవీంద్ర జడేజా తోడుగా నిలవడంతో ఏడో విజయాన్ని నమోదు చేసింది . టార్గెట్ ను ఛేదించే క్రమంలో చెన్నై జ‌ట్టు ఆదిలోనే ఫాంలో వున్న షేన్ వాట్స‌న్, డుప్లిసిస్ , మ‌హేంద్ర సింగ్ ధోనీ , కేదార్ జాద‌వ్ లు త‌క్కువ ప‌రుగుల‌కే పెవీలియ‌న్ దారి ప‌ట్టారు. దీంతో మైదానంలో వున్న సురేష్ రైనా ఒక్క‌డే అద్భుత‌మైన ఫాంను క‌న‌బ‌ర్చి జ‌ట్టును విజ‌యపు అంచుల్లోకి తీసుకు వెళ్లాడు. కేవ‌లం 41 బంతులు ఆడి ఏడు ఫోర్లు, ఒక భారీ సిక్స‌ర్ సాయంతో 57 ప‌రుగులు చేశాడు. కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు రైనా. సురేష...

మొబైల్ మార్కెట్లో మనోడే దిగ్గజం

చిత్రం
ప్రపంచ వ్యాపార రంగంలో భారతీయులు టాప్ పొజిషన్ లో వుంటున్నారు . ఇప్పటికే మొబైల్ తయారీ మార్కెట్ లో చైనా అందనంత దూరంలో ఉన్నది . ఇతర దేశాలకు దిమ్మ తిరిగేలా షాక్ లు ఇస్తూ కోలుకోలేకుండా చేస్తోంది . ఓ వైపు ఆపిల్ ఇంకో వైపు సాంసంగ్ మొబైల్స్ కు పోటీగా చైనా మొబైల్స్ ఇండియన్ మార్కెట్ ను ఆక్రమించేశాయి . దీంతో చైనాను నిలువరించేందుకు భారతీయ స్మార్ట్ ఫోన్ల తయారీదారులు నానా తంటాలు పడుతున్నారు . మైక్రో మాక్స్ , ఇంటెక్స్ ..తదితర కంపెనీలు మార్కెట్లో ఉన్నా ఆశించినంత అమ్మకాలు సాగడం లేదు . చైనా మొబైల్స్ కంపెనీలలో వివో ..ఒప్పో తో పాటు రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. తయారీలోనూ ..సెల్ఫీ క్లారిటీ ,,బ్యాటరీ ..ఎక్కువ ఫీచర్స్ ..ఉండడంతో ఈ మొబైల్స్ ను యూత్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు . దీంతో ఊహించని రీతిలో చైనా మొబైల్స్ కంపెనీలకు లెక్కించంలేనంత ఆదాయాం సమకూరుతోంది . ఓ వైపు వివో కంపెనీ ఏకంగా అత్యంత ఖరీదైన టోర్నమెంట్ ఐపిల్ టోర్నీని స్పాన్సర్ చేస్తోంది . దీనిపైనే ఏకంగా ఈ కంపెనీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. భారతీయ వ్యాపార రంగంలో తమ వాటాను కలిగి ఉన్న విదేశీ కంపెనీలకు కోలు...

హమ్మయ్య ..గెలిచారు ..నిలిచారు..!

చిత్రం
ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎట్టకేలకు ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగుళూరు చాలెంజర్స్ జట్టు బోణీ చేసింది . పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది . ఏకంగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలై క్రికెట్ ఫాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కున్న కోహ్లీ సేన సునాయాసంగా గెలుపు సాధించింది . కెప్టెన్ కోహ్లీ తో పాటు డివిలియర్స్ అద్భుత ప్రదర్శన ప్రదర్శించారు . అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అత్యుత్తమమైన పనితీరు కనబరిచారు . వరుస ఓటములతో డీలా పడిన కోహ్లీ జట్టు మెరుగైన ఆట ఆడింది . మిగతా జట్లన్నీ గెలుస్తూ పాయింట్ల పట్టికలో ముందు వరుసలో చేరిపోతుంటే కోహ్లీ ఒక్కడే ఒంటరిగా మిగిలి పోయాడు . ఐపీఎల్ లో విజయం కోసం నానా తంటాలు పడ్డాడు . ఎటు చూకిస్నా విమర్శలే . కోహ్లీని తప్పించాలని క్రికెట్ ఫాన్స్ డిమాండ్ చేశారు . ఐపీఎల్ లో జట్టును గెలిపించలేని కెప్టెన్ ఇక ఇండియా జట్టును గెలిపిస్తాడని ..తక్షణమే మార్చాలంటూ నెటిజన్లు .. అభిమానులు డిమాండ్ చేశారు . దీంతో కోహ్లీ ఆట మైదానంలో తీవ్ర అసహనానికి గురయ్యాడు . ఎట్టకేలకు విజయం సాధించడంతో కోహ్లీ మోములో నవ్వు మెరిసింది . ఇక ఆట...

రాజస్థాన్ రాయల్ విక్టరీ - బట్లర్ భారీ స్కోర్

చిత్రం
ఐపీఎల్ టోర్నమెంట్ లో రాజస్థాన్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది . స్వంత గడ్డపై ముంబై వాంఖేడ్ మైదానంలో ఫాన్స్ మద్దతు ఉన్న ముంబై జట్టును రాజస్థాన్ ఓడించింది . ఆరు వికెట్లను కోల్పోయి 188 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేదించింది . మొదట రహానే ఆరు ఫోర్లు ఒక సిక్స్ తో 37 పరుగులు చేయగా ..జొస్ బట్లర్ చెలరేగి ఆడాడు . రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు . ఏకంగా కేవలం 43 బంతులు మాత్రమే ఆడిన బట్లర్ ఎనిమిది ఫోర్లు ..ఏడు సిక్సర్లతో 89 పరుగులు చేశాడు . వీరిద్దరూ మంచి శుభారంభం అందించారు . మైదానంలో బట్లర్ చెలరేగి ఆడుతూ ఉంటే ముంబై బౌలర్లు ఏమీ చేయలేక చతికిల పడ్డారు . ఆ తర్వాత వచ్చిన ఇండియన్ స్టార్ క్రికెటర్ సంజూ సాంసన్ 31 పరుగులు చేయడంతో సునాయాసంగా విజయం లభించింది. శాంసన్ అవుట్ కావడం ..త్వరత్వరగా రాజస్థాన్ వికెట్లు కోల్పోవడంతో గెలుస్తుందో లేదోనన్న ఉత్కంఠ నెలకొన్నది . ఈ సమయంలో రంగంలోకి దిగిన చివర్లో శ్రేయాస్‌ గోపాల్‌(13) ధాటిగా ఆడి ముంబయిని ఓడించాడు. ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు . అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు విక...