పోస్ట్‌లు

అభివృద్ధి వైపే జనం - మళ్ళీ బాబుకే పట్టం - సర్వేలన్నీ అటు వైపే

చిత్రం
సీన్ మారింది . ఏపీ రాజకీయాలు మరోసారి హీట్ పెంచినా మరోసారి చంద్ర బాబు నాయుడే సీఎం కాబోతున్నారంటూ పలు ముందస్తు సర్వేలు వెల్లడించాయి . మిషన్ చాణక్య తో పాటు వివిధ చానళ్ళు తమ సర్వేల ఫలితాలను ప్రకటించాయి . చాణక్య సంస్థ 101 సీట్లు టీడీపీకి రానున్నాయని ..మిగతా చానళ్ళు 105 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి . కొంత మేరకు వ్యతిరేకత ఉన్నా ఆంధ్రా జనం మాత్రం బాబు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అమలు చేస్తున్న పథకాలు . అభివృద్ధి ఇదే ముఖ ్యం కానున్న్నాయి . టిడిపికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్నది . ఏ సమయంలోనైనా కేంద్ర బిందువుగా మారే బాబు ఏది చేసినా ..ఓటమి మాత్రం ఒప్పుకోరు. ఆయన ఒక్కరే దేశం లో పీఎం మోడీని టార్గెట్ చేశారు . నిన్నటి దాకా కమలంతో దోస్తీ చేసిన బాబు ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు . చంద్రబాబును అటు మోడీ ఇటు కేసీఆర్ , జగన్, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు . అయినా బాబు చలించలేదు . ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు . బీజేపీయేతర పార్టీలు, నాయకులను ఒకే తాటిపైకి తీసుకు వస్తున్నారు . ఓ వైపు ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతూనే దేశంలో పర్యటించారు . వారిని ఒకే చోటుకు తీసుకు వచ్చారు. కర్ణాకటలో దేవెగౌడ ..తమ...

విరాట్ కోహ్లీకి ఏమైంది ..?- అభిమానుల ఆందోళన - గంభీర్ ఆగ్రహం

చిత్రం
విజయం ఊరిస్తుంది . అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. గెలిచినప్పుడు చాలా మంది పొగిడేందుకు రెడీగా ఉంటారు . ఓటమి పాలైనప్పుడు మాత్రం మనం ఒక్కరమే మిగిలి ఉంటాం . ఇది సహజం . నిన్నటి దాకా దమ్మున్న ప్యేయర్ గా ప్రపంచం మెచ్చుకున్న ఇండియన్ డైనమిక్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ..ఐపీఎల్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరల్డ్ లోనే గొప్ప ఆటగాడిగా కోహ్లీకి పేరుంది. ఏ ఫార్మాట్ లోనైనా ఆడే దమ్ము ..ధైర్యం ఈ ఆటగాడికి ఉంది . లెక్కలేనన్ని పరుగుల వరద పారించిన కోహ్లీ ..ఈ టోర్నీలో నాయకుడిగా రాణించలేక పోతున్నాడు . అటు వన్డేలోను ..ఇటు టెస్టుల్లోనూ సెంచరీల మోత మోగించిన ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ పరుగుల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికి ఆరు మ్యాచులు ఆడితే అందులో ఏ ఒక్క దానిని గెలిపించలేక పోయాడు . మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఈ అరుదైన ఆటగాడు ఇప్పుడు లెక్కలేనంత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విజయాలు ..గెలుపులు అన్నీ కొద్దీ పాటే ఉంటాయి . దానిని అర్థం చేసుకున్న ఆటగాళ్లు కొద్దీ మందే. కోహ్లీకి కోపం ఎక్కువ . బెంగుళూరు చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తన సహచర ఆటగాళ్లలో ధైర్యాన్ని ఇవ...

ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకుల వత్తాసు - ప్రజల సొమ్ము దొంగల పాలు

చిత్రం
బడా బాబులకు ..రుణాల ఎగవేత దారులకు ..దొంగలకు ..ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకులు వత్తాసు పలుకుతున్నాయి . వీరు చేసిన నిర్వాకాన్ని సాక్షాత్తు సిఇసి నిలదీసింది . పెద్ద ఎగవేతదారులను ఎందుకు వదిలి వేస్తున్నారంటూ ..వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలని కోరింది . 50 కోట్లకు మించిన బకాయిదారులను మీరుందుకు వెల్లడించడం లేదని..అసలు ఎందుకు వారిని కాపాడుతున్నారని హెచ్చరించింది. ప్రజలు కస్టపడి దాచుకున్న డబ్బులను ఇలా అప్పనంగా రుణాల ఎగవేతదారుల ఎలా కట్టబెడుతున్నారు ..మిమ్మల్ని జాతి ద్రోహులుగా ప్రకటించరాదో చెప్పాలంటూ పేర్కొంది . దేశ వ్యాప్తంగా 7 వేల మంది పారిశ్రామిక వేత్తలు వేల కోట్లు కొల్లగొట్టారు . మోసగించారు . కట్టకుండా కళ్ళముందే తిరుగుతున్నారు . అయినా రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు చోద్యం చూస్తున్నారు. ఈ మేరకు సిఇసి ఆర్ధిక శాఖ. ఆర్బీఐ , గణాంక శాఖలకు తాకీదులు ఇచ్చింది . రైతులతో పాటు చిన్న మొత్తలు ఋణం తీసుకుని ..కట్టలేక పోతే వారి పేర్లు బహిర్గతం చేస్తూ అవమానాలకు గురిచేస్తున్నారని , కోట్లకు పైగా ఎగ్గొట్టిన వాళ్ళను మాత్రం వారి వివరాలు ఎందుకు వెల్లిదంచడం లేదంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు . ...

పవన్ వ్యూహం ఫలించేనా

చిత్రం
ఏపీలో పాలిటిక్స్ రోజు రోజుకు జోరందుకున్నాయి. ఓ వైపు పోలింగ్ దగ్గర పడుతుండడంతో ఎవరి సత్తా ఏమిటో త్వరలో తేలనుంది . రాజకీయ రంగంలో అపార చాణిక్యుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి జరుగుతున్నా ఎన్నికలు యుద్దాన్ని తలపింప చేస్తున్నాయి. గతంలో జగన్ బాబు మధ్యలో పొరుంటే ఈ సారి పవన్ , బాబు, జగన్ ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఓటరు నాడి ఏ వైపున ఉన్నదో తెలియక ఆయా పార్టీల నాయకులు..బరిలో దిగిన అభ్యర్థులు ఒక అంచనాకు రాలేక పోతున్నారు . కర్ణాటక రాజకీయం పునరావృతం అవుతుందా లేక వార్ వన్ సైడ్ అవుతుందా అన్నది తేలనుంది . మొత్తంగా చూస్తే జనసేన అధినేత చాలా చోట్ల ప్రభావితం చేయనున్నారు . ఆయన పార్టీ చీల్చే ఓట్లు ఎవరికి లాభం అవుతుందో ఇంకెవ్వరికి నష్టం చేకూరుస్తుందో తెలియడం లేదు. ఇంకో వైపు ముందస్తు సర్వేలు మాత్రం మళ్ళీ టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వస్తాడని ..రమారమి 110 సీట్లు వస్తాయని ..వైసీపీ 70 సీట్లకే పరిమితం అవుతాడని ..పవన్ జనసేన కేవలం 10 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించాయి. ఓట్ల శాతం బాబు జగన్ ల మధ్య కేవలం మూడు శాతం తేడా ఉన్నప్...

అంత‌టా ప‌వ‌నిజం..అదే అత‌డి డైన‌మిజం

చిత్రం
పార్టీ న‌డ‌పాలంటే పైస‌లు అక్క‌ర్లేదు. కావాల్సంద‌ల్లా ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డం..ఇంత స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే ..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే చెప్పాలి. ఆర‌డుగుల బుల్లెట్ లాగా ఉంటాడు కానీ మాట‌లతో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌గ‌ల‌డు. చూపుల‌తో జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌డు. ల‌క్ష‌లాది అడుగుల‌ను త‌న ఆశ‌య సాధ‌న కోసం..స‌మున్న‌త స‌మాజం కోసం న‌డిచేలా చేయ‌గ‌ల‌డు. ఇదీ కొణిదెలకు ఉన్న క్రెడిబిలిటి. వ్య‌క్తిత్వ ప‌రంగా అంత‌ర్ముఖుడైన ఈ ప‌వ‌ర్ స్టార్ గురించే ఇపుడంతా చ‌ర్చ‌. ఏపీలోను ఇటు తెలంగాణ‌లోను ఆయ‌న‌కు ఎన‌లేని అభిమానులున్నారు. త‌మ‌కు తాముగా ఆరాధించే వాళ్లు ఎక్కువున్నారు. ఇదే ఆయ‌న‌కు ఉన్న అతి పెద్ద అస్సెట్. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎవ్వ‌రిపైనా చేయ‌రు. కాక‌పోతే త‌న జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోరు. ఎక్కువ‌గా మాట్లాడ‌రు. కానీ మాట్లాడితే అవ‌త‌లి వాళ్లు ఫిదా అయి పోవాల్సిందే. ఇదే రాజ‌కీయ నాయ‌కుడికి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఒక్క చూపుతో..ఒకే ఒక్క మాట‌తో శాసించ‌గ‌ల‌రు. న‌డిపించ‌గ‌ల‌రు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టే ఏ రాజ‌కీయ పార్...

సివిల్స్‌లో మెరిసిన మ‌ట్టి బిడ్డ‌లు - స‌త్తా చాటిన ప‌ల్లె ప‌రిమ‌ళాలు - సివిల్స్ ట్రైనింగ్ హ‌బ్‌గా హైద‌రాబాద్

చిత్రం
దేశంలో అత్యుత్త‌మ‌మైన స‌ర్వీసుగా భావించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో పేదింటి బిడ్డ‌లు త‌మ స‌త్తా చాటారు. తెలుగు వారు మ‌రోసారి మెరిశారు. జాతీయ స్థాయిలో యూనియ‌న్ స‌ర్వీస్ ప‌బ్లిక్ క‌మిష‌న్ ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. తెలంగాణ‌లోని మిర్యాల‌గూడ‌కు చెందిన వ‌రుణ్ రెడ్డి ఏకంగా ఏడ‌వ ర్యాంకు సాధించి ఆశ్చ‌ర్య‌పోయేలా చేశాడు. టాప్ ప‌రంగా 100 ర్యాంకుల‌ను ప్ర‌క‌టిస్తే అందులో తెలుగు వారు ఆరు మంది ఉండ‌డం విశేషం. గ్రామీణ నేప‌థ్యం నుండి వ‌చ్చిన వారే త‌మ స‌త్తా ఏమిటో ప్ర‌ద‌ర్శించారు. సివిల్ స‌ర్వీసెస్ లో అత్యుత్త‌మ‌మైన ఫ‌లితాలు ఇక్క‌డి వారే పొందుతున్నారు. సివిల్స్ కోచింగ్ సెంట‌ర్ల‌కు కేంద్రంగా హైద‌రాబాద్ మారింది. 2018లో నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష‌కు సంబంధించి సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ లో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో ఇంట‌ర్వ్యూలు చేప‌ట్టింది. ఫైన‌ల్ మెరిట్ లిస్టు ప్ర‌క‌టించింది. మొత్తంగా చూస్తే 759 మంది ఈ స‌ర్వీసుకు ఎంపిక చేసింది యుపీఎస్సీ. జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 361 మంది, ఓబీసీ కేట‌గిరిలో 209 మంది, ఎస్సీ కేట‌గిరిలో 128 మంది, ఎస్టీ కేట‌గిరిలో ...

జ‌న‌మే దేవుళ్లు..స‌మాజ‌మే దేవాల‌యం - ప‌వర్ స్టార్

చిత్రం
త‌రాలు గ‌డిచినా ఇంకా ల‌క్షలాది ప్ర‌జ‌లు ఆక‌లితో ఉండ‌డం న‌న్ను బాధించింది. లెక్క‌లేనంత సంప‌ద‌..అపార‌మైన వ‌న‌రులు క‌లిగి ఉన్నా ఎందుక‌ని కొంద‌రి చేతుల్లోనే ఈ స‌మాజం బందీ అయింది. ఈ ప్రాంతంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికి బ‌తికే హ‌క్కుంది. గౌర‌వ ప్ర‌దంగా జీవించే సౌలభ్యం ఉంది. ఎవ‌రితో పేచీ లేదు. ఇంకెవ్వ‌రితో గొడ‌వ‌లు లేవు. నా ముందున్న ఒకే ఒక్క ల‌క్ష్యం. అంత‌రాలు లేని స‌మాజం. దాని కోసం నా జీవితాన్ని అంకితం చేశా. కోట్లాది ఆస్తులున్నా నాకు సంతృప్తిని ఇవ్వ‌వు. కానీ ల‌క్ష‌లాది అభిమానుల ఆద‌ర‌ణే నాకు కొండంత అండ‌. అందుకే నాకు ప్ర‌జ‌లు అంటే ప్రాణం. వారు బాగుండాల‌ని ..త‌ల ఎత్తుకుని బ‌త‌కాల‌న్న స‌దాశ‌యంతో తుచ్ఛ‌మైన రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. న‌న్ను త‌క్కువ అంచ‌నా వేసిన వారే ఇపుడు నాతో క‌లిసి న‌డిచేందుకు వ‌స్తున్నారు. మార్పు అన్న‌ది త్వ‌ర‌గా రాదు..కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. అంద‌రు ఒక్క‌డే అన్నారు. గేలి చేశారు. వేధింపుల పాలు చేశారు. కేసులు న‌మోదు చేశారు. కానీ ఆ ఒక్క‌రే దేశానికి స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించారు. ఆంగ్లేయుల గుండెల్లో నిదుర పోయారు. అత‌నే మ‌హాత్మాగాంధీ. జ‌న‌మే దేవుళ్లు..స‌మాజ‌మే దేవాల‌యం. ఇదే నా ఆశ‌యం. ప్ర...