పోస్ట్‌లు

నేస్తం నువ్వే సమస్తం - వ‌ల్ల‌బ‌దాస్ స్మ‌తిలో..!

చిత్రం
పాల‌మూరు జిల్లా వీరుల‌ను క‌న్న‌ది. అత్యంత ప్ర‌తిభావంతుల‌ను చేసింది. ఉద్య‌మ‌కారుల‌ను..పోరాట స్ఫూర్తిని..త్యాగ‌ధ‌నుల‌ను..విజేత‌లను..మేధావుల‌ను ..తాత్వికుల‌ను..గాయ‌నీ గాయ‌కుల‌ను..క‌ష్ట‌జీవుల‌ను అందించింది. ఈ మ‌ట్టిలో పుట్టి..దీనిలోనే త‌క్కువ కాలంలోనే ఇక సెల‌వంటూ వెళ్లి పోయాడు..మా వ‌ల్ల‌బ‌దాస్ మ‌హేంద‌ర్ గౌడ్. మ‌రిక‌ల్ మండ‌లం జిన్నారం ఊరులో పుట్టిన మ‌హేంద‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న మ‌మ్మ‌ల్ని వీడి ఇవాళ్టితో ఏడాది గ‌డిచింది. గ్రూప్ -1 ఆఫీస‌ర్ గా అద్భుత‌మైన నైపుణ్యం, సునిశిత‌మైన తార్కిక విశ్లేష‌ణ‌, రాయ‌డంలో, చ‌ద‌వ‌డంలో, విశ్లేషించ‌డంలో మా కంటే ఆయ‌న ముందున్నారు. గుండె నిండా ప్రేమ‌ను..మాన‌వ‌త్వాన్ని క‌లిగిన స్నేహితుడు దూరం కావ‌డం బాధాక‌రం. కాలం ఎంత విచిత్ర‌క‌ర‌మైన ప‌రిస్థితిని క‌లుగ చేసిందో త‌లుచుకుంటేనే క‌న్నీళ్లు కారి పోతున్న‌వి. మా ఇద్ద‌రి మ‌ధ్య రెండేళ్ల స్నేహం మాత్ర‌మే. కానీ మ‌రిచి పోలేని జ్ఞాప‌కాల‌ను మిగిల్చింది. ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ‌, సాహిత్య‌, సాంస్కృతిక‌, సైన్స్, ఐటీ, సోష‌ల్ మీడియా, న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌తి రంగంలో ఆయ‌న‌కు అప‌రిత‌మైన అనుభ‌వం ఉన్న‌ది. ప్ర‌తి అంశం ...

ఆ రూపం అపురూపం .. ఆమె జ్ఞాప‌కం అజ‌రామ‌రం - మ‌దిలో మ‌ధుబాల..!

చిత్రం
భార‌తీయ సినీ జ‌గ‌త్తులో చెరిగిపోని జ్ఞాప‌కం ఆమె.. అందం..అభిన‌యం..విన‌యం..క‌ల‌గ‌లిస్తే మ‌ధుబాల‌. ఇవాళ ప్రేమికుల రోజు..అలాగే వెండితెర వెన్నెల‌..మ‌ధుబాల పుట్టిన రోజు. ఎన్నేళ్ల‌యింది చూసి..మొఘెల్ ఏ ఆజం సినిమా ఎప్ప‌టికీ క్లాసిక్కే. ఆ చూపు..ఆ క‌ళ్లు..ఆ రూపం..ఇంకెవ్వ‌రికీ రాదు..దేవుడు సృష్టించిన అద్భుతాల్లో మ‌ధుబాల ఒక‌రు. ఆమె అస‌లు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహల్వి. 14 ఫిబ్ర‌వ‌రి 1933లో ఢిల్లీలో జ‌న్మించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. త‌న అందంతో మెస్మ‌రైజ్ చేశారు. న‌టిగా దిగంతాల‌ను వెలిగించారు. ఈ ప్ర‌యాణంలో మ‌లుపులు ఎన్నో..జ్ఞాప‌కాలు మ‌రెన్నో. త‌లుచుకుంటే చాలు ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. ఎన‌లేని కీర్తిని మూట‌గ‌ట్టుకున్నారు. కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. 1950 నుండి 1960 మ‌ధ్య కాలంలో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించారు. త‌న స‌మ‌కాలికులైన న‌టీమ‌ణులు న‌ర్గీస్, మీనాకుమారిల‌తో ..స‌మానంగా గౌరవం పొందారు. సాంప్ర‌దాయ ముస్లిం దంప‌తుల 11 మంది సంతానంలో మ‌ధుబాల ఐద‌వ వ్య‌క్తి. తండ్రి అతావుల్లా ఖాన్ పెషావ‌ర్‌లోని ఇంపీరియ‌ల్ టొబాకో కంపెనీలో త‌న ఉద్యోగాన్ని కోల్పోవ‌డంతో ..త‌న కుటుంబాన్ని ముంబ‌య...

అగ్ని శిఖ‌రం అంచున ..అక్ష‌ర యోధుడు ..!

చిత్రం
సుసంప‌న్న‌మైన ..త‌ర‌త‌రాల‌కు స‌రిప‌డా వ‌న్నె త‌గ్గ‌ని చ‌రిత్ర క‌లిగిన ప్రాంతం తెలంగాణ‌. ఈ మ‌ట్టికి ఎన‌లేని మాన‌వ‌త్వం వున్న‌ది. మ‌నుషుల్ని ..జీవాల‌ను ఒకే రీతిన చూడ‌గ‌లిగే సంస్కృతి ఈ ఒక్క ప్రాంతానికి మాత్ర‌మే వున్న‌ది. పోరాటాల‌కు..త్యాగాల‌కు..బ‌లిదానాల‌కు..ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక ఈ స్థ‌లం. ఆయుధాలు లేక పోయినా స‌రే ఆత్మ‌విశ్వాసానికి కొదువ లేదు. ప్ర‌పంచ చ‌రిత్ర‌లో సుదీర్ఘ‌మైన పోరాటం చేసి..ప్ర‌త్యేక రాష్టం కోసం తెలంగాణ జెండాను ఎగుర వేసిన ఘ‌న‌మైన చ‌రిత్ర‌ను సృష్టించింది ఈ స్థల‌మే. అపార‌మైన వ‌న‌రులు..అద్భుత‌మైన అవ‌కాశాలు క‌లిగిన ఒకే ఒక్క ప్రాంత‌మిదే. ఎక్క‌డికి వెళ్లినా ఈ మ‌ట్టిలో వున్నంత ప్రేమ ఇంకెక్క‌డా దొర‌క‌దు . అందుకే ఆ అక్ష‌ర యోధుడు దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు ..నా తెలంగాణ కోటి ర‌త‌ణాల వీణ అని స‌గౌర‌వ్వంగా లోకానికి చాటి చెప్పారు. క‌విగా, ర‌చ‌యిత‌గా, గేయ ర‌చ‌యిత‌గా తెలంగాణ ప్రాంతం నుండి త‌న‌దైన ముద్ర‌ను వేసుకుని అక్ష‌రాల‌తో మంట‌లు పుట్టించిన మ‌హాక‌వి దాశ‌ర‌థి. వ‌రంగ‌ల్ జిల్లా చిన్న‌గూడురులో 1925 జూలై 22న జ‌న్మించారు. నిజాం న‌వాబుల దాష్టిక పాల‌న‌పై ఎక్కుపెట్టిన ఆయుధం ఆయ‌న‌. తెలం...

హ‌మ్ దోనో ..దో ప్రేమి ..దునియా చోడ్ చెలే - ఆరాధ‌న రాజేష్ ఖ‌న్నా..!

చిత్రం
ఆ రోజులే వేరు..సినిమా అంటే తీర‌ని మోజు..ఇప్ప‌టిలా ఎప్పుడంటే అప్పుడు సినిమాలు చూసే వీలుండేది కాదు. ఓ వైపు పాఠాలు ఇంకో వైపు టాకీసుల ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌టం..చూసి ఎంజాయ్ చేయ‌డం. డ్రెస్సులు..స్ట‌యిల్..స్టేట‌స్ సింబ‌ల్ ..హిందీ అర్థ‌మ‌య్యేది కాదు..కానీ ఎవ‌రైనా మాట్లాడితే విన‌సొంపుగా వుండేది.. ఆ స‌మ‌యంలో హీరో క‌నిపిస్తే చాలు చ‌ప్ప‌ట్లు..ఈల‌లు..మా కాలంలో అమితాబ్ బ‌చ్చ‌న్, దేవానంద్, రాజేష్ ఖ‌న్నా ..సినిమాలంటే పిచ్చి ప్రేమ‌. కిషోర్ కుమార్, ల‌తా మంగేష్క‌ర్, ఆషా భోంస్లే ల పాట‌లు..ఎస్‌డీ, ఆర్ డి బ‌ర్మన్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పాట‌లంటే పంచ ప్రాణం. మ‌ధ్యాహ్నం అయ్యే స‌రిక‌ల్లా సిలోన్ రేడియోలో వ‌చ్చే వార్త‌లు, పాట‌ల కోసం నిరీక్ష‌ణ‌. ఓ వైపు గంట మోగేది..ఇంకో వైపు ..రాత్రి అయితే చాలు గీత్ మాలా ప్ర‌సారం అయ్యేది. ప్ర‌తి ఇంట్లో రేడియో..ఫిలిప్స్ కంపెనీ , మ‌ర్ఫీ కంపెనీలవి వుంటే అదో స్టేట‌స్. ఆ రోజుల్లో రాజేష్ ఖ‌న్నా సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు ..అదో అద్వితీయ‌మైన ఆనందం. హ‌మ్ దోనో ..దో ప్రేమి..దునియా చోడ్ చెలే ..అనే పాట‌ను ఎన్ని సార్లు విన్నా త‌నివి తీర‌దు..ఆ స్ట‌యిల్..ఆ చూపులు..ఆ చైత‌న్య‌వంత‌మైన రూప...

!..ప్రేమ లోగిలి..లోక‌మే వాకిలి ..!

చిత్రం
బ‌తుకు వెలిగి పోవాల‌న్నా..ఆనందం వెళ్లి విరియాల‌న్నా..గుండెల్లోంచి గుండెల్లోకి చూపులు ప్ర‌స‌రించాల‌న్నా ప్రేమ కావాల్సిందే. నువ్వు నేను క‌లుసుకున్న‌ప్పుడు..కొత్త‌గా ప‌రిచ‌యం చేసుకున్న‌ప్పుడు..ప్ర‌యాణం చేస్తున్న‌ప్పుడు...కిటికీ ప‌క్క‌న ఒక‌రికొక‌రం క‌ళ్ల‌ల్లోకి ప్ర‌వ‌హించిన‌ప్పుడు ..శ‌రీరాలు తెలియ‌కుండానే క‌ద‌ల‌డం ప్రారంభిస్తాయి. అపుడంతా ఈ ప్ర‌పంచం ఎంత అద్భుత‌మైన‌దోన‌ని అనిపిస్తుంది. మేఘాలు తేలిపోతున్న‌పుడు..అల‌లు అల‌లుగా ఆలోచ‌న‌లు వెంబ‌డిస్తున్న‌ప్పుడు..మ‌ళ్లీ మ‌ళ్లీ జ్ఞాప‌కాలు పూల మొక్క‌ల్లా అగుపిస్తాయి. ప్రేమ లేకుండా వుండ‌లేం. ఆశించ‌కుండా ..కోరుకోకుండా..చేత‌కాదు. ఇదే ప్రేమంటే..నీ కోసం ప‌రిత‌పిస్తున్న‌ప్పుడు..నీ కోసం ఆక్రోశిస్తున్న‌ప్పుడు..నీ అడుగుల స‌వ్వ‌డి..ఆ ప్రేమ‌త‌న‌పు దారుల్లో న‌డుస్తున్న‌ప్పుడు..గాల్లో తేలిన‌ట్టు అనిపిస్తుంది..ఇలా మొద‌లై అలా ముగుస్తుంద‌ని చెప్ప‌లేం. ఎంత చెప్పినా త‌క్కువే..ఈ లోకం వెలిగిపోతోంది..ఈ జ‌గ‌త్తు ప్ర‌కాశ‌సిస్తోంది..నువ్వు లేకుండా నేనుండ‌లేను..నీ సాహ‌చ‌ర్యం లేకుండా బ‌త‌కడం చేత కాదు..ఏక కాలంలో ..ఏకాంతంలో హృద‌యాలు క‌లుసుకున్న‌ప్పుడు ప్ర‌పంచం వ‌ద్...

శార‌దా పీఠం .. భ‌క్తికి ప్ర‌తిరూపం - స్వ‌రూపానందేంద్ర ప్ర‌స్థానం

చిత్రం
అన్ని దారులు అటు వైపు వెళుతున్నాయి. వివిధ రంగాల‌కు చెందిన వారు..ల‌బ్ధ ప్ర‌తిష్టులైన వారి అడుగుల‌న్నీ ఆ ప‌విత్ర‌మైన ..భ‌క్తుల‌కు సాంత్వ‌న చేకూర్చుతోంది విశాఖప‌ట్ట‌ణంలోని పెందుర్తిలో శార‌దా పీఠం. ఆధ్యాత్మిక‌త‌కు..యాగాల‌కు చిరునామా ఈ పుణ్య స్థ‌లం. ఇక్క‌డ కొలువై వున్న అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు క్యూ క‌డ‌తారు. సాక్షాత్తు భ‌క్తి స్వ‌రూపుడైన పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామీజీని అనుస‌రిస్తారు. ఆయ‌న బోధ‌న‌ల‌ను ..ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన ఆధ్యాత్మిక , ధార్మిక విలువ‌ల‌ను ఆల‌కిస్తారు. అవ‌లోక‌న చేసుకుంటారు. భ‌క్తికి..సామాజిక బాధ్య‌త‌కు మ‌ధ్య‌న కుటుంబ‌మ‌నే బంధాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఎంద‌రో ఆధ్యాత్మిక వేత్త‌లు, స్వాములు నిరంత‌రం ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. అలుపంటూ ఎరుగ‌క క‌ష్ట‌ప‌డుతున్నారు. కుల మ‌తాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు ధ‌ర్మ‌బ‌ద్ధంగా వుండాల‌ని, ప‌దుగురికి చేయూత‌నివ్వాల‌ని..ఆప‌ద స‌మ‌యంలో వున్న‌ప్పుడు ఆదుకోవాల‌ని..క‌ష్టాల సుడిగుండంలో చిక్కుకున్న వారికి ఆస‌రాగా నిల‌వాల‌ని పీఠాలు, ఆశ్ర‌మాలు, అధిప‌తులు, పీఠాధిప‌తులు పిలుపునిస్తున్నారు. విలువైన జీవితాన్ని గుర్తెరిగారు కాబాట్టే వారు రుషుల...

మ‌ళ్లీ జ‌న్మిస్తావా..దేవానంద్ ..!

చిత్రం
నిద్ర‌లో క‌ల‌వ‌రించే అందం ఆయ‌న స్వంతం. అత‌డే జ‌గ‌మెరిగిన‌..జ‌నం మెచ్చిన ..ఎవ‌ర్ గ్రీన్ హీరో..దేవానంద్. ఆ ముగ్ధ మ‌నోహ‌ర‌మైన రూపం ఆయ‌న‌కు మాత్ర‌మే స్వంతం. ప్ర‌కృతి విప్పారిన‌ట్టు..పూల‌న్నీ ఒకే చోట వాలిన‌ట్టు..ఎంత‌టి అద్భుత‌మైన‌..ఆక‌ర్ష‌ణీయ‌మైన‌..ర‌మ‌ణీయ‌మైన శ‌రీరం..ప‌డుకుంటే..కిటికీ ప‌క్క‌న తొంగి చూస్తే..గాలి తెమ్మెర‌లు తాకుతుంటే..ప్రియురాలి ముంగురులు క‌ళ్ల‌ను..వాకిళ్ల‌ను..చూపుల్ని క‌ట్టి ప‌డేస్తుంటే..అపుడు ల‌యాత్మ‌కంగా ..గైడ్ సినిమా హ‌త్తుకుంటుంది. ఎవ‌రూ లేకుంటే బావుండ‌నిపిస్తుంది..ఏకాంతంలో ఒక్క‌ళ్ల‌మే ..గ‌దిలో త‌చ్చ‌ట్లాడుతుంటే..దేవానంద్ ప‌ల‌క‌రిస్తాడు..ప‌ల‌వ‌రించేలా చేస్తాడు..అదీ ఆయ‌న స్పెషాలిటీ..భౌతికంగా లేరు..కానీ మాన‌సికంగా ఆ స‌మ్మోహ‌న భ‌రిత‌మైన ..ఎల్ల‌వేళ‌లా వ‌సంతంలా ..చిగురించే కొమ్మ‌ల్లా ..ఆ న‌వ్వు ..అన్నింటిని క‌దిలిస్తుంది..అందమంటే ఏమిటి..ఆక‌ర్ష‌ణా కాదు అదో అనిర్విచ‌నీయ‌మైన అనుబంధం. గాతా ర‌హే మేరా దిల్ ..అంటూ పిల్ల‌తెమ్మ‌ర‌లా కిషోర్ కుమార్..ల‌తా మంగేష్క‌ర్ లు పాడుతూ వుంటే..దేవానంద్ అభిన‌యం అద్వితీయం..అజ‌రామ‌రం. భార‌తీయ సినిమా ఫ్లాట్ ఫాంలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న సినిమా అ...