పోస్ట్‌లు

!..నువ్వు నీలాగే ఉండు..!

చిత్రం
నీ ద‌గ్గ‌ర ఏముంది. నిన్ను పొగిడే వాళ్లున్నారా. నీ చుట్టూ మందీ మార్బ‌లం ఉందా. నిన్ను ఆకాశానికి ఎత్తేసి. లాబీయింగ్ చేసే వాళ్లున్నారా. ఎదుటి వాళ్ల‌ను మెస్మ‌రైజ్ చేసే లౌక్యం ఉందా..పోనీ సాయంత్రం అయితే బార్ లేదా ప‌బ్ కు తీసుకు వెళ్ల‌గ‌లిగే స్టామినా నీకుందా..గ్యాంగ్ ను మెయింటెనెన్స్ నీ వ‌ద్దుందా..పోనీ బెదిరించి ప‌నులు చేసుకునే ప‌వ‌ర్ వుందా..ప‌ర్స్ నిండా క‌రెన్సీ వుందా..ఆస్తులు, అంత‌స్తులు..అమెరికాను త‌ల‌ద‌న్నే కార్లున్నాయా..క‌ళ్లు చెదిరే స్మార్టు ఫోన్లున్నాయా. నీకెంత‌మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారా..అయితే ఇప్పుడున్న దునియాలో నువ్వు తోపు. నిన్ను డామినేట్ చేసే వాళ్లుండ‌రు..అంతా అన్నా అని అనేటోళ్లే. ఇంకెందుకు ఆల‌స్యం. అమెరికా జ‌పం చేయండి చాలు. అబ్బో ఫ్ల‌యిట్లు..దిమ్మ తిరిగే బ్యాంకు బ్యాలెన్సులు నిండితే చాలు క‌దా. నీకో స‌ర్కార్ కొలువుంటే చాలు..అదే ప‌ది వేలు. అదే ధ్యాస‌..అదే శ్వాస‌. ప‌క్కోడు ఏమై పోతేనేం. నువ్వు బాగుంటే చాలు. ఇది కాదు జింద‌గీ అంటే. నీ వ‌ద్ద చిల్లి గ‌వ్వ లేక పోయినా..నీ ద‌గ్గ‌ర ద‌మ్ముంటే చాలు. దీనిని ఏలటానికి . ఇక నీకు నీవే బ్రాండ్. నీ జీవితం నీది. ఇంకొకడి డామినేష‌న్ అక్క‌ర్లేదు. నిన్ను...

ధ్యానం జీవ‌న యోగం..!

చిత్రం
ఎవ‌రికి వారై ..ఎవ‌రి లోకంలో వాళ్లు ఊరేగుతూ అదే అద్భుత‌మనుకుంటూ బ‌తుకు జీవుల‌కు అన్నీ వున్నా ఏదో వెలితి కెలుకుతోంది. వ‌స్తువుల వ్యామోహం మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఈ త‌రుణంలో ప్ర‌శాంతత కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ముప్పై ఏళ్ల‌కే ముస‌లిత‌నం వ‌చ్చేస్తోంది. చేతుల్లో సెల్లు గొల్లుమ‌నేలా క‌ట్ట‌డి చేస్తోంది. అటు శ‌రీరం..ఇటు మ‌న‌సు రెండింటి మ‌ధ్య ఈ లోకంలో మ‌న‌కంటూ ఓ ఐడెంటిటీ కావాలిగా. దీని కోసం అంద‌మైన అబ‌ద్దాలు. లేనిపోని ఆడంబ‌రాలు. ఎంత నేర్చుకున్నా..త‌రాల‌కు స‌రిప‌డా సంపాదించినా సంతృప్తి శూన్యం. ఐదారుగంట‌లు కుదురుగా కూర్చోలేరు. ఒద్దిక‌గా వుండ‌లేరు. ప్ర‌పంచాన్ని ఉద్ద‌రించలేరు. పోనీ ఓ క్వింటాలు బ‌రువును ఎత్తలేరు. ఎందుకూ కొర‌గాని డిజిగ్నేష‌న్లు. ఎవ‌రిని క‌దిలించినా ఇంజ‌నీరింగ్ జ‌పం. ఇండియాను ఎప్పుడో మ‌ర్చిపోయారు. 24 గంట‌లు మొబైల్‌లోనే..అక్క‌డే ప్ర‌త్య‌క్షం..ప‌ల‌క‌రించేందుకు కూడా టైం దొర‌క‌ని దౌర్భాగ్య ప‌రిస్థితి. డాల‌ర్ల మాయాజాలం మ‌నుషుల్ని ఒక ప‌ట్టాన నిల‌వ‌నీయ‌కుండా చేస్తోంది. క‌ళ్లు చెదిరే నిర్మాణాలు..కాంక్రీట్ గ‌దుల్లో ఇరుక్కు పోయిన బ‌తుకులు. అంత‌టా బ‌ట‌న్ సిస్టం. బ‌తుకంతా అభ‌ద్ర‌త ర...

లివింగ్ లెజెండ్..కేసీఆర్..!

చిత్రం
కేసీఆర్ ఈ పేరు ప్రపంచ చరిత్రలో ఓ పాఠం ..ఓ అధ్యాయం. పట్టుదలకు మారు పేరు ..అనుకున్నది సాధించే మొండి ఘటం. జనం మెచ్చిన నాయకుడు . ప్రజలు మెచ్చిన పరిపాలనాదక్షుడు. అపర భగీరథుడు . బహు భాషా కోవిదుడు . తాత్వికుడు ..పోరాట యోధుడు . వ్యూహకర్త ..కవి ..రచయిత ..గంటల తరబడి లక్షలాది సమూహాన్ని నియంత్రించే ఉపన్యాసకుడు. పలు అంశాల్లో పట్టు కలిగిన ధీరోదాత్తదుడు. లోకం నివ్వెర పోయేలా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాన్ని నడిపిన జగమెరిగిన నేత. ఆయనే కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. అంతా ముద్దుగా పిలుచుకునే పేరు కేసీఆర్. కొందరు అనామకులుగానే ఉంటారు .ఇంకొందరు భావి తరాలను ప్రభావితం చేసే చరిత్రను సృష్టిస్తారు . అలాంటి చరిత్రను తీరుగా రాసిన జన హృదయ నేత కేసీఆర్. బహుశా ఈ దేశంలో ఏ నాయకుడు ఎదుర్కోని అవమానాలను ఆయన ఎదుర్కొన్నారు . అయినా తెలంగాణ విముక్తి కోసం ఆయన చేయని పోరాటం లేదు ..ఆయన చేయని ప్రయత్నం లేదు . ఈ ప్రపంచంలో సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత దాకా ఆయన పేరు సదా నిలిచే ఉంటుంది. అప్పటి సీఎం చంద్రబాబు తీరుతో విసిగి వేసారి ..తెలంగాణ ప్రాంతపు దుఃఖాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి ఆయన.దుఃఖం వచ్చినా ఆపు కోలేని మానవత్వం ఉన్న మనీషి కేసీఆ...

కవితమ్మ..బతుకమ్మ..!

చిత్రం
తెలంగాణ మాగాణంలో విస్మరించలేని పదం కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఆమె పేరు వినని వారంటూ వుండరు. అంతగా ప్రాచుర్యం పొందారు. ఇటు రాష్ట్ర స్థాయిలోను అటు దేశ విదేశాలలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలిగా నలుదిశలా వినుతికెక్కారు. ఉద్యమ నేపథ్యం ..అపారమైన విజ్ఞానం. నాయకత్వ నైపుణ్యం ఆమె సొంతం.ఏది మాట్లాడినా సరే ఒక విజన్ ఉండేలా ఎదుటి వారిని మెప్పిస్తారు. ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరులో ఆమె చేపట్టిన బతుకమ్మ పండుగ ఒక బ్రాండ్ గా మారి పోయింది . బతుకమ్మ అంటేనే కవితమ్మ అనే పేరు చీర స్థాయిగా నిలిచి పోయేలా చేసింది . ఇదంతా ఆమె సాధించిన అపూర్వ విజయం ఇది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. నిరంతర నిర్బంధంలో సైతం ఆడబిడ్డల్ని ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన ఘనత ఆమెదే. ఎన్నో అవమానాలు .. మరెన్నో ఆరోపణలు ..వాటినన్నిటిని ధైర్యంతో ఎదుర్కొన్నది. తానే నేటి యువతకు ఓ ఐకాన్ లాగా మారి పోయింది. అదీ ఆమెకున్న ఘనత ..ప్రత్యేకత. తెలంగాణ యాస ..భాష..కట్టు బొట్టు .అన్నిటిని ఆమె జనంలోకి తీసుకు వెళ్లారు . దేశం దాటి ఖండాతరాళాల్లో తెలంగాణ సంస్కృతి .. సాంప్రదాయాలను పాటించేలా చేశారు . ఇప్పుడు ఎక్క...

రోగుల పాలిట దైవం కె.జె.రెడ్డి వైద్యం

చిత్రం
ఆర్థోపెడిక్ విభాగంలో దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న వైద్యుల జాబితాలో డాక్ట‌ర్ కె.జె.రెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ‌లో ఆయ‌న పేరు ఎవ‌రిని అడిగినా త‌డుముకోకుండా చెప్పేస్తారు. అపార‌మైన అనుభ‌వంతో పాటు  రోగుల ప‌ట్ల ఆయ‌న చూపించే అనురాగం రెడ్డిని ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా నిలిచేలా చేసింది. ఆర్థోపెడిక్ ప‌రంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ విష‌యాన్ని ఆయ‌న ముందే గుర్తించారు. అందుకే తాను పుట్టిన ఊరికి, పాల‌మూరు జిల్లాకు పేరు తీసుకు వ‌చ్చారు. ఆయ‌న త‌న మూలాల‌ను మ‌రిచి పోలేదు. ఒక‌ప్పుడు వైద్యం కోసం  అష్ట‌క‌ష్టాలు ప‌డిన త‌మ ప‌ల్లె ప్ర‌జ‌లను చూసి రెడ్డి చ‌లించి పోయారు. ఏకంగా జిల్లా చ‌రిత్ర‌లో స‌క‌ల స‌దుపాయాలు, సౌక‌ర్యాల‌తో అత్యాధునిక‌మైన ఆస్ప‌త్రిని, మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్‌, రాయిచూర్ ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే జిల్లా కేంద్రానికి ద‌గ్గ‌ర‌లో పేద‌ల‌కు మెరుగైన చికిత్స‌లు అంద‌జేస్తోంది.  కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు.క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబద్ధ‌త‌, సింప్లిసిటీకి పెట్టింది పేరు కె.జె.రెడ్డి. క‌లాం క‌ల‌లు క‌న్నారు..ద...

సేవే మార్గం జీవితం ధ‌న్యం - మ‌హిళా స్ఫూర్తి - శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు

చిత్రం
జీవితం దేవుడిచ్చిన వ‌రం. ప‌ది మందికి సేవ చేయ‌డంలో ఉన్నంత సంతృప్తి ఎందులోనూ ఉండ‌దంటున్నారు నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం జూప‌ల్లి గ్రామానికి చెందిన శ్రీ‌మ‌తి వ‌న‌జా భాస్క‌ర్‌రావు. త‌రాల‌కు  స‌రిప‌డా ఆస్తులు, అంత‌స్తులున్నా అవేవీ మ‌న‌కు ఆనందాన్ని ఇవ్వ‌వ‌ని చెబుతారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన దాంట్లోంచి ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలంటారు. ఒక మ‌హిళ త‌లుచుకుంటే ఏమైనా సాధించ‌గ‌ల‌మ‌ని ఆమె నిరూపిస్తున్నారు. సాటి మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. త‌ల్లిదండ్రులు ర‌ఘుప‌తిరావు, సౌంద‌ర్య‌దేవి. ఐదుగురు అక్కా చెల్లెళ్లు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు. డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నారు. 1975లో క‌రీంన‌గర్ జిల్లాకు చెందిన శ్రీ‌మాన్ భాస్క‌ర్‌రావు గారితో వివాహం. వీరికి ఒక పాప‌. ఒక బాబు. ఇద్ద‌రూ చ‌దువులో రాణించారు. వైద్యులుగా అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. కోడ‌లు , అల్లుడు కూడా డాక్ట‌ర్సే. 1980లో జి.వి.భాస్క‌ర్‌రావు పేరుతో సీడ్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. 1986లో దీనిని కావేరీ సీడ్స్ కంపెనీగా మార్చారు. ఇదే స‌మ‌యంలో శ్రీశ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అప్ప‌టి నుండి శ్రీ‌మ‌తి వ‌న‌జా ...

జ్యూట్ బ్యాగుల త‌యారీతో జీవ‌నోపాధి - బోయ‌న‌ప‌ల్లి క‌విత బ‌తుకు క‌థ‌

చిత్రం
ప్లాస్టిక్ బ్యాగులు, సంచుల వినియోగం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటోంద‌న్న ఆలోచ‌నే శ్రీ‌మ‌తి బోయ‌న‌ప‌ల్లి క‌విత‌ను వినూత్నంగా ఆలోచించింది.  తాను బ‌త‌క‌ట‌మే కాదు ప‌ది మందికి ఉపాధి క‌ల్పించాల‌న్న సంక‌ల్పం ఆమెను జ్యూట్ బ్యాగుల త‌యారీ ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టేలా చేసింది. ఎక్క‌డ చూసినా ప్లాస్టిక్ సంచులే. వీటి వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌మైన రోగాలు వ‌చ్చే ప్ర‌మాదం వుంద‌ని ఆమె గ్ర‌హించారు. తానే ఎందుకు వాటిని ఉప‌యోగించ‌కుండా చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించారు. భ‌ర్త స‌హ‌కారంతో అదే కొద్దిపాటి పెట్టుబ‌డితో సిరి జ్యూట్ క్రియేష‌న్స్ పేరుతో నాలుగు సంవ‌త్స‌రాల కింద‌ట హైద‌రాబాద్ లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాల‌నీలో ప్రారంభించింది. కొద్ది మందితో ప్రారంభ‌మై ఇపుడు 22 మందికి ఉపాధి ఇచ్చేలా ఎదిగింది. దీని వెనుక శ్రీ‌మ‌తి క‌విత గారి ప‌ట్టుద‌ల‌, కృషి ఎంతో ఉంది. మొద‌ట్లో రెండు ఏళ్ల పాటు సిబ్బంది, పెట్టుబ‌డికి ఇబ్బంది ఎదురైనా మెల మెల్ల‌గా వ్యాపారం పుంజు కోవ‌డంతో ఏడాదికి 90 లక్ష‌ల ట‌ర్నోవ‌ర్  సాధించేలా చేసింది. ఖాళీగా కూర్చోవ‌డం కంటే ఏదో ఒక ప‌ని చేయాలి. ఇంకొంద‌రికి ప‌ర్మినెంట్‌గా కొలువులు ఇవ్వాల‌నే ఉద్ధేశంతో శ్రీ...